Saturday, September 26, 2026

విసిరేస్తే వదిలేస్తాడా? | SEETAKANTH TALKIE | #lordkrishna #lifelessons #motivation #telugustories

విసిరేస్తే వదిలేస్తాడా? | SEETAKANTH TALKIE | #lordkrishna #lifelessons #motivation #telugustories

Author Name:SEETAKANTH TALKIE

Youtube Channel Url:https://www.youtube.com/@SEETAKANTHTALKIE

Youtube Video URL:https://www.youtube.com/watch?v=BPS4rlpQnZg





Title: విసిరేస్తే వదిలేస్తాడా? | SEETAKANTH TALKIE | #lordkrishna #lifelessons #motivation #telugustories

Author Name: SEETAKANTH TALKIE

Description: #SEETAKANTHTALKIE


Follow For More Updates

Facebook :   / seetakanthn  
Instagram :  / seetakanth_n

Transcript:
(00:00) బాగా చీకటిగా ఉన్న అర్ధరాత్రి వేళ బయట భారీ వర్షం పడుతుంది. ఒక పాత వంతిన కింద నది చాలా వేగంగా ప్రవహిస్తుంది. ఆ చీకట్లోనే ఒక కారు వచ్చి వంతన మధ్యలో ఆగింది కారు డోరు తెరుచుకొని వర్షంలో తడుస్తూ ఒక వ్యక్తి బయటకు దిగాడు. అతని చేతుల్లో ఒక పెద్ద వెండి కృష్ణుడి విగ్రహం ఉంది. అతను వణకుతున్న అడుగులతో వంతిన అంచు దగ్గరికి వెళ్ళాడు అతని ముఖం మీద పడుతున్న వర్షపు నీటిలో కంటి నిండి కారుతున్న కన్నీళ్లు కలిసిపోతున్నాయి.
(00:29) విగ్రహాన్ని రెండు చేతులతో గట్టిగా పట్టుకొని చాలా కోపంతో ఆవేశంతో ఊగిపోతూ అంటున్నాడు 15 ఏళ్ళు 15 ఏళ్ల నుంచి ప్రతిరోజు క్రమం తప్పకుండా నిన్ను భక్తితో కడిగాను తుడిచాను పూలతో పూజించాను ఒక్కరోజు కూడా నీ మీద నమ్మకాన్ని వదులుకోలేదు కానీ చివరికి నువ్వు నాకు ఏమ ఇచ్చావు కృష్ణ ఆస్తులు కొట్టుకుపోయేలా నష్టాలు ఇచ్చావు నడి రోడ్డున నిలబెట్టే అవమానాలు ఇచ్చావు ప్రాణంగా అనుకున్న నా వాళ్ళందరినీ నాకు దూరం చేసేసావ్ నువ్వు ఉన్నావని నన్ను కాపాడతావని నమ్మాను చూడు అది అది నా మూర్ఖత్వం ఇంకా నిన్ను పూజించడం నా అమాయకత్వం నువ్వు లేవు ఈ ప్రపంచంలో దేవుడు అనేవాడే
(01:08) లేడు అని గట్టిగా అరుస్తూ తన చేతుల్లోని వెండి విగ్రహాన్ని బలంగా ఆ చీకటి నదిలోకి విసిరేసాడు ఆ విగ్రహం నీటిలో పడుతూ చేసిన దబ్ అనే శబ్దం ఆ వర్షపు హోరులో కొట్టుకుపోయింది. అతను వెనక్కి తీరి చూడకుండా ఆవేశంగా కారికి వెళ్ళిపోయాడు అతని పేరు ప్రతాప్ ఆ రాత్రి నదిలో పడింది కేవలం ఒక వెండి కృష్ణుడి విగ్రహం మాత్రమే కాదు 15 ఏళ్లుుగా అతను పెంచుకున్న నమ్మకం భక్తి అసలు దేవుడిని ప్రాణంగా ఆరాధించే ప్రతాప్ అంతటి దారుణమైన నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తెలియాలంటే మనం కొంచెం అతని గతంలోకి వెళ్ళాలి.
(01:47) ప్రతాప్ ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత చిన్ననాటి నుండి అతనికి కృష్ణుడి మీద కొండంత నమ్మకం ఎనలేని భక్తి వాళ్ళ ఇంట్లో తాత ముత్తాతల కాలం నుండి వస్తున్న ఒక చిన్న కృష్ణ మందిరం అందులో అత్యంత పవిత్రంగా భావించే ఒక వెండి కృష్ణుడి విగ్రహం ఉండేది ఉదయాన్నే ఐదు గంటలకు లేచి స్నానం చేసి ఆ కృష్ణుడికి మనస్ఫూర్తిగా పూజ చేసి ప్రసాదం నివేదించిన తర్వాతే అతను ఆఫీస్ కి బయలుదేరేవాడు ఎంతటి ముఖ్యమైన పని ఉన్నా మీటింగ్ ఉన్నా ఎంత వర్క్ ప్రెజర్ ఉన్నా సరే ఆ పూజ విధానం మాత్రం ఎప్పుడూ తప్పేది కాదు కానీ దేవుని ఎంత పూజించినప్పటికీ ప్రతాప్ జీవితంలో ఎప్పుడూ
(02:24) ప్రశాంతత అనేదే ఉండేది కాదు వ్యాపారంలో ఒక సమస్య తీరేలోపు బంధాల్లో ఇంకో సమస్య వచ్చిపడేది. అలాంటి సమయంలో ప్రతాప్ జీవితాన్ని మలుపు తిప్పే ఒక అద్భుతమైన అవకాశం తలుపు తట్టింది. దేశంలోనే ఒక ఫేమస్ హాస్పిటల్ నెట్వర్క్ ఓరియన్ హెల్త్ కేర్ వాళ్ళు ఒక బారి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ కోసం టెండర్ పిలిచారు. పేషెంట్ రికార్డ్స్ ఫార్మసీ బిల్డింగ్ అత్యవసర విభాగాలు ఇలా అన్ని ఒకే ప్లాట్ఫామ్ మీద పనిచేసే అత్యాధునిక సాఫ్ట్వేర్ కాంట్రాక్ట్ అది ఆ కాంట్రాక్ట్ విలువ కోట్ల రూపాయల్లో ఉంది.
