Saturday, September 19, 2026

ఈ ఒక్క లక్షణం ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఓడించలేరు! | What is Sthitaprajna in Telugu

ఈ ఒక్క లక్షణం ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఓడించలేరు! | What is Sthitaprajna in Telugu

Author Name:viswam-vishnuhu

Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=BkbVqLnofD0





Title: ఈ ఒక్క లక్షణం ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఓడించలేరు! | What is Sthitaprajna in Telugu

Author Name: viswam-vishnuhu

Description: నమస్కారం మిత్రులారా! జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, సంతోషం వచ్చినప్పుడు గాల్లో తేలిపోకుండా... అన్ని పరిస్థితులలోనూ మనసును ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించిన "స్థితప్రజ్ఞుడు" అంటే ఎవరు? ఆయన లక్షణాలు ఎలా ఉంటాయి? గౌతమ బుద్ధుడి జీవితంలోని ఒక అద్భుతమైన కథ ద్వారా స్థితప్రజ్ఞతను మన నిత్య జీవితంలో ఎలా అలవర్చుకోవాలో ఈ 25 నిమిషాల వీడియోలో ప్రాక్టికల్ స్టెప్స్‌తో వివరించడం జరిగింది. తప్పకుండా చివరి వరకు చూడండి!
#Sthitaprajna #BhagavadGitaTelugu #TeluguMotivation #GautamBuddhaStories #MentalToughness #MindControlTelugu #PersonalityDevelopment #TeluguVideos

