‼️VIRAT, DONI, SACHIN Cricketers పేర్లతో మహాభారతం పద్యం చెప్పమంటే చెప్పగలరా?‼️AVADHANAM #madangupta
Author Name:Madan Gupta
Youtube Channel Url:https://www.youtube.com/@themadangupta
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Dda91w6Epq8
Transcript:
(00:00) నమస్తే సదా వత్సలే మాతృభూమే నమస్కారం మిత్రులారా నేను మీ మదన్ గుప్త ఈరోజు మనదైన ఒక అద్భుత ప్రక్రియ గురించి తెలుసుకుందాం. మన మస్తిష్కం మన ఏకాగ్రత మన ధారణ ఈ మూడు కలిసి చేసే అద్భుతం అవధానం మన మైండ్ కి మన మస్తిష్కానికి ఎంత పవర్ ఉన్నది అనేది ఈరోజు వరకు ఎవరు కనుక్కోలేకపోయారు మనం శ్రీకృష్ణ పరమాత్ముని చూసాం ఆయన అనేక రకాలైనటువంటి విషయాల్ని ఏదోసి సినిమాలో నేను చూడడం జరిగింది. ఒక ఆర్కిటెక్ట్ ఒక మ్యూజిషియన్
(00:49) ఒక మ్యూజిషియన్ ఒక వారియర్ ఒక నగరాన్ని నిర్మించగలిగిన సమర్థుడు ఫిలాసఫర్ ఇన్ని కలిసి ఒక వ్యక్తిగా రూపొందితే అది శ్రీకృష్ణుడు ఈరోజు మన న్యూరాలజీ సైంటిస్టులు చెబుతున్నది ఏమిటంటే ఇన్ని ప్రయోగాలు చేసినా ఇంతచే చేసినా మన మైండ్ కు ఉన్నటువంటి పవర్ ని 5 శాతం మాత్రమే ఉపయోగించుకోగలుగుతున్నాం అనిని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేశారు.
(01:28) ఈ అవధాన ప్రక్రియ ను గురించి మనం తెలుసుకుంటే ఇది ఎంత అద్భుతమైనటువంటి ప్రక్రియో మీకు తెలుస్తుంది. ముందు ఒక ఉదాహరణను తీసుకొని తద్వారా మనం ఈ ప్రక్రియను గురించి విపులంగా తెలుసుకుందాం. ఈసారి ఆర్ గణేష్ అనే ఆయనను భారత ప్రభుత్వం పద్మభూషణ ఉపాధితో సన్మానించింది. వీరు మానవుడి మస్తిష్కం యొక్క రహస్యాన్ని చేదించారు అని చెప్పుకోవచ్చు.
(02:00) ఈయన అవధాన ప్రక్రియలో చాలా గొప్పవారు ఈ ప్రక్రియ ఈయన ఎలా చేస్తారో ముందుగా తెలుసుకుందాం. వీరిని ముందుగా ఒక గదిలో కూర్చోబెడతారు. గణేష్ గారిని వారి దగ్గర పెన్ గాని పేపర్ గాని ఏమి ఉండవు ఖాళీ గది ఆ గదిలో ఒక 100 మంది ఒకరి తర్వాత ఒకరుగా ప్రవేశించి ఒక నంబర్ చెప్పి ఒక పదమో లేక వాక్యమో చెప్పి వెళ్తారు. అలా 100 మంది చెప్పిన తరువాత వారు బయటకు వచ్చి ఏ నంబరు వ్యక్తి ఏ పదం లేదా ఏ వాక్యం చెప్పాడో చెబుతాడు.
