శ్రీ గురుభ్యోనమః
వినాయక చతుర్థీ పూజా పత్రములు -బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవులు అందించిన ప్రామాణిక నామాలు
1. మాచీ పత్రం
2. బృహతీ పత్రం అంటే "వాకుడాకు" (వాక్కాయ ఆకు)
3. బిల్వపత్రం అంటే " మారేడు"
4. దూర్వాయుగ్మం -
దూర్వా అనగా గరిక. యుగ్మం అంటే రెండు. దూర్వాయుగ్మం అనగా రెండు గరిక పోచలు
5. ధత్తూర పత్రం అంటే " ఉమ్మెత్త "
6. బదరీ పత్రం అంటే "రేగు"
7. అపామార్గ పత్రం అంటే "ఉత్తరేణి"
8. జంబూపత్రం అంటే నేరేడు
9. చూత పత్రం అంటే " మామిడి ఆకు"
10. కరవీరపత్రం అంటే " గన్నేరు"
11. విష్ణు క్రాంత పత్రం అంటే వ్యవహారము లో " విష్ణుకాంత"
12. దాడిమీ పత్రం అంటే " దానిమ్మ"
13. దేవదారు పత్రం
14. "మరువం" పత్రం
15. సింధువార అంటే "వావిలి"
16. జాజీ పత్రం అంటే "జాజిఆకు"
17. గండకీ పత్రం అంటే " దేవకాంచనం"
18. శమీ పత్రం అంటే "జమ్మి ఆకు"
19. అశ్వత్ధ పత్రం అంటే " రావి ఆకు"
20. అర్జున పత్రం అంటే " తెల్లమద్ది"
21. అర్క పత్రం అంటే "జిల్లేడు"
వీటిలో ఏదేని ఒకరకం లేకపోతే ఉన్న ఆకులే మళ్లీ సమర్పించవచ్చు.
ఇక ఈ ఏకవింశతి పత్రాలు అంటే ఇరవై ఒక్క వనమూలికలను వినాయక చవితి రోజున ఎందుకు
పూజలో ఉపయోగిస్తారు అంటే దీనిలో ఒక పరమార్ధం దాగిఉంది. ఊరిలోని ప్రజలు వినియోగించిన నీళ్ళన్ని డ్రైనేజీ కాలువల ద్వారా ఊరి చెరువులో కలుస్తాయి. ఈ వినాయక నవరాత్రులలో ఈ ఏకవింశతి పత్రాలు పూజలో పెట్టడం వలన ఇంట్లో చెడుని తొలగించి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. పూర్వ కాలంలో ఊరి జానాలు అందరూ చెరువు నీళ్ళనే అందరూ త్రాగేవారు. వినాయక నవరాత్రులు ముగిసాక గణేష్ నిమర్జనం చేసినప్పుడు ఈ ఆకులన్నింటిని చెరువులో కలపడం ద్వారా చెరువులోని కలుషితమైన నీళ్ళన్ని ఆయుర్వేద గుణము కలిగిన పత్రాలు కాబట్టి కలుషితమైన నీళ్ళను శుద్ధి చేస్తాయి.
No comments:
Post a Comment