Sunday, September 20, 2026

మన ఆత్మ మనతో ఎలా మాట్లాడుతుంది? దాన్ని ఎలా గుర్తించాలి? | Conversations with God

మన ఆత్మ మనతో ఎలా మాట్లాడుతుంది? దాన్ని ఎలా గుర్తించాలి? | Conversations with God

Author Name:Dhyana Jagath

Youtube Channel Url:https://www.youtube.com/@Dhyanajagath

Youtube Video URL:https://www.youtube.com/watch?v=W6d5sR_IrbU





Title: మన ఆత్మ మనతో ఎలా మాట్లాడుతుంది? దాన్ని ఎలా గుర్తించాలి? | Conversations with God

Author Name: Dhyana Jagath

Description: How can we hear the voice of the soul? How do we distinguish between the noise of the mind, fear, imagination, intuition, and genuine inner guidance?

Inspired by the ideas explored in Conversations with God – Book 1 by Neale Donald Walsch, this video looks at how inner communication can appear through feelings, thoughts, images, experiences, and words.

We explore questions such as:

How does God communicate with us?
Why are feelings described as the language of the soul?
Is every thought a message from God?
How can we recognize deeper inner guidance?
What is the connection between Joy, Truth, and Love?
What role do silence, awareness, and experience play?
How can we move from fear and lack toward love, gratitude, and trust?

This video is an exploration of the spiritual perspectives presented by Neale Donald Walsch, intended for reflection and self-inquiry.

Book: Conversations with God – Book 1
Author: Neale Donald Walsch

If this video resonates with you, share your experience in the comments.

#ConversationsWithGod #NealeDonaldWalsch #InnerVoice #Soul #Spirituality #InnerGuidance #Intuition #SelfAwareness #HigherSelf #Meditation #SpiritualAwakening #SelfDiscovery #Consciousness #PureLove #InnerPeace

