Saturday, September 26, 2026

మీ మెదడును బ్లాస్ట్🤯 చేసే అష్టావక్ర గీత రహస్యం | The Mindset-Breaking Truth of Ashtavakra Gita

మీ మెదడును బ్లాస్ట్🤯 చేసే అష్టావక్ర గీత రహస్యం | The Mindset-Breaking Truth of Ashtavakra Gita

Author Name:Mr AK Prime

Youtube Channel Url:https://www.youtube.com/@MrAKPrime

Youtube Video URL:https://www.youtube.com/watch?v=kYF_47txvJQ





Title: మీ మెదడును బ్లాస్ట్🤯 చేసే అష్టావక్ర గీత రహస్యం | The Mindset-Breaking Truth of Ashtavakra Gita

Author Name: Mr AK Prime

Description: The topic we are going to talk about today is not a simple motivation. It is an ancient and very powerful mental weapon that will radically change your way of thinking and your life. Ashtavakra Geeta... This knowledge, given by a 12-year-old boy, an Ashtavakra Maharaja Janaku, with a body with eight bends, is the biggest psychological shock in the world. Why do we suffer? Why do we get depressed when others criticize us? Why do we fear when we face defeat? The ultimate answer to this confusion is 'Sakshi Bhava'. Watch this video till the end. All your troubles, fears, and overthinking will disappear from this moment. This is a life-changing masterpiece presented by Mr AK Prime. After watching this video, your life will never be the same.

ashtavakra gita in telugu, ashtavakra gita explained, who am i philosophy, observer mindset, sakshi bhavam, how to stop overthinking in telugu, advaita vedanta telugu, psychological breakdown of ashtavakra gita, ashtavakra and king janaka story, mr ak prime telugu, mindset shifting videos in telugu, ancient indian philosophy telugu, how to detach from emotions, handling insults telugu, true meaning of life telugu, overcoming ego in telugu, spiritual awakening telugu, financial mindset, life lessons telugu, best self improvement telugu, motivation telugu, telugu personality development, control your mind telugu, destroy depression telugu, fear of failure telugu, reality of human life, illusion of world maya, adwaita philosophy simple telugu, epic stories in telugu, king janaka enlightenment.

#AshtavakraGita #MrAKPrime #ObserverMindset #StopOverthinking #TeluguMotivation #SakshiBhavam #LifeLessonsTelugu #PsychologyInTelugu #AdvaitaVedanta #SelfImprovementTelugu #MindsetShift #OvercomeFear #AncientWisdom #WhoAmI #SpiritualAwakening #SuccessMindset #TeluguStories #EpicPhilosophy #MentalStrength #DestroyEgo #DetachFromOutcome #FocusAndSuccess #InnerPeace #TeluguYouTuber #LifeChangingVideo

⚠️ Disclaimer:
The content provided in this video is for informational and educational purposes only. We aim to provide accurate and up-to-date information, but we do not guarantee the completeness or accuracy of the information presented. Viewers are advised to verify details from official sources before making any decisions. The creator is not responsible for any actions taken based on this video.
Copyright Disclaimer:
Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
Images & Video Clips Credit:
The images and video clips used in this video belong to their respective owners. They are used strictly for educational and news reporting purposes under Fair Use. If you are the owner of any content and wish for it to be removed or credited differently, please contact us at:
Music Credit:
Music provided by YouTube Audio Library / NCS Source Pixbuy
🤖 AI & Safety Disclosure:
Transparency matters to us! Please note that the voiceover and certain visual elements (like 3D images and thumbnails) in this video were generated using advanced Artificial Intelligence (AI) tools to provide you with the highest quality audio and visual experience. However, the core script, research, and concept are entirely original and crafted for educational and motivational purposes only.

Safety & General Disclaimer
The information provided on this channel is for public awareness purposes only. We do not intend to hurt anyone's sentiments, incite violence, or mislead anyone. You may use your own discretion before accepting this information.

