గ్యారెంటీ ఎవరికీ ఉండదు | Face The Fear Now | Satyagrahi
Author Name:Satyagrahi
Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=F_u1cYw4Pgc
Transcript:
(00:05) మీకు ఒక చేదు నిజం చెప్పనా మీరు జీవితంలో అలిసిపోయింది పనులు చేయడం వల్ల కాదు మీ ఆలోచనల వల్ల మీకు 10ఏళ్ల తర్వాత జీవితం ఎలా ఉండబోతుందో ఇప్పుడే తెలిసిపోవాలి. చేసే ప్రతి పని వేసే ప్రతి అడుగుకినూటికి 100% గ్యారెంటీ ఉండాలి. రేపు ఏం జరుగుతుందో ఈరోజే మనం కంట్రోల్ లో ఉండాలనే ఒక పిచ్చి ఆరాటం మీ తల మీద ప్రపంచం మొత్తాన్ని మోస్తున్నట్లు నటిస్తారు.
(00:29) కానీ నిజానికి ఆ బరువుని మీరే కోరి మోస్తున్నారు. ఇది సమస్య కాదా ఒకసారి మీ చేతుల్లో ఉన్న ఫోన్ వైపు చూడండి ఎక్కడో కూర్చొని ఏదో స్క్రీన్ స్క్రోల్ చేస్తూ నాకు ఆ టాలెంట్ లేదు ఈ బ్యాక్గ్రౌండ్ లేదు నా జీవితం ఇంకా ఎక్కడో ఆగిపోయిందని కుమిలిపోతున్నారు. ప్రేమానంద్ గోవింద శరణ్ గారు ఒక అద్భుతమైన మాట చెప్తారు. ఆయన ఎప్పుడూ ఒక మాట గుర్తు చేస్తూ ఉంటారు కూడా మనిషి పతనానికి మొదటి కారణం వాడి అహంకారం రెండవది భవిష్యత్తు గురించి వాడికి ఉన్న అనవసరమైన భయం మనం ఏమనుకుంటామంటే ప్రతీదీ మన తెలివితేటలతోనే సాధించేస్తున్నాము అని మొత్తం జీవితానికి ఒక బ్లూ ప్రింట్ గీసేసి
(01:07) ఆ గీత దాటి ఒక అడుగు పక్కకు పడిన డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాం. ఎంత విచిత్రమైన మైండ్ సెట్ ఇది నిజం ఏంటంటే మీ సమస్య టాలెంట్ లేకపోవడం కాదు మీరు ఏ పని మొదలు పెట్టకపోవడమే అసలు సమస్య మొత్తం దారి కనిపించేదాకా అడుగు ముందుకి వేయను అని మొండికేసి కూర్చుంటే రాత్రివేళ ప్రయాణం ఎలా సాధ్యమవుతుంది చెప్పండి మనం జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే క్లియర్ కట్ గా మనకి విజయం అనే ఆ చివరి మెట్టు కనిపించేంతవరకు నేను మొదటి మెట్టు ఎక్కను అంటే ఎంత మూర్ఖత్వం ఇది ఈ చిన్న లాజిక్ ని మర్చిపోయి చాలా మంది వాళ్ళ వాళ్ళ జీవిత లక్ష్యాల కోసం ఒక్క మెట్టు
(01:43) కూడా ఎక్కలేకపోతున్నారు. మీరు ఒకసారి మీ మనసుని నిశ్చితంగా గమనించండి. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్ని లెక్కలు నేను ఆ పని చేస్తే నాలుగు మాటలు అంటారేమో ఈ పని చేస్తే నా హోద తగ్గుతుందేమో అసలు నన్ను సమాజం ఒక విజేతగా గుర్తిస్తుందా లేదా నిజం చెప్పాలంటే బజారులో కుక్కలకు కూడా లేని ఒక పిచ్చి బెంగా మనుషులమైన మనకెందుకు ఎందుకంటే మనం బ్రతకడం మానేసి ఎదుటివాడి కళ్ళల్లో మన ఇమేజ్ ఎలా ఉందో చెక్ చేసుకోవడంలో బిజీ అయిపోయాం.
