Wednesday, September 30, 2026


👶🏻చిన్నప్పుడు, సరిగ్గా మాటలు కూడా రాని వయసులో, LKG లో join చేయగానే నిన్ను అడిగే మొదటి ప్రశ్న.. "What is your goal in life?" అని. నువ్వు డాక్టర్, ఇంజనీర్, లేక IAS అని ఏదో ఒక ఆన్సర్ చెప్పాలి.  సరిగ్గా అక్కడే.. బతుకు అనే ఒక అంతులేని పరుగు పందెంలో, నిన్నొక అడ్డ గాడిదలా నిలబెట్టడానికి వేసిన మొదటి విత్తనం అది.

గమ్యం ఉండాలి, Target ఉండాలి, Purpose ఉండాలి.. ఇవన్నీ వినడానికి భలే Motivational గా, goose bumps వచ్చేలా ఉంటాయి కదా? కానీ, లాజికల్ గా ఆలోచించు. ఇదంతా నిన్నొక బానిసలా మార్చడానికి ఈ సొసైటీ ఆడిన అతిపెద్ద Psychological Scam అని నీకు ఎప్పుడైనా అనిపించిందా?

🤦🏻నిజానికి జీవితానికి ఎలాంటి Goal లేదు. అసలు ఉండకూడదు కూడా.

ఈ మాట వినగానే, ఈ Goals, Ambitions అని పట్టుకుని పరిగెడుతున్న నీ లోపలి Ego కి ఎక్కడో కాలుతుంది. "అదేంటి? Goal అనేదే లేకపోతే పశువుకి, మనిషికి తేడా ఏముంది?" అని లాజిక్స్ తీస్తావ్. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. పశువుకి, మనిషికి మధ్య ఉన్న ఒకే ఒక్క తేడా ఏంటో తెలుసా? పశువు ప్రశాంతంగా ఈ రోజు గడ్డిని ఈ రోజే తింటుంది. మనిషి మాత్రం.. రేపెప్పుడో తినబోయే ఊహాజనితమైన గడ్డి కోసం, ఇవాళటి ఆకలిని, ఇవాళటి ప్రశాంతతను చంపుకుంటూ బ్రతకడానికి Try చేస్తుంటాడు. That is the only difference.

కావాలంటే, నిన్ను నువ్వు ఒకసారి observe చేసుకో. పదిహేనేళ్ల వయసులో 10th class పాస్ అవ్వడం నీ Goal. ఇరవై ఏళ్లకి మంచి Job కొట్టడం నీ Goal. పాతికకి పెళ్లి, ముప్పైకి ఇల్లు, నలభైకి బ్యాంక్ బ్యాలెన్స్.. ఇలా ఒక Goal చేరుకోగానే, నీ Mind automatic గా ఇంకో Goal ని క్రియేట్ చేస్తుంది. ఎందుకు? ఎందుకంటే నువ్వు Success అయ్యాక దొరికే ఆనందం, ఒక Ice cream లాంటిది. అది కరిగేలోపే నీకు ఇంకో Ice cream కావాలి.

🔴అసలు ఎందుకు మనకి ఈ Goals పిచ్చి పట్టుకుంది? ఎందుకంటే నీ Ego బ్రతకాలంటే దానికి Oxygen లాంటిది ఒకటి కావాలి.. అదే "రేపు" (Tomorrow).

ఈ క్షణంలో, ఇక్కడ, ఇప్పుడు నువ్వు పూర్తి సంతోషంగా ఉంటూ, నీకు ఎలాంటి కోరిక లేకపోతే.. నీ Ego కి పనే లేదు, అది చచ్చిపోతుంది. అందుకే, నీ Mind ఎప్పుడూ నిన్ను Present లో ఉండనివ్వదు. ఏదో ఒక వెలితిని క్రియేట్ చేస్తూనే ఉంటుంది. "ఆ ప్రమోషన్ వస్తే నేను happy", "ఆ కారు కొంటే నేను happy" అని ఒక illusion ని సృష్టిస్తుంది. నువ్వు Future లో బతుకుతున్నావు అంటేనే, Present ని నువ్వు Reject చేస్తున్నావు అని అర్థం. బతికి ఉన్న ఈ ఒక్క క్షణాన్ని నిర్దాక్షిణ్యంగా చంపేసి, ఎప్పుడో వస్తుందో రాదో తెలియని ఆ "రేపటి" కోసం, స్మశానంలో ఇల్లు కట్టుకుంటున్నావు. Simple గా చెప్పాలంటే... Goal అంటేనే, వర్తమానాన్ని హత్య చేయడం.

🤦🏻అసలు ఈ Goal అనే కాన్సెప్ట్ ఎవరికి కావాలి? నీకా? కాదు. ఈ సమాజానికి. ఈ ఎకానమీకి.

నువ్వు ఏ Goal లేకుండా, ఈ రోజు దొరికిన దానికి సంతోషపడిపోతూ ఒక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చుంటే.. ఈ Economy ఏమైపోవాలి? కొత్త కార్లు ఎవరు కొంటారు? Insurance లు ఎవరు కడతారు? Bank loan లు ఎవరు తీసుకుంటారు? Real estate Mafia ఏమైపోవాలి? సమాజానికి నువ్వు ఒక మనిషివి కాదు, ఒక యంత్రం. Economy నడవాలంటే నువ్వు ఒక అడ్డ గాడిదలా పరిగెత్తాలి. అందుకే నీ మెదడులో చిన్నప్పుడే ఈ software ని install చేశారు. ఒక మనిషి ఎప్పుడూ అసంతృప్తితో ఉంటేనే వాడి చేత పని చేయించుకోవచ్చు. ఆ అసంతృప్తికి వాళ్లు పెట్టిన ముద్దు పేరే... "Goal". నిన్ను నువ్వు ఒక బానిసలా మార్చుకోవడానికి, నీకు నువ్వే వేసుకున్న ముసుగు అది.