(02:42) అంటే 100 నంబర్లు వాటికి లింకు ఉన్నటువంటి మాట లేదా వాక్యం గుర్తుపెట్టుకొని చెప్పాలి దీన్నే అవధాన క్రియ అంటారు వీరిని శతావధాని అంటారు. మన దేశంలో ఈనాటికి అష్టావధానులు శతావధానులు సహస్రావధానులు ఉన్నారు. అవపూర్వక ధాజ్ ధారణ పోషకయోహ అనే ధాతువు నుండి అవధానం అనే పదం పుట్టింది. సామాన్య అర్థంలో అంటే మామూలుగా మనం మాట్లాడుకునేటటువంటి అర్థంలో తీసుకుంటే అవధానం అనే మాటకు ఏకాగ్రత అని అర్థం ఇంగ్లీష్ లో దీన్ని అటెన్షన్ అంటారు.
(03:19) అవధానాల్లో సాహిత్య అవధానాలని సాహిత్యేతర అవధానాలని ఉన్నాయి. సాహిత్యావధానాల్లో అష్ట్రావధానం, శతావధానం, సహస్రావధానం మొదలైనవి ఉండగా సాహిత్యేతర అవధానాల్లో మరికొన్ని ఉన్నాయి. ఇందులో కొన్ని ధారణా సంబంధమైనటువంటి అవధానాలు ధారణేతర అవధానాలు ఉన్నాయి. ఈ అవధాన ప్రక్రియను అనేక భాషల వారు అనేక రకాలుగా అభ్యసించి అనేక రకాలుగా ప్రదర్శిస్తున్నారు.
(03:49) శతావధాని చల్లపెళ్ళ వెంకట శాస్త్రి గారు తమ కథలు గాధలు అనే గ్రంథంలో అవధానం వేదాన్ని అధ్యయనం చేసేవారు వేదాన్ని ధారణ చేయడానికి అభ్యసిస్తారు అని రాశారు. వేదంలో జట క్రమ మాల శిఖ ధ్వజ దండ రథ అనే ఘన అనే ఎనిమిది వేద పటనాభ్యాస విధానాలు ఉన్నాయి. వాటిని అభ్యాసం చేయడానికి ఈ అవధానాన్ని అభ్యసిస్తారు. వీటిని అభ్యసించిన వారిని వేదావధానులు అంటారు.
(04:20) రాళ్ళబండి కవితా ప్రసాద్ గారు సాహిత్యత రంగంలో అవధానాలను నాలుగు రకాలుగా విభజించారు. ధారణా మాత్ర అవధానాలు సాంకేతిక అవధానాలు శాస్త్ర సంబంధ అవధానాలు కళా సంబంధ అవధానాలుగా విభజించారు. మనం చూస్తూ ఉంటాం భగవద్గీతను రామాయణాన్ని ధారణ చేయడం శబ్దావధానం, పుష్పావధానం ఇలా అనేక రకాల అవధాన ప్రక్రియలు చేస్తున్నారు. స్వరావధానం, అక్షరావధానం, గణితావధానం, జ్యోతిష్యావధానం, వైద్య అష్టావధానం అక్షర గణితావధానం, నాట్యావధానం, సంగీత అష్టావధానం, సంగీత గేయధార, నేత్రావధానం మొదలైన అనేక ప్రక్రియలు ఈ అవధాన ప్రక్రియలో చోటు చేసుకున్నాయి.
(05:04) అన్ని అవధానాల గురించి చెప్పుకుంటూ పోతే అదో పెద్ద గ్రంథం అవుతుంది మన వీడియో కొన్ని గంటల నిడివి అవుతుంది. కనుక మచ్చుకు ఒకటి రెండు ఉదాహరణలు చెప్పుకొని ముందుకు నడుద్దాం. నాట్యావధానం నా చిన్నప్పుడు చూశాను ఒంగోల్లో ధార రామనాథ శాస్త్రి గారు ఉండేవారు వారు మా ఊర్లో కావలిలో కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆయన ఒక ప్రదర్శన ఇచ్చాడు.