Transcript:
(00:11) రోజు పొద్దున్నే లేచి అద్దంలో చూసుకుని అక్కడ కనిపించే ఆ రూపం నువ్వే అని బలంగా నమ్ముతున్నావు కదా నీకున్న పేరు నీ బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ నువ్వు చేస్తున్న ఉద్యోగం నీ చుట్టూ ఉన్న బంధాలు నీ మెదడును తొలుస్తున్న కష్టాలు ఆవరించి ఉన్న భయాలు ఇవన్నీ నీవే అని ఇవన్నీ కలిపి పితేనే నువ్వు అని ఒక పెద్ద భ్రమలో బతుకుతున్నావు కానీ ఒక్కసారి ఆలోచించు ఇదంతా ఒక అబద్ధం అయితే నీకు జరిగిన అవమానాలు నీకు వచ్చిన విజయాలు నిన్ను కాల్చివేస్తున్న భయాలు అన్నీ కేవలం ఒక భ్రమ మాత్రమే అయితే నువ్వు పుట్టినప్పటి నుంచి నీ గురించి నువ్వు ఏదైతే నమ్ముతున్నావో అదంతా నూటికిన శాతం అబద్ధం
(00:51) అయితే నీ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనవుతుంది కదా ఈరోజు నేను నీకు చెప్పబోయేది ఏదో మోటివేషనల్ క్లాస్ కాదు నిన్ను ఉత్సాహ పరచడానికి చెప్పే నాలుగు మంచి మాటలు అంతకంటే కాదు ఇది నీ మైండ్సెట్ ను ముక్కలు చేసే ఒక అత్యంత భయంకరమైన అద్భుతమైన నిజం ఒక మనిషి ఆలోచనా విధానాన్ని బద్దలు కొట్టి వాడి అహంకారాన్ని సునామీలా ముంచెత్తే ఒక ప్రాచీన రహస్యం ఈ వీడియో చూస్తున్న ప్రతిక్షణం ప్రతి నిమిషం నీకు తెలియని ఒక కొత్త కోణం నీలో నిద్రలేస్తుంది.
(01:23) ఈ జ్ఞానాన్ని వినకుండా వదిలేస్తే జీవితంలో అత్యంత విలువైనది కోల్పోయినట్టే ఇది మిస్టర్ ఏకే ప్రైమ్ నీ బుర్రలో ఉన్న చెత్తను తొలగించి నిన్నొక అజయుడిగా ఎవరికీ భయపడని ఒక మానసిక యోధుడిగా మార్చే ప్రయాణానికి స్వాగతం చరిత్రలో ఒకానొక కాలంలో ఒక మహా సామ్రాజ్యం ఉండేది. ఆ సామ్రాజ్యానికి రాజు జనక మహారాజు ఆయన మామూలు రాజు కాదు అపారమైన జ్ఞాని గొప్ప పండితుడు.
(01:53) ఆయన ఆస్థానంలో అద్భుతమైన మేధావులు వేదాలు చదివిన పండితులు తత్వవేత్తలు ఎప్పుడూ చర్చలు జరుపుతూ ఉండేవారు. ఒకరోజు జనక మహారాజు సభలో ఒక అతి పెద్ద చర్చ జరుగుతోంది. దేశంలో ఉన్న మహా మహా పండితులంతా ఆ సభలో కూర్చుని ఉన్నారు. ఆ సభలోకి ఒక చిన్న బాలుడు అడుగుపెట్టాడు. ఆ బాలుడి వయసు కేవలం 12 సంవత్సరాలు కానీ ఆ బాలుడి శరీరం మామూలుగా లేదు. ఎనిమిది వంకర్లు తిరిగి ఉంది.
(02:18) కాళ్ళు వంకరగా చేతులు వంకరగా నడుము వంకరగా మెడ వంకరగా నడవడానికి కూడా తీవ్రంగా కష్టపడుతూ తన శరీరాన్ని ఈడ్చుకుంటూ ఆ మహా పండితుల సభ మధ్యలోకి వచ్చాడు. ఆ బాలుడిని చూడగానే అక్కడ ఉన్న పండితులందరికీ ఒకటే నవ్వు పెద్ద పెద్ద విద్యావంతులు జ్ఞానులు అని పిలవబడే ఆ మేధావులంతా ఆ బాలుడి శారీరక వైకల్యాన్ని చూసి పగలబడి నవ్వడం మొదలు పెట్టారు.