Transcript:
(00:00) ఒక వ్యక్తి తన జీవితంలో అన్ని కోల్పోయాడు. ప్రేమించిన రిలేషన్షిప్ దూరమైంది ఉద్యోగం పోయింది. ఆ తర్వాత ఒక తీవ్రమైన కార్ యక్సిడెంట్ జరిగింది. ఆ ప్రమాదంలో అతని మెడకు తీవ్రమైన గాయమైంది. ప్రాణాలతో బయట పడడమే ఒక అద్భుతమని డాక్టర్లు చెప్పారు. కానీ అక్కడితో సమస్యలు ఆగలేదు. ఉద్యోగం కోసం ఎన్నో ఇంటర్వ్యూస్ కి వెళ్ళాడు. క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ ఎవ్వరు ఉద్యోగం ఇవ్వడానికి ముందుకు రాలేదు.
(00:26) రోజులు గడిచాయి. సేవింగ్స్ కరిగిపోయాయి. రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేకుండా పోయాయి. చివరికి [సంగీతం] ఉండడానికి ఇల్లు కూడా లేకుండా పోయింది. ఒకప్పుడు సాధారణ జీవితం గడిపిన ఆ వ్యక్తి ఇప్పుడు వీధుల్లో జీవించాల్సిన పరిస్థితికి వచ్చాం. ఒక నెల కాదు దాదాపు ఒక్క సంవత్సరం వర్షంలో మంచులో తీవ్రమైన చలిలో నీళ్ల మీద నిద్రపోయిన రోజులు ఉన్నాయి.
(00:52) తినడానికి ఇతరుల దగ్గర చిన్న చిన్న కాయిన్స్ అడుక్కొని తిన్న సందర్భాలు ఉన్నాయి. జీవితం అతన్ని పూర్తిగా కిందికి తీసుకెళ్ళినట్టు అనిపించింది. కానీ అదే వ్యక్తి తర్వాత ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని చేరుకున్న రచయితగా మారాడు. అతని పేరు నీల్ డోనాల్డ్ వాల్ష్ అతని జీవితాన్ని కాదు ఎంతో మంది జీవితాన్ని మార్చిన పుస్తకం కన్వర్జేషన్స్ విత్ గాడ్ అయితే వేదిలో జీవించే స్థితి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది గుండెల్లో చోటు ఎలా సంపాదించాడు? అసలు దేవుడితో మాట్లాడాడని అతడు ఎందుకు చెప్పాడు? దేవుడు తనకు ఏం చెప్పాడు ఇటువంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కొంత కాలం తర్వాత నీల్ కు
(01:31) ఒక చిన్న పార్ట్ టైం జాబ్ దొరికింది. ఒక చిన్న గది అద్దెకి తీసుకునేంత డబ్బు సంపాదించగలిగాడు. అది పెద్ద ఇల్లు కాదు. ఒక గ్యారేజ్ పైన చిన్న స్టూడియో కానీ ఏడాది పాటు వీధిలో జీవించిన అతనికి అది కూడా లగ్జరీలా అనిపించింది. అక్కడికి వెళ్ళిన దాదాపు రెండు నెలల తర్వాత ఒకరోజు తెల్లవారు జామున నాలుగున్నరకు నిద్రలేస్తాడు. నిద్ర రావడం లేదు.
(01:54) జీవితం మీద విపరీతమైన కోపం ఎందుకు తనకు ఇలా జరుగుతుంది ఎందుకు సమస్య మీద సమస్య వచ్చిపడుతుంది ఎంత ప్రయత్నించినా ఎందుకు జీవితం మారడం లేదు. తన ముందు ఉన్న ఒక బుక్కును తీసుకుంటాడు. దేవుడికి కోపంతో ఒక ఉత్తరం రాయడం మొదలు పెట్టాడు. దేవుడా జీవితం సరిగ్గా నడవాలంటే నేను ఏం చేయాలి? నేను అంత ఘోరంగా ఏం చేశాను? ఎందుకు నా జీవితంలో ఈ పోరాటం ఆగడం లేదు.
(02:20) పెద్ద అక్షరాలతో రాశడు. అసలు నీకు నా నుంచి ఏం కావాలి అతని లోపల నుంచి ఎన్నో సంవత్సరాలుగా పేరుకపోయిన బాధ బయటకు వస్తుంది. అక్కడే ఊహించని విషయం నీల్ కు జరిగింది. తనలో ఒక స్వరం వినిపిస్తుంది. చాలా ప్రశాంతమైన స్వరం ఆ స్వరం ఏమంటుందంటే నీల్ నీకు నిజంగా ఈ ప్రశ్నలకు సమాధానం కావాలా లేక నీ కోపాన్ని బయటకు వెళ్ళగక్కుతున్నావా? ఒక్కసారిగా అతను ఆశ్చర్యపోయాడు.