(05:31) అది నేను చూడడం జరిగింది. ఈ ప్రక్రియ ఏంటంటే మీరు ఏదైనా ఒక అంశం గాని ఒక క్యారెక్టర్ గాని ఒక సంఘటన గాని ఇస్తే సరిగ్గా రెండు నిమిషాలలో ఆ క్యారెక్టర్ సంబంధించిన వేషధారణ చేసుకుని ఆ క్యారెక్టర్ ని మన కళ్ళ ముందు ఉంచుతారు. ఉదాహరణకు శివాజీ అనే క్యారెక్టర్ ఇస్తే వెంటనే శివాజీ వేషంలో శివాజీ డైలాగులు చెబుతూ అచ్చు శివాజీ లాగానే మనకు కనిపిస్తారు.
(05:57) రాణి రుద్రమ పాత్ర ఇస్తే రాణి రుద్రమ వేషంలో రాణి రుద్రమ డైలాగులు చెబుతూ మన ముందుకు వస్తారు. ఏదైనా సంఘటన ఇచ్చామ అనుకోండి ఆ సంఘటనలోనే పాత్రలు ఎలా మాట్లాడతాయో మన ముందు ప్రదర్శిస్తారు. ఇలా మీరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆ క్యారెక్టర్ ను మీ ముందుకు ఉంచుతారు. ఇంతకుముందు ఇదే ప్రక్రియను నాట్యకారులు నాట్యం ద్వారా ఈ విధానాన్ని చేసేవారు.
(06:24) ఇప్పుడు మరో అవధానాన్ని చూద్దాం. భగవద్గీతా అవధానం ఈ మధ్యకాలంలోనే ఏదో టీవీలోనో వీడియోలోనో ఏదో YouTube లోనో చూశాను ఓ చిన్న కుర్రాడు మీరు 12వ అధ్యాయం 10వ శ్లోకం అనగానే ఆ శ్లోకం చెబుతాడు అలాగే 15వ అధ్యాయం 14వ శ్లోకం అనగానే ఆ శ్లోకం చెబుతాడు. ధారణతో ఇది సాధ్యమవుతుంది. ఇక మన తెలుగువారి ప్రత్యేక అవధానం సాహిత్య అవధానం దీని గురించి తెలుసుకునే ముందు మన సాహిత్యం పద్యాలు ఛందస్సు గురించి కొద్దిగా తెలుసుకోవాలి.
(07:03) ఎందుకంటే ఈ తెలిస్తే గాని అవధానం యొక్క విలువ మనకు అర్థం కాదు ఒక పద్యం రాయాలి అంటే గణాలు తెలియాలి గురు లఘువులతో ఏర్పడేవి గణాలు ఈ గణాలను గుర్తించడానికి మేము చిన్నప్పుడు ఒక సూత్రాన్ని ఇచ్చేసేవాళ్ళం యమాత రాజబాన సలగం అని యతి ప్రాసలు తెలియాలి ఉత్పలమాలకు ప్రతి పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉండాలి ప్రతి పాదంలో భరణభరవ అంటే భగణం రగణం నగణం భగణం భగణం రవణం రగణం వగణం అనేటటువంటి అనే గణాలు రావాలి పదవ అక్షరం యతి ఇలా ఉత్పలమాల ఇక చంపకమాల శార్ధులం మత్తేభం మత్తకోకిల కంద అనేక రకాల పద్యవృత్తాలు ఉన్నాయి మనకి
(07:54) ఈ సూత్రాలను పాటిస్తూ పద్య నిర్మాణం చేయాలి ఇంత కష్టతరమైనది పద్య నిర్మాణం ప్రస్తుత టెక్ యుగంలో కష్టపడడాన్ని వదిలివేసాం. కాబట్టి కష్టతరమైన పద్య నిర్మాణం కూడా కనుమరువ అవుతూ ఉంది. ఆంగ్ల విద్య వెనుకబడి మనం మాతృభాషను నిర్లక్ష్యం చేస్తున్నాం. అద్భుతమైన భావ వ్యక్తీకరణ చేయాలి అంటే మాతృభాషను మించిన భాష మరొకటి లేదు.