(02:41) సభ అంతా వారి నవ్వులతో మార్మోగిపోతుంది. జనక మహారాజు కూడా ఆశ్చర్యంగా ఆ బాలుడి వైపే చూస్తున్నాడు. సభలో అందరూ అలా నవ్వుతూ ఉంటే ఆ 12 ఏళ్ల బాలుడు ఒక్క క్షణం ఆగి వాళ్ళందరి వైపు తీక్షణంగా చూశాడు. ఆ తర్వాత ఆ బాలుడు నవ్వడం మొదలు పెట్టాడు. ఆ నవ్వు ఎంత భయంకరంగా ఉందంటే పండితుల నవ్వులన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. ఆ 12 ఏళ్ల బాలుడి నవ్వుల గర్జనకు ఆ సభ అంతా నిశశబ్దమైపోయింది.
(03:10) మహారాజు జనకుడికి ఏమీ అర్థం కాలేదు. అప్పుడు జనకుడు ఆ బాలుడిని అడిగాడు. ఓ బాలుడా వాళ్ళంతా నీ శరీరాన్ని చూసి నవ్వారు దానికి ఒక అర్థం ఉంది. కానీ నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ బాలుడు చెప్పిన ఒక్క మాట ఆ సభలో ఉన్న ప్రతి ఒక్కరి అహంకారాన్ని ముక్కలు చేసింది. ఆ బాలుడు ఇలా అన్నాడు. మహారాజా నేను వచ్చింది మహాజ్ఞానుల సభకు అనుకున్నాను.
(03:37) కానీ ఇక్కడంతా చర్మకారులు మాత్రమే ఉన్నారు అన్నాడు. చర్మకారులు అంటే చెప్పులు కుట్టేవారు తోలు వ్యాపారం చేసేవారు అని అర్థం. ఈ మాట వినగానే పండితులందరికీ కోపం కట్టలు తెంచుకుంది. మమ్మల్ని చర్మకారులు అంటావా అని అరిచారు. అప్పుడు ఆ బాలుడు చాలా ప్రశాంతంగా ఇలా అన్నాడు. అవును చర్మకారుడికి మాత్రమే ఒక చర్మం లేదా తోలు ఎంత నాణ్యతగా ఉందో తెలుస్తుంది.
(04:00) ఆ తోలు రంగు ఏంటి? దాని ఆకారం ఏంటి అని చూసేవాడు చర్మకారుడు. ఇప్పుడు మీరంతా నా శరీరంలో ఉన్న ఎముకలను నా శరీరం మీద కప్పి ఉన్న ఈ చర్మాన్ని చూసి నవ్వుతున్నారు తప్ప ఈ శరీరం లోపల ప్రకాశిస్తున్న నా ఆత్మను నా జ్ఞానాన్ని మీరెవరు చూడలేకపోతున్నారు. ఎముకలు మాంసం చర్మం చూసి నవ్వేవారిని చర్మకారులు అనక మరేమంటారు అని ప్రశ్నించాడు ఆ బాలుడు. ఆ ఒక్క దెబ్బకు సభ అంతా శిలాజం లాగా మారిపోయింది. ఆ బాలుడే అష్టావక్రుడు.
(04:28) శరీరం ఎనిమిది వంకర్లు ఉన్నా ఆయన జ్ఞానం ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించు ఆ సభలో ఉన్న పండితులకి ఈరోజు బతుకుతున్న మనకి తేడా ఏమైనా ఉందా? మనం కూడా అదే చేస్తున్నాం కదా ఒక మనిషి వేసుకున్న బట్టలు చూసి వాడు నడిపే కారు చూసి వాడి జేబులో ఉన్న డబ్బు చూసి వాడి అందం చూసి మనం వాడికి ఒక గుర్తింపు ఇస్తున్నాం.