(02:49) మొదట గదిలో ఇంకెవరైనా ఉన్నారా అనుకున్నాడు. ఎవ్వరూ లేరు. తర్వాత నేను నా మానసిక స్థితిని కోల్పోతున్నానా అని అనుకున్నాడు. కానీ ఆ స్వరం చాలా ప్రశాంతంగా స్పష్టంగా ఉంది. అప్పుడు నీల్ మనసులో నాకు కోపం ఉంది కానీ నిజంగా సమాధానాలు ఉంటే తెలుసుకోవాలని కూడా ఉంది అని అనుకున్నాడు. అక్కడి నుంచి ఒక ప్రశ్న ఒక సమాధానం ఆ సమాధానం నుంచి మరో ప్రశ్న దానికి మరో సమాధానం ఇలా రాస్తూ వెళ్ళాడు.
(03:20) ఆ స్వరం కూడా తనకు పూర్తిగా తెలియని వేరే గొత్తులా కాకుండా తనలోనే వినిపించే అంతర్గత స్వరంలా అనుభూతి పొందాడు. అతను ఒక ప్రశ్న రాసేవాడు సమాధానం మనసులోకి వచ్చేది. ఆ సమాధానాన్ని తన చేతితో పేపర్ మీద రాసేవాడు. ఆ సమాధానం నుంచి మరో ప్రశ్న ఆ ప్రశ్న నుంచి మరో సమాధానం ఇలా ప్రశ్నలు సమాధానాలు వరుసగా కొనసాగుతూ ఒక దశలో తన లోపలే ఉన్న ఆ దేవుడితో సంభాషణ చేస్తున్నట్లు అనుభూతి చెందాడు.
(03:49) మొదట ఈ రాతలన్నిటిని ప్రపంచానికి చూపించాలన్న ఆలోచనే లేదు. అది తనకు చాలా పర్సనల్ అండ్ డివైన్ ఎక్స్పీరియన్స్ లా అనుభూతి చెందాడు. కానీ ఈ కన్వర్జేషన్స్ లో ఒక దశలో ఒక రోజు ఇది పుస్తకంగా మారుతుంది. ఎంతో మంది దీన్ని చదువుతారు అనే సమాధానం ఆ స్వరం వినిపించింది. ఈ పుస్తకం ఎవరికీ అవసరం ఉంటే వాళ్ళు ఈ పుస్తకాన్ని చేరుకుంటారు. వాళ్ళ లోపల ఉన్న ఎన్నో క్వశ్చన్స్ కి ఈ పుస్తకం ఆన్సర్ ఇస్తుంది అని ఆ స్వరం చెప్పింది.
(04:16) కానీ అతను నమ్మలేదు. ఎక్కడో ఉన్న వ్యక్తి దేవుడితో మాట్లాడుతున్నాను అని చెబితే ఏ పబ్లిషర్ పుస్తకం వేస్తాడు అని అనుకున్నాడు. ఆయన మూడు కాపీస్ చేసి ముగ్గురు పబ్లిషర్స్ కి పంపించాడు. కొన్ని వారాల్లో ఒక పబ్లిషర్ నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ళకు మెటీరియల్ నచ్చింది. మొదట దాన్ని ఫిక్షన్ స్టోరీ లాగా ప్రచారించాలనుకున్నారు.
(04:36) ఎందుకంటే అది ఒక అల్లిన కథ అని అనుకున్నారు. కానీ నీల్ ఇది నేను కల్పించి రాసిన కథ కాదు. ఇది నాకు జరిగిన అనుభవం నిజంగానే ఆ స్వరమే నాకు చెప్పింది ఇవన్నీ అని చెప్పాడు. చివరికి నాన్ ఫిక్షన్ గా ప్రచురించారు. పబ్లిషర్ అప్పుడు ఇది 500 మంది రీడర్స్ ని కూడా చేరకపోవచ్చు అని అన్నాడు. కానీ నీల్ చెప్పిన ప్రకారం అది 500 మధ్య ఆగలేదు. 5 మిలియన్ రీడర్స్ ను చేరుకుంది.
(05:03) ఆ బుక్ లో నుంచి కొన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? ఈ ప్రశ్న నీలు అడిగినప్పుడు అతనికి వచ్చిన మొదటి సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నేను అందరితో మాట్లాడుతూనే ఉంటాను. ప్రశ్న నేను ఎవరితో మాట్లాడుతున్నాను అన్నది కాదు ఎవరు వింటున్నారు అన్నది అంటే దేవుడు మనతో మాట్లాడడం అంటే తప్పనిసరిగా మన ముందు ఒక రూపంలో ప్రత్యక్షమై మన చెవులకు వినిపించే గొంతుతో మాట్లాడడం మాత్రమే కాదు ఇక్కడ మాట్లాడడం కంటే కమ్యూనికేషన్ అంటే ఆ పదానికి కరెక్ట్ సమాధానం వస్తుంది.