(08:24) ఇతర భాషలు నేర్చుకోవడంలో తప్పు లేదు కానీ మన భాషను వదిలివేయడం మాత్రం మాతృద్రోహం సరే మరలా అవధానం గురించి తెలుసుకుందాం మనకు అష్టావధానం శతావధానం సహస్రావధానం అనే ప్రక్రియలు ఉన్నాయని ముందే చెప్పుకున్నాం ముందుగా అష్టావధానాన్ని గురించి తెలుసుకుందాం ఈ అష్టావధానంలో ఎనిమిది మంది పృచ్చకులు ఉంటారు. పృచ్చకులు అనగానే ఎవరో అనుకోకండి పృచ్చకులు అంటే ప్రశ్నించేవారు అని అర్థం.
(08:51) వీరు ఎనిమిది రకాలుగా అవధానిని ప్రశ్నలు అడుగుతారు. ఇప్పుడు ఈ ఎనిమిది రకాల ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయో కూడా కొద్దిగా తెలుసుకుందాం. దాంట్లో సమస్యపూరణం ఒక విధానం అవధానాలలో సమస్యపూరణం అనేది చమత్కారపూరితమైన జటిలమైన ప్రక్రియ పృచ్చకుడు అంటే అదేనండి ప్రశ్నించేవాడు ఒక పద్యపాదాన్ని భావ వైరుధ్యంతో ఇస్తాడు భావ వైరుధ్య సమస్యను అవధాని పూరించాలి.
(09:24) తెలుగులో సమస్య పూరణాలు అనే పుస్తకం కూడా ఉంది. అనేక పుస్తకాలు సమస్య పూరణాల పైన వచ్చాయి. కానీ సినిమాల్లో వచ్చిన ఒక రెండు సమస్య పూరణాలు చెబుతాను ఎందుకంటే అవి అందరికీ తెలిసి ఉంటాయి కాబట్టి తెనాలి రామకృష్ణ సినిమాలో ఒక సమస్యను గేట్ దగ్గర ఉండేటటువంటి ఒక బంటు తెనాలి రామకృష్ణని అడుగుతాడు కుంజర యుధంబు దోమ కుత్తుక జొచ్చన్ అంటే ఏనుగుల గుంపు వెళ్లి దోమ గొంతులో దూరింది ఇది సమస్య ఎక్కడైనా ఏనుగుల గుంపు దోమ గొంతులో దూరుతుందా అండి దానికి ఆ బంటుకు దొరికిన సమాధానం ఏంటంటే గంజాయి తాగి తురకల సంజాతము చేత కళ్ళు చవిగొన్నావా లంజల కొడక ఎక్కడి కుంజరయుధంబు
(10:12) దోమ కుత్తుక చొచ్చెన్ అని ఘాటుగా సమాధానం ఇస్తాడు అర్థం వివరించనక్కర్లేదుఅను అనుకుంటాను అందరికీ ఈ పాటికి ఈ పద్యం అర్థంయి ఉంటుంది. ఇదే సమస్యను శ్రీకృష్ణదేవరాయులు అడుగుతాడు. దానికి సమాధానంగా రంజన చెడి పాండవుల హరిభంజనులై విరటుకొల్వుపాలైరకట సంజయ విధినేమని చెప్పుదు కుంజరయుధంబుదోమ కుత్తుక జొచ్చెన్ అని సమాధానం ఇస్తాడు.
(10:42) దీని అర్థం ఏమిటంటే విధివంచితులైనటువంటి ఏనుగుల గుంపు వంటి పాండవులు దోమ అంత చిన్నదైన రాజ్యం విరాట రాజ్యం అటువంటి దోమ గొంతులోకి అంటే అటువంటి విరాట రాజ్యంలోనికి కొలువుల కోసం పాండవుల లాంటి ఏనుగుల గుంపు చేరింది అని పూరించాడు అంటే అక్కడ ఏనుగుల గుంపు దోమ కుత్తుకలో దూరింది అని భావాన్ని ఇచ్చాడు. మరో సినిమాలో ఆదిత్య 369 లో కృష్ణదేవరాయుల ఆస్థానంలోనే మరో సమస్య ఇవ్వబడుతుంది.