(02:55) ప్రతాప్ తన ప్రతిభనంతా ఉపయోగించి ప్రెజెంటేషన్ ఇచ్చాడు అది నచ్చిన ఆ ఓరియన్ హెల్త్ కేర్ యాజమాన్యం మీరు ఈ ప్రొడక్ట్ తయారు చేసి డెమో చూపించండి అది మా స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా ఉంటే కాంట్రాక్ట్ మీకే ఇస్తాం అని చెప్పారు అంతే ప్రతాప్ తన జీవితాన్ని సర్వస్వాన్ని ఆ ప్రాజెక్ట్ మీద ఫణంగా పెట్టాడు మార్కెట్ ధర కంటే ఎక్కువ జీతాలు ఇచ్చి 30 మంది ఫైనెస్ట్ ఇంజనీర్స్ ని ఉద్యోగంలోకి తీసుకున్నాడు ఒక పెద్ద ఆఫీస్ ఫ్లోర్ ని లీజ్ కి తీసుకొని సర్వర్లు లైసెన్సులు అంటూ కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడు బ్యాంకులో ఉన్న డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్స్
(03:26) మొత్తం ఖర్చుఅయిపోయాయి అంతటితో ఆగక తన సొంత ఇంటిని తాకట్టు పెట్టేసాడు ఆఖరికి తన భార్య స్వప్న బంగారాన్ని కూడా తెచ్చి ఆ ప్రాజెక్టులో కుమ్మరించాడు. భార్య స్వప్న భయపడుతూ ఏమండీ మనకు ఉన్నదంతా పెట్టి ఇంత పెద్ద రిస్క్ చేయడం అవసరమా అని అడిగితే ప్రతాప్ నవ్వుతూ మన వెనక కృష్ణుడు ఉన్నాడు స్వప్న ఆయన అంతా చూసుకుంటాడు అని కొండంత ధైర్యంతో చెప్పేవాడు.
(03:51) 14 నెలలు రాత్రింభవళ్ళు తేడా లేకుండా శ్రమించాడు ప్రతాప్ ఇంటికి వెళ్ళిన రోజులు వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు ఆఫీస్ లోనే సోఫా మీద పడుకుంటూ ఆఫీస్ డ్రాయర్ లో ఉన్న కృష్ణుడి ఫోటోకి నమస్కరించుకుంటూ చాలా కష్టపడ్డాడు. 14 నెలలు శ్రమ ఫలించి ప్రొడక్ట్ కంప్లీట్ అయిపోయి రెడీ అయింది. డెమో ఇచ్చే రోజు రానే వచ్చింది.
(04:12) ఓరియన్ హెల్త్ కేర్ బోర్డ్ రూమ్లో ప్రతాప్ చేతులు వణకుతున్నాయి కానీ కృష్ణుడిని మనసులో తలుచుకుంటూ అద్భుతంగా ప్రెజెంటేషన్ ఇచ్చాడు. ఇక కాంట్రాక్ట్ తనదే అని నమ్మాడు కానీ మూడు రోజుల తర్వాత అతని ఈమెయిల్ కి ఒక మెసేజ్ వచ్చింది. అందులో మూడే మూడు లైన్లు ఉన్నాయి మీ ప్రొడక్ట్ మాకు నచ్చినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల మేము వేరొక వెండర్ తో ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నాం మీ ప్రయత్నానికి ధన్యవాదాలు ఆ ఒక్క ఈమెయిల్ ప్రతాప్ ప్రపంచాన్ని తలకిందులు చేసేసింది.
(04:41) 14 నెలల నిరంతర శ్రమ జీవితకాల సంపాదన భార్య బంగారం తాకట్టు పెట్టిన ఇల్లు అన్నీ ఆ మూడు లైన్లలో కరిగి బూడిద అయిపోయాయి. ఆ తర్వాత జరిగింది ఒక భయంకరమైన పతనం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక తన చేతులతో రిక్రూట్ చేసుకున్న ఆ 30 మంది ఇంజనీర్లకు కన్నెలతో రిలీవింగ్ లెటర్లు ఇచ్చి పంపించేశడు లీజు కు తీసుకున్న ఆఫీస్ ఖాళీ చేశడు వాడుతున్న కారు కూడా అమ్మేసాడు తాకట్లో ఉన్న ఇంటిని బ్యాంకు వాళ్ళు అటాచ్ చేయడంతో ఒక చిన్న అద్ద ఇంట్లోకి మారాల్సి వచ్చింది.
(05:13) అయితే ఈ ఆర్థిక నష్టం కంటే ప్రతాప్ ని మానసికంగా నలిపేసింది బంధాల మోసం ప్రతాప్ కి వరుణ్ అనే ప్రాణ స్నేహితుడు ఉన్నాడు ఇద్దరూ కలిసి కాలేజీ రోజుల నుంచి పెరిగారు కలిసి కంపెనీ ప్రతాప్ దే అయినా వరుణ్ని టెక్నికల్ గా హెడ్ పెట్టి ఇది మన కంపెనీ అని చెప్తూ గౌరవించేవాడు కానీ కంపెనీ మునిగిపోతున్న అక్లిష్ట సమయంలో వరుణ్ ఫోన్ ఎత్తడం మానేసాడు ఒక్కరోజు కాదు వారం కాదు శాశ్వతంగా మాయమైపోయాడు.
(05:38) అంతకుముందు ప్రతాప్ ఇచ్చిన పార్టీలో తిని ప్రతాప్ సహాయంతో పైకవచ్చి అన్నయ్యా నువ్వు లేకపోతే మేము లేము అన్న బంధువులు స్నేహితులు ఒక్కొక్కరుగా మొహం చాటేశారు పైగా అంత పెద్ద అత్యాసక పోకుండా ఉండాల్సింది అంత పెద్ద ప్రాజెక్టులు అవసరమా ఒక్కసారి ఒక్కదానిపై అంతా పెట్టేస్తే ఎలా ఇలాంటివి ఏమైనా జరిగితే ఏమవుతుందని ఊహించనక్కర్లేదా అని విమర్శలు కూడా చేశారు.
