Tuesday, August 18, 2026

ఎందుకు ఇంతలా కుమిలిపోతావ్ | Ramana Maharshi Life Secret | Satyagrahi

ఎందుకు ఇంతలా కుమిలిపోతావ్ | Ramana Maharshi Life Secret | Satyagrahi

Author Name:Satyagrahi

Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=WBl8PyWl2EY



Transcript:
(00:01) [సంగీతం] ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆలోచించండి నిజంగా మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టగలరా రోడ్డు మీద వెళ్తుంటే ఎవరో ఏదో అన్నారని ఆఫీస్ లో బాస్ అరిచాడని ఇంట్లో వాళ్ళు మీకు విలువ ఇవ్వట్లేదని లేకపోతే గుర్తించట్లేదు అని ఏది చేసినా సరే వాళ్ళు చేసేది తప్పే అనుకుందాం కానీ వాళ్ళు ఏమైనా మీ గుండెల్లోకి నేరుగా కత్తి దింపారా లేదు కదా వాళ్ళు కేవలం గాలిలోకి కొన్ని శబ్దాలు వదిలారు అంటే కేవలం కొన్ని మాటలు అన్నారు మిమ్మల్ని తిట్టారు లేకపోతే విమర్శించారు మిమ్మల్ని చూసి నవ్వారు లేకపోతే నవ్వుకున్నారు కానీ ఆ తర్వాత ఆ మాటల్ని సీరియస్ గా తీసుకొని ఆ మాటల గురించి
(00:43) ఆలోచించి నిరంతరం బాధపడుతున్నది ఎవరో అన్నవాళ్ళా లేకపోతే విన్న మీరా మీకు తెలుసా మనం చిన్నప్పటి నుంచి ఒక దరిద్రమైన భ్రమలో బ్రతుకుతున్నాం. ఫలానా వాడు నన్ను డిస్టర్బ్ చేశాడు. ఫలానా పరిస్థితులను డిప్రెషన్ లోకి నెట్టేసింది. ఇదంతా ఒక పెద్ద అబద్ధం. ఎవడో మిమ్మల్ని కదిలించట్లేదు మీ మనశాంతిని ఎవడో లాక్కోవట్లేదు.
(01:06) మీరే మీ రిమోట్ కంట్రోల్ తేసుకెళ్లి అవతలు వాడి చేతిలో పెడుతున్నారు. వాడు ఏదనా అంటే చాలు మీరు బాధపడతారు. ఒకవేళ వాడు పొగిడితే చాలు మీరు ఆకాశంలో ఎగుడుతూ ఉంటారు. కోపం తెచ్చుకుంటారు, బాధపడతారు, అలుగుతారు, అన్నం తినటం మానేస్తారు. ఇదంతా ఏంటి? ఒక మనిషి మాటని సీరియస్ గా తీసుకుంటే జరిగేవి. అందులోనూ ఆ మనిషికి మీరు విలువిస్తున్నారు మరి ముఖ్యంగా మీరు వాళ్ళ మాటలకి బానిసగా బ్రతుకుతున్నారు.
(01:31) దీన్ని నిజంగా బానిస జీవితమే అంటారు. భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు ఒక అద్భుతమైన మాట అంటారు. ప్రపంచం నిన్ను ఏమీ చేయట్లేదు నీ మనసే ప్రపంచాన్ని సృష్టించుకొని భయపడుతుంది. రమణ మహర్షి గారు అరుణాచలం కొండల్లో మౌనంగా కూర్చున్నప్పుడు ఆయన శరీరానికి తేళ్లు కుట్టాయి. చీమలు తిన్నాయి అందులోనూ ప్రజలందరూ ఏమైంది దీనికి అని చెప్పేసి రకరకాలుగా అనుకుంటున్నారు.
(01:54) కానీ ఆయన కళ్ళల్లో ఆ నిశ్చలత ఎందుకు జరిగిపోలేదో తెలుసా ఎందుకంటే ఆయనకి ఒక లోతైన సత్యం అర్థమైంది. బయట జరిగే గంధర్గోళం శరీరానికో శబ్దాలకో సంబంధించింది. దానికి లోపల ఉన్న నేను అనే అవేర్నెస్ కి ఎలాంటి సంబంధం లేదు అని. మరి మీరెందుకు ప్రతి చిన్న విషయానికి బాధపడిపోతారు లేకపోతే ఆనంద పడిపోతారు ఎందుకంటే సమస్య బయట లేదు అలా అని చెప్పేసి ఆనందం కూడా బయట లేదు ఏదైనా సరే మీలోనే మొదలవుతుంది.
(02:24) అది మీ ఆనందం అవ్వచ్చు లేకపోతే మీ బాధ అవ్వచ్చు. నిజం ఏంటంటే మనం ఎప్పుడూ ఒక విక్టిమ్ లా బ్రతకడానికి అలవాటు పడిపోయాం. వాడు నన్ను మోసం చేశాడు. వీడు నన్ను అర్థం చేసుకోవట్లేదు. సమాజం నాకు అన్యాయం చేసింది. ఈ డైలాగులు కొట్టడం చాలా సులభం ఎందుకంటే ఎదుటివాడి మీద నింద వేస్తే మీ చేతకానితనాన్ని మీరు సమర్ధించుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి మీ ఆలోచనలకి మీ ఆవేశానికి మీ కన్నీళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? పక్కవాడిదా కానే కాదునూటికి 100 శాతం మీదే.
(02:56) మనం సోషల్ మీడియాలో ఎవడో రాసిన కామెంట్ కి చాలా బాధపడిపోతాం. ట్రాఫిక్ లో ఎవడో హార్రర్ కొడితే బీపి పెంచుకుంటాం. పక్కవాడు ఐఫోన్ కొంటే చాలు అసూయతో నిద్రపోము. అసలు మనిషి తన మనసు గురించి ఏమనుకుంటున్నాడు రోడ్డు పక్కన చెప్పకుండి అనుకుంటున్నాడా ఎవరు పడితే వాడు వచ్చి నాలుగు చెత్త ఆలోచనలు పారేసి వెళ్ళిపోవడానికి మీరు అనుమతి ఇవ్వకుండా మీ ప్రమేయం లేకుండా ఈ భూమ్మీద ఏ ఒక్కడు మీ మనశశాంతిని ముట్టుకోలేడు.
(03:22) రమణ మహర్షి గారి దగ్గరికి ఎంతో మంది వచ్చి స్వామి మాకు మనశశాంతి లేదు బంధాలు బాధిస్తున్నాయి అంటే మా రిలేషన్స్ లో చాలామంది మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. శత్రువులు వేధిస్తున్నారు అని చెప్పేసి ఏడ్చే వాళ్ళంట ఆయన చిరునవ్వుతో ఒకటే ప్రశ్న వేసేవారు బాధపడుతున్నది ఎవరు అశాంతిగా ఉన్నది ఎవరికీ వాళ్ళు ఏమనేవారంటే నాకే స్వామి అనేవాళ్ళంట వెంటనే రమణ మహర్షి గారు ఆ నేను ఎవరో తెలుసుకో తెలుసుకున్న తర్వాత ఈ బాధలన్నీ ఎవరికి వస్తున్నాయో కూడా తెలుస్తుంది అనేవారంట.
(03:53) మనం సమస్య తాలూక వేర్లను వదిలేసి ఎండిపోయిన ఆకుల మీద నీళ్లు చెల్లుతున్నాం. అసలు డిస్టర్బ్ అవుతున్నది ఎవరు అనే క్లారిటీ మీలో లేనంతవరకు ఈ ప్రపంచం మిమ్మల్ని రోజు ఫుట్బాల్ ఆడుకుంటుంది. మనకి సమస్య ఎందుకు వస్తుందో తెలుసా మనం ఒక పెద్ద భ్రమలో బ్రతుకుతున్నాం. మనం మన శరీరం అనుకుంటాం. మనం మన ఆలోచనలు అనుకుంటాం. ఈ సమాజం మనక ఇచ్చిన పేరు హోదా లేకపోతే ఈగోలు మన నిజ స్వరూపం అనుకుంటాం.
(04:21) అందుకే ఎవడైనా మీ పేరుని తిడితే మీకు దెబ్బ తగిలినట్లు గిలగిలా కొట్టేసుకుంటారు. లేకపోతే మీ బైక్ మీద చిన్న గీత పడితే మీ గుండె పగిలిపోయినంత పని అవుతుంది. ఎంత హాస్యాస్పదం ఇది రమణ మహర్షి గారు ఈ మానసిక రోగాన్ని చాలా సూటిగా బయట పెట్టారు. ఆయన ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్పారు. మనిషికి వచ్చే ప్రతి బాధకి మూలం అహంకారం అంటే నేను ఈ దేహం అనే తప్పుడు భావన.
(04:45) ఆయన అంటారు మనం డిస్టర్బ్ అవ్వనంతవరకు ఈ ప్రపంచంలో ఏది మనల్ని డిస్టర్బ్ చేయదు. మీరు గమనించారో లేదో చాలా మంది ఏంటంటే వాళ్ళని ఎంతమంది తిట్టినా పట్టించుకోరు వాళ్ళని ఎంతమంది పొగిడినా వాళ్ళు ఆనందంతో ఎగురి గంతులేయరు కాకపోతే కొంతమంది ఉంటారు పొగిడితే వాళ్ళని ఆపలేం తిడితే వాళ్ళు పడే బాధను చూసి మనం బాధపడతాం.
(05:07) అలా ఉంటారు వాళ్ళు అందులోనూ ప్రతిదీ నేను అని చెప్పేసి ట్యాగ్ వేసుకుంటే ఈ భూమి మీద బతకడం చాలా కష్టం ఎందుకంటే నేను అనే భావన ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి మాక్సిమం మనశశాంతి అనేది అస్సలు ఉండదు. ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను ఎప్పుడు ఈ ఉదాహరణ చెప్తూనే ఉంటాను మళ్ళీ చెప్తున్నాను ఒక సినిమా థియేటర్ లో తెల్లట స్క్రీన్ ఉంటుంది.
(05:28) ప్రొజెక్టర్ లో సినిమా వేస్తారు. సినిమా వేసినప్పుడు సినిమాలో అగ్ని ప్రమాదం జరుగుతుంది. ఒకసారి తుఫాన్ వస్తుంది ఇంకోసారి శవాలు కనిపిస్తాయి. కానీ సినిమా అయిపోయాక ఆ తెల్లటి తెర కాలిపోతుందా తడిసిపోతుందా? ఏమీ కాదు అది అలాగే స్వేచ్ఛగా ఉంటుంది. మీరు కూడా అంతే ఆ తెల్లటి తెర లాంటి వారే. కానీ మీరు తెర మీద నడిచే నాటకాన్ని పట్టుకొని నేను కాలిపోతున్నాను నేను మునిగిపోతున్నాను అని చెప్పేసి ఏడుస్తున్నారు.
(05:53) నిజం ఏంటంటే బయట ప్రపంచంలో జరిగే ఏ సంఘటనకి స్వతహాగా మంచి లేదా చెడు అనే గుణం ఉండదు అవి కేవలం సంఘటనలు అంతే రోడ్డు మీద వర్షం పడుతుంది. అది ఒక సంఘటన. అది మీ ఆలోచనలు బట్టి రొమాంటిక్ వెదర్ అవ్వచ్చు లేదా ట్రాఫిక్ జామ్ వల్ల నరకం అవ్వచ్చు. ఎందుకంటే వర్షం అనేది ఒక్కొక్కలకి ఒక్కొక్కలా అర్థమవుతుంది. వ్యవసాయం చేసే వాళ్ళకి వర్షం ఒకలా అర్థమైతే ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న వాడికి వర్షం వస్తే అతనికి ఇంకొకలా అర్థం అవుతుంది.
(06:23) బట్ ఏది అర్థమైనా అర్థం అవ్వకపోయినా ఆ వర్షం మన మనశాంతిని డిస్టర్బ్ చేయకూడదు. అది మనం తెలుసుకోవాల్సింది. అంటే వర్షంలో ప్రాబ్లం ఉందా లేక మీరు ఆలోచించే విధానంలో ప్రాబ్లం ఉందా? మీరు ఇచ్చే రియాక్షనే మీ నరకానికి ముడిసరుగు. మనం పరిస్థితులను అంగీకరించం అంటే పరిస్థితులు మనకు తగ్గట్లుగా ఉండాలనుకుంటాం. మనకి నచ్చినట్లు మనుషులందరూ నడుచుకోవాలని చెప్పేసి పిచ్చి పట్టుదలతో ఉంటాం.
(06:49) అదే మనల్ని నిలువున నాశనం చేస్తుంది. మీకు తెలుసా మన మెదడు రోజు వేల ఆలోచనల్ని ఒక ఫ్యాక్టరీలా తయారు చేస్తూనే ఉంటుంది. గతం గురించి పశ్చాత్తాపం భవిష్యత్తు గురించి అనవసరమైన భయం ఎదుటివాడు నన్ను చూసి ఏమనుకుంటున్నాడో అన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అవ్వచ్చు. ఇలా నిరంతరం ఒక యుద్ధం జరుగుతూనే ఉంది. రమణ మహర్షి గారు ఈ మానసిక మాయను వివరిస్తూ ఒక చక్కని మాట అంటారు.
(07:15) మనసు అనేది ఒక దెయ్యం లాంటిది దానికి ఏ పని చెప్పకపోతే అది నిన్నే తినేస్తుంది. ఆయన చెప్పిన మరో అద్భుతమైన సత్యం ఏంటంటే ఈ ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి. నేను అనే ఒక పెద్ద ప్రాథమిక ఆలోచన నుంచి ఎప్పుడైతే మీరు నాకు అన్యాయం జరిగింది నన్ను తక్కువ చేశారు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటారో అక్కడ మీ ఈగో పని చేస్తుంది.
(07:36) ఆ ఈగో కి ఒకటే అలవాటు ప్రతి చిన్న విషయాన్ని పర్సనల్ గా తీసుకోవడం ఎవడో తెలియని వ్యక్తి ఏదో వాగి వెళ్తే దాన్ని తీసుకొని రోజంతా నెమరేస్తూ నిద్ర లేకుండా గడపటం ఇది పిచ్చితనం కాక ఇంకేంటి చెప్పండి నిజం చెప్పాలంటే ప్రపంచం మీ చుట్టూ తిరగట్లేదు. ఎవరి పిచ్చులో వాళ్ళు ఉన్నారు ఎవరి స్వార్థంలో వాళ్ళు ఉన్నారు కానీ మీరు మాత్రం అందరూ మీ గురించి ఆలోచిస్తున్నారని అందరూ మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని ఒక ఊహా లోకంలో బ్రతుకుతున్నారు.
(08:03) రమణ మహర్షి గారి బోధనల ప్రకారం బాహ్య ప్రపంచం మీ మనసుకి కేవలం ఒక అద్దం లాంటిది. మీ లోపల అశాంతి ఉంటే బయట శత్రువులు కనిపిస్తారు. మీ లోపల ప్రశాంతత ఉంటే బయట ఏ తుఫాను వచ్చినా మీరు మాత్రం నిశ్చలంగా ఉంటారు. మరి ఆ నిశ్చలత్వాన్ని ఎలా సాధించాలి? ఈ అనవసరపు బాధల వలయం నుంచి ఎలా బయట పడాలి? ఇప్పుడు అసలైన మ్యాజిక్ మొదలవుతుంది.
(08:28) ఈ మానసిక నరకం నుంచి బయటపడటానికి ఏదో హిమాలయాలకి పారిపోవాల్సిన పని లేదు. ఎవరితోనూ యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. రమణ మహర్షి ప్రపంచానికి అందించిన అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రం ఒకటి ఉంది. అదే సెల్ఫ్ ఎంక్వైరీ ఆత్మ విచారణ. ఎప్పుడైనా మీకు కోపం వస్తే ఎవరైనా మిమ్మల్ని అవమానించినప్పుడు బాధ పుడితే వెంటనే రియాక్ట్ అవ్వకండి.
(08:50) ఆ ఆగ్రహంలోకి వెళ్లి ఎదుటివాడితో గొడవ పడకండి. జస్ట్ ఒక క్షణం ఆగి కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు ఒకే ఒక్క ప్రశ్న వేసుకోండి. ఈ కోపం ఎవరికి వస్తుంది? ఈ బాధ ఎవరికీ కలుగుతుంది అని సమాధానం లోపల నుంచి ఏమ వస్తుంది నాకే అని వెంటనే రెండో ప్రశ్న వేయండి ఆ బాధ పడుతున్న నేను ఎవరు అని ఎప్పుడైతే మీరు ఈ ప్రశ్న లోతుల్లోకి తీసుకెళ్తారో లేకపోతే వెళ్తారో అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది.
(09:16) రమణ మహర్షి గారు అంటారు దొంగ దొరకాలంటే వాడి వెనకాల పడాలి. అలాగే ఈ ఆలోచనల వెనుక ఉన్న నేను అనే మూలాన్ని వెతకడం మొదలుపెట్టగానే ఆ ఆలోచనలన్నీ మంచులా కరిగిపోతాయి. ఎందుకంటే మనతో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మనతో మనం మాట్లాడుకునేది ఎవరితో నేను అనే క్యారెక్టర్ తో సో నేను అనే క్యారెక్టర్ హట్ అయిన వెంటనే మనం ఏం చేయాలి అని చెప్పేసి మనం కూడా అన్ని చేస్తూ ఉంటాం.
