హనుమాన్ అంశ్ నుండి శుభవార్త | Hanuman Ansh Team Good News
Author Name:Bharatavarsha
Youtube Channel Url:https://www.youtube.com/@bharatavarsha4u
Youtube Video URL:https://www.youtube.com/watch?v=n9a71RqlFsg
Transcript:
(00:01) హనుమాన్ అంష్ ఈ చిత్రం విడుదలయి ఇంత పెద్ద గ్రాండ్ సక్సెస్ అయింది అంటే దానికి గల కారణం ఎవరైతే ఈ టీం ఉన్నారో వీళ్ళు కమర్షియల్ గా మాత్రమే ఆలోచించలేదు దీన్ని ఒక ప్రాణంగా దీన్ని ఒక భక్తిగా ముందుకు తీసుకువెళ్ళారు ఈ ప్రాజెక్ట్ ని అంటే ఇందులో ఉన్న విషయాలు స్వచ్ఛమైనవి సనాతనమైనవి గురుబంధమైనవి సో అవన్నీ ప్రతి ఒక్కరికి చేరాలి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి చేరాలి.
(00:34) ఈ ఆలోచనతోనే వాళ్ళు ఈ చిత్రాన్ని రూపొందించారు డబ్బు లేకపోయినా అతి తక్కువ ఖర్చుతోనే ఈ సినిమాని తయారు చేశారు. అలాగే ఈ మేకింగ్ మొత్తం జరుగుతున్న ప్రాసెస్ లో వారు నిష్టగా కూడా ఉన్నారు ఆ పాయింట్స్ చెప్తాను దానికంటే ముందు ఒక ప్రధానంగా వస్తున్న వార్త ఏంటి అంటే ఇది ఇప్పుడు తెలుగులో కూడా రాబోతా ఉంది. త్రివిక్రం శ్రీనివాస్ డైరెక్టర్ త్రివిక్రం శ్రీనివాస్ ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు హక్కులను పొందినట్లుగా తెలుస్తుంది.
(01:05) ఆయన దగ్గర ఉండి డబ్బింగ్ చేయిస్తున్నారట. అంటే ఇంకా ఆయనలో కూడా ఎటువంటి భావజాలం ఉంటుందో మనందరికీ తెలిసిందే సో వారు కూడా ఈ మూవీ చూసి ఉండొచ్చు ఇందులో ఉండే లైన్ నచ్చిఉండొచ్చు. ఈ ఇంపాక్ట్ తోనే ఆయన తెలుగులో శ్రద్ధగా పక్కనుండి మరి డబ్బింగ్ చేయిస్తూ ఉండవచ్చు. కనుక తెలుగులో అతి త్వరలోనే మన ముందుకి ఈ చిత్రం మారబోతుంది. హిందీలో చూసిన వాళ్ళు మరలా తెలుగులో చూస్తారు.
(01:31) హిందీ అంటే ససేమిరా అన్నవాళ్ళు తెలుగులో తప్పకుండా చూస్తారు. మొత్తానికి ప్రతి తెలుగువాడు చూడాల్సినటువంటి చిత్రం హనుమాన్ అంశని నేను గట్టిగా చెప్పగలను. అంత అద్భుతంగా ఒక రెండున్నర గంటలు ఆధ్యాత్మిక లోకంలో ఉండి వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఎక్కడా సినిమా చూస్తున్నామ అనే భావన ఉండదు. ఎంతసేపు ఆ నిమకరలి బాబాగారు వారి యొక్క ఆ హనుమత్ నామజపం సీతారామ నామజపం ఆ చుట్టూత అప్పటి పరిస్థితుల్లో కదా అంటే 1947 కు ముందు నాటి వాతావరణం అవన్నీ కూడా చాలా చక్కగా ఆవిష్కరించారు అవి మనకి ఆ అనుభూతిని ఇస్తాయి అన్నమాట అయితే ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే చెప్దాం అనుకున్నాం
(02:15) కదా నిష్టగా ఏం చేశారు వీళ్ళు అంటే పూర్తిగా శాఖహారం అన్నమాట. షూటింగ్ జరిగినన్ని రోజులు అందరికీ కేవలం ఈ శాఖహారం మాత్రమే వడ్డించటం అలాగే నాన్వెజ్ పూర్తిగా నిషేధించడం జరిగింది. సినిమా ఆధ్యాత్మికతను దెబ్బతీయకుండా ఉండేందుకు సెట్లో ఎవరూ కూడా మద్యం సేవించటం అనేది నిషిద్ధం. దాన్ని కూడా కఠినంగా అమలు చేశారు.
(02:42) అలాగే పరస్పరం ఒకరినొకరు దోషించుకోవడం ఒక వర్క్ అట్మాస్ఫియర్ లో ఇది సహజంగా జరిగేది అందులో సినిమా ఇండస్ట్రీలో కూడా జరుగుతుంది. సో అలాంటి టైంలో ఒకరినొకరు దోషించుకోవడం బూతులు మాట్లాడడం గొడవలు పడడం వంటివి కూడా కఠినంగా నిషేధించారు. ప్రతిరోజు షూటింగ్ ప్రారంభించే ముందు అలాగే ముగించే సమయంలో సెట్ లోని సభ్యులంతా తప్పనిసరిగా హనుమాన్ చాలీసా పటించేవారు.
