దేవతా ఉపాసకుల్లో మానవ బంధాల పై అనాసక్తి ! #vastavam #prasadthota
Author Name:Vastavam Channel
Youtube Channel Url:https://www.youtube.com/@vastavam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=T9-e7KxSlS4
Transcript:
(00:00) జప సాధనలు మంత్ర సాధనలు ఉండే వాళ్ళకి ఆ దైవ శక్తి తోటి అనుబంధం పెరిగే కొద్దీ అంటే నథింగ్ బట్ ఆ కుండలిని శక్తి అనేది కొంచెం కొంచెంగా జాగృతం అవుతున్న కొద్దీ కూడా బాహ్య ప్రపంచం మీద ఆసక్తి తగ్గిపోతుంది బాహ్య ప్రపంచం అంటే మన మిత్రులు కావచ్చు సహా ఉద్యోగులు కావచ్చు ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు వాళ్ళతోటి ఎక్కువగా కలవాలనిపించదు వాళ్ళతో ఎక్కువగా మాట్లాడాలి అనిపించదు ఏంటో అది ఒక టైం వేస్ట్ అనిపిస్తుంది ఆ సమయం కూడా ఉంటే మనం ఆ దేవతా శక్తి దగ్గర కూర్చొని జపం చేస్తూ కూర్చోవచ్చనో లేకపోతే ప్రశాంతంగా ఉండాలనో ఒంటరిగా ఉండాలి అని అనిపించే భావన అన్నమాట
(00:35) అది అదే భావన పెరిగి పెరిగి పెద్దదయ్యి మన బంధువులు బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళతోటి కొంచెం కొంచెం కొంచెం దూరం వెళ్ళిపోవాలి అనిపిస్తుంది పోనీ అక్కడితో ఆగుతుందా ఆగదు అది ఇంకా మరింతగా పెరిగిన తర్వాత జరిగే ప్రమాదం ఏంటంటే తల్లిదండ్రుల మీద వాళ్ళతో కూడా దూరం జరగాలనిపిస్తుంది రాను రాను మీరు ఊహించుకోవచ్చు జీవిత భాగస్వామితో కూడా దూరం అయిపోవాలి అనిపిస్తుంది
No comments:
Post a Comment