(05:37) [సంగీతం] ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది మాటల ద్వారా మాత్రమే జరగదు. కమ్యూనికేషన్ ప్రధానంగా నాలుగు మార్గాల్లో మనకు చేరవచ్చు. భావనలు ఆలోచనలు అనుభవాలు చివరిగా మాటలు వాటిలో మొదటిది భావన ఫీలింగ్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది సోల్ భావన ఆత్మ యొక్క భాష మన లోపల చాలా లోతుగా ఉన్న భావనలో మనకు సంబంధించిన ఒక సత్యం దాగి ఉండొచ్చు.
(06:03) కానీ ఇక్కడ నాకు ఇప్పుడు ఏదో ఫీలింగ్ వచ్చింది కాబట్టి అది దేవుడే చెప్పాడు అని అర్థం చేసుకోకూడదు. ఎందుకంటే మన ఫీలింగ్స్ లో భయం ఉండొచ్చు. మన గత అనుభవాల ప్రభావం ఉండొచ్చు. మన ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు మన కండిషన్ అయి ఉండొచ్చు. అందుకే ప్రతి ఫీలింగ్ దైవ సందేశం కాదు. రెండవ మార్గం ఆలోచన. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆలోచన అంటే కేవలం మన తలలో సెంటెన్సెస్ రావడం మాత్రమే కాదు.
(06:27) కొన్నిసార్లు అది ఒక ఇమేజ్ రూపంలోకి రావచ్చు. ఒక పిక్చర్ లా రావచ్చు, ఒక ఐడియాలా రావచ్చు. ఒక్కసారిగా ఏదో అర్థమైనట్టు ఒక ఇన్సైట్ రావచ్చు. నీకు వచ్చిన సమాధానంలో కూడా ఆలోచన ద్వారా కమ్యూనికేషన్ జరిగేటప్పుడు ఇమేజెస్ అండ్ పిక్చర్స్ కూడా వచ్చేవి. ఎగ్జాంపుల్ కు మీరు కొన్ని రోజులుగా ఒక సమస్యకు సొల్యూషన్ వెతుకుతున్నారు. ఎంత ఆలోచించినా సమాధానం రావడం లేదు.
(06:50) ఒకరోజు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఒక్కసారిగా కొత్త ఐడియా వస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? మన కాన్షియస్ మైండ్ దాన్ని తయారు చేసిందా? మన సబ్కాన్షియస్ నుంచి వచ్చిందా? మన ఇంక్యూషన్ లేదా ఇంకేదైనా లోతైన కమ్యూనికేషన్ ఇక్కడే ఇమాజినేషన్ అనే విషయం వస్తుంది. ఇమాజినేషన్ అంటే కేవలం ఫాంటసీ కాదు మన కండ్ల ముందు ఫిజికల్లీ లేని ఒక విషయాన్ని మన అంతరంగంలో చిత్రంగా ఆలోచనగా పాజబిలిటీగా చూడగలిగే సామర్థ్యం.
(07:17) ఒక ఆర్కిటెక్ట్ బిల్డింగ్ నిర్మించకముందే దాన్ని తన మైండ్ లో చూడగలుగుతాడు. ఒక మ్యూజిషియన్ ఇంకా బయట వినిపించని మెలోడీని ముందుగా తనలో వినవచ్చు. ఒక ఇన్వెంటర్ ఇంకా తయారు కాని వస్తువును ముందుగా ఊహించొచ్చు. అంటే ఒక విషయం ఇమాజినేషన్ లో వచ్చింది కాబట్టి అది తప్పు అని చెప్పలేం. అలాగే ఇమాజినేషన్ లో వచ్చింది కాబట్టి అది దేవుడి నుంచి వచ్చిన సందేశం అని కూడా చెప్పలేం.
(07:41) అసలు ప్రశ్న అక్కడే మొదలవుతుంది. అయితే నేను ఎలా గుర్తించాలి? ఇదే నీల్ కూడా అడిగిన ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే మనలో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. కొన్ని మంచివి, కొన్ని భయపెట్టేవి, కొన్ని స్వార్థంతో ఉన్నవి, కొన్ని ప్రేమపూర్వకమైన ఆలోచనలు. కొన్ని మన గతం నుంచి వచ్చినవి ఇంకొన్ని వేరే వాళ్ళు మనకు నేర్పించిన నమ్మకాల నుంచి వచ్చినవి. అయితే వీటిలో ఏది దేవుని కమ్యూనికేషన్ అని తెలుసుకోవాలి.