(04:56) ఒకరి దగ్గర డబ్బు లేకపోతే వాడిని అవమానిస్తున్నాం. ఒకరు అందంగా లేకపోతే వాళ్ళని చూసి నవ్వుతున్నాం. ఈ సమాజం మొత్తం ఒక పెద్ద చర్మకారుల సభలాగా మారిపోయింది. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మనం శరీరాన్ని వస్తువులని నిజం అనుకుంటున్నాం. అసలైన మన అస్తిత్వాన్ని మర్చిపోయాం. అష్టావక్రుడి మాటలు విన్న జనక మహారాజుకు ఒక పెద్ద షాక్ తగిలింది. తన సింహాసనం మీద నుంచి కిందకు దిగిపోయి అష్టావక్రుడి పాదాల మీద పడ్డాడు.
(05:23) స్వామి నాకు ఒక అనుమానం ఉంది. నా మనసు ఎప్పుడు గందరగోళంగా ఉంది. అసలు నేను ఎవరు నాకు ఈ ప్రపంచం నుంచి ముక్తి ఎలా దొరుకుతుంది? అసలైన జ్ఞానం అంటే ఏంటి? అని అడిగాడు. అప్పుడు అష్టావక్రుడు ఇచ్చిన సమాధానమే అష్టావక్ర గీత. ఇది కేవలం జనకుడికి చెప్పినది కాదు. ఈరోజు ప్రతి చిన్న విషయానికి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నా ఉద్యోగం పోయిందని భయపడుతున్నా ఎవరైనా అవమానించాలని ఏడుస్తున్న ప్రతి ఆధునిక మనిషికి ఇచ్చిన అత్యంత పదునైన మానసిక ఆయుధం ఇది.
(05:54) అష్టావక్రుడు జనకుడికి చెప్పిన మొదటి సూత్రం నువ్వు ఈ శరీరం కాదు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఈ పంచభూతాలతో తయారైన ఒక ముద్ద ఈ శరీరం నువ్వు ఆ ముద్ద కాదు మరి నేను ఎవరు అని జనకుడు అడిగితే అష్టావక్రుడు చెప్పిన సమాధానం నువ్వు సాక్షివి నువ్వు అన్నిటిని గమనించే ఒక స్వచ్ఛమైన చైతన్యాన్ని నువ్వు కేవలం ఒక పరిశీలకుడివి అన్నాడు. ఈ మాటను చాలా జాగ్రత్తగా వినండి.
(06:22) సాక్షి భావం లేదా అబ్జర్వర్ మైండ్సెట్ అంటే ఏమిటి ఇక్కడే మన జీవితంలో ఉన్న కష్టాలన్నింటికీ సమాధానం ఉంది నువ్వు ఒక సినిమా హాల్ కి వెళ్లి సినిమా చూస్తున్నావు. తెరమీద ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగినట్టు దృశ్యం వస్తుంది. ఆ మంటలు చూసి నువ్వు భయపడతావా నీకు సెగ తగులుతుందా? తెరమీద హీరో ఏడుస్తూ ఉంటే నువ్వు నిజంగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతావా? లేదు ఎందుకంటే నీకు తెలుసు ఆ తెర మీద జరిగేదంతా కేవలం ఒక ఆట అని నువ్వు కేవలం దానిని చూస్తున్న ఒక ప్రేక్షకుడివి అని నీకు స్పష్టంగా తెలుసు తెర మీద ఎంత పెద్ద సునామి వచ్చినా సరే తెర తడవదు. ఎంత పెద్ద మంటలు వచ్చినా సరే తెర