Transcript:
(00:00) జీవితంలో అనుకోకుండా ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే మనం కుప్ప కూలిపోతాం. అదే సంతోషం వస్తే ఎగిరి గంతులేస్తాం. కానీ సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా లాభం వచ్చినా నష్టం వచ్చినా కొండలా నిలబడే మనుషులు ఉంటారని మీకు తెలుసా? కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు డిప్రెషన్ లో ఉన్నప్పుడు కృష్ణుడు ఒక మానసిక స్థితి గురించి చెప్పాడు.
(00:26) అదే స్థిత ప్రజ్ఞత గురించి ఈరోజు మనం వీడియోలో స్థిత ప్రజ్ఞత అంటే ఏంటి స్థిత ప్రజ్ఞుడి లక్షణాలు ఎలా ఉంటాయి ఈ 2026 లో మన స్థిత ప్రజ్ఞతని సాధించడం పాసిబుల్ేనా అసలు ఎలాంటి ప్రాబ్లం నైనా హ్యాండిల్ చేసే కెపాసిటీ ధైర్యం మనకు ఎక్కడి నుంచి వస్తుంది ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చూడండి.
(00:50) ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అసలు స్థిత ప్రజ్ఞుడు అంటే ఎవరు ఈ పదాన్ని రెండుగా విడదీద్దాం. స్థిత అంటే స్థిరంగా ఉండడం ప్రజ్ఞ అంటే బుద్ధి లేదా విచక్షణ అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా మన బుద్ధిని విచక్షణని కోల్పోకుండా ఉండే వ్యక్తిని స్థిత ప్రజ్ఞుడు అంటాం. సాధారణంగా మన మనసు ఎలా ఉంటుంది? ఎవరైనా పొగిడితే పొంగిపోతాం ఒకవేళ తిడితే బాధపడతాం.
(01:25) ఒకవేళ వ్యాపారంలో లాభాలు వస్తే ఎగిరి గంతేస్తాం సంతోషపడిపోతాం అదే నష్టం వస్తే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం. కానీ స్థిత ప్రజ్ఞుడు అలా కాదు లాభ నష్టాలని సుఖ దుఃఖాలని సమానంగా చూసే వ్యక్తిని స్థిత ప్రజ్ఞుడు అంటాం. [సంగీతం] భగవద్గీత రెండవ అధ్యాయంలో అర్జునుడు కృష్ణుని అడుగుతాడు. కృష్ణ అసలు స్థిత ప్రజ్ఞుడి లక్షణాలు ఎలా ఉంటాయి తను ఎలా మాట్లాడతాడు ఎలా నడుచుకుంటాడు అని అప్పుడు కృష్ణుడు ఇలా చెప్తాడు.
(01:57) ఫస్ట్ కోరికలని నియంత్రించడం మనకి మామూలుగా మన మనక ఎన్ని కోరికలు ఉంటాయి ఒక కోరిక పోతే ఒక కోరిక అలా వందల కోరికలు ఉంటాయి. కానీ స్థిత ప్రజ్ఞుడు కోరికలన్నింటిని వదిలేసి తనలో తాను సంపూర్ణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. సెకండ్ రాగద్వేషాలకి అతీతంగా ఉండటం ఫర్ ఎగజాంపుల్ మనకైతే మనలాంటి వాళ్ళకి మనం ఆ వ్యక్తి లేకపోతే ఉండలేం మనం డబ్బులు లేకపోతే ఉండలేం మనకు ఆస్తిపాస్తులు లేకపోతే ఉండలేం కానీ స్థిత ప్రజ్ఞుడు అలా కాదు అటాచ్మెంటే ఉండదు ఏ వ్యక్తితోనూ ఏ వస్తువుతోనూ అటాచ్మెంట్ ఉండదు రాగద్వేషాలు ఉండవు [సంగీతం] అంటే ప్రేమ ఉండదు భయం ఉండదు కోపం ఉండదు ఇలాంటి
(02:40) వ్యక్తి స్థిత [సంగీతం] ప్రజ్ఞుడు భగవద్గీతలో శ్రీకృష్ణ కృష్ణుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు తాబేలు దానికి ఎగ్జాంపుల్ అని తాబేలు ఏదైనా ఒక ప్రమాదం రాగానే తన అవయవాలన్నింటిని లోపలికి ముడుచుకుంటుంది. స్థిత ప్రజ్ఞుడు కూడా అలాగే ఏదైనా ఒక చెడు విషయం జరగగానే తన ఇంద్రియాలఅన్నింటిని లోపలికి తిప్పిస్తాడు అంటే ఫర్ ఎగజాంపుల్ ఏదైనా చెడు కనిపించినప్పుడు చూడడు ఏదైనా చెడు ఎవరైనా [సంగీతం] మాట్లాడుతూ ఉంటే తన చెవులని అక్కడ పెట్టడు ఎల్లప్పుడూ భగవత్ సంబంధమైన భగవంతునితో మాత్రమే నిమగ్నమై ఉంటాడు మనసుతో [సంగీతం] అటువంటి వ్యక్తి స్థిత ప్రజ్ఞుడు అన్నమాట ఓకే ఇదంతా బాగానే
(03:26) ఉంది. మరి ఈ 2026 లో మన స్థిత ప్రజ్ఞతని ఎలా సాధించాలి అసలు అది పాసిబుల్ేనా ఈరోజు తెలుసుకుందామా ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ లో మన బాస్ మనల్ని [సంగీతం] అరిచి ఉంటాడు. మామూలు వ్యక్తి అయితే ఏం ఆలోచిస్తాడు అరే నేను ఎంత కరెక్ట్ గా చేస్తున్నా [సంగీతం] ఆ నా బాస్ ఈరోజు నన్ను అరిచాడు అని ఆ రోజుంతా మూడ్ ఆఫ్ లో ఉంటారు.