(08:07) ఎప్పుడూ నీ హైయెస్ట్ థాట్ నీ క్లియరెస్ట్ వర్డ్ నీ గ్రేటెస్ట్ ఫీలింగ్ అంటే అత్యున్నతమైన ఆలోచన అత్యంత స్పష్టమైన మాట అత్యున్నతమైన భావన వాటిని గుర్తించడానికి మూడు సూచనలు కూడా ఉన్నాయి. హైయెస్ట్ థాట్ జాయ్ని ఆనందాన్ని కలిగిస్తుంది. క్లియరెస్ట్ వర్డ్ సత్యాన్ని కలిగి ఉంటుంది. గ్రాండెస్ట్ ఫీలింగ్ ప్రేమను కలిగి ఉంటుంది. ఆనందము సత్యము ప్రేమ ఈ మూడు ఒకదానితో ఒకటి సంబంధం ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం.
(08:38) మనసులో ఒక ఆలోచన వచ్చింది. అతను నిన్న బాధ పెట్టాడు. నువ్వు కూడా అతన్ని బాధ పెట్టు. ఒక తాడి వచ్చింది కాబట్టి దేవుడు నాకు ఇలా చేయమన్నాడు అని చెప్పలేం. ఇంకొక దాడు వచ్చింది. నీకు బాధ కలిగింది. కానీ కోపంతో వెంటనే స్పందించకు. [సంగీతం] ముందు నిన్ను నువ్వు అర్థం చేసుకో తర్వాత నిజాయితిగా మాట్లాడు. ఇప్పుడు రెండింటిని పరిశీలించొచ్చు.
(08:58) ఏది ఎక్కువ సత్యం వైపు తీసుకెళ్తుంది. ఏది ప్రేమ వైపు తీసుకెళ్తుంది. ఏది మన చైతన్యాన్ని మరింత విస్తరింపజేస్తుంది. ఇదే డిసైన్మెంట్ అంటే ఏది సత్యము ఏది అసత్యము అని తెలుసుకోవడం. మరొక ఎగ్జాంపుల్ మీరు ఒక పెద్ద డిసిజన్ తీసుకోవాలి ఒక థాట్ వచ్చింది ఏదైనా సరే వెంటనే చేసేయ్ లేకపోతే అన్ని పోతాయి అని అనిపిస్తుంది. దానిలో ఒక భయం ఉంది. మరో అంతర్గత వాయిస్ చాలా ప్రశాంతంగా చెప్తుంది.
(09:29) కొంచెం ఆగు స్పష్టంగా చూడు నిజంగా నీకు సరైనది ఏంటో తెలుసుకొని తర్వాత నిర్ణయం తీసుకో. ఇక్కడ కూడా బ్లైండ్ గా ఏ వాయిస్ ను ఫాలో చేయడం కాదు. దాని నేచర్ ను అబ్సర్వ్ చేయాలి. అది భయాన్ని పెంచుతుందా లేక క్లారిటీని తీసుకొస్తుందా అది మాయ వైపు తీసుకెళ్తుందా లేదంటే సత్యం వైపా అది దేశం వైపు తీసుకెళ్తుందా లేక ప్రేమ వైపా ఇలా మన జీవితంలో తీసుకున్న ఎన్నో డిసిషన్స్ కి సత్యము ప్రేమ ఆనందం అనే వాటిని గుర్తుంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి.
(09:58) మూడవ కమ్యూనికేషన్ ఎక్స్పీరియన్స్ అనుభవం పదాలు మనకు ఒక విషయం అర్థం చేయించవచ్చు. కానీ ఎక్స్పీరియన్స్ దాన్ని మనకు తెలిసేలా చేస్తుంది. ఉదాహరణకి క్షమించడం వల్ల మనసుకు శాంతి వస్తుంది అని 100 సార్లు చదవచ్చు. అది నాలెడ్జ్ కానీ సంవత్సరాలుగా మనసులో పెట్టుకున్న కోపాన్ని ఒకరోజు నిజంగా విడిచిపెట్టినప్పుడు లోపల కలిగే ఫ్రీడమే ఎక్స్పీరియన్స్ ప్రేమ గొప్పది అని పుస్తకంలో చదవడం ఒకటి.
(10:24) ఏమి తిరిగి ఆశించకుండా ఒకరిని నిజంగా ప్రేమించినప్పుడు మనలో కలిగే అనుభూతి ఇంకొకటి. అందుకే నీల్ వచ్చిన సమాధానంలో ఎక్స్పీరియన్స్ కి చాలా ప్రాధాన్యం ఇవ్వమంటున్నాడు. అంతేకాదు మన జీవితంలో ఒక పాటర్న్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటే దాన్ని కూడా గమనించమని చెప్తున్నాడు. ఒకే విధమైన సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన సమస్యలు ఒకే విధమైన రియాక్షన్ అవే భయాలు పేర్లు పరిస్థితులు మారుతున్నాయి కానీ లెసన్ మాత్రం మళ్ళీ వస్తుంది.