(02:15) ఎక్కడ తగ్గితే మనం విలువ పోతుందో అన్న అభద్రత భావం మనల్ని క్షణం కూడా ప్రశాంతంగా నిలవనివ్వడం లేదు. ప్రేమానంద్ గోవింద్ చరణ్ గారు ఒక లోతైన నిజాన్ని చాలా సహజంగా బయట పెడతారు. ఆయన అంటారు పాత్ర ఎంత అందంగా ఉంది ఎంత ఖరీదైన బంగారంతో చేయబడింది అన్నది కాదు ముఖ్యం. ఆ పాత్రలో ఏమైనా నింపడానికి అది ఖాళీగా ఉందా లేదా అన్నదే ముఖ్యం. కానీ మన పాత్రలు ఇప్పటికే అతి తెలివి, అహంకారం, సందేహాలు అనే చెత్తతో నిండిపోయి ఉన్నాయి.
(02:44) ఇలాంటి మనసులో కొత్త ఆలోచనలు ఎలా పుడతాయి ఒక నిజమైన అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఒడిసి పట్టుకునే స్పృహ ఎలా ఉంటుంది? మీరు దేనికి సిద్ధంగా లేరు కానీ అన్ని మీకే దక్కాలనే దురాశ మాత్రం గుండెల్లో నిండిపోయింది. ఈ తరం యువత నిలువున దహించేస్తున్న పెద్ద వ్యాధి ఏంటో తెలుసా? అనాలసిస్ పెరాలసిస్ ప్రతి చిన్న నిర్ణయానికి 100 విశ్లేషణలు జిమ్ కి వెళ్ళడానికి కూడా 10 వీడియోలు చూసి డైట్ ప్లాన్ రాసి చివరికి మంచం మీద నుంచి లేవకుండానే రోజంతా గడిపేసే అలవాటు.
(03:13) ఆలోచించి ఆలోచించి మెదడు ముద్దు బారుతుందే తప్ప చేతులతో ఒక్క పని కూడా జరగట్లేదు. ఈ ఆలోచన చట్రంలో ఇరుక్కుపోయి మీరు బ్రతుకుతున్న మన భ్రమలో చచ్చిపోతున్నారు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఈ రోగం ఎక్కడి నుంచి మొదలైందో ఎప్పుడైనా గమనించారా చిన్నప్పటి నుంచి సమాజం మన మెదడులో ఒక విషయాన్ని ఎక్కించింది. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి నువ్వు అందరికంటే ముందుండాలి నీ దగ్గర పక్కా ప్లాన్ లేకపోతే నువ్వు పనికి రాని వాడివి ఈ మాటలు విని విని మనం సహజంగా బ్రతకడం మానేసి ఒక రేసు గుర్రంలా మారిపోయాం.
(03:47) ఎవరో గీసిన గీత మీద పరిగెడుతున్నాం తప్ప అసలు ఆ పరుగు ఎక్కడికి చేరుస్తుందో మనకి తెలియదు. మన సొంత ఆలోచన అంటూ ఏమి మిగలట్లేదు. అంతా ఎదుటి వారి మెప్పు కోసం వాడే ఒక బూటకపు నాటకం. ప్రేమానంద్ గోవింద చరణ్ గారు నిక్కచ్చిగా ఒక సత్యం చెప్తారు. సంసారంలో మనుషులు పడే ప్రతి ఆందోళన వెనుక ఒకటే ఉంటుంది. కర్తవ్య భావన అంటే మొత్తం నేనే చేస్తున్నాను నేనే చేయాలి నా వల్లే ఇదంతా సాధ్యం అనే అహంకారం.