(06:00) ఫెర్ ఫెయిర్ వెదర్ ఫ్రెండ్స్ ఆర్ లైక్ షాడోస్ దే ఫాలో యు ఇన్ ద సన్ బట్ లీవ్ యు ఇన్ ద డార్క్ మంచి రోజుల్లో ఉండే స్నేహితులు నీడ లాంటివారు నీకు వెలుగు ఉన్నంతవరకే నీ వెంట ఉంటారు చీకటి పడగానే మాయమైపోతారు. ఆ ఒంటరితనం ఆ అవమానం ఆ ఆర్థిక పతనం ప్రతాప మనసుని ముక్కలు చేశయి ఒకరోజు రాత్రి పూజ గదిలో కూర్చొని కృష్ణుడి విగ్రహం వైపు చూస్తూ నేను ఏం తప్పు చేశాను కృష్ణ ఎవరికీ అన్యాయం చేయలేదు రూపాయి ఎగ్గొట్టలేదు నిన్నే నమ్ముకొని పూజించాను అలాంటి నాకు నువ్వు ఇచ్చిన బహుమతి ఇదేనా అని ఏడుస్తూ ఆక్రోశంగా నిలదీశడు కానీ ఆ విగ్రహం నుండి ఎలాంటి జవాబు రాలేదు కేవలం ప్రశాంతమైన
(06:35) నిశబ్దం మాత్రమే మిగిలింది. ఆ మౌనమే తనను వెక్కరిస్తున్నట్లు అనిపించి ఆ వర్షపు రాత్రి ఆ విగ్రహాన్ని తీసుకొని నీటిలో విసిరేసి తన భక్తికి నమ్మకానికి స్వస్తి చెప్పాడు. ఆ రాత్రి విగ్రహాన్ని నదిలో పడేసిన తర్వాత ప్రతాప్ లో ఒక భయంకరమైన రాక్షస కసి మేల్కొంది దేవుడు లేడు దయ లేదు కేవలం తన కష్టం మరియు స్వయం శక్తి మాత్రమే నిజం అనే పంతంతో పని చేయడం మొదలు పెట్టాడు.
(07:00) ఓరియన్ హెల్త్ కేర్ వాళ్ళు తన ప్రొడక్ట్ ను ఎందుకు రిజెక్ట్ చేశారో ఆ వివరాలు పొట్టు వదలకుండా సంపాదించాడు. ఆ సాఫ్ట్వేర్ లో ఎమర్జెన్సీ మాడ్యూల్ నెమ్మదిగా ఉండటం ఆఫ్లైన్ మోడ్లో పని చేయకపోవటం చిన్న హాస్పిటల్స్ కి ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది అవ్వటం అనే మూడు ప్రధానమైన లోపాలు ఉన్నాయని తెలుసుకున్నాడు రెండు గదుల చిన్న అద్ద ఇంట్లో కేవలం ఐదుగురు నమ్మకమైన ఇంజనీర్లను పెట్టుకొని రాత్రింబవళ్ళు శ్రమించాడు.
(07:25) ఈసారి ఏ ఒక్క క్లైంట్ కోసమో కాక మార్కెట్లో తనే ఒక స్వతంత్ర ప్రొడక్ట్ ని నిలబెట్టాలనే కసితో పని చేశాడు. 18 నెలలు తిండి నిద్ర మర్చిపోయి ప్రతి లోపాన్ని సరిదిద్దాడు. ఆఫ్లైన్ సిస్టం ని అందుబాటులోకి తెచ్చాడు చిన్న హాస్పిటల్స్ కూడా ఆ ప్రొడక్ట్ ని కొనుక్కునేలా కాస్ట్ ని తగ్గించాడు. ప్రొడక్ట్ లాంచ్ అయిన ఆరు నెలల్లో 40 హాస్పిటల్స్ తన ప్రొడక్ట్ ని కొనుగోలు చేశాయి.
(07:50) ఏడా తిరిగేసరికి ఆ సంఖ్య 300కు చేరింది రెండేళ్లల్లో ఆ ప్రొడక్ట దేశంలోనే అత్యంత విజయవంతమైన బ్రాండ్ గా రూపాంతరం చెందింది. ప్రతాప్ మళ్ళీ ముందుకంటే రెట్టింపు డబ్బు హోదాతో నిలబడ్డాడు. ఒక టీవీ ఇంటర్వ్యూలో ప్రతాప్ గర్వంగా చెప్తున్నాడు నేను దేవుణని నమ్మను కేవలం నా కష్టాన్ని మాత్రమే నమ్ముతాను ఎప్పటివరకు దేవుణని నమ్మానో అప్పటివరకు నా కష్టాలే వచ్చాయి ఎప్పుడైతే దేవుడు లేడని గ్రహించి నా మీద నేను నమ్మకం పెట్టుకున్నానో అప్పటి నుంచే నా జీవితంలో మంచి రోజులు మొదలయ్యాయి అని ప్రకటించేశాడు.
(08:19) అలా కాలం సాగిపోతుండగా ఒకరోజు రాత్రి ప్రతాప్ తన ఇంట్లో బిజినెస్ న్యూస్ చూస్తున్నాడు స్క్రీన్ మీద ఒక వార్త ప్రసారం అవుతుంది. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ పై ఇండస్ట్రియల్ ఎస్పిఓ నాష్ కేసు నమోదు ఆ కంపెనీ టెక్నికల్ హెడ్ అరెస్ట్ అని చెబుతూ ఒక ముఖాన్ని చూపించారు. ఆ ముఖం ఎవరిదో కాదు ప్రతాప్ ప్రాణ స్నేహితుడు వరుణ్దే న్యూస్ రిపోర్టర్ చెప్తున్న వివరాల ప్రకారం ఆ కంపెనీకి చెందిన ప్రధాన సాఫ్ట్వేర్ కోడ్ ని వరుణ్ వేరొక విదేశీ కంపెనీకి రహస్యంగా అమ్మటానికి ప్రయత్నిస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.
(08:49) దాంతో ఆ కంపెనీ వరుణ్ పై కేసు పెట్టి అరెస్ట్ చేయించింది. అయితే ఆ అరెస్ట్ తర్వాత సదర్ కంపెనీ చేసిన ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ లో ఇంకొక సంచలన నిజం బయటపడింది. గతంలో వరుణ్ తన సొంతంగా డిజైన్ చేసిన ప్రొడక్ట్ అని చెప్పి ఆ కంపెనీకి అమ్మిన సాఫ్ట్వేర్ కోడు అసలు వరుణ్ది కాదని ప్రతాప్ దగ్గర దొంగిలించిన కోడ్ అని తేలింది. ప్రతాప్ కంపెనీలో టెక్నికల్ హెడ్ గా ఉన్న వరుణే కావాలని ప్రతాప్ డెమో కోడ్లో లోపాలు క్రియేట్ చేసి ఆ ప్రొడక్ట్ ని దొంగతనంగా తెచ్చి తన సొంత ప్రొడక్ట్ గా ఆ కంపెనీకి అమ్ముకున్నాడనే నిజం ఆ ఇన్వెస్టిగేషన్ లో వెల్లడయింది.
(09:20) ఆ వివరాలు వింటున్న ప్రతాప్ కి వరుణ ఎంతటి భయంకరమైన ద్రోహో తన వెనక ఎంతటి కుట్ర చేశాడో ఎంత దారుణంగా తనని మోసం చేశాడో పూర్తిగా అర్థమయింది. తన పక్కనే తిరుగుతూ తనతో పాటే తింటూ తన జీవితాన్ని రోడ్డున పడేసింది తన ప్రాణ స్నేహితుడేనని తెలిసింది. ఆ నిజం తెలిసాక ప్రతాప్ కి దేవుడి మీదే కాకుండా మొత్తం మనుషుల మీద కూడా నమ్మకం పూర్తిగా పోయింది.