🏞️See జీవితం అనేది ఒక నది. నువ్వు దానికి ఒక డ్యామ్ కట్టి, ఒక Goal సెట్ చేసి, ఆ ప్రవాహాన్ని నీ కంట్రోల్ లోకి తెచ్చుకోవాలి అనుకుంటున్నావు. అక్కడే నీ లైఫ్ మొత్తం నాశనం అవుతోంది.

ఇక్కడ నీకు ఒక పెద్ద doubt రావచ్చు... "సరే, Goal అనేది పెట్టుకోవొద్దు అన్నావ్. మరి నేను రేపట్నుంచి పడుకుని నిద్రపోవాలా? నా పనులు మానేయాలా?" అని.

ఇక్కడే జనాలు పప్పులో కాలు వేస్తారు. Goal లేకుండా పని చేయడం అంటే, కర్మను వదిలేయడం కాదు.. కర్మ ఫలాన్ని వదిలేయడం. నీకు అర్థమయ్యేలా రోజు జరిగే రియల్ లైఫ్ లోకి తీసుకువచ్చి చెప్తా చూడు.

🏏నువ్వు సండే రోజు ఫ్రెండ్స్ తో కలిసి గల్లీలో క్రికెట్ ఆడుతున్నావు. ఎందుకు ఆడుతున్నావు? ఎవరైనా వరల్డ్ కప్ ఇస్తారా? నీకేమైనా కోటి రూపాయలు అకౌంట్ లో పడతాయా? ఏమీ రాదు కదా. అయినా సరే ఎండలో చెమటలు కక్కుతూ, కిందపడి మోకాళ్లు గీసుకున్నా సరే నవ్వుతూ ఆడుతున్నావు. ఎందుకు? ఆ బ్యాట్ పట్టుకుని బంతిని కొడుతున్న ఆ క్షణం నీకు ఇష్టం కాబట్టి. ఆ process లో ఉన్న మజా కోసం ఆడుతున్నావు. అక్కడ గెలుపు ఓటములు పక్కన పెడితే.. ఆ ఆడే రెండు గంటలు నువ్వు పూర్తిగా అక్కడే జీవిస్తున్నావు. దీన్ని "ఆట" అంటారు.

ఇప్పుడు అదే గల్లీ మ్యాచ్ మీద, ఒక లక్ష రూపాయలు బెట్టింగ్ కట్టావనుకో. ఇప్పుడు మొదలవుతుంది అసలైన నరకం. ఆడే ప్రతి బాల్ కి tension, గుండె దడదడలాడుతుంది. ఒక చిన్న catch miss అయితే ప్రాణం పోయినంత పనవుతుంది. ఆటలో మజా చచ్చిపోయి, భయం పుడుతుంది. ఎందుకిలా జరిగింది? Ground అదే, క్రికెట్ అదే, ఆడుతుంది నువ్వే. కానీ నీ focus ఆట మీద లేదు, ఆ లక్ష రూపాయల Result మీద ఉంది. దీన్ని "వ్యాపారం" అంటారు.

🤓జీవితం కూడా అచ్చం ఇంతే. ఏ పని చేస్తున్నా, "దీనివల్ల నాకేంటి లాభం? ఎప్పుడు సక్సెస్ అవుతాను?" అని భవిష్యత్తు గురించి లెక్కలు వేసుకుంటూ చేస్తే అది వ్యాపారం. అందులో Stress తప్ప kick ఉండదు. ఎందుకంటే నీ Mind Present లో లేదు, Future లో ఎక్కడో ఉంది. కానీ, ఆ పనిని ఒక గల్లీ క్రికెట్ లాగా Feel అవ్వు. Result వస్తుందా రాదా అని సంబంధం లేకుండా ఆ క్షణంలో పూర్తిగా Involve అయ్యి చేస్తే.. అది నీకు ఒక ఆటలా మారిపోతుంది. అప్పుడు పని భారం అనిపించదు.

Logic చాలా సింపుల్... Result కోసం చేసేది Duty, ఆ క్షణం కోసం చేసేది Beauty. ఫలాపేక్ష లేకుండా కర్మ చెయ్యడం అంటే ఇదే. ఈ క్షణంలో బతకడం నేర్చుకుంటే, నీ Best ఏంటో దానంతట అదే బయటకొస్తుంది.

⬜నీ Life కి ఒక Meaning ఉండాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అసలు నువ్వు ఈ భూమి మీద బతికి ఉండటమే ఒక అద్భుతం. పూలు పూయడానికి మీనింగ్ అవసరం అనుకుంటున్నాయా? నక్షత్రాలు మెరవడానికి ఒక Target అవసరం అనుకుంటున్నాయా? సృష్టిలో దేనికీ Purpose లేదు, ఒక్క మనిషికి తప్ప. అందుకే సృష్టి అంతా అందంగా, ప్రశాంతంగా ఉంది, మనిషి మాత్రం పిచ్చోడిలా పరిగెడుతున్నాడు.

So, నువ్వు వదిలేయాల్సినవి ఏమైనా ఉన్నాయేమో తప్ప, నువ్వు సాధించడానికి మాత్రం ఇక్కడ ఏమీ లేదు.

-PRATIKULA VEDAM






No comments:

Post a Comment