(10:55) అప్పుడు జీవితం నాకు ఏం చూపిస్తుంది అని అడగడం ఒక పవర్ఫుల్ క్వశ్చన్ అవుతుంది. మన ఎక్స్పీరియన్సెస్ ను పట్టించుకోకపోతే అదే అనుభవాన్ని మళ్ళీ మళ్ళీ జీవించే పరిస్థితి రావచ్చు. మనకు దేవుడు అంటే ముందుగా వాయిస్ గుర్తొస్తుంది. కానీ నీల్ ఏం చెప్తున్నాడంటే వర్డ్స్ ఆర్ యక్చువల్లీ ద లీస్ట్ ఎఫెక్టివ్ ఫామ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఒక మాటను ఇద్దరు వ్యక్తులు రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు.
(11:21) మాటలు కేవలం సంకేతాలు మాత్రమే అవి మనలోని భావనలను ఆలోచనలను అనుభవాలను వ్యక్తపరచడానికి ఉపయోగించే సాధనాలు. అందుకే మాటల కంటే మన అనుభవం మన అంతరంగ భావన మనలో లోతుగా కలిగించే ఆలోచన మరింత ప్రత్యక్షంగా మనకు విషయాన్ని తెలియజేయగలవు. నీల్ ప్రశ్నను పూర్తిగా పేపర్ మీద రాసిన తర్వాత తన సొంత ఆలోచనలను పక్కన పెట్టడానికి ప్రయత్నించేవాడు. అప్పుడు ఆన్సర్స్ వచ్చేవి.
(11:48) కొన్నిసార్లు అవి తాను రాయగలిగిన వేగం కంటే ఇంకా ఎక్కువ వేగంతో వచ్చేవి. అందుకే వాటిని అందుకోవడానికి చాలా వేగంగా రాయాల్సి వచ్చేది. కొన్నిసార్లు ఇవి ఇంకెక్కడి నుంచో వస్తున్నాయి అని ఫీలింగ్ పోయినప్పుడు అతని రైటింగ్ ఆపేసేవాడు. పెన్ పక్కన పెట్టి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ ఇన్స్పిరేషన్ వచ్చినప్పుడు మాత్రమే తిరిగి వచ్చి రాయడం కొనసాగించేవాడు.
(12:10) అతని అనుభవాన్ని కేవలం ఒక వాయిస్ వినిపించింది అని చెప్పడం కంటే అతను దానికి కొన్ని సందర్భాల్లో డిక్టేషన్ తీసుకున్నట్టుగా చెప్తున్నాడు. తనకు వచ్చిన ఆన్సర్స్ కూడా తనకు అర్థమయ్యే లాంగ్వేజ్ లోనే వచ్చాయంట. అందుకే కన్వర్జేషన్స్ చాలా సాధారణమైన కన్వర్జేషన్ లాంగ్వేజ్ లో ఉంటాయి. తన జీవితంలో అప్పటికే చదివినవి తెలుసుకున్నవి అనుభవించినవి కూడా ఆ ఆన్సర్ లో కనిపిస్తూ ఉంటాయి.
(12:35) నీల్ వర్ణించిన దాని ప్రకారం గాడ్ కమ్యూనికేషన్ అంటే తప్పనిసరిగా ఆకాశం నుంచి వేరే గొంతు వినిపించాలి అనే డెఫినేషన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వాళ్ళ ఇంట్యూషన్ తో కనెక్ట్ అవ్వచ్చు. ఫీలింగ్ తో ఉండవచ్చు థాట్ తో ఉండవచ్చు ఇమేజ్ తో ఎక్స్పీరియన్స్ తో వర్డ్స్ తో కూడా ఉండవచ్చు. మనలో చాలామంది ప్రార్థన చేసేటప్పుడు దేవుడా నాకు ఇది కావాలి నా సమస్యను పరిష్కరించు నాకు డబ్బు కావాలి నా జీవితంలో మంచి వ్యక్తి రావాలి అని అడుగుతూ ఉంటాం.
(13:01) నువ్వు పదే పదే నాకు ఇది కావాలి ఇది కావాలి అని చెప్తున్నప్పుడు ఆ మాటల వెనుక తెలియకుండానే ఇంకొక భావన ఉండొచ్చు. అది ఇప్పుడు నా దగ్గర లేదు. ఉదాహరణకి నాకు డబ్బు కావాలి అని పదే పదే అనుకుంటున్నాను కానీ నా లోపల నా దగ్గర సరిపడా డబ్బు లేదు అన్న భావన బలంగా ఉండొచ్చు. అంటే మనం బయటకు పలికే మాటల కంటే ఆ మాటల వెనుక మనం నిజంగా ఏం నమ్ముతున్నామో అది ముఖ్యమైనది.
