*పారాయణ*
ఈరోజుల్లో ఎక్కడ చూసినా, ఏ గుళ్ళో, ఏ వూళ్ళో, ఏ ఇంట్లో చూసినా మేము ఆ దేవుడి పారాయణ చేస్తున్నాము, అమ్మవారి నామాలు , రామాయణ భాగవతాలు పారాయణ సల్పుతున్నాము అని వింటున్నాము, మరి *ఈ పారాయణ వల్ల మనకు ఎంత వరకు ఉపయోగం??*
శాస్త్రములు చదువవలసిందే, వేదములు అభ్యసించ వలసిందే, ఉపనిషత్తులు చూడవలసిందేగాని, వాటిని పారాయణ గ్రంథములుగా మనం భావించరాదు.
ఈనాడు 'గీతా పారాయణము చేయండి' అంటారు.
ఇటువంటి మూర్ఖ గురువుల వల్లనే మూర్ఖ శిష్యులు తయారవుతున్నారు.
'లడ్డు, లడ్డు' అని పారాయణ చేస్తే లడ్డూ నీ చేతికి వస్తుందా?
హైదరాబాద్ పోవాలని రోడ్డుపై నిలబడి "హైదరాబాద్, హైదరాబాద్" అంటూ నిలబడితే హైదరాబాద్ కు చేరతావా?
అనేకమంది అమాయక జనులు కేవలం పారాయణ చేస్తే సరిపోతుందనుకుంటారు,
లలితాసహస్రనామ పారాయణ, గీతాపారాయణ... ఇవన్నీ పారాయణ చేసి లాభమేమిటి?
నూరు శ్లోకాలు చెప్పే బదులు ఒక్క శ్లోకమును మనము ఆచరణలో పెట్టడం వల్ల అది మనకు లాభం.
మనమే కాదు, మన మొబైల్ కూడా నిత్యం ఏదో ఒక శ్లోకం పారాయణ చేస్తూనే ఉంది, అది చెడిపోతే ఏమి చేస్తున్నావు, రేపు మనము కూడా అంతే,
ఆచరణ లేని ఎలాంటి పారాయణ అయినా నిరర్థకము.
అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఆచరణ సలిపితే భగవంతుణ్ణి చేరగలుగుతాము.
అర్థమైతే నీవు జ్ఞానివి, అర్థం కాక నవ్వితే అజ్ఞానివి,
*_🌿శుభమస్తు🌿_*
No comments:
Post a Comment