(07:04) కాలిపోదు. అష్టావక్రుడు చెబుతున్నది అదే నీ జీవితం అనేది ఒక సినిమా తెర లాంటిది నీ శరీరానికి కష్టాలు వస్తున్నాయి. నీ బ్యాంకు బ్యాలెన్స్ పడిపోతుంది. నిన్ను ఎవరో అవమానిస్తున్నారు. నీకు ఎవరైనా బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ కేవలం తెర మీద ఆడుతున్న దృశ్యాలు ఆ కష్టం నీ శరీరానికి నీ మనసుకి నీ అహంకారానికి వచ్చిందే తప్ప అసలైన నీకు రాలేదు నువ్వు కేవలం ఈ జీవితం అనే సినిమాను చూస్తున్న ఒక సాక్షివి.
(07:34) కానీ మనం చేస్తున్న అతి పెద్ద తప్పు ఏంటంటే మనం సినిమా చూస్తూ చూస్తూ ఆ సినిమాలో క్యారెక్టర్ మనమే అని భ్రమపడిపోతున్నాం. అందుకే ప్రతి చిన్న అవమానానికి మన రక్తం మరిగిపోతుంది. ప్రతి చిన్న కష్టానికి గుండె ఆగిపోయేంత భయం వస్తుంది. నీకు పదే పదే భయం ఎందుకు వస్తుందో తెలుసా నువ్వు నిన్ను ఒక కర్తగా ఫీల్ అవుతున్నావు. నేను చేస్తున్నాను నా వల్ల అవుతుంది.
(07:55) నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే అహంకారం నీలో ఉంది. ఈ సమాజం నిన్ను ఎలా తయారు చేసింది అంటే ఒక డిగ్రీ వస్తే నీకు ఒక గుర్తింపు ఒక జాబ్ వస్తే నీకు ఒక గుర్తింపు 10 మంది నిన్ను పొగిడితే నువ్వు తోపు అంటే నీ గుర్తింపు మొత్తం బయట ఉన్న వాళ్ళ చేతుల్లో పెట్టేసావు. వాళ్ళు పొగిడితే ఉబ్బిపోతావు. వాళ్ళు తిడితే కుంగిపోతావు. వాళ్ళు నీకు అటాచ్ చేసిన లేబుల్స్ ని నువ్వు నిజం అనుకుంటున్నావు.
(08:20) వాళ్ళు నిన్ను పేదవాడు అంటే నువ్వు పేదవాడిని అని ఫిక్స్ అయిపోయావు. వాళ్ళు నిన్ను ఫెయిల్యూర్ అంటే నువ్వు ఫెయిల్యూర్ అని ఏడుస్తున్నావు. కానీ అష్టావక్రుడు అంటున్నాడు ఈ ప్రపంచం నీకు ఇచ్చే ఏ లేబుల్ నీది కాదు నీకు అంటగట్టిన ఏ పేరు నీది కాదు. నిన్ను విమర్శించే వాడికి వాడి గురించి వాడికే తెలియదు. ఇక నీ గురించి వాడు ఎలా జడ్జ్ చేస్తాడు నువ్వు మురికి నీటిలో పడినా సరే నువ్వు ప్యూర్ అని తెలిసినప్పుడు ఆ మురికి నిన్ను ఏమి చేయలేదు కదా సాక్షి భావం అంటే ప్రతిదానికి ఒక అడుగు దూరంలో నిలబడి చూడటం నీ ఆఫీసలో నీ బాస్ నిన్ను అందరి ముందు ఘోరంగా తిట్టాడు అనుకుందాం. సాధారణ మనిషి
(08:55) ఏం చేస్తాడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు. నా పరువు పోయింది అని కుంగిపోతాడు. రాత్రంతా నిద్రపోకుండా ఓవర్ థింకింగ్ చేస్తాడు. నా జీవితం నాశనమైపోయింది అని భయపడతాడు. ఎందుకంటే వాడు వాడి అహంకారాన్ని వాడి మనసును తనే అనుకుంటున్నాడు. కానీ సాక్షి భావం ఉన్నవాడు ఎలా ఆలోచిస్తాడో తెలుసా ఆ బాస్ తిడుతున్నప్పుడు వాడు ఆ తిట్లను తన మనసుకి తీసుకోడు నా శరీరం అక్కడ నిలబడి ఉంది.