(03:54) మూడ్ ఆఫ్ చేసుకొని అసలు దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. కానీ స్థిత ప్రజ్ఞత అలవాట అయితే ఎలా ఆలోచిస్తారు ఓ నా బాస్ అరిచారు అది ఆయన వ్యక్తిగతం కానీ నా వర్క్ ని నేను కరెక్ట్ గా చేశానా లేదా అనేదే ఇంపార్టెంట్ నాకు అని మాత్రమే ఆలోచిస్తారు అంటే స్థిత ప్రజ్ఞుడు అంటే పొగడతలకి పొంగిపోడు తిట్టారని కృంగిపోడు రెండిటిని సమానంగా చూస్తాడు. ఇప్పుడు స్థిత ప్రజ్ఞుడిగా మారడం జల ఫస్ట్ సాక్షిభూతంగా మారడం [సంగీతం] మన మనసులో ఎన్నో ఆలోచనలు ఎన్నో ఫీలింగ్స్ ఎన్నో ఎమోషన్స్ వస్తుంటాయి.
(04:34) వాటిని మనం ఒక థర్డ్ పర్సన్ లా అబ్సర్వ్ చేయడమే వాటితో పాటు కొట్టుకోకూడదు. జస్ట్ అబ్సర్వ్ చేస్తూ ఉండటం సాక్షిభూతంగా ఉండటం సెకండ్ ఫలితం గురించి ఆలోచించకుండా మన కర్తవ్యాన్ని మాత్రమే చేయడం భగవద్గీతలో కృష్ణుడు ఇలా చెప్తాడు కర్మణ్యే బాధికారస్తే మాఫలేషు తదాచన అంటే రిజల్ట్ ఏదైనా సరే స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. జస్ట్ మనం మన కర్తవ్యాన్ని మాత్రమే చేయాలి.
(05:07) రిజల్ట్ మన చేతిలో లేదు రిజల్ట్ గురించి ఆలోచించకూడదు. థర్డ్ డైలీ మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకోవాలి. [సంగీతం] డైలీ మెడిటేషన్ చేయడం ద్వారా మన మనసు మన కంట్రోల్ లోకి వస్తుంది. ఫోర్త్ ఎమోషనల్ కంట్రోల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ఎవరైనా తిట్టారనుకోండి వెంటనే రియాక్ట్ అవ్వకూడదు. కొద్దిసేపు ఆగాలి అప్పుడు మన మనసు కామ అయిపోతుంది. ఆ మనం రియాక్ట్ అయిపోయామ అనుకోండి మన మూడ్ రిమోట్ కంట్రోల్ వాళ్ళ దగ్గర ఉంది అన్నమాట మన చేతిలో లేదు ఎప్పుడైనా సరే మన మూడ్ రిమోట్ కంట్రోల్ మన దగ్గరే ఉండాలి.
(05:43) మనల్ని ఎవరైనా అవమానించినా తిట్టినా సరే వెంటనే రెస్పాండ్ అవ్వకూడదు వెంటనే ఏ డిసిషన్ తీసుకోకూడదు. ఒక 10 సెకండ్స్ ఆగితే మన మనసు మామూలు స్థితికి అయితే వస్తుంది. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఈరోజు ఒక స్టోరీ చెప్తా గౌతమ గౌతమ బుద్ధుడు జీవితంలో జరిగిన ఒక స్టోరీ అన్నమాట. ఒకసారి గౌతమ బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి వెళ్తున్నారు.
(06:12) దారి మధ్యలో గౌతమ బుద్ధుడికి దాహం వేసింది. అప్పుడు తన శిష్యుల్లో ఒకరైనా ఆనందని పిలిచి ఆనంద నాకు దాహంగా ఉంది మనం ఇప్పుడే కదా ఒక చెరువుని క్రాస్ చేసుకొని వచ్చాం ఆ చెరువు దగ్గరికి వెళ్లి నువ్వు నీర్లు తీసుకురా అని చెప్తాడు. ఈ ఆనంద సరే అని ఆ ఒక గిన్నె తీసుకొని ఆ చెరువు దగ్గరికి వెళ్తాడు. చెరువు దగ్గరికి వెళ్లేసరికి అక్కడ ఎద్దుల బండ్లు దాటి వెళ్ళడంతో ఆ నీళ్ళంతా పైన బురద బురదగా ఉంటుంది.
(06:42) ఈ నీళ్ళని గురువుగారికి ఎలా ఇచ్చేది అని వెంటనే రిటర్న్ వచ్చేస్తాడు. రిటర్న్ వచ్చి ఆ గౌతమ బుద్ధుడికి చెప్తాడు ఇలా జరిగింది బురద బురదగా ఉంది [సంగీతం] గురువా అని సరే బుద్ధుడు చిరునవ్వి నవ్వి సరే కొద్దిసేపు ఇక్కడ మనం విశ్రాంతి తీసుకుందాం కొద్దిసేపు అయిన తర్వాత వెళ్దువులే అని చెప్తాడు అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు అందరూ ఒక అరగంట అయిన తర్వాత మళ్ళీ ఆనందాన్ని పిలిచి సరే ఇప్పుడు వెళ్ళు అంటాడు.
(07:10) కానీ ఆనందకు మాత్రం ఏమాత్రం నమ్మకం ఉండదు ఎందుకంటే అవి నీళ్లు సరిగ్గా ఉండవు క్లీన్ గా ఉండవు. సరేలే గురువు చెప్పాడు కదా అని వెళ్తాడు. వెళ్లేసరికి అక్కడ నీళ్ళంతా తేటగా ఉంటాయి స్వచ్ఛంగా ఉంటాయి. ఎందుకంటే బురదంతా కిందకంతా దిగిపోయి స్వచ్ఛమైన నీరు పైన ఉంటుంది. [సంగీతం] అప్పుడు నీళ్లు తీసుకొని వస్తాడు. అప్పుడు గౌతమ గౌతమ బుద్ధుడు ఇలా చెప్తాడు ఆనందతో మన మనసు కూడా అంతే ఏదైనా మనల్ని ఎవరైనా అవమానించినప్పుడు ఎవరైనా తిట్టినప్పుడు మన మనసులో కోపం పగ బాధ ఏడుపు ఇవన్నీ ఒక్కసారిగా వచ్చేస్తాయి కానీ కొద్దిసేపు మనసుకి టైం ఇస్తే అవన్నీ కిందకి వెళ్ళిపోతాయి స్వచ్ఛమైన మనసు అలా పైకి
(07:54) వస్తుంది అంటాడు. ఇప్పుడు మీకు అర్థమయింది అనుకుంటాను స్థిత ప్రజ్ఞత అంటే స్థిత ప్రజ్ఞత అనేది ఒక్క రోజులో రాదు ఒక వారంలో కూడా రాదు అది ఒక లైఫ్ జర్నీ అన్నమాట ప్రయత్నిస్తూ ఉంటే సాధన చేస్తూ ఉంటే ఒకరోజు మీకే అది అలవాటు అయిపోతుంది. ఎవ్వరