వినాశనం రాబోతోందా ? 😱 | THE SILENT KILLER 🚨 | By Naresh Bukya
Author Name:NB Show Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@nbshowtelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Y4mzTRABquU
Transcript:
(00:04) మనలో చాలామంది నేను ఆల్కహాల్ తాగను సిగరెట్ కూడా తాగను కాబట్టి నా లివర్ కి ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను చాలా హెల్దీగా ఉన్నాను అనుకుంటారు. కానీ ఈ కాలంలో అలా అనుకోవడం ఒక అతి పెద్ద మిస్టేక్. ఎందుకంటే మన హైదరాబాద్ లో ఐటి ఎంప్లాయిస్ పైన జరిగిన ఒక స్టడీలో తెలిసింది ఏమిటంటే సాఫ్ట్వేర్ లో పనిచేస్తున్న 84% మందికి లివర్ లో ఫ్యాట్ అక్యములేషన్ ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది.
(00:28) అంటే వాళ్ళ లివర్స్ హెల్దీగా లేవు. అండ్ ఇక్కడ ఇంకో డేంజరస్ విషయం ఏమిటంటే వీళ్ళ లివర్స్ డ్ామేజ్ అవుతున్నట్టుగా వాళ్ళకు కూడా తెలియదు. మళ్ళీ చెప్తున్నాను హైదరాబాద్ ఐటీ కంపెనీస్ లో పనిచేసే ప్రతి 10 మందిలో ఎనిమిది మంది లివర్ ప్రాబ్లం్ తో సఫర్ అవుతున్నారు. ఆ విషయం వాళ్ళకు కూడా తెలియదు. అందుకే ఈ వీడియోలో మనం ఈ టాపిక్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం.
(00:51) గాయస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయాలు చాలా ఇంపార్టెంట్. ఇవి మీ ప్రాణాల్ని కాపాడగలవు. కాబట్టి ఏ మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఈ టాపిక్ పైన మీకు పూర్తి అవగాహన రావాలి అంటే ముందుగా మనం హైదరాబాద్ లో ఉంటున్న 28 సంవత్సరాల రాహుల్ స్టోరీ తెలుసుకోవాలి. రాహుల్ హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు.
(01:13) మార్నింగ్ 9 గంటలకు ఆఫీస్ కి వెళ్తే రాత్రి 8 గంటల వరకు అక్కడే ఉంటాడు. ఇక తిండి విషయానికి వస్తే రోజులో మూడు టీలు రెండు సమోసాలు ఒక బిస్కెట్ ప్యాకెట్ లంచ్ కి దాల్ రైస్ డిన్నర్ కి ఏది త్వరగా దొరికితే అది తినేస్తాడు. వీకెండ్ వచ్చిందంటే మాత్రం ఒక్కటే మాట చాలా టైడ్ గా ఉన్నాను అంటాడు. అందుకే వీకెండ్ మొత్తం నిద్రపోవడానికి ఇష్టపడతాడు.
(01:37) జిమ్ గురించి అడిగితే మనలో చాలా మంది చెప్పినట్టే రేపటి నుంచి పక్కా అని చెప్తాడు. కానీ ఎప్పటికీ వెళ్ళడు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే రాహుల్ ఆల్కహాల్ తాగడు సిగరెట్ కూడా తాగడు. కాబట్టి తనకు ఎటువంటి పెద్ద హెల్త్ ప్రాబ్లం లేదని అనుకుంటున్నాడు. కానీ రాహుల్ కి తెలియని విషయం ఏమిటంటే అతని బాడీ లోపల ఒక సైలెంట్ డిజాస్టర్ జరుగుతుంది.
(01:58) ఎలాంటి వార్నింగ్ లేకుండా బయటకి పెద్దగా సింటమ్స్ కనిపించకుండా ఒక హిడెన్ డిసీజ్ అతని బాడీలో చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ ని నెమ్మదిగా డ్ామేజ్ చేస్తుంది. ఇది ఒక్క రాహుల్ కథ మాత్రమే కాదు. ఇండియాలో మెజారిటీ ఐటి ఎంప్లాయిస్ల పరిస్థితి ఇలాగే ఉంది. హైదరాబాద్ లో ఐటి ఎంప్లాయిస్ పైన చేసిన ఒక స్పెసిఫిక్ స్టడీ నాచురల్ సైంటిఫిక్ రిపోర్ట్ లో పబ్లిష్ అయింది.
(02:22) ఆ రిపోర్ట్ ప్రకారం దాదాపు 84% మందికి ఒక ఇన్విజిబుల్ డిసీజ్ ఉంది. అంటే మీ ఆఫీస్ లో 10 మంది ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటే అందులో దాదాపు ఎనిమిది మంది ఈ సీరియస్ ప్రాబ్లం తో ఆల్రెడీ స్ట్రగుల్ అవుతూ ఉండొచ్చు. షాకింగ్ విషయం ఏమిటంటే ఆ విషయం వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు. అయితే ఆల్కహాల్ తాగని వ్యక్తి సిగరెట్ తాగని వ్యక్తి కంపెనీ కోసం డే అండ్ నైట్ కష్టపడే వ్యక్తి అలాంటి వ్యక్తి బాడీలో ఇంత సీరియస్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? 84% ఐటి ప్రొఫెషనల్స్ ఆల్రెడీ ఈ సైలెంట్ డిసీజ్ బారిన పడుతుంటే మన నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంటి? ఎలాంటి వార్నింగ్ లేకుండా మన యంగ్ అండ్ ప్రొడక్టివ్ జనరేషన్
(02:57) ని డామేజ్ చేస్తున్న ఈ ఇన్విజిబుల్ డిసీజ్ ఏంటి? ఈరోజు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఈ పజిల్ ని సాల్వ్ చేద్దాం. ఈ డిసీజ్ గురించిన డేంజరస్ విషయం ఏమిటంటే ఇది స్టార్టింగ్ లో చాలా సైలెంట్ గా ఉంటుంది. కానీ మన బాడీ మాత్రం కొన్ని చిన్న చిన్న సిగ్నల్స్ ఇస్తుంది. ప్రాబ్లం ఏమిటంటే మనం వాటిని వర్క్ స్ట్రెస్ అనుకొని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం.
(03:18) ఉదాహరణకి రాహుల్ ని తీసుకోండి వీకెండ్ ఎప్పుడూ నిద్రపోతూ ఉంటాడు. అయినా కూడా ఎప్పుడూ టైడ్ గానే ఉంటాడు. అయితే ఇది నార్మల్ టైడ్నెస్ కాదు ఎంత నిద్రపోయినా తగ్గని ఒక ఫ్యాటిక్ఎనిమిది గంటలు బాగా నిద్రపోయి లేచినా కూడా ఇంకా టైడ్ గా ఉన్నానఏంటి అనిపిస్తుంది. మనమేమో ఇదంతా కూడా ఆఫీస్ స్ట్రెస్ వల్లే అనుకుంటాము. రెండవ సిగ్నల్ స్టబన్ బెల్లీ ఫ్యాట్ జిమ్ కి వెళ్ళిన డైట్ చేసిన పొట్ట మాత్రం తగ్గదు.
(03:43) మూడవ సిగ్నల్ సివియర్ బ్లోటింగ్ ఫుడ్ తిన్న తర్వాత పొట్ట బాగా ఉబ్బినట్టుగా టైట్ గా అనిపిస్తుంది. గ్యాస్ కూడా కంటిన్యూస్లీ ఉన్నట్టు అనిపిస్తుంది. అది చూసి మనం ఈరోజు లంచ్ లో దాల్ కొంచెం హెవీగా అయిందేమో అనుకుంటాం. అలా అనుకొని వదిలేస్తాం. నాలుగో సిగ్నల్ డల్ స్కిన్ అండ్ డార్క్ సర్కిల్. స్కిన్ లో గ్లో నెమ్మదిగా తగ్గిపోతుంది.
(04:05) అది కేవలం స్లీప్ తక్కువ కావడం వల్ల మాత్రమే కాదు. బాడీలో ఇంటర్నల్ మెకానిజం డిస్టర్బ్ అయిందని చెప్పడానికి ఇది ఒక సిగ్నల్. బ్లడ్ రిపోర్ట్ లో కూడా కొన్ని చేంజెస్ కనిపిస్తాయి. ఎలివేటెడ్ లివర్ ఎంజైమ్స్ హై ట్రైగ్లిజరైడ్స్ హై ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కనిపిస్తాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మెజారిటీ పీపుల్ ఈ టెస్ట్ ని చేయించుకోరు. హైదరాబాద్ స్టడీలో 76% ఐటి ఎంప్లాయిస్ కి ఎల్డిఎల్ అబ్నార్మిలిటీ హై గా ఉందని తెలిసింది.
(04:33) 72% మందిలో ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోస్ డిస్టర్బ్డ్ గా ఉందని చెప్పారు. కానీ వాళ్ళ బాడీలో అసలు ఏం జరుగుతుందో వాళ్ళకే తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఈ టెస్ట్ ని ఎప్పుడూ కూడా చేయించుకోలేదు. ఈ ప్రాబ్లమ్స్ ని మనం ఇలాగే ఇగ్నోర్ చేస్తూ వెళ్తే మన బాడీలో ఏం జరుగుతుందో తెలుసా ఈ హిడెన్ ఎనిమీ మన బాడీలో నాలుగు స్టేజెస్ లో ప్రోగ్రెస్ అవుతుంది.
(04:52) స్టేజ్ నెంబర్ వన్ హిడెన్ బిల్డప్ ఆగన్ సెల్ లో అన్వాంటెడ్ ఎలిమెంట్ నెమ్మదిగా అక్యములేట్ అవ్వడం మొదలవుతుంది. సింటమ్స్ ఉండవు పెయిన్ ఉండదు. ఈ స్టేజ్ లో బ్లడ్ రిపోర్ట్ కూడా లార్జ్లీ నార్మల్ గానే ఉంటుంది. అందుకే రాహుల్ లాంటి వాళ్ళు తమ బాడీలో ఏదో జరుగుతుంది అనే విషయాన్ని కూడా రియలైజ్ అవ్వరు. స్టేజ్ ట ఇన్ఫ్లమేషన్ బిల్డప్ మరీ ఎక్కువైనప్పుడు సెల్ ఇరిటేట్ అవుతాయి.
(05:14) ఆర్గాన్ లో ఇన్ఫ్లమేషన్ మొదలవుతుంది. రొటీన్ చెకప్ లో డాక్టర్ ఎంజైమ్ అబ్నార్మల్ గా ఉన్నాయని చెప్తాడు. కానీ సింటమ్ మాత్రం ఆల్మోస్ట్ జీరో గానే ఉంటాయి. అందుకే చాలా మంది టెస్ట్ చేయించుకోవడానికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. రాహుల్ కూడా ఈ టైడ్నెస్ టెంపరరీ అయి ఉంటుంది అనుకున్నాడు. ఇక స్టేజ్ 3 లో అసలు రియాలిటీ మొదలవుతుంది.
(05:35) ఇక్కడి నుంచి రియల్ డామేజ్ స్టార్ట్ అవుతుంది. ఆర్గాన్ టిష్యూ మీద స్కార్స్ రావడం మొదలవుతుంది. నెమ్మదిగా డామేజ్ ఇర్రివర్సిబుల్ గా మారుతుంది. ఈ స్టేజ్ లో పేషెంట్ కి పెయిన్ రావచ్చు. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయి ఉంటుంది. ఇక చివరగా స్టేజ్ఫోర్ ఆర్గాన్ ఫెయిల్యూర్ ఆర్గాన్ పూర్తిగా పనిచేయడం ఆపేస్తుంది.
(05:57) క్యాన్సర్ రిస్క్ డ్రాస్టికల్లీ పెరుగుతుంది. సిచువేషన్ ఎక్స్ట్రీమ్ స్టేజ్ కి వెళ్తే చివరికి మిగిలే ఆప్షన్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ ఇక్కడే ఈ డిసీజ్ ఎంత డేంజరస్ అనేది మనకు అర్థం కావాలి. స్టేజ్ వన్ స్టేజ్ 2 లో ప్రాబ్లం్ ని రివర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ బాడీ పెద్దగా సిగ్నల్స్ ఇవ్వదు. స్టేజ్త్ర స్టేజ్ఫోర్ లో సిగ్నల్ క్లియర్ గా కనిపించే సమయానికి కొన్ని సందర్భాల్లో సిచువేషన్ మన చేదాటిపోయి ఉంటుంది.
(06:23) ఇంతకీ ఆ డిసీజ్ పేరు చెప్పలేదు కదు ఆల్కహాల్ తాగకపోయినా లివర్ ని డామేజ్ చేస్తున్న ఆ వింత డిసీజ్ పేరుఏంటంటేఎంఏఎఫ్ఎల్డి మెటబాలిక్ డిస్ఫంక్షనల్ అసోసియేట్ ఫాటీ లివర్ డిసీస్. సింపుల్ గా చెప్పాలంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. చాలా సంవత్సరాల పాటు ఫ్యాటీ లివర్ అంటే ఆల్కహాల్ తాగే వాళ్ళకే వస్తుంది అనుకునేవారు. కానీ సైన్స్ ఏం చెప్తుంది అంటే ఒక్క డ్రాప్ ఆల్కహాల్ తాగకపోయినా మన లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల లివర్ ఈక్వల్లీ డ్ామేజ్ అవ్వచ్చు.
(06:54) 2021 లో వచ్చిన ఒక మెటా అనాలసిస్ ప్రకారం 38% ఇండియన్ అడల్ట్స్ కి ఆల్రెడీ ఈ ఫ్యాటీ లివర్ ఉంది. చండీగఢ లో అయితే ఈ నెంబర్ 53% గా ఉంది. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే 35% పిల్లల్లో కూడా ఇది కనిపిస్తుంది. ఇక ఇప్పుడు రాహుల్ లివర్ ఇలా ఎందుకు అయిందో తెలుసుకుందాం. దీని వెనక మెయిన్లీ మూడు విలన్స్ కలిసి పనిచేస్తున్నాయి. విలన్ నెంబర్ వన్ ఫుడ్ టీ లో రెండు స్పూన్ల షుగర్ పరాటా లంచ్ లో 60% కార్బోహైడ్రేట్స్ అంటే వైట్ రైస్ ఈవెనింగ్ నమకీన్ బిస్కెట్స్ నైట్ రైస్ అండ్ రోటీ అండ్ రాహుల్ రోజంతా కూర్చొనే ఉంటాడు కాబట్టి అతని మజల్స్ కి ఎక్సెసివ్ గ్లూకోస్ అంతా అవసరం ఉండదు. అప్పుడు
(07:35) ఇన్సులిన్ ఇచ్చే సిగ్నల్ తో లివర్ ఈ ఎక్సెస్ గ్లూకోస్ ని ఫ్యాట్ గా కన్వర్ట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ ని డినోవ లైపోజెనసిస్ అంటారు. అంటే న్యూ ఫ్యాట్ క్రియేషన్ అని అర్థం. రోజు ఇలా క్రియేట్ అవుతున్న ఫ్యాట్ నెమ్మదిగా లివర్ సెల్స్ లో అక్యములేట్ అవుతుంది. విలన్ నెంబర్ టూ జీరో మూమెంట్. హైదరాబాద్‌లో స్టడీ ప్రకారం 72% ఐటి ఎంప్లాయిస్ రోజుకు దాదాపు 8 నుంచి 10 గంటలు చేర్లోనే కూర్చొని ఉంటున్నారు.
(08:02) మూమెంట్ లేకపోవడంతో మెటబాలిజం స్లో అవుతుంది. ఫ్యాట్ నెమ్మదిగా లివర్ తో పాటు ఆర్గాన్ చుట్టూ అక్యములేట్ అవుతుంది. ఎగజక్ట్లీ విసిరల్ ఫ్యాట్ లాగా విలన్ నెంబర్ త్రీ క్రానిక్ స్ట్రెస్ అండ్ స్లీప్ డిప్రవేషన్. స్టడీలో దాదాపు 70% మంది స్లీప్ డిప్రవేడ్ గా ఉన్నారని తెలిసింది. పూర్ స్లీప్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెంట్ పెరుగుతుంది.
(08:25) స్ట్రెస్ వల్ల రిలీజ్ అయ్యే కార్టిజోల్ హార్మోన్ లివర్ కి ఎమర్జెన్సీ మోడ్ లోకి వెళ్ళు ఫ్యాట్ ని స్టోర్ చేస్తూ ఉండు అనే సిగ్నల్ ఇస్తుంది. బై ద వే ఇది రాహుల్ స్టోరీ మాత్రమే కాదు మీ స్టోరీ కూడా కావచ్చు. మెజారిటీ ఇండియన్ స్టోరీ ఇలాగే ఉంటుంది. ఇది నెమ్మదిగా నేషనల్ క్రైసిస్ గా మారుతుంది. ఇది కేవలం ఒక ఇండివిడ్యువల్ హెల్త్ ఇష్యూ కాదు ఒక నేషనల్ ప్రొడక్టివిటీ క్రైసిస్ ఇండియన్ ఐటి సెక్టార్ లో దాదాపు 54 లక్షల మంది ప్రొఫెషనల్స్ పనిచేస్తున్నారు.
(08:53) మన ఎకానమీకి ఐటి సెక్టార్ ఒక బ్యాక్ బోన్ లాంటిది. ఎందుకంటే మన జిడిపి లో సర్వీస్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి మన యంగ్ ఎడ్యుకేటెడ్ ఎకనామికలీ యక్టివ్ జనరేషన్ మెటబాలిక్ ప్రాబ్లం తో కొలాప్స్ అయితే వికసిత్ భారత్ 2047 అనే మన డ్రీమ్ ని అచీవ్ చేయడం ఇంపాసిబుల్ అవుతుంది. ఇక ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఈ డిసీజ్ ని క్యూర్ చేయగలమా దీన్ని రివర్స్ చేయగలమా అంటే ఈ డార్క్ స్టోరీలో ఒక చిన్న హోప్ కూడా ఉంది.
(09:21) లివర్ మన బాడీలో ఫుల్లీ రీజనరేట్ అవ్వగల ఒక ఆర్గాన్ అంటే లివర్ తనను తాను రిపేర్ చేసుకోగలదు. కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మనం ముందు మాట్లాడుకున్న స్టేజ్ వన్ స్టేజ్ ట లో ఫ్యాటీ లివర్ ని 100% రివర్స్ చేయవచ్చు. అది కూడా ఎక్స్పెన్సివ్ మెడిసిన్స్ లేకుండా కానీ దానికి ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. మొదటిది టాక్సిన్స్ ని తగ్గించాలి.
(09:42) రిఫైన్డ్ షుగర్, కూల్ డ్రింక్స్, ప్యాకేజెడ్ స్నాక్స్, మైదా వీటిని మీ లైఫ్ నుంచి కంప్లీట్ గా తొలగించేయాలి. జీరో చేసేయాలి ఎందుకంటే ఇవి డైరెక్ట్లీ లివర్ లో ఫ్యాట్ క్రియేషన్ ని అంటే లైపోజెనసిస్ ని ప్రమోట్ చేస్తాయి. అందుకే వీటిని ఆపితే ఈ ప్రాసెస్ కూడా తగ్గిపోతుంది. రెండవది మీ ప్లేట్ ని ఫిక్స్ చేయండి.
(10:04) మీ ఫుడ్ లో 20 g ప్రోటీన్ 10గ్రమ ఫైబర్ ఉండేలా చూసుకోవచ్చు. ఈ కాంబినేషన్ బ్లడ్ షుగర్ స్పైక్ ని స్లో చేస్తుంది. లివర్ మీద లోడ్ ని తగ్గిస్తుంది. ఇక మూడవది స్వీట్ కాఫీని అవాయిడ్ చేయండి. ఒక కప్పు షుగర్ లేని బ్లాక్ కాఫీ తాగితే కొన్ని పీ రివ్యూ స్టడీ ప్రకారం షుగర్ లేకుండా బ్లాక్ కాఫీ తాగితే లివర్ ఫ్యాట్ ని అప్ టు 20% వరకు తగ్గించవచ్చు.