(09:23) ఆ బాస్ నోటి నుంచి కొన్ని శబ్దాలు వస్తున్నాయి. ఆ శబ్దాలు నా చెవిలో పడుతున్నాయి. నేను కేవలం దీన్ని గమనిస్తున్నాను అని వాడు డిటాచ్ అయిపోతాడు. వాడు లోపల నవ్వుకుంటాడు. నాకేమీ కాలేదు నేను కాలిపోలేదు అని ప్రశాంతంగా ఉంటాడు. ఇదే అష్టావక్రుడి సైకాలజీ నీకు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య లోపల ఇరుకుపోకుండా ఒక మూడో వ్యక్తి లాగా నీ జీవితాన్ని నువ్వు గమనించడం మొదలు పెడితే ఈ భూమి మీద ఏ కష్టము నిన్ను ఏడిపించలేదు.
(09:49) కొంతమంది అంటుంటారు డబ్బులు పోయాయి నా బతుకు అయిపోయింది అని డబ్బులు ఎక్కడికి పోయాయి నీ జేబులో నుంచి వేరేవాడి జేబులోకి వెళ్ళాయి. నువ్వు ఏమైనా పుట్టినప్పుడు సూట్కేసుల్లో డబ్బులు తెచ్చుకున్నావా? లేదు కదా మళ్ళీ సంపాదించవచ్చు. కానీ నువ్వు ఆ డబ్బునే నీ ప్రాణంగా నీ అస్తిత్వంగా మార్చుకున్నావు కాబట్టి నువ్వు నరకం అనుభవిస్తున్నావు అటాచ్మెంట్ అనేది కేవలం నీ మనసు సృష్టించిన ఒక భ్రమ నీకు దేని మీద అయితే విపరీతమైన అటాచ్మెంట్ ఉంటుందో అదే నిన్ను అత్యంత దారుణంగా ఏడిపిస్తుంది.
(10:18) అది ఒక మనిషి కావచ్చు ఒక వస్తువు కావచ్చు లేదా ఒక హోదా కావచ్చు అష్టావక్రుడు చెప్పే ముక్తి అంటే అడవుల్లోకి పారిపోయి కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు. ముక్తి అంటే నువ్వు ఈ సమాజంలోనే ఉండాలి డబ్బు సంపాదించాలి బంధాలను చూసుకోవాలి వ్యాపారాలు చేయాలి కానీ ఇవేవి నిన్ను కంట్రోల్ చేయకూడదు. నువ్వు అన్నిటిని వదిలేయడం కాదు డిటాచ్మెంట్ అంటే ఏది నిన్ను పట్టుకోకుండా ఉండటమే నిజమైన డిటాచ్మెంట్ మనసు అనేది ఒక కోతి లాంటిది అది గతాన్ని తలుచుకొని బాధపడుతుంది.
(10:53) భవిష్యత్తును తలుచుకొని భయపడుతుంది. అరే నాకు 30 ఏళ్ళు వచ్చాయి ఇంకా సెటిల్ కాలేదు అని ఒక భయం. నా ఫ్రెండ్స్ అందరూ కార్లు కొన్నారు. నేను ఇంకా బైక్ మీదే ఉన్నాను అని ఒక భయం. రేపు ఏమవుతుందో అనే ఆందోళన. అష్టావక్రుడు జనకుడితో చాలా కఠినమైన ఒక నిజం చెప్పాడు. నీకు బంధనం అనేది బయట ఎక్కడా లేదు మహారాజా నువ్వు బంధించబడ్డావు అని నువ్వు అనుకోవడమే నీ అతి పెద్ద బంధనం అన్నాడు.