(09:41) కానీ మనకి నేనుకి మధ్య ఈగో ఉండకూడదు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే రోడ్డు మీద ట్రాఫిక్ వెళ్తుంది. లారీలు, కార్లు, బైక్ శబ్దాలు చేస్తూ పోతుంటాయి. మీరు రోడ్డు పక్కన నిలబడి చూస్తుంటే మీకు ప్రమాదం ఏమైనా ఉందా? లేదు కానీ మీరే ఆ రోడ్డు మధ్యలోకి వెళ్లి ప్రతి వాహనాన్ని ఆపలం చూస్తే కచ్చితంగా మీకు దెబ్బలు తొలుతాయి. అలాగే మీ ఆలోచనలు కూడా ఆ వాహనం లాంటివే.
(10:07) వాటిని కేవలం చూడండి వాటితో ప్రయాణించకండి. రమణ మహర్షి గారు నేర్పిన ఈ సాక్షి భావన మీకు అర్థమైతే ఈ ప్రపంచంలో మిమ్మల్ని తాకే శక్తి దేనికి ఉండదు. మరొక ప్రాక్టికల్ సూత్రం ఏంటంటే స్పందించడంలో విరామం. ది ఆర్ట్ ఆఫ్ పాస్ ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు లేదా ఒక సమస్య ఎదురైనప్పుడు వెంటనే అరవకండి కేవలం ఒక ఆరు సెకండ్లు నిశశబ్దంగా ఉండండి.
(10:35) ఆ ఆరు సెకండ్లలో మీరు మీ జంతు ప్రవృత్తి నుంచి మనుగడ చైతన్యానికి వస్తారు అంటే రియాక్షన్ అనే కాన్సెప్ట్ నుంచి అవేర్నెస్ అనే కాన్సెప్ట్ కి వస్తారు. రమణ మహర్షి గారి సమక్షంలో ఎంతో మంది విమర్శకులు దురుద్దేశం ఉన్న అహంకారులు వచ్చేవారు. కొందరు ఆయన్ని తిట్టేవారు కొందరు ఆయన్ని ఎగతాలి చేసేవారు. కానీ మహర్షి గారు ఏం చేశారో తెలుసా? కేవలం ఒక చిరునవ్వు నవ్వి మౌనంగా చూసేవారు. ఆ మౌనంలో ఎలాంటి భయం లేదు.
(10:59) అపారమైన పరిపక్వత ఉంది. ఆయన దృష్టిలో మౌనం అంటే కేవలం మాట్లాడకపోవడం కాదు మనసులో ఎలాంటి తీర్పులు లేకుండా ఉండటం అంటే మైండ్ లో జడ్జిమెంట్స్ లేకుండా ఉండటం ఎదుటివాడు మీపై అరిచాడంటే అది వాడి లోపల ఉన్న కుళ్ళు వాడి అశాంతి వాడి మానసిక దౌర్బల్యం వాడి చెత్తను తెచ్చి మీ ఇంట్లో ముంగిట్లో వేస్తే మీరు తీసుకుంటారా? తీసుకోరు కదా మరి వాడి మాటలనే విషయాన్ని మీ మనసులోకి ఎందుకు తీసుకుంటున్నారు? రమణ మహర్షి గారు ఒక చక్కటి మాట అంటారు.