(09:42) మనుషులంతా స్వార్ధపరులు మోసగాళ్ళు దేవుడు అనేవాడు కూడా లేడు ఇదే నిజం అని ఫిక్స్ అయ్యాడు ప్రతాప్ కానీ ప్రతాప్ నమ్మిన ఆ నిజం వెనక దేవుడు దాచిన ఇంకో మహానిజం ఉందనే విషయాన్ని అతను గ్రహించలేకపోయాడు. కొన్ని నెలల తర్వాత వినాయక చౌతి పండగ వచ్చింది. ప్రతాప్ కంపెనీ లాభీలో ఉద్యోగులందరూ ఉత్సాహంగా ఒక పెద్ద వినాయకుడిని తీసుకొచ్చి అలంకరించి పూజ చేసి హారతి ఇచ్చి ప్రసాదం పంచుతున్నారు.
(10:09) అదే సమయానికి ఆఫీస్ లో అడుగు పెట్టిన ప్రతాప్ ఆ దృశ్యం చూడగానే కోపంతో రగిలిపోయాడు. పెద్ద గొంతుతో ఇది ఎవరు పెట్టారు ఇప్పుడే విగ్రహాన్ని ఇక్కడి నుంచి తీసేయండి ఇది పని చేసే ఆఫీస్ పూజలు చేసుకునే గుడి కాదు అని అరిసాడు ఉద్యోగులంతా భయంతో తలదించుకున్నారు అక్కడ ఉద్యోగం చేస్తున్న ఒక ముసలాయన శాంతంగా ముందడుగు వేశడు ఆయన పేరు రామయ్య ప్రతాప్ తండ్రి కాలం నుంచి వాళ్ళ దగ్గరే పని చేస్తున్నాడు ప్రతాప్ నష్టాల్లో మునిగిపోయిన రోజుల్లో కూడా జీతం తీసుకోకుండా ప్రతాప్ వెంటే నిలబడ్డాడు రామయ్య ప్రతాప్ కళ్ళలోకి చూస్తూ బాబు దేవుడు నీకు ఏం అన్యాయం చేశవని అంతగా
(10:41) ద్వేషిస్తున్నావ్ అని అడిగాడు ప్రతాప ఆవేశంగా ఏం చేశడా 14 నెలల నా కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశడు నా ఇల్లు నా భార్య బంగారం అన్ని పోయాయి నా అనుకున్న వాళ్ళు నా బంధువులు దూరమయ్యారు ఇవన్నీ చేసింది ఆ దేవుడు కాదా అని నిలదీశడు రామయ్య నెమ్మదిగా బాబు నీకు ఈ నష్టాలు రాబట్టే కదా నిజంగా నిజమైన మనుషులు ఎవరో తెలిసింది అది నీకు లాభమా నష్టమా ప్రతాప్ అలాగే ఆవేశంగా చూస్తున్నాడు సరే బాబు ఆ రోజు నీకు అంత పెద్ద నష్టం వచ్చింది ఆ తర్వాత ఏం జరిగింది అని అడిగాడు.
(11:12) ఏముంది నా ప్రాణ స్నేహితుడే నన్ను ముంచాడని నా పక్కనే ఉంటూ నన్ను వెన్నుపోటు పొడిచాడని తెలిసింది అన్నాడు ప్రతాప్ రామయ్య మళ్ళీ మృదువుగా చిరునవ్వు నవ్వి ఒకసారి ఆలోచించు బాబు నీ ప్రాణ స్నేహితుడు మోసం చేసి నీకు నష్టం వచ్చి మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టాక ఎవరిని నమ్మకుండా తక్కువ స్టాప్ పెట్టుకొని వర్క్ జాగ్రత్తగా చేసుకున్నావ్ సక్సెస్ఫుల్ అయ్యావు కదా అది నీకు లాభమా నష్టమా మళ్ళీ లైఫ్ లో ఎవరిని గుడ్డిగా నమ్మకుండా గొప్ప పాఠం నేర్చుకున్నావు కదా అది నీ ముందు జీవితానికి కి ఎంత లాభమో ఆలోచించు ప్రతాప్ నోట మాట రాలేదు రామయ్య మళ్ళీ మాట్లాడుతూ సరే నాకో విషయం చెప్పు
(11:46) ఆరోజు ఓరియన్ హెల్త్ కేర్ వాళ్ళు నీ ప్రొడక్ట్ ని ఒప్పుకొని ఉంటే అది సక్సెస్ అయి ఉంటే ఏమయ్యేది నీకు కొద్దిగా కాంట్రాక్ట్ డబ్బులు వచ్చేవి ఆ ప్రొడక్ట వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోయేది నువ్వు జీవితాంతం ఒక సాధారణ వెండర్ గానే మిగిలిపోయేవాడివి కానీ ఆ రోజు ఆ దెబ్బ తగలడం వల్ల కదా నువ్వు ఆ లోపాలను సరిదిద్ది ఈరోజు దేశంలోనే నెంబర్ వన్ బ్రాండ్ ని సృష్టించావు అంటే ఆ రోజు నీకు జరిగిన ఫెయిల్యూర్ నష్టమా నీ మేలు కోసం జరిగిందా నీ కీడు కోసం జరిగిందా అని సూటిగా ప్రశ్నించాడు.