(11:18) నువ్వు ముక్తుడివి అని నువ్వు అనుకున్న క్షణమే నువ్వు స్వేచ్ఛను పొందుతావు. ఎంత అద్భుతమైన సైకాలజీ ఇది ఒక ఏనుగును చిన్నప్పుడు ఒక చిన్న గొలుసుతో కట్టేస్తారు. ఆ చిన్న ఏనుగు ఆ గొలుసును తెంచడానికి చాలా ప్రయత్నిస్తుంది. కానీ దాని వల్ల కాదు అలా దాని మెదడులో ఒక విషయం ఫిక్స్ అయిపోతుంది. ఈ గొలుసును నేను ఎప్పటికీ తెంచలేను అని ఆ ఏనుగు పెద్దదై మహా బలాన్ని పొందుతుంది.
(11:46) ఇప్పుడు ఆ ఏనుగు తలుచుకుంటే ఆ గొలుసును ఒక్క దెబ్బతో ముక్కలు చేయగలదు కానీ అది ప్రయత్నించదు. ఎందుకంటే దాని మెదడు దాన్ని బంధించేసింది. మన పరిస్థితి కూడా అంతే మనల్ని ఎవరూ బంధించలేదు. సమాజం మనకఇచ్చిన భయాలు మన మైండ్ లో ఉన్న కండిషనింగ్ మనల్ని కదలకుండా చేస్తున్నాయి. నీ ఆలోచనలే నీ జైలు నీ ఆలోచనలే నీకు శత్రువులు ఆ ఆలోచనలను సాక్షిలాగా గమనించడం మొదలు పెట్టు.
(12:12) ఒక ఆలోచన వస్తే దాని వెంట పరుగెత్తకు వదిలేయ్ ఆకాశంలో మేఘాలు వచ్చినట్టు ఆలోచనలు వస్తాయి. మళ్ళీ వెళ్ళిపోతాయి. ఆకాశం ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉంటుంది. నువ్వు ఆ ఆకాశానివి అష్టావక్రగీత మనకు నేర్పే అతి పెద్ద పాఠం ఏంటంటే ఓటమి అనేది కేవలం మనసు యొక్క ఒక భ్రమ. నువ్వు ఏ పని చేసినా దానికి వచ్చే ఫలితం గురించి ముందే ఊహించుకుని ఆ ఊహకి బానిస కావడం వల్లే నీకు టెన్షన్ వస్తుంది.
(12:40) రిజల్ట్ గురించి పట్టించుకోకుండా నేను కేవలం ఈ పనిని గమనిస్తూ చేస్తాను అని నువ్వు అనుకుంటే నీ ఫోకస్ 100 శాతం పెరుగుతుంది. నీ పనితీరు భయంకరంగా మారుతుంది. అప్పుడు విజయం నీ వెనకాల కుక్కలాగా పరిగెత్తుకుంటూ వస్తుంది. నువ్వు ఎందుకు భయపడుతున్నావు నీ ఇగో ఎక్కడ హర్ట్ అవుతుందో అని భయపడుతున్నావు. 10 మంది నిన్ను ఫెయిల్యూర్ అంటారేమో అని భయపడుతున్నావు.
(13:01) కానీ ఒక్కసారి అష్టావక్రుడి కోణంలో నుంచి చూడు వాళ్ళు ఎవరిని అంటున్నారు నీ శరీరాన్ని నీ క్యారెక్టర్ ని కానీ అసలైన నువ్వు ఎవరికీ కనబడవు నిన్ను ఎవరూ అంటలేరు నిన్ను ఎవరు ఏమి చేయలేరు కత్తి నిన్ను కోయలేదు మంట నిన్ను కాల్చలేదు. నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ నిజం నీ నరనరాల్లోకి ఎక్కిన రోజు నీ నడక మారుతుంది. నీ చూపు మారుతుంది.
