*🌅 ఆరోగ్య జీవన యాత్ర – ఈరోజు అరుణోదయ సందేశం 🌅*
*🙏 భగవద్గీతలో శ్రీకృష్ణుని అమూల్యమైన బోధ 🙏*
*“ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ।*
*ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః ॥”*
*— భగవద్గీత 6.5*
*🌿 భావం:*
మనిషి తనను తాను పైకి తీసుకెళ్లుకోవాలి…
తనను తానే కిందకు లాగుకోకూడదు.
మన మనసే మనకు మంచి మిత్రుడు కావచ్చు…
అదే మనసు అదుపు తప్పితే మనకు శత్రువుగా మారవచ్చు.
*🌞 ఈ ఉదయపు సందేశం:*
మన ఆలోచనలను మార్చుకుంటే
మన జీవితం మారుతుంది.
మనసులో మంచి ఆలోచనలు నింపుకుంటే
మాటల్లో మంచితనం వస్తుంది…
మంచి మాటలు చేతల్లోకి వస్తే
మన జీవితం మాత్రమే కాదు—
మన చుట్టూ ఉన్నవారి జీవితాల్లో కూడా వెలుగు నిండుతుంది.
*🌱 ఈరోజు మనసును జయిద్దాం…*
*మంచిని ఆచరిద్దాం…*
*ఆరోగ్యంగా, ఆనందంగా జీవిద్దాం.*
*ఆరోగ్య జీవన యాత్ర*
*— వేల్పుల బోస్....✍🏻*
No comments:
Post a Comment