(10:28) కాఫీలో ఉండే పాలిఫినోల్స్ లివర్ లో ఫ్యాట్ ఆక్సిడేషన్ ని ఇంప్రూవ్ చేస్తాయి. ఇక నాలుగవది మాండేటరీ మూమెంట్ ఫుడ్ తిన్న వెంటనే కూర్చోవద్దు. 10 నుంచి 15 నిమిషాలు ఖచ్చితంగా వాక్ చేయండి. వీక్ లో మూడు సార్లు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి. దీంతో మజల్ గ్లూకోస్ ని కన్స్ూమ్ చేస్తాయి. లివర్ మీద ఫ్యాట్ లోడ్ తగ్గుతుంది. ఇక ఐదవది స్లీప్ ఈస్ నాన్ నెగోషియబుల్ డైలీ కంపల్సరీగాఏడు నుంచిఎనిమిది గంటల స్లీప్ ఉండాల్సింది.
(10:54) దీంతో స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసోల్ ఇన్సులిన్ రెసిస్టెంట్ కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే రెండు మీల్స్ మధ్య నాలుగు నుంచిఐదు గంటల గ్యాప్ ఉండాలి. దీంతో పాంక్రియాస్ కి రెస్ట్ దొరుకుతుంది. లివర్ కి ఫ్యాట్ బర్న్ చేయడానికి టైం దొరుకుతుంది. ఇక చివరగా మన రాహుల్ ఇంకా హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు.
(11:15) ఇప్పటికీ డెస్క్ దగ్గరే లంచ్ చేస్తున్నాడు. లేట్ నైట్ వరకు కూర్చొని డెడ్ లైన్స్ ని కంప్లీట్ చేస్తున్నాడు. అతని లివర్ ఇంకా స్టేజ్ వన్ లోనే ఉంది. అంటే అతని సిచువేషన్ కంప్లీట్లీ రివర్సిబుల్ కానీ రాహుల్ కి ఆ విషయం తెలియదు. ఎందుకంటే ఎవరు అతనికి చెప్పలేదు. కానీ మీరు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి ఈ విషయం మీకు ఇప్పుడు తెలుసు అందుకే వెంటనే ఒక పని చేయండి మీ పాత బ్లడ్ రిపోర్ట్స్ ని బయటకు తీయండి అందులో ఏఎల్టి ఏఎస్ట ట్రైగ్లిజరాయిడ్స్ చెక్ చేయండి.
(11:43) అవి ఎలివేటెడ్ గా ఉంటే డాక్టర్ ని కన్సల్ట్ చేసి ఫైబ్రో స్కాన్ గురించి అడగండి. మీ రిపోర్ట్ నార్మల్ గా ఉంటాయి. ఈ వీడియో మీ ఆఫీస్ లో ఉన్న ఆ ఎనిమిది మంది ఫ్రెండ్స్ కి పంపండి. ఎందుకంటే వాళ్ళలో కొందరు తమకు తెలియకుండానే ఈ సైలెంట్ డిజాస్టర్ వైపు వెళ్తూ ఉండొచ్చు. రాహుల్ కి ఎవరు చెప్పలేదు కానీ మీకు నేను చెప్తున్నాను మీరు ఇంకో 10 మందికి చెప్పండి.
(12:04) మన ఇండియా ఫ్యూచర్ కేవలం కోడింగ్ లో మాత్రమే లేదు. మన లివర్ హెల్త్ లో కూడా ఉంది. ఈ లివర్ డిసీజ్ ని మనం సీరియస్ గా తీసుకోవాలి ఎందుకంటే పాపులేషన్ అన్‌ఫిట్ గా మారితే ఫ్యూచర్ జనరేషన్ అన్‌ఫిట్ గా మారితే మన కంట్రీ చాలా పెద్ద సైలెంట్ ఎకనామిక్ అండ్ హెల్త్ క్రైసిస్ ని ఫేస్ చేయాల్సి రావచ్చు. అవునా కాదా? మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు.
(12:27) మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు అండ్ మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమిటంటే ఈ వీడియోని ఎంత వీలైతే అంత షేర్ చేసి ఈ విషయంలో ప్రజల్లో అవేర్నెస్ వచ్చేలా చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.
(12:47) అంటిల్ దెన్ జై హింద్ జై భారత్ భారత్ మాతా కి జై.
No comments:
Post a Comment