(11:32) ఎవరైనా నీకు ఏదైనా ఇస్తే నువ్వు దాన్ని స్వీకరించకపోతే అది ఎవరి దగ్గర మిగిలిపోతుంది. ఇచ్చే వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇలాగే వాళ్ళు ఇచ్చే అవమానాలని వాళ్ళు ఇచ్చే దూషణల్ని వాళ్ళు చేసే వ్యంంతో కూడిన కామెంట్లన్నిటిని మీరు తీసుకోకుండా వాళ్ళకే వదిలేయండి. మీరు చేయాల్సిందల్లా ఒకటే. జీవితాన్ని ఒక నదీ ప్రవాహంలా చూడటం నేర్చుకోండి. నదిలో పూలు కొట్టుకొస్తాయి ముళ్ళ కంపలు కొట్టుకొస్తాయి నది దేన్ని ఆపదు దేనితోను బంధం పెంచుకోదు అది కేవలం ప్రవహిస్తూనే ఉంటుంది రమణ మహర్షి గారి తత్వం కూడా అంతే జీవితంలో ఏ సంఘటన వచ్చినా లేకపోతే మీ జీవితంలో ఏ మనిషి అయినా ఎదురైనా సాక్షిగా
(12:11) గమనించండి వదిలేయండి ముందుకు సాగిపోండి అదే అసలైన స్వేచ్ఛ ఇప్పుడు మీ జీవితాన్ని నిజంగా మార్చుకోవాల్సిన సమయం వచ్చింది జీవితం అంటే ఎవరో రాసిన స్క్రిప్ట్ ప్రకారం నడుచుకోవడం కాదు ఎదుటివాడి అంచనాలకి తగ్గట్టు సర్దుకుపోతూ బతకటం అంతకంటే కాదు రమణ మహర్షి గారు బోధించినట్లు ఎప్పుడైతే మీ ఇన్నర్ థాట్స్ నిశ్చలంగా ఉంటాయో అప్పుడు ప్రపంచం మీ చుట్టూ ఎలా తిరిగినా మీరు చెక్కు చెదరరు.
(12:38) ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే సోషల్ మీడియా ఫీట్స్ చూడటం మానేయండి. ఒక్క 10 నిమిషాలు మౌనంగా కూర్చోండి. ఎలాంటి ఆలోచనలు వచ్చినా వాటిని ఆపకండి. కేవలం ఒక నది ఒడ్డున కూర్చొని నీటి ప్రవాహాన్ని చూస్తున్నట్లు మీ మనసుని చూస్తూ ఉండండి. ఈ నిశ్చలత్వమే మీకు అంతులేని శక్తిని ఇస్తుంది. మీకు తెలుసా మనిషికి నిజమైన భయం చావు వల్ల రాదు.
(13:03) తాను సృష్టించుకున్న అబద్ధపు గుర్తింపులు అంటే ఫేక్ ఐడెంటిటీస్ వల్ల ఆ ఐడెంటిటీస్ అన్నీ ఎక్కడ పోతాయో అన్న భయం వల్లే వస్తుంది. రమణ మహర్షి గారు అరుణాచలం కొండలపై దశాబ్దాలు పాటు ఒకే ఒక్క కౌపీనంతో గడిపారు. ఆయన దగ్గర కోట్లు లేవు. పెద్ద పెద్ద పదవులు లేవు నిజం చెప్పాలంటే ఆస్తులు అంతకన్నా లేవు. కానీ ప్రపంచం మొత్తం ఆయన పాదాల దగ్గరికి ఎందుకు వచ్చింది ఎందుకంటే ఆయన లోపల ఏ లోటు లేదు కనుక ఆయన తనను తాను పూర్తిగా తెలుసుకున్నారు.
(13:33) మీరు కూడా బయట వస్తువుల్లోనూ మనుషుల ప్రశంసల్లోనూ ఆనందాలు వెతకడం ఆపేయండి. ఆనందం అనేది ఎక్కడో దొరికే వస్తువు కాదు అది మీ అసలు సహజ స్వరూపం. ఇకపై ఎవరైనా మిమ్మల్ని కదిలించడానికి ప్రయత్నించినప్పుడు పరిస్థితులు తారుమారైనప్పుడు ఒకసారి రమణ మహర్షి గారు చెప్పిన ఆత్మ విచారణని గుర్తు చేసుకోండి. ఈ క్షణంలో బ్రతకడం నేర్చుకోండి. గతం చచ్చిపోయింది.
(13:55) భవిష్యత్తు ఇంకా పుట్టలేదు. మీ చేతుల్లో ఉన్నది కేవలం ఈ నిమిషం మాత్రమే ఈ నిమిషాన్ని అనవసరపు బాధలతో పగలతో పూలికలతో వృదా చేసుకోకండి. మీ మనశశాంతి అనేది మీ జన్మ హక్కు దాన్ని ఏ ఒక్కడి చేతిలోనూ తాకట్టు పెట్టకండి. మీ జీవితానికి మీరే యజమానిగా మారండి. నిశ్చలంగా ధైర్యంగా స్వచ్ఛంగా జీవించడం నేర్చుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే మాత్రం కచ్చితంగా కామెంట్ చేయండి మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను బాయ్ [సంగీతం] ఈ [సంగీతం]

No comments:

Post a Comment