(12:16) ప్రతాప్ గుండెల్లో ఏదో సోలం గుచ్చినట్టయింది తన సొంత లాజిక్ లోనే తాను చిక్కుకున్నాడు.సటైమస్వాట్ సటైమస్వాట్ లుక్స్ లైక్ ఏ లాస్ ఇస్ జస్ట్ లైఫ్ క్లియరింగ్ ద tableేబుల్ ఫర్ సంథింగ్ బిగ్గర్ కొన్నిసార్లు మన జీవితంలో జరిగే నష్టం మనల్ని ఓడించడానికి కాదు మనకి ఇక అవసరం లేని వాటిని తొలగించి మనకు తెలియని ఒక గొప్ప రేపటికి చోటు కల్పించడానికి ఒక్కసారి ఆగి ఆలోచించు ప్రతాప్ జరిగిన నష్టం వల్ల నిజంగా నువ్వు ఏదైనా కోల్పోయావా లేక నీ జీవితంలోకి రాబోయే ఒక గొప్ప వాటికి నువ్వు బయటకి విసిరేసిన దేవుడు నిశబ్దంగా తలుపు తెరిచాడా ప్రతాప్ష షాక్ లో ఉన్నాడు రామయ్య ప్రతాప్
(12:52) భుజం మీద చెయ్యి వేసి ఇంకొక్క మాట బాబు నీ కష్టాల గురించి నువ్వు నిందిస్తున్నది ఎవరినో తెలుసా ఆ కృష్ణ పరమాత్ముని కదా అసలు ఆ కృష్ణుడి జీవితం ఎప్పుడైనా చూశవా ఆయన పుట్టిందే జైల్లో కారాగారంలో పుట్టిన క్షణం నుండే ప్రాణగండం కంటి మీద కునుకు లేకుండా అర్ధరాత్రి పూట వర్షంలో ఉప్పొంగే యమునను దాటి గోకులానికి వెళ్ళాడు పెరిగే వయసులో ఏ క్షణంలో ఏ రాక్షసుడు వచ్చి మీద పడతాడో తెలియని పరిస్థితి ఇవన్నీ దాటుకొని మధుర వెళ్ళేటప్పుడు తనని ప్రాణంగా ప్రేమించిన పెంచిన తల్లిదండ్రులని గోపికల్ని ఆడుకునే స్నేహితుల్ని శాశ్వతంగా వదిలివేసి వెళ్ళిపోయాడు అది ఎంత కష్టమో
(13:28) ఆలోచించు జీవితాంతం నిందలే శమంతకమణి దొంగతనం నుండి కురుక్షేత్ర యుద్ధం వరకు ప్రతి దశలోనూ లోకం ఆయనను వేలెత్తి చూపుతూనే ఉంది. గాంధారి శాపానికి గురై ఆఖరికి తన కళ్ళ ముందే తన వంశం అంతా నశించిపోతుంటే ఏమీ చేయలేని స్థితి చివరికి ఒక అడవిలో ఒంటరిగా కూర్చున్నప్పుడు ఒక బోయవాని బాణం తగిలి అవతారాన్ని ముగించాడు 18 రోజుల పాటు ఆయన శరీరం కూడా ఎవ్వరికీ కనిపించలేదు ఎప్పుడు చిరునవ్వుతో ఉండే కృష్ణుడి జీవితంలో ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలో ఒకసారి ఆలోచించు ఆ మాటక వస్తే కష్టాల్ని కడతీర్చమని మనం ప్రార్థించే రాముడి జీవితం అంతా కూడా కష్టాల మయమే కదా
(14:07) దేవుడికే ఇన్ని కష్టాలు తప్పనప్పుడు మనుషులమైన మనకి కష్టాలు రాకుండా ఎలా ఉంటాయి భగవంతుడు అయ్యై ఉండి కూడా కష్టాలు లేని జీవితాన్ని ఆయన ఎందుకు సృష్టించుకోలేదు దేవుడికి కష్టాలు లేకుండా బ్రతకడం చాలా తకా కాదు కదా మనుషుల మధ్య పుట్టి కష్టాలు వస్తే ఎలా ఎదుర్కొని నిలబడాలో మనకి నేర్పడానికి ఆయన అన్ని కష్టాలు అనుభవించాడు కానీ మనం దేవుని మన కోరికలు తీర్చే రూపంగా చూస్తాం తప్ప దేవుడి జీవితాన్ని ఒక్కసారి కూడా పరీక్షించం కదా అని చెప్పాడు.
(14:34) రామయ్య మాటలు వింటుంటే ప్రతాప్ కళ్ళలో నుంచి నీళ్లు సుడి తిరిగాయి ఇన్నాళ్ళు తనని కప్పేసిన అజ్ఞానపు పొరలు ఒక్కొక్కటిగా ఊడిపోయాయి. నేను ఎంతటి పాపం చేశాను నన్ను కాపాడటానికి నన్ను గొప్పవాడిని చేయటానికి దేవుడు వేసిన సెట్టింగ్ ని అర్థం చేసుకోలేక ఓర్పు కోల్పోయి నా అహంకారంతో నా కృష్ణుడిే నదిలో పారేసానా విసిరేసానా అనుకుంటూ ప్రతాప్ ఆఫీస్ నుండి బయటకి పరిగెత్తాడు బయట మళ్ళీ అదే హోరు వర్షం అదే చీకటి ఇప్పుడు ఉంటుంది అసలు విషయం ప్రతాప్ పిచ్చివాళ్ళలా కారికి బయలుదేరాడు నా కృష్ణుడిని నేనే పారేసుకున్నాను నా కృష్ణుడు నాకు కావాలి అనే తప్పన తప్ప అతని
(15:12) మనసులో ఇంక ఇంకేమీ లేదు కానీ సరిగ్గా ఆ మట్టి రోడ్లో వెళ్తుండగా వర్షపు బురదలో కారు చక్రం ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా కారు కదలలేదు. ప్రతాప్ వెంటనే తన ఫోన్ ద్వారా ఒక క్యాబ్ బుక్ చేశడు 10 నిమిషాల్లో క్యాబ్ వచ్చింది. వర్షంలో తడుస్తూ ప్రతాప్ వెళ్లి ఆ క్యాబ్ ముందు సీట్లో కూర్చున్నాడు. అతని కళ్ళ నుంచి కన్నీళ్లు ఆగకుండా కారుతున్నాయి ఆ డ్రైవర్ కార్ని పోనిస్తూ ప్రతాప్ ను చూసి ఆందోళనగా సార్ ఏమైంది సార్ ఎందుకు అలా ఏడుస్తున్నారు మీకుేమైనా సమస్య ఉందా అని అడిగాడు.