(13:29) నీ మాటలో ఒక గర్జన వస్తుంది. నీ ఎదురుగా ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎంత పెద్ద శత్రువు వచ్చినా నువ్వు చిరునవ్వుతో ఎదుర్కోగలవు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఇగో మాత్రమే తెలుసు నీకు అహంకారం లేని అనంతమైన స్వేచ్ఛ తెలుసు జనక మహారాజు ఈ మాటలు విన్న తర్వాత ఆయనలో ఉన్న భయాలు గందరగోళం రాజ్యభారం టెన్షన్ అన్నీ ఒకే ఒక్క క్షణంలో బూడిదయపోయాయి.
(13:53) నేను రాజుని కాబట్టి నేను ఇవన్నీ భరించాలి అనే అహంకారం మాయమైపోయింది. నేను ఒక సాక్షిని ఈ రాజ్యం నడుస్తుంది. నేను దాన్ని చూస్తూ నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను అని ప్రశాంతంగా తన సింహాసనం మీద కూర్చున్నాడు. అందుకే జనకుడిని రాజర్షి అంటారు. రాజుగా ఉంటూనే ఋషిలాగా జీవించాడు. ఈ రోజు నుంచి నీకు ఎవరైనా అవమానం చేసినా నీకు ఏదైనా నష్టం వచ్చినా డిప్రెషన్ నిన్ను కమ్మేస్తున్న కళ్ళు మూసుకుని అష్టావక్రుడి నవ్వును గుర్తు తెచ్చుకో వాళ్ళందరూ చర్మకారులు అని గుర్తు తెచ్చుకో ఈ ప్రపంచం నీ చుట్టూ ఆడుతున్న నాటకాన్ని కేవలం ఒక ప్రేక్షకుడిలా చూసి ఆనందించు అప్పుడే
(14:29) నువ్వు అసలైన ఆటను ఆడగలవు. భయం లేకుండా తీసుకునే ఏ నిర్ణయమైనా అద్భుతంగానే ఉంటుంది. సాక్షి భావంలో ఉన్నవాడిని ఏ ఓటమి కృంగదీయలేదు. ఏ విజయము ఉక్కిరి బిక్కిరి చేయలేదు. వాడు ఎప్పుడూ ఒకేలా ఉంటాడు అదే అంతిమ శక్తి అదే అంతిమ విజయం నేను ఏదీ కాదు నేను కేవలం పరిశీలకుడిని అని నీకు నువ్వు బలంగా చెప్పుకో ఈ ఒక్క థాట్ నీ జీవితాన్ని సమూలంగా మార్చేస్తుంది.
(14:55) ఈ వీడియోలో మీరు తెలుసుకున్న ఈ ప్రాచీన రహస్యం మీ మెదడులో ఒక కొత్త జ్యోతిని వెలిగించిందని నేను నమ్ముతున్నాను. మీరు మిమ్మల్ని ఇంకెప్పుడూ తక్కువ అంచనా వేసుకోరు. ఇలాంటి బలమైన మీ మైండ్సెట్ ను బద్దలు కొట్టే మిమ్మల్ని ఒక యోధుడిగా నిలబెట్టే జ్ఞానం మీకు మళ్ళీ మళ్ళీ కావాలి అనుకుంటే మిస్టర్ ఏకే ప్రైమ్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.
(15:16) ఈ జ్ఞానాన్ని అందరికీ పంచండి. కామెంట్స్ లో ఒక్క మాట చెప్పండి. ఈ క్షణం నుంచి మీ జీవితాన్ని మీరు ఒక సాక్షిగా చూస్తారా లేదా అనేది కింద కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ చదువుతాను. లైక్ బటన్ నొక్కడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. రాబోయే వీడియోలు ఇంతకు మించిన సైకలాజికల్ షాక్ తో మీ ముందుకు వస్తాయి. ధన్యవాదాలు.

No comments:

Post a Comment