(11:23) బలరాముడు సీత చూచి పక్కున నవ్వెన్ బలరాముడు మహాభారత కాలం నాటివాడు సీత రామాయణ కాలం నాటి తల్లి ఇది ఎలా సాధ్యం ఈ సమస్యను కూడా తెనాలి రామకృష్ణుడే పూరిస్తాడు సినిమాలోండి లలనలు పాయసమానిన కలుగుదురే పిల్లలను సూక్ష్మాసుతనవ్వన్ పొలమున దొరికెదరని ధీవల రాముడు సీత చూచి పక్కున నవ్వెన్ స్త్రీలు పాయసం తాగితే పిల్లలు పుడతారా అని సీతమ్మ తల్లి నవ్వింది.
(11:55) పొలంలో దొరుకుతారులే అన్నాడు శ్రీరామచంద్రుడు నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. ఇక్కడ ది అనే అక్షరం చేర్చడంతో బుద్ధి బలం కలిగినటువంటి రాముడు అనే అర్థం వస్తుంది. అలాగే లంగాలాగిన సీత కృంగెన్ అనేది సమస్య. కాల్ నీలంగా లాగిన సీత కృంగెన్ అనేది పూరణం. పంచాంగము చూచి పడతి పక్కున నవ్వెన్ ఇలా అనేక సమస్యలకు చాతుర్యంతోను హాస్యరసం మేళవించి పూరణలు చేశారు.
(12:28) సివి సుబ్బన్న గారు తమ అవధాన విద్య అనే పుస్తకంలో 16 రకాలుగా ఈ సమస్యను సమస్య పూరణాన్ని చేయవచ్చని రాశారు దత్తపది రెండవది. ఈ దత్తపదిలో నాలుగు పదాలు ఇస్తారు ఈ నాలుగు పదాలు పద్యంలోని నాలుగు పంక్తులలో అంటే లైన్లలో రావాలి వృచ్చకుడు ఈ పదాలతో పాటుగా ఒక అంశాన్ని కూడా ఇస్తాడు ఆ అంశం ప్రకారం ఈ నాలుగు పదాలు వచ్చేలా పద్యం చెప్పాలి ఒక ఉదాహరణ కూడా మనం చూద్దాం పృచ్చకుడు అంటే ప్రశ్నించేవాడు సచిన్ ధోని విరాట్ వార్న్ అనే నాలుగు పదాలు ఇచ్చి మహాభారత
(13:13) అర్థంలో చెప్పమని అడిగాడు. ఈ నాలుగు పదాలకు మహాభారతానికి ఏమైనా సంబంధం ఉందా సంబంధమే లేదు అవధాన్ని దీన్ని ఎలా పూరించాడో అది కూడా చూద్దాం. వ్యాస చిన్మయ రూప నీ వ్రాత మహిమ రమ్యముగా గంటి నేను విరాట్ స్వరూపు చాలు నదియా యదోనిధులేల ననుచు నిష్ట జైమిని వేదవార్నిధి మదించే మొదటి పంక్తిలో వ్యాస చిన్మయ లో సచిన్ స చిన్న సచిన్మయ చిన్ సచిన్ అనే పదం వచ్చింది.
(13:53) రెండవ పంక్తిలో విరాట్ స్వరూప విరాట్ వచ్చింది. మూడవ పంక్తిలో యధోనిధులేల అనే పదంలో ధో ని రెండు పదం వచ్చింది. నాలుగవ పంక్తిలో వేదవార్నిధిలో వార్న్ వచ్చింది. ఇక మూడవ ప్రక్రియ నిషిద్ధాక్షరి ఇది కూడా చూద్దాం అవధాన ప్రక్రియలో నిషిద్ధాక్షరి అత్యంత క్లిష్టమైన ప్రక్రియగా చెప్పుకుంటారు. అవధాని పద్యంలో మొదటి అక్షరం ప్రారంభించగానే పృచ్చకుడు ఆయన ఏ పదం వాడబోతున్నాడో ఊహించి రెండవ అక్షరాన్ని నిషేధిస్తాడు.