(15:42) ఆ క్షణంలో ప్రతాప్ తన బాధని దాచుకోలేకపోయాడు ఆ క్యాబ్ డ్రైవర్ ని ఒక అపరిచితుడిగా చూడకుండా తన మనసుల్లోని వేదనంతా వెళ్ళగడు 14 నెలల ప్రాజెక్టు తన ఫ్రెండ్ వరుణ్ తనకు చేసిన ద్రోహం కోపంతో తాను ఆ వంతుని మీద నుండి వెండి కృష్ణుడి విగ్రహాన్ని నదిలో విసిరేసిన భయంకరమైన రాత్రి అంతా ఏడుస్తూ చెప్పాడు నేను పెద్ద పాపం చేశాను దేవుడు లేడనుకని నా కృష్ణుడిని నా చేతులతోనే నీళ్లలో విసిరేసాను ఇప్పుడు నాకు నా కృష్ణుడు కావాలి ఆయన ఎలా దొరుకుతాడు ఎక్కడ దొరుకుతాడు అని చిన్న పిల్లా ఏడుస్తున్నాడు ఇప్పుడు చూడండి ఆ మాటలు వినగానే క్యాబ్ డ్రైవర్ ముఖంలో రంగు మారింది అతడు సడన్ బ్రేక్ వేసి కార్ని
(16:16) పక్కన ఆపాడు. ప్రతాప ఆశ్చర్యంతో ఎందుకు ఆపావు నన్ను త్వరగా తీసుకెళ్ళు అన్నాడు కానీ ఆ డ్రైవర్ స్టీరింగ్ వీల్ని గట్టిగా పట్టుకొని వణకుతున్న గొంతుతో సార్ మీరు ఆ విగ్రహాన్ని విసిరేసింది ఊరి చివరిన ఉన్న ఆ పాత వంతెన మీద నుంచేనా అని అడిగాడు ప్రతాప్ అవునని తలపాడు డ్రైవర్ ఒక క్షణం కళ్ళు మూసుకొని ఆ తర్వాత తన కారు డాష్ బోర్డు మీద ఉన్న ఒక చిన్న ఫోటో ఫ్రేమ్ని తీసి ప్రతాప్ చేతిలో పెట్టాడు.
(16:41) సార్ మీరు ఆరోజు నీళ్ళలో పడేసిన విగ్రహం ఇదేనా చూడండి అన్నాడు. ప్రతాప్ ఆ ఫోటో వైపు చూశడు అతని గుండె ఒక్క క్షణం ఆగిపోయినంత పనింది చేతులు విపరీతంగా వణకుతున్నాయి అదే ఒంపు అదే చిరునవ్వు అదే ఆకృతి తాత ముత్తాతల కాలం నుండి తన ఇంట్లో ఉన్న అదే వెండి కృష్ణుడి విగ్రహం ప్రతాప్ బలవంతంగా తన గొంతును పెగిల్చుకొని ఇది ఇది నీకు ఎక్కడిది నా విగ్రహమే ఇది నాదే నీ దగ్గరికి ఎలా వచ్చింది నా కృష్ణుడు ఎక్కడఉన్నాడు అని అడిగాడు అప్పుడు ఆ క్యాబ్ డ్రైవర్ కళ్ళల్లో నీళ్లుు నింపుకొని తన కథ చెప్పడం మొదలు పెట్టాడు సార్ నాకు ఇప్పుడు అర్థంఅవుతుంది నా పేరు ఈశ్వర్ సార్ మీరు ఆరోజు వంతున మీద నిలబడి
(17:17) కోపంతో ఆ విగ్రహాన్ని నదిలో విసిరేయడానికి సరిగ్గా కొన్ని నిమిషాల ముందు అదే నదిలో నేను ఆత్మహత్య చేసుకోవడానికి దూకాను సార్ ప్రతాప్ నిచేష్టుడై అదే షాక్ అయి చూస్తూ ఉండిపోయాడు ఈశ్వర్ కన్నీళ్ళతో మళ్ళీ ఇలా చెప్పడం మొదలు పెట్టాడు. సార్ నేను అప్పులు చేసి ఒక చిన్న కిరాణ కొట్టు పెట్టాను సార్ తీవ్రమైన నష్టాలు వచ్చాయి వడ్డీ వ్యాపారులు ఇంటి ముందు నిలబడి నా భార్య పిల్లలను ముందే నన్ను దారుణంగా అవమానించారు నా భార్య ఇద్దరు చిన్న పిల్లలకు తిండి కూడా పెట్టలేని పరిస్థితి నాది చచ్చిపోవడం తప్ప ఇంకో దారి కనిపించలేదు నదిలో దూకి చనిపోవాలనుకున్నాను కానీ నాకు బాగా ఈత
(17:51) వచ్చు సార్ నీళ్ళల్లో పడ్డాక ఊపిరాడక బతుకు మీద ఆశ పుడితే ఎక్కడ ఈత కొట్టి మళ్ళీ ఒడ్డుకు వచ్చేస్తాను అని భయపడి నా నడువుకి ఒక పెద్ద రాయిని తాడుతో గట్టిగా కట్టుకొని నదిలోకి దూకేసాను సార్ నీళ్లలో మునిగిపోయాను సార్ ఊపిరి ఆగిపోతుంది కళ్ళు తేలేస్తున్నాను చీకటి ఆవహిస్తుంది నా చావు కాయం అనుకున్న ఆఖరి క్షణంలో పైనుంచి ఏదో బరువైన పదార్థం వేగంగా వచ్చి నీళ్లలో ఉన్న నా చేతుల్లో పడింది ఏంటో తెలియక దాన్ని అలాగే గట్టిగా పట్టుకున్నాను అంతే సార్ ఆ క్షణంలో నా శరీరంలో ఏదో తెలియని దివ్యమైన శక్తి ప్రవేశించినట్టు అయింది నడుముకు బిగించి కట్టిన ఆ తాడును నేను ఊరికే అలా
(18:28) లాగగానే ఆ రాయి తాడు ఊడిపోయి కిందకు పడిపోయింది నేను ఈత కొడుతూ పైకి వచ్చాను ఒడ్డుకు చేరాను నా చేతిలో ఉన్న వస్తువును చూసుకుంటే అది ఒక వెండి కృష్ణుని విగ్రహం అప్పుడు నాకు బోధపడింది సార్ చావు బతుకులు మన చేతుల్లో లేవని నన్ను బతికించడానికే నా కుటుంబాన్ని నిలబెట్టడానికే దేవుడు ఆ రూపంలో వచ్చి నా చేతుల్లో పడ్డాడని భావించాను ఆ విగ్రహాన్ని షాప్లో అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో అప్పులన్నీ తీర్చేసి ఇదిగో లోన్లో ఈ క్యాబ్ కొనుక్కున్నాను సార్ ఇప్పుడు నా భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నాను నా కూతురు బడికి వెళ్తుంది.
(18:59) నా ప్రాణాన్ని నా కుటుంబాన్ని కాపాడిన ఆ విగ్రహాన్ని నేను నా దగ్గర ఉంచుకోలేకపోయాను సార్ అందుకే ఆ విగ్రహాన్ని అమ్మేసే ముందు ఈ ఫోటో తీసి డాష్ బోర్డు మీద పెట్టుకున్నాను ప్రతిరోజు ఈ ఫోటోకి దండం పెట్టుకున్నాకే నేను నా క్యాబ్ స్టార్ట్ చేస్తాను ఆ మాటలు వింటుంటే దుఃఖంలో ఉన్న ప్రతాప్ కి శరీరం పులకరించింది.