(04:15) ఈ ఒక్క భ్రమ వల్లే మనిషి కొప్పుకోపోతున్నాడు. ఈ విశ్వాన్ని నడిపించే ఒక అపారమైన శక్తి ఉంది. దాని ముందు మీ మేధస్సు ఎంత? మీ ప్లాన్లు ఎంత? మీరు రాత్రి పడుకున్నాక గుండెని కొట్టుకోమని ఆర్డర్ వేస్తున్నారా శ్వాస పీల్చుకోమని చెప్పేసి మెదడికి గుర్తు చేస్తున్నారా అది ముఖ్యమైన ప్రాణమే నీ చేతుల్లో లేనప్పుడు 20 ఏళ్ల భవిష్యత్తు నీ కంట్రోల్ లో ఉంటుందని ఎలా అనుకుంటున్నారు మీరు నిజం ఏంటంటే మనం ఫలితాన్ని ప్రేమించినంతగా పనిని ప్రేమించడం లేదు.
(04:41) మనం కోరుకునేది సక్సెస్ ఇచ్చే ఆడంబరం. అంతే తప్ప దానికి పడే కష్టాన్ని కాదు ఒక విత్తనం నేలలో పడి నలిగిపోకుండా చెట్టు ఎలా అవుతుంది కానీ మీకు విత్తనం వేసిన మరు క్షణమే పండ్లు చేతికి వచ్చేయాలి ఆ ఆరాటమే భయం ఆరాటమే అనుమానం ఈ మనసు నిండా నాకు అర్హత లేదా అని ఒక చెత్త న్యూనత భావం ప్రేమానంద్ గోవింద చరణ్ గారు అంటారు ప్రకృతి నీ అర్హతను చూడదు నీ సమర్పణను మాత్రమే చూస్తుంది.
(05:08) నువ్వు వాడే ఆటలో నిజాయితీగా లేనప్పుడు ఎంత పెద్ద వ్యూహాలు రచించినా ఫలితం శూన్యం అవుతుంది. మీరు గమనించారో లేదో ఈ భయానికి ఇంకొక చీకటి కోణం ఉంది. అదే పోలిక. పొద్దున్నే లేచిఇగ ఓపెన్ చేయగానే ఎవడో 20 ఏళ్లకు కారు కొన్నాడు. ఇంకెవడో 30 ఏళ్లకు విదేశాల్లో సెటిల్ అయ్యాడు. వాడి జీవితం చూసి మీ గుండెల్లో ఏదో తెలియని అశాంతి అన్నమాట. అంటే అందరూ దూసుకెళ్ళిపోతున్నారు నేను మాత్రం ఇక్కడే ఉండిపోయాను అని చెప్పేసి మీరు బాధపడుతూ ఉంటారు.
(05:38) ఈ పోలికే మీ మనసుని నిరంతరం పీల్చి పిప్పి చేస్తుంది. సమాజం తయారు చేసిన సక్సెస్ కొలతల్లో మీరు ఇరుక్కుపోయారు. వాడి ప్రయాణం వేరు మీ ప్రయాణం వేరన్న కనీస స్పృహ కోల్పోయారు. ప్రేమానంద గోవింద్ చరణ్ గారు ఒక అద్భుతమైన హెచ్చరిక చేస్తారు. ఎదుటివాడి ఆకులో పాయసం చూసి నీ విస్తరిలో ఉన్న అన్నాన్ని నేలపాలు చేసుకోకు అని మనం రోజు చేసే పని సరిగ్గా అయితే కదా మన దగ్గర ఉన్న ప్రస్తుత క్షణాన్ని మన ముందున్న చిన్న కర్తవ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తాం.
(06:06) ఎక్కడో ఉన్నవాడి ఆడంబరాన్ని చూసి ఇక్కడున్న మన వాస్తవాన్ని అసహించుకుంటాం. ఈ అభద్రత భావం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? మీరు జీవితాన్ని ఒక యుద్ధంలో భావించడం వల్ల ప్రతి క్షణం గెలవాలి. అందరినీ తొక్కేసి ముందుకు వెళ్ళాలి అనే ఈ స్వార్థ పూరిత ఆలోచనే మీ మనశశాంతిని హరించేస్తుంది. మీకు తెలుసో లేదో అహంకారం అంటే కేవలం గర్వంగా విర్రవేగడమే కాదు నేను పనికి రాను నావల్ల ఏమీ కాదని మూల కూర్చోవడం కూడా ఒక రకమైన తిరోగమన అహంకారమే.