(14:39) అప్పుడు అవధాని వేరే అక్షరాన్ని ఆ పదంలో పెట్టి పదాన్ని పూర్తి చేసుకోవాలి. అలా పద్యంలోని పదాలన్నింటిలో పృచ్చకుడు నిషేధించిన అక్షరం లేకుండా పద్యం పూర్తి చేయాలి. ఒక్కోసారి పృచ్చకుడు ఒక అక్షరాన్ని నిషేధించి పద్యం చెప్పమనవచ్చు అంటే ఉదాహరణకు కంద పద్యంలో కందకూర పైన పద్యం చెప్పాలి. ఆ పద్యంలో క అనే అక్షరం రాకూడదు చూడండి పద్యం అంటే ఆ పద్యం యొక్క ఛందస్సు విధానం కంద కంద పద్యం కూర కందకూర కందకూర పైన చేయాల కానీ క అక్షరం రాకూడదు ఇలా అంటే ఎంత క్లిష్టమైన
(15:30) పరిస్థితి ఉంటుందో చూడండి ఇలా ఇక నాలుగవ ప్రక్రియ న్స్తాక్షరి ఏదైనా పద్యపాదంలోనో పాటల్లోనో వాక్యంలోని అక్షరాలను చిన్న చిన్న కాగితం ముక్కల మీద రాసి అస్తవ్యస్తంగా అంటే అప్పుడప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు కాగితం ముక్కలను అవధానికి అందిస్తాడు. ఆ కాగితం ముక్కలన్నిటిని అందుకున్నటువంటి అవధాని ఆ అక్షరాలన్నింటిని గుర్తుపెట్టుకొని వాటిని ఒక వరుసలో పెట్టి ఆ వాక్యాన్ని చెప్పాలి.
(16:05) పై నాలుగు ప్రక్రియలు జరిగేటప్పుడు మధ్య మధ్యలో ఒకరు గంట మరోగిస్తూ ఉంటారు ఇతన్ని గంటావరాని అంటారు. చివరిలో పృచ్చకుడు ఎన్నిసార్లు గంట మోగించాడో చెప్పాలి. అలాగే మరొక పృచ్చకుడు మధ్యలో ఆయన శరీరం మీద పూలు చల్లుతూ ఉంటాడు. చివర్లో ఆ పూల సంఖ్య ఎంత అనేది కూడా అవధాని చెప్పాలి. మధ్యలో మరో పృక్షకుడు అవధాని కాన్సంట్రేషన్ డైవర్ట్ చేయడానికి అప్రస్తుత ప్రసంగం చేస్తూ ఉంటాడు.
(16:39) అతనికి అప్రస్తుత ప్రసంగాన్ని కూడా అవధాని సమాధానం చెబుతూ అవధానాన్ని కొనసాగించాలి. ఇంత క్లిష్టమైన ప్రక్రియ ఇది అవధానికి సంస్కృత ఆంధ్ర సాహిత్యం పైన మంచి పట్టు ఉండాలి. కావ్యాలను, పురాణాలను, ఇతిహాసాలను బాగా చదివి ఉండాలి. చందస్సు పైన పట్టు ఉండాలి ధారణ కలిగి ఉండాలి గొప్ప కాల్పనిక శక్తి ఉండాలి అప్పుడే అవధాని అవధాన ప్రక్రియను కొనసాగించగలడు.