(19:21) ఈశ్వర్ మళ్ళీ ప్రతాప్ చేతులు పట్టుకొని ఎమోషనల్ గా చెప్తున్నాడు సార్ దేవుడు ఉన్నాడు సార్ మీకు ఆరోజు ఆ నష్టం రాకపోయి ఉంటే మీకు దేవుడి మీద కోపం వచ్చేది కాదు కోపం రాకపోయి ఉంటే మీరు ఆ విగ్రహాన్ని నదిలో విసిరేసేవారు కాదు మీరు ఆ విగ్రహాన్ని విసిరేయకపోతే ఆ రోజు నీళ్లలో మునిగిపోయిన నేను చచ్చిపోయి ఉండేవాడిని సార్ నా కుటుంబం రోడ్డున పడేది మీ కోపాన్ని కూడా దేవుడు ఇంకొకరి ప్రాణాలు కాపాడే వరంగా మార్చేసాడు సార్ కష్టం వస్తే దేవుని తిట్టుకోకూడదు సార్ దేవుడు మనకు ఏదో మేలు చేయడానికే ఈ కష్టం ఇచ్చాడని నమ్మి దాన్ని దాటే ధైర్యం ైర్ ఇమ్మని కోరుకుంటే ఆయన మనల్ని నడిపిస్తాడు ఆ మాటలు
(19:53) వినగానే ప్రతాప్ కి దేవుడి ప్రణాళిక అంటే ప్లాన్ ఎంత గొప్పదో అర్థమైంది ఒక క్యాబ్ డ్రైవర్ ని చావు నోటి నుంచి కాపాడి కష్టాల నుంచి గట్టెక్కించిన ఆ దేవుడే తనకు కూడా కష్టాలు ఇచ్చి వాటిని జయించే ధైర్యాన్ని ఇచ్చి ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టాడని అర్థమయింది జీవితంలో కష్టం వస్తే దేవుని నిందించడం కాదు దీని వెనక ఏ మంచి దాగి ఉందో అని ఆ భగవంతుడికి నమస్కరించుకోవాలనే మహోన్నతమైన సత్యం ప్రతాప్ కి అర్థమయింది.
(20:21) ప్రతాప్ వెంటనే తనకు ఆ విగ్రహం కావాలని ఈశ్వర్ని ఆ విగ్రహం అమ్మిన జూలరీ షాప్ కి తీసుకెళ్ళమని బతిమలాడాడు. ఇద్దరూ కలిసి ఆ షాప్ కి వెళ్ళారు ఆ యజమాని ఆ విగ్రహాన్ని గుర్తుపట్టాడు సార్ కానీ ఇలాంటి దొరికినవి అని తీసుకొచ్చిన పాత విగ్రహాల్ని మేము ఉంచుకోము వాటిని వెంటనే కరిగించేసి కొత్త నగలు లేదా కొత్త విగ్రహాలు చేస్తాం ఆ కృష్ణుడి విగ్రహంతో ఆ వెండితో ఒక కొత్త బాలకృష్ణుడి విగ్రహం చేశం సార్ ఆ విగ్రహాన్ని నిన్ననే అమ్మేసాం అని చెప్పాడు ఎవరికి అమ్మారు అని అడిగితే ఏదో పెద్ద కంపెనీ వాళ్ళు గిఫ్ట్ కోసం కొనక్కెళ్ళారు వాళ్ళ వివరాలు మా దగ్గర
(20:53) లేవు అని చెప్పాడు ప్రతాప్ గుండె పగిలిపోయింది నా కోపాన్ని కూడా ఒక అమాయకుడు ప్రాణం కాపాడే వరంగా మార్చిన నా కృష్ణుడు అసలు నువ్వే లేవు అని ఈసడించుకొని విసిరేసిన నాలాంటి పాపిని ఎలా క్షమిస్తాడు ఆయన ప్రేమకు అర్హత లేని నా దగ్గరకు మళ్ళీ ఎందుకు తిరిగి వస్తాడు అని తీవ్రమైన పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఇంటికి చేరాడు.
(21:14) అర్ధరాత్రి పూట ఇంట్లోని పూజా గదిలో కృష్ణుడి విగ్రహం ఉండే ఆ ఖాళీ ప్రదేశం దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని కృష్ణ నన్ను క్షమించు నా అహంకారం నా కళ్ళు కప్పేసింది నువ్వు ఎప్పుడూ నా పక్కనే ఉన్నావు నేనే నిన్ను చూడలేకపోయాను అని ఏడ్చాడు సరిగ్గా అప్పుడే అతని భార్య స్వప్న అక్కడికి వచ్చింది. ఏవండీ సాయంత్రం మీ కొత్త క్లైంట్ ఆఫీస్ నుంచి కొందరు వచ్చారు మీరు ఫోన్ ఎత్తకపోవడంతో ఈ బాక్స్ ఇచ్చి మీ కంపెనీ వల్లే మా సంస్థ నిలబడింది మీలాంటి విజనరీతో పని చేయడం మాకు గర్వకారణం అలాగే మా ఎండి గారు ప్రత్యేకంగా ఈ బాక్స్ ని మీకు స్వయంగా అందించమన్నారు అని చెప్పి వెళ్ళారు అంటూ ఒక పెద్ద గిఫ్ట్
(21:48) బాక్స్ ని ప్రతాప్ చేతిలో పెట్టింది భార్య స్వప్న ప్రతాప్ ఉణకుతున్న చేతులతో ఆ బాక్స్ ఓపెన్ చేశాడు లోపల మెరిసిపోతూ వెండితో చేసిన ఒక అత్యంత సుందరమైన బాల కృష్ణుడి విగ్రహం అది అది తన కృష్ణుడి వెండితోనే చేసిందా అదే విగ్రహం మళ్ళీ తనకి ఈ రూపంలో తిరిగి వచ్చిందా ప్రతాపికి ప్రస్తుతానికి తెలియదు కానీ ప్రతాప ఆ విగ్రహాన్ని రెండు చేతులతో ఎత్తుకొని తన గుండెలకు హత్తుకొని ఆ పాదాల మీద తల పెట్టి వచ్చేసావా కృష్ణ నన్ను వదిలిపోకుండా మళ్ళీ దగ్గరికి వచ్చేసావా అని చిన్న పిల్లా ఏడుస్తూ ప్రార్థించాడు.