(06:37) ఎందుకంటే అక్కడ కూడా నేను అనే భావనే కేంద్రీకృతమై ఉంది. ప్రేమానంద గోవింద చరణ్ గారు సూటిగా ప్రశ్నిస్తారు. నీలో ఆ ప్రాణాన్ని నిలిపిన సృష్టికి లేని అనుమానం నీపై నీకెందుకు అని నువ్వు పనికిరావు అనుకోవడానికి నువ్వు ఎవరు? నిన్ను నువ్వు సృష్టించుకున్నావా? ఈ ప్రశ్న మీ చెంప పై గట్టిగా కొట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మీ అసమర్థతను దాచుకోవడానికి ఓవర్ థింకింగ్ అనే ఒక పెద్ద ముసుగు వేసుకొని కాలం గడిపేస్తున్నారు.
(07:01) సరే ఇదంతా బాగానే ఉంది మరి. ఈ సమస్యను మరి ఎలా అధిగమించాలి మరి ఈ అనవసరపు గందరగోరం నుంచి బయట పడటం ఎలా మొదటగా మీరు చేయాల్సిన పని మీ తలకెక్కించుకున్న ఆ కిరీటాన్ని తీసి పక్కన పడేయండి నేను ఎంతో తెలివైన వాడిని నాకే అంత తెలియాలి అని అహంకారాన్ని నేలకు వేసి కొట్టండి ఎందుకంటే నిండిపోయిన గ్లాసులో గంగాజలం పోసిన అది కింద ఉలికిపోతుందే తప్ప ఒక్క చుక్క కూడా లోపలికి వెళ్ళదు.
(07:28) ముందు ఖాళీ అవ్వడం నేర్చుకోండి. మీ ఆలోచనల్ని మీ పూర్వపు ముద్రలని మీ అభద్రతలని తుడిచి పెట్టేయండి. ప్రకృతి మీకు ఏదైనా ఇవ్వాలంటే ముందు మీ చేతులు ఖాళీగా ఉండాలి కదా అన్ని పట్టుకొని బిగించి కూర్చుంటే కొత్త అవకాశాలు ఎలా పుట్టుకొస్తాయి ప్రేమానంద గోవింద చరణ్ గారు ఒక అపూర్వమైన జీవన సూత్రాన్ని బోధించారు. ఆయన అంటారు సమర్పణ అంటే చేష్టలుడిగి కూర్చోవడం కాదు నీ కర్తవ్యాన్ని నువ్వు పరిపూర్ణ చిత్తశుద్ధితో చేస్తూ దాని ఫలితంపై పట్టును వదిలేయడం ఈ ఒక్క మాట మీ నరల్లోకి ఎక్కించుకోండి.
(08:00) మీ బాధ్యత కేవలం విత్తనం నాటడం నీరు పోయడం వరకే మొక్క ఎప్పుడు మొలకెత్తాలి పువ్వు ఎప్పుడు పూయాలి పండ్లు ఎప్పుడు పక్వానికి రావాలి అనేది కాలు నిర్ణయిస్తుంది. కానీ మీరు ప్రతి గంటకి మట్టిని తవ్వి ఇంకా మొలక రాలేదేంటి అని చూస్తున్నారు. అలా చేస్తే విత్తనం బ్రతుకుతుందా బ్రతకదు చచ్చిపోతుంది. జీవితాన్ని కూడా మీరు సరిగ్గా అలాగే తొందరపాటుతో ఊపిరాడకుండా చేసుకుంటున్నారు.
