Saturday, September 12, 2026

​The Biggest Enemy Inside You | The Hidden Trap of Hatred

​The Biggest Enemy Inside You | The Hidden Trap of Hatred

Author Name:Telugu Books

Youtube Channel Url:https://www.youtube.com/@telugubooks1031

Youtube Video URL:https://www.youtube.com/watch?v=MpL5_BPxFDs





Title: ​The Biggest Enemy Inside You | The Hidden Trap of Hatred

Author Name: Telugu Books

Description: Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

Transcript:
(00:00) అతి పెద్ద శత్రువు లోకంలో సకల అనర్థాలకు మూలకారణం ద్వేషమే ఈర్ష్య అసూయ ఆధిపత్య భావనల్లోంచి పుట్టుకొస్తుంది ద్వేషం ఇతరులను ద్వేషించడం అంటే ఎలుకను తరిమివేయడానికి సొంత ఇంటికి నిప్పు పెట్టుకోవడం ద్వేషం ఉన్నవాడికి మానసిక సమతుల్యత దెబ్బతిని ప్రశాంతత లోభిస్తుంది. చుట్టూ శత్రువులను పెంచి నిరంతర అభద్రత భావానికి గురి చేస్తుంది.
(00:32) విద్వేషం మనిషిని కిందకు నొక్కుతుంది. విద్వేషాన్ని పెంచి నిరంతర అభద్రత భావం కలగడానికి అది దోహదం చేస్తుంది. విచక్షణ శక్తిని కోల్పోయి మంచి చెడుల మధ్య తారతమ్యాన్ని మనిషి తెలుసుకోలేకపోతాడు. కైకేయి ద్వేషం పట్టాభిషేకం చేసుకోవాల్సిన శ్రీరాముని 14 ఏళ్ళు వనవాసానికి పంపింది. శకుని మనసులో రగిలిన ద్వేషం కురువంశం మొత్తాన్ని నాశనం చేసింది.
(01:00) పరస్పరం తీవ్రంగా ద్వేషించుకునే ఇద్దరు వ్యక్తులు ఒకేసారి తపస్సుకు కూర్చున్నారు. మొదటి వ్యక్తికి దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. రెండోవాడు ఏం కోరితే దానికి రెట్టింపమని అడిగాడు అతను రెండో వ్యక్తి తనకు ప్రత్యక్షమై దేవుడి ద్వారా మొదటి వాడి కోరిక తెలుసుకొని తనకి ఒక కన్ను పోయేలా చేయమని కోరుకున్నాడట దానివల్ల శత్రువుకు రెండు కళ్ళు పోతాయి అన్నది ద్వేషంలో నుంచి పుట్టిన అతడి దురాలోచన.
(01:27) ద్వేషం వల్ల తమ తపోశక్తిని వృధా చేసుకుని ఇరువురు నష్టపోయారు. కాబట్టి ఎప్పుడూ కూడా మావిద్వాషవై అంటే మనిద్దరి మధ్య ఎలాంటి ద్వేషం లేకుండా ఉండుగాక అని చాటుతుంది శాంతి మంత్రం ద్వేషం మనిషికి శత్రువని దాన్ని జయించాలంటూ అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణమేవచా అని భగవద్గీత చెబుతుంది సహృదయం సామనస్యం అవిద్వేషం కృణామవః మానవులారా మీ హృదయులు ఏకమై మనసులు కలిసి ఎటువంటి ద్వేషభావం లేకుండా ఆవు తన దూడను ప్రేమించినట్టు ఒకరినొకరు ప్రేమించుకోండి అని బోధిస్తుంది అధర్బణ వేదం సమానీవ ఆకుతిహి సమానా హృదయానివః
(02:17) మీ సంకల్పాలు ఒకటిగా ఉండి హృదయాలు సమానంగా ఉండి ఐక్యత సామరస్యతలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తుంది ఋగ్వేదం పగలుడుగా నాసలుడుగను వగడుండు కోర్కెలుడుగు వడి జన్మంబుల్ అంటూ వేమన చెప్పింది అదే మనిషిలో పగలు ద్వేషాలు నశిస్తే దురాశలు నశిస్తాయి విచారం పోతే కోరికలు అదుపులోకి వస్తాయి భోగాల పట్ల ఆసక్తి తగ్గితే సంసార బంధాలు తెగిపోతాయి ఎప్పుడైతే త్రిగుణాలు నశిస్తాయో అప్పుడే మనిషికి మోక్షం లభిస్తుంది అంటారు వేమన ద్వేషం నిండిన దేహం నిండా ప్రతికూల స్వభావం ఏర్పడుతుంది ప్రతిఫలంగా
(03:02) పగ ప్రతీకారాలతో రగిలి హింసా మార్గాన్ని ఆశ్రయిస్తాడు మనిషి విచక్షణ రహితంగా సకలాన్ని ధ్వంసం చేసుకుంటూ పోతాడు ప్రేమ క్షమ సహనం వీటి ద్వారానే ద్వేషాన్ని జయించగలుగుతాం అవిద్వేషం నహకృతుణం ప్రజాభ్యః ఓ పరమాత్ముడా మా ప్రజలలో ఎలాంటి ద్వేషం లేని వాతావరణాన్ని కల్పించమంటూ వేడుకుంటుంది వేదనాదం సర్వశత్రు వినాశనం అంటే అంటే శత్రువులందరినీ చంపివేయడం కాదు వారి హృదయాలను ప్రేమతో గెలుచుకొని మిత్రులుగా మార్చుకోగలగడం ద్వేషాన్ని జయిస్తే మనిషి తన అతి పెద్ద శత్రువును జయించినట్లే

No comments:

Post a Comment