(22:22) ఫత్ ఫెత్ ఇస్ నాట్ ద అబ్సెన్స్ ఆఫ్ స్టామ్స్ ఇట్ ఇస్ ద బిలీఫ్ దట్ యు areర్నవర్ అలోన్ ఇన్ దెమ విశ్వాసం అంటే జీవితంలో తుఫాన్లు రాకపోవటం కాదు ఆ తుఫాన్లో కూడా తాను ఒంటరిని కానని భగవంతుడు తనతోనే ఉన్నాడని నమ్మటం కథ ఇక్కడితో ముగిసింది కానీ ఇది కేవలం ప్రతాప్ కథ మాత్రమే కాదు మనలో చాలామంది జీవితాల ప్రతిబింబం ఇప్పుడు మనం రెండు మాటలు మాట్లాడుకుందాం మనలో చాలామందికి దేవుడితో ఒక వ్యాపార ఒప్పందం ఉంటుంది బిజినెస్ డీల్ దేవుడా నేను ఈ రోజు నీకు రెండు రెండు కొబ్బరికాయలు కొడతాను పూజలు చేస్తాను కాబట్టి నా జీవితంలో ఎలాంటి కష్టాలు రాకూడదు అన్ని లాభాలే రావాలి
(22:57) లాభాల్లో నీకు కూడా వాటా ఇస్తాను అని దేవుడితో బేరాలాడతాం. ఆ ఒప్పందం ప్రకారం మన జీవితంలో ఏదైనా చిన్న కష్టం రాగానే వెంటనే దేవుడి మీద తిరుగుబాటు చేస్తాం. అంత పూజ చేసినా నాకే ఎందుకు కష్టాలు ఇచ్చావ్ అసలు దేవుడు లేడు అని నిందిస్తాం కానీ ఒక క్షణం ప్రశాంతంగా ఆలోచిద్దాం మనకి ఏది లాభం ఏది నష్టం అని నిర్ణయించే శక్తి మనకు ఉందా ప్రతాప్ కి ఆ రోజు ఆ పెద్ద ప్రాజెక్ట్ పోవడం తన జీవితంలో అతి పెద్ద నష్టంలా అనిపించింది కానీ ఆ రోజు ఆ నష్టం రాకపోయిఉంటే తన పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచే వరుణ్ లాంటి వాళ్ళ నుంచి బయట పడేవాడు కాదు. తన సొంత బ్రాండ్ పుట్టేది
(23:30) కాదు మనం నష్టం అనుకునేది చాలాసార్లు జీవితం మనకోసం అంతకన్నా పెద్ద విజయాన్ని ఇవ్వటానికి మన దారిలోని చెత్తను శుభ్రం చేయడం మాత్రమే రెండో విషయం బంధాలు దూరమైతే బాధపడాలా కష్టం రాగానే మనల్ని వదిలేసి వెళ్ళేవాళ్ళు నిజమైన మన వాళ్ళు కాదు ప్రతాపు నా వాళ్ళను దేవుడు దూరం చేశడు అని ఏడ్చాడు కానీ దేవుడు చేసింది వాళ్ళని దూరం చేయడం కాదు వాళ్ళ ముసుకులు తొలగించి వాళ్ళ అసల స్వరూపాన్ని చూపించడం కష్టం వచ్చినప్పుడు ఎవరు మనతో ఉంటారో ఎవరు జారుకుంటారో తెలుస్తుంది అలాంటి స్వా స్వార్ధపరులు మన జీవితం నుంచి దూరమైతే సంతోషించాలి గానీ దేవుని నిందించకూడదు.
(24:03) మూడో విషయం సూటిగా ఒప్పుకోవాల్సిన పచ్చి నిజం జీవితంలో కష్టాలు సుఖాలు సహజం నేను సేఫ్ గా సెక్యూర్ గా హాయిగా సెటిల్డ్ గా కూర్చుంటాను అంటే కుదరదు కష్టాల నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదు కష్టం అనేది నష్టం కాదు దాని నుంచి పారిపోవడం కుదరదు. దాన్ని మనం యక్సెప్ట్ చేయాలి ఆ బాధను అనుభవించాలి ఆ వేదనతో కూర్చోవాలి సమస్యను సాల్వ్ చేసుకోవడానికి పోరాడాలి.
(24:28) ఎప్పుడైతే సమస్యను చూసి పారిపోకుండా ఎదురు నిలిచి పోరాడతామో అప్పుడే మనం రాటు తేల్తాం అలా రాటు తేలినప్పుడే జీవితంలో ఇంకెన్ని కొండల్లాంటి కష్టాలు వచ్చినా చిరునవ్వుతో వాటిని ఎదుర్కునే శక్తి మనకు వస్తుంది. కేవలం సుఖాలు మాత్రమే ఉండి అసలు కష్టమే లేకపోతే ఆ జీవితం కుళ్లిపోతుంది ఏ రసమ లేకుండా నీరసం అయిపోతుంది. కష్టం నిన్ను పడగొట్టడానికి రాదు నిన్ను సాన పెట్టడానికి నిన్ను ఒక సరైన దారిలో పెట్టడానికే వస్తుంది.
(24:52) అందుకే కష్టం లేని జీవితాన్ని ఎప్పుడూ కోరుకోవద్దు అలాంటి బతుకును ఊహించుకోవద్దు కూడా ఎందుకంటే మనం చేసుకునే కర్మలను బట్టి కష్టాలు సుఖాలు వస్తాయి అంటుంటారు పెద్దలు వాటి నుంచి తప్పించుకోవడం ఎవ్వరి వల్ల కాదు కాబట్టి దేవుని మొక్కుకునేటప్పుడు అన్ని వరాలే కోరుకోవద్దు ఎందుకంటే కష్టాలు రావడం ఎలాగో తప్పదు కాబట్టి దేవుడా వచ్చిన కష్టాల నుంచి సరైన దారిలో బయటపడే ధైర్యాన్ని శక్తిని నాకుఇవ్వు అని కోరుకుందాం ఈరోజు ఈ క్షణంలో ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు కష్టం వచ్చిందని తట్టు పట్టుకోలేక పారిపోవాలని చూస్తూనో లేదా తన మనసులోని కృష్ణుడిని నదిలో విసిరివేయడానికి సిద్ధంగాను ఉండి
(25:26) ఉండవచ్చు మన ఫ్రెండ్స్ లో కూడా అలాంటి వాళ్ళు ఉండొచ్చు కాబట్టి ఈ వీడియో అందరికీ పంపండి ఈ కథ మళ్ళీ అలాంటి వాళ్ళకి నిలబడే కొత్త ధైర్యాన్ని ఇవ్వచ్చు ఉంటారు మర్చిపోకండి కష్టాలు సుఖాలు అనేవి ఒకే జడలో ఉండే రెండు పాయలు నమ్మకం ధైర్యం ఓర్పు అనే మూడో పాయతో అల్లండి అందమైన జీవితం అనే జడ తయారవుతుంది ఉంటాను జై హింద్ జై శ్రీరామ్

No comments:

Post a Comment