(03:04) షూటింగ్ ఆలస్యమైన సాంకేతిక ఇబ్బందులు ఎదురైనా టీం అంతా కూడా హనుమాన్ చాలీసా చదువుతూ ప్రశాంతంగా ఉండేవారని చాలామంది నటినట్టులు చెబుతున్నటువంటి విషయం. ఇక ఈ సినిమాకు దర్శకుడు మరియు నిర్మాతగా వ్యవహరించిన విశాల్ చతుర్వేచి ఈ ప్రాజెక్ట ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా తన పారితోషం ఏమి తీసుకోకుండా అంతకుమించి ఈ సినిమా విడుదలకు ముందు ఆనాలుగున్నర నెలల పాటు ఆయనంట కేవలం పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకున్నాడు అన్నమాట.
(03:35) ఫ్రూట్ డైట్ తోనే కఠినమైన దీక్ష చేశారు. అలాగే ప్రమోషన్స్ కోసం వేరే వేరే విధాలుగా డబ్బులు ఖర్చు చేయకుండా అన్నదానం వంటివి చేశారన్నమాట. వీలైనంత ఎక్కువ కొన్ని లక్షల మందికి అన్నదానం చేస్తూ ఈ సినిమాని ప్రమోట్ చేయడం అన్నమాట. ఇదిఒక కొత్త వరవడిని వీళ్ళు తీసుకొచ్చారు. ఈ విధముగా ఈ సినిమా యూనిట్ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఒక చిత్తశుద్ధితో క్రమశిక్షణతో భక్తితో దీక్షా దక్షతతో ఈ సినిమాను రూపొందించింది కనుకనే ఇంత సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు.
(04:11) హనుమంతుడి యొక్క కృప ఉంటే రాముడి యొక్క కృప ఉంటే ఎవ్వడు కూడా అపజయం పాలవడు సరి కదా విశేషమైన కీర్తి ప్రతిష్టలు అన్ని రకాలైనటువంటి క్షేమాలు వాడికి కలుగుతాయి. అయితే ఆ ఆ యొక్క కోరికలు లెక్క మనకి అల్టిమేట్ గా కావాల్సింది ఆ రామనామ జపము తద్వారా వచ్చే ఆనందము కానీ మనం ఈ రామనామ జపం ఎందుకు చేస్తున్నాము అంటే అదిగో నాకు ఫలానా కావాలి ఫలానా ఈ సినిమా సక్సెస్ అవ్వాలి అందులో కోట్లు రావాలి ఆ భావన వాళ్ళలో లేదు అది భగవంతుడు ఆటోమేటిక్ గా ఇచ్చాడు.
(04:48) గీతాచార్యుడు చెప్పినట్లుగా కష్టపడటమే నీ యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం దాని ఫలితం గురించి ఫోకస్ పెట్టక అది నేను చూసుకుంటాను. అలా వీళ్ళందరూ కష్టపడుతూ భక్తితో ముందుకు సాగారు దానికి తగ్గ ఫలం వాళ్ళకి లభించింది ఫలం కోసం వారు కష్టపడలేదు. మరల మరలా చెప్తున్నాను మనం కూడా ఆదిశగా అలాంటి వికాసపూరితమైనటువంటి నడవడికతో ముందుకు సాగితే తప్పకుండా భగవంతుడు అనుగ్రహిస్తాడు ఊహించని ప్రతిఫలాన్ని ఇస్తాడు వాటితో మనకి కేవలం ఏదో చిన్న చిన్న బెనిఫిట్స్ కాదండి లోకం కూడా మెచ్చుకుంటుంది.
(05:26) అంతటి గొప్ప ఆ రోజులు వస్తాయన్నమాట భగవంతుని నమ్ముకుంటే నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరం ఆ యొక్క సనాతన ధర్మ సంబంధమైనటువంటి దేవీ దేవతలు ఎవరో ఒకరు వారిని పట్టుకుందాం ఆ దైవ నామాన్ని పట్టుకుందాం పరమాత్మ ఒక్కడే అతడు ఈ రూపంతో మమ్మల్ని మనల్ని అనుగ్రహిస్తున్నాడు ఈ గురువు ద్వారా మనల్ని అనుగ్రహిస్తా ఉన్నాడు అని చెప్పేసి ఆ మూలాన్ని వేడకుండా గురువులనే సాధనం ద్వారా ఆ మార్గాల ద్వారా మనం అక్కడికి చేరుకోవడానికి తపన చెందుతూ దానికి తోడుగా క్రమశిక్షణ ఆహారం విషయంలో గాని ఇతరతర అన్ని విషయాల్లో గాని క్రమశిక్షణతో ఉంటే ఉంటే ఆటోమేటిక్ గా సత్ఫలితాలు వస్తాయి.
(06:05) హనుమాన్ అంష్ ఈ యాంగిల్ లో కూడా అలాంటి మార్కులు గడించింది ఇప్పుడు ఇది తెలుగులో కూడా రాబోతోంది అనేది ప్రధానంగా ఇక్కడ హైలైట్ న్యూస్.
No comments:
Post a Comment