(13:27) అందుకే ప్రార్థన గురించి మరింత లోతైన స్థితిని చెప్తున్నాడు. కృతజ్ఞత ఎప్పుడూ అడుగుతూనే ఉండడం కాకుండా కృతజ్ఞతతో ఉండడం కానీ దీని అర్థం మన దగ్గర లేనిది ఉన్నట్లు మనల్ని మనం మోసం చేసుకోవడం కాదు మనసంతా భయంతో నిండిపోయి పైకి మాత్రం ధన్యవాదాలు దేవుడా ధన్యవాదాలు అని చెప్పడం కాదు ఎందుకంటే మనం మాటలతో మనల్ని మనం మోసం చేసుకోలేము.
(13:51) ఆ మాట వెనుక ఉన్న మన అంతరంగ స్థితి నేను భయంతో ప్రార్థిస్తున్నానా నాకు లేదు అనే భావంతో ప్రార్థిస్తున్నానా లేక నమ్మకంతోనా కృతజ్ఞతతోనా ఒక ఆలోచన వెనుక ఉన్న అసలు ఆలోచన అంటే మనకు ఒక ఆలోచన వచ్చింది అనుకుంటాం. కేవలం ఆ ఆలోచనని మాత్రమే చూడకుండా ఆ ఆలోచన వెనుక నేను నిజంగా ఏం నమ్ముతున్నాను అని చూడాలి. ఉదాహరణకి నేను చాలా డబ్బులు సంపాదించాలి.
(14:15) దాని వెనుక నా దగ్గర ఉన్నది సరిపోదు అనే భావన ఉందా? ఎవరైనా నన్ను ప్రేమించాలి దాని వెనుక నేను ఒంటరిగా ఉన్నాను నాకు ప్రేమ లేదు అనే భావన ఉందా? ఇలా మన జీవితాన్ని నడిపిస్తున్నది మనకు పైన కనిపించే ఆలోచన మాత్రమే కాకపోవచ్చు. ఆ ఆలోచన వెనుక దాగి ఉన్న మూల నమ్మకం కావచ్చు. అందుకే మన ఆలోచనలను గమనించడంతో పాటు ఆ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది.
(14:41) ప్రేమ నుంచా భయం నుంచా నమ్మకం నుంచా లేక నాకు లేదు అనే భావన నుంచా అని మనల్ని మనం ప్రశ్నించుకోవచ్చు. ప్రస్తుతం నా పరిస్థితి ఏదైనా సరే నేను కేవలం లోటు మీద దృష్టి పెట్టకుండా ఇప్పటికే నా జీవితంలో ఉన్నదాన్ని గుర్తించి కృతజ్ఞతతో ఉంటాను. ముందుకు అవసరమైన దాన్ని సృష్టించగలననే నమ్మకంతో ఉంటాను. మన జీవితంలో జరిగే ప్రతిది దేవుడే నిర్ణయిస్తాడా అలా అయితే మన ఛాయిస్ కు వెలువేముంది? ఫ్రీవిల్ స్వేచ్ఛ ఇంక మనిషి ఒక తోలు బొమ్మ కాదు మనకు ఛాయిసెస్ ఉన్నాయి.
(15:16) ఒక పరిస్థితి మనం ముందుకు రావచ్చు. కానీ దానికి మనం ఎలా స్పందించాలి దాని నుంచి ఏం సృష్టించాలి ఆ అనుభవం తర్వాత మనం ఎవరిగా మారాలి ఇందులో మన ఛాయిస్ ఉంది. ఒకే పరిస్థితిని ఇద్దరు వ్యక్తులు ఎదుర్కున్నా ఒకరు పూర్తిగా కూలిపోవచ్చు. మరొకరు అదే అనుభవం నుంచి తన జీవితానికి కొత్త అర్థాన్ని సృష్టించుకోవచ్చు. నీల్ జీవితమే దానికి ఒక ఉదాహరణలా కనిపిస్తుంది.
(15:39) అతను ఇల్లు కోల్పోయాడు ఆ బాధ వెంటనే పోలేదు. [సంగీతం] కానీ అదే సమయంలో ఎందుకు నాకు ఇలా జరిగింది అనే ప్రశ్న చివరికి ఈ అనుభవం నుంచి నేను ఏం సృష్టించబోతున్నాను అనే దిశగా మారింది. మనిషి చేసే చర్య వెనుక చివరికి రెండు మూల శక్తులు పనిచేస్తాయి. ఒకటి ప్రేమ రెండోది భయం మన ఎమోషన్స్ అన్నీ పైకి ఎన్నో రూపాల్లో కనిపిస్తాయి.
(16:01) కోపం, అసూయ, దుఃఖం, అటాచ్మెంట్, పొససివ్నెస్ కానీ వాటి లోపలికి ఇంకా లోతుగా వెళ్తే చాలాసార్లు భయం కనిపిస్తుంది. కోల్పోతానేమో నన్ను వదిలేస్తారేమో నేను సరిపోనేమో నా దగ్గర లేకుండా పోతుందేమో నేను ఓడిపోతానేమో భయం పట్టుకొని ఉంచుతుంది. ప్రేమ విడిచిపెట్టగలదు. భయం దాచుకుంటుంది. ప్రేమ పంచుకుంటుంది. భయం తనను తాను రక్షించుకోవడానికి గోడలు కొడుతుంది. ప్రేమ తెరుచుకుంటుంది.