(08:22) నిజం ఏంటంటే మీకు అర్హత ఉందా లేదా అన్నది ముఖ్యం కాదు. మీరు ఈ క్షణంలో ఎంత అందుబాటులో ఉన్నారు అన్నదే ముఖ్యం. ఎదురుగా ఒక పని కనిపిస్తే ఇది నా స్థాయికి తగినదా అని ఆలోచించకండి. ముందు ఆ పనిని పూర్తి చేయండి. ప్రేమానంద గోవింద చరణ్ గారి జీవన విధానాన్ని చూస్తే మనకి ఒక సత్యం బోధపడుతుంది. ఆయన నిరంతరం తన అంతరంగాన్ని నిష్కల్మశంగా ఉంచుకుంటూ తనని ఆశ్రయించిన ప్రతి ఒక్కరిని ప్రేమగా ఆప్యాయంగా పలకరించేవాళ్ళు అందులోనూ ప్రేమని ఆప్యాయాన్ని పంచేవాళ్ళు నేను ఎంత గొప్పగా మాట్లాడాలి ప్రపంచం నన్ను ఎలా చూడాలి అనే ఫిల్టర్స్ ఆయన దగ్గర ఉండవు. ఆ
(09:00) నిరాడంబరతే ఆయన అసలైన బలం. మీరు కూడా మీ మనసులోని కల్మషాలని లెక్కలని తీసి పారేసి ఒక చిన్న పిల్లవాడిలా నిర్మలంగా ఉండడం నేర్చుకుంటే జీవితం మీకు దారులు ఎలా తెరుస్తుందో మీరే చూస్తారు. ఇప్పుడు మీరు ఆచరించాల్సిన ప్రాక్టికల్ నేమ్ ఒకటి అదే ది 1 మీటర్ రోల్ ఒక్క అడుగు మాత్రం మీ కళ్ళ ముందు 100 మెట్లు ఉండొచ్చు. కానీ మీ పాదం మోపగలిగేది మొదటి మెట్టు మీదే.
(09:25) 100 మెట్టు గురించి ఆలోచిస్తూ మొదటి మెట్టు ఎక్కకుండా అక్కడే నిలబడిపోతే మీరు ప్రయాణాన్ని ఎప్పటికీ మొదలు పెట్టలేరు. ఈ క్షణంలో మీ చేతిలో ఏ బాధ్యత ఉందో దాన్ని నూటికిన శాతం నిజాయితీతో పూర్తి చేయండి చదువుకోవాలా ఆ ఒక్క పేజీ శ్రద్ధగా చదవండి పని చేయాలా ఆ ఒక్క ఫైల్ ని పూర్తి చేయండి. ఈరోజు చేయాల్సిన పనిని నిర్లక్ష్యం చేసి 10ఏళ్ల భవిష్యత్తు గురించి ఆలోచించడం తెలివి తక్కుతనం కాక మరేమిటి చెప్పండి.
(09:50) ప్రేమానంద గోవింద చరణ్ గారు ఒక అద్భుతమైన మాట చెప్తారు. నీవు నిజాయితీగా ఒక చిన్న ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మమే నీకు తదుపరి దారిని వెలుగులా చూపిస్తుంది. జీవితం ఎవరికీ ముందుగానే పూర్తి సినిమా చూపించదు. కొన్ని సన్నివేశాలను మాత్రమే ఆవిష్కరిస్తుంది. మొదటి అడుగు వేయడానికి సిద్ధంగా లేని వాడికి రెండు అడుగు వేసే అర్హత ఎలా వస్తుంది? విధేయత అంటే ఎవరికో బానిసగా మారటం కాదు.
(10:16) మీ మనస్సాక్షికి ఈ క్షణంలో మీ ముందున్న కర్తవ్యానికి కట్టుబడి ఉండటం మీరు గమనించండి ఎవరైతే అనవసరపు ఫలితాల భారాన్ని మోయటం ఆపేస్తారో వారి చేతులు ఎంత వేగంగా పనిచేస్తాయో భయం పోయిన చోట స్పష్టత వస్తుంది. స్పష్టత ఉన్న చోట అలసట ఉండదు. ప్రేమానంద గోవింద చరణ్ గారి ముఖంలో కనిపించే ఆ ప్రశాంతత ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు ఆయన రేపటి గురించి భయపడడు.