(17:07) ఎనిమిది మంది పృచకులు ఉంటే అష్టావధానం అదే 100 మంది పృచకులు ఉంటే శతావధానం 200 మంది పృచకులు ఉంటే ద్విశతావధానం 1000 మంది పృచకులు అంటే ప్రశ్నించే వాళ్ళు 1000 మంది ఉంటే అది సహస్రావధానం ఆలోచించండి 1000 మంది 1000 రకాలుగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు వాళ్ళ ప్రశ్నల్ని మైండ్ లో పెట్టుకోవాలి దాని సమాధానాల్ని అప్పటికప్పుడు తయారు చేసి సిద్ధం చేసుకుంటూ ఉండాలి ఇలా 1000య మందికి ఏమేమి ప్రశ్నలు ఇచ్చారో ఆ ప్రశ్నలకు సరైనటువంటి సమాధానాలు చెబుతూ అవధాని ముందుకు నడుస్తాడు.
(17:48) ఈ ప్రక్రియ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే మానవ మస్తిష్కానికి ఎంత శక్తి ఉందో తెలియజెప్పడానికి మాత్రమే చివరిగా నాకు తెలిసిన అవధానల గురించి స్మరించుకుని ఈ విషయాన్ని మనం ముగిద్దాం. తెలుగు సాహిత్యంలో అనేకమంది అవధానులు ఉన్నారు తెనాలి రామకృష్ణుడు శ్రీనాధుడు కొప్పరపు సోదరులు తిరుపతి వెంకట కవులు రాళ్ళబండి కవితా ప్రసాద్ గారు మేడసాని మోహన్ గారు డాక్టర్ సివి సుబ్బన్న గారు దోర్బల ప్రభాకర శర్మ గారు రాంబట్ల జగన్నాథ శాస్త్రి గారు వెంకట పార్వతీశ కవులు వెంకట శేష కవులు కాశీ కృష్ణమాచార్యులు కడిమెళ్ళ వరప్రసాద్ గారు అద్దేపల్లి రామ్మోహన్ గారు
(18:26) మొదలైన వారు ఇంకా చాలా మంది ఉన్నారు అంద అందరి పేర్లు నాకు తెలియకపోవచ్చండి. అనేక అవధానాలు చేసి తెలుగు పద్య సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. మా చిన్నతనంలో ఇటువంటి అద్భుత ప్రక్రియలను చూసే అదృష్టం మాకు దక్కింది. ఈనాటికి అవధాన విద్యను అవపోసన పట్టినటువంటి మహామహుడు ఉన్నారు. ప్రస్తుతం ఈ అవధాన విద్య బ్రతికి ఉంది అంటే మెడసాని మోహన్ గారు వద్దిపర్తి పద్మాకర్ గారు గరికపాటి నరసింహారావు గారు మాడుగుల నాగపణ శర్మ గారు వీళ్ళ దయవల్ల నేటి తరం ఇటువంటి అద్భుత విషయాలను నేర్చుకోవడానికి ముందుకు రావడం లేదు.
(19:07) ఈ తరం దాటితే ఈ అద్భుత విద్య కనుమరుగ అవుతుందేమో అనేటటువంటి బెంగ పట్టుకుంది. మనదైన విద్యలను బ్రతికించుకుందాం. ఇది మిత్రులారా మన అవధాన ప్రక్రియ గొప్పతనం ఈ వీడియో చూసి కొంతమందయినా ఈ విద్య నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే తెలుగు జాతి సంతోషిస్తుంది. మరో మంచి విషయంతో మీ ముందు ఉంటాను అప్పటివరకు సెలవా మరి అనేకమంది వధాన్యులు మేము చేస్తున్నటువంటి ఈ మహత్కార్యానికి తమ చేయుతను అందిస్తున్నారు.
(19:37) వారందరికీ మా ధన్యవాదాలు మీ సహాయాన్ని కొనసాగించమని ప్రార్థిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ది మదన్ గుప్త ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే అలాగే మీ మిత్రులకు కూడా మన ది మదన్ గుప్తా ఛానల్ ను పరిచయం చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో మాతో పంచుకోండి మరో మంచి అంశంతో మీ ముందుంటాను అప్పటివరకు సెలవు మరి జై హింద్ జై మా భారతి నమస్కారం మిత్రులారా మీ మదన్ గుప్త
No comments:
Post a Comment