(16:30) భయం దూరం చేస్తే ప్రేమ దగ్గర చేస్తుంది. భయం గాయపరిస్తే ప్రేమ స్వస్థత పరచబడదు. అందుకే జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మనల్ని మనం ఒక ప్రశ్న అడగవచ్చు. నేను ఇప్పుడు చేస్తున్నది ప్రేమ నుంచి వస్తుందా? లేక భయం నుంచి వస్తుందా? ఈ ఒక్క ప్రశ్న మన యొక్క సంబంధ బాధవ్యాలను ఇంకా లోతుగా చూపిస్తుంది. ఉదాహరణకి మనక ఒక వ్యక్తి అంటే చాలా ప్రేమ కానీ ఈ వ్యక్తి నన్ను వదిలిస్తే అనే తాట వచ్చింది అక్కడ భయం వచ్చింది.
(17:02) ఆ భయం నుంచి ఒక బంధం రావచ్చు ఒక కంట్రోల్ రావచ్చు ఒక ఎక్స్పెక్టేషన్ రావచ్చు నువ్వు ఇలా ఉండాలి నాతో ఇలా మాట్లాడాలి నన్ను ఎలా ప్రేమించాలి నేను నీకు ఇంత చేస్తున్నాను నువ్వు కూడా నాకు చేయాలి. అప్పుడు మనం ప్రేమిస్తున్నామా లేక ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నామా ఇక్కడ నీల్ దేవుని రెండు పదాల్లో నిర్వచిస్తాడు. ప్యూర్ లవ్ శరతులు లేని ప్రేమ ప్యూర్ లవ్ అంటే తిరిగి ఏమీ అవసరం లేని ప్రేమ ఏమి ఎక్స్పెక్ట్ చేయని ప్రేమ ఏమి డిమాండ్ చేయని ప్రేమ.
(17:34) నువ్వు నాకు ఇది చేస్తేనే నేను నిన్ను ప్రేమిస్తాను అని చెప్పని [సంగీతం] ప్రేమ. నీల్ తన రిలేషన్షిప్ లో కూడా ఇదే విషయాన్ని గ్రహించమని చెప్తున్నాడు. ఒక వ్యక్తిని అతను లేదా ఆమె మనకు ఏమ ఇస్తున్నారు కాబట్టే ప్రేమిస్తే అప్పుడు మనం నిజంగా వారిని ప్రేమిస్తున్నామా లేక వారి ద్వారా మనకు లభించే అనుభూతిని ప్రేమిస్తున్నామా నువ్వు నాకు ఏమఇస్తావో అందుకు నేను నిన్ను ప్రేమించడం లేదు.
(17:57) నువ్వు ఎవరో అది చూసి నిన్ను ప్రేమిస్తున్నాను. ఎదుటి వ్యక్తి నుంచి ఏదో తిరిగి వస్తేనే ప్రేమించడం కాదు. అతను మన ఎక్స్పెక్టేషన్స్ కి సరిపోతేనే ప్రేమించడం కాదు. ముందుగా నేను ప్రేమకు అర్హుని కావాలంటే ఏదైనా నిరూపించుకోవాలా ఏమీ ఆశించకుండా ఏం శరతులు లేకుండా వాళ్ళను వాళ్ళుగా ప్రేమించడం మన జీవితంలో ప్రతిసారి ఆకాశం నుంచి ఒక స్వరం సమాధానం చెప్పకపోవచ్చు.
(18:24) కానీ మన జీవితంలో కొన్ని ప్రశ్నలు మనల్ని మరింత లోపలికి తీసుకెళ్తాయి. నేను ఇప్పుడు భయం నుంచి జీవిస్తున్నానా ప్రేమ నుంచి జీవిస్తున్నానా నేను ఎప్పుడూ లేని దాన్నే చూస్తున్నానా లేక ఉన్నదానికి కృతజ్ఞతతో ఉన్నానా నేను దేవుని బయట మాత్రమే వెతుకుతున్నానా లేక నా అంతరంగాన్ని కూడా వినగలుగుతున్నానా మన జీవితాన్ని మార్చేది ప్రతిసారి మనకు దొరికే సమాధానం కాకపోవచ్చు.
(18:48) మనల్ని మనం అడగడం మొదలు పెట్టిన సరైన ప్రశ్న కూడా మన జీవితాన్ని మార్చొచ్చు. జీవితం మీద ఆశ కోల్పోయిన నీల్ డోనాల్డ్ వాల్స్ అంతరంగ చైతన్యంతో కనెక్ట్ అయి ఎంతో మందికి స్ఫూర్తిగా ఉన్నాడు. ఈ బుక్ లో ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది చదవగలిగే వాళ్ళు చదవండి. ఈ పుస్తకంలో మీకు కనెక్ట్ అయిన ద బెస్ట్ పాయింట్ ఏంటో కామెంట్ లో తెలియజేయొచ్చు.
(19:09) థాంక్యూ సో మచ్ తిరిగి మరొక వీడియోలో కలుసుకుందాం.

No comments:

Post a Comment