(10:41) ఈ క్షణాన్ని పరమాత్మ సమక్షంగా భావించి బ్రతుకుతారు. మీరు కూడా మీ మనసులో అనవసరపు లెక్కలని భయాలను పక్కన పెట్టి చూస్తే జీవితం ఎంత తేలిగ్గా మారుతుందో మీకే అర్థంవుతుంది. సరే ఇదంతా బాగానే ఉంది. మరి మన జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి అంటే మాత్రం జీవితాన్ని బాగుపరుచుకోవడం అంటే అద్భుతాలు సృష్టించడం కాదు ముందు అనవసరమైన చెత్తని తలకెక్కించుకోకుండా ఉండటం.
(11:04) మీ మనసు అనే గదిని క్లీన్ గా ఉంచుకోవాలి. ఆ గదిలోకి వచ్చే ప్రతి ఆలోచనని స్వాగతించకండి. ఎవడో ఏదో అన్నాడు ఇంకెవరో మనల్ని తక్కువ చేసి మాట్లాడారు. వాటన్నిటిని లోపలికి లాగి పెట్టుకుంటే మీ మనసు ఒక డంపింగ్ యాడ్ అవుతుందే తప్ప మరి ఏది అవ్వదు. జీవితాన్ని సరళంగా మార్చుకోవడమే అసలైన విజయం. సంక్లిష్టత మేదస్సు కాదు అది గందరగోళానికి సంకేతం.
(11:27) ప్రేమానంద గోవింద చరణ్ గారు ఒక అత్యున్నతమైన సత్యాన్ని ఉపదేశిస్తారు. ఎప్పుడైతే నువ్వు నీ ఇంద్రియాలని నీ కోరికలని అదుపులో ఉంచుకుంటావో అప్పుడు ప్రపంచం నిన్ను శాసించలేదు. ఎవరు నిన్ను పొగిడినా పొంగిపోకు ఎవరు నిన్ను నిందించినా కుంగిపోకు రెండు నీ స్వరూపాన్ని మార్చలేవు ఈ స్థిత ప్రజ్ఞత మీ ఆలోచనల్లోకి రావాలి. మీ విలువ ఎవరి సర్టిఫికెట్ల మీద ఆధారపడి లేదు.
(11:50) మీరు ప్రకృతి చేత ఎంపిక చేయబడిన ఒక సజీవ చైతన్యం. ఆ చైతన్యాన్ని అనవసరపు పోలికలతో సమాజపు ప్రణాళికలతో చంపుకోకండి. మీరు ప్రతి రోజు పడుకునే ముందు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోండి. ఈరోజు నా కర్తవ్యానికి నేను ఎంతవరకు న్యాయం చేశానో ఎంతమందికి మంచి చేశానో నా మనసు ఎంత నిర్మలంగా ఉంది ఈ ఆత్మ పరిశీలనే మిమ్మల్ని మెరుగుపరుస్తుందే తప్ప సోషల్ మీడియాలోని లైకులు కామెంట్లు కావు.
(12:18) ప్రేమానంద గోవింద చరణ్ గారు ఎప్పుడూ గుర్తు చేసేది అదే నీ లోపలికి నువ్వు ప్రయాణం చెయ్. బయట ప్రపంచం దానంతట అదే నిన్ను అనుసరిస్తుంది. సమర్పణ భావంతో నిర్భయంగా స్వచ్ఛమైన మనసుతో మీ అడుగులు వేయండి. ప్రకృతి తన అద్భుతాలని మీ ద్వారా తప్పక ఆవిష్కరిస్తుంది. ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను బాయ్.
(12:45) [సంగీతం]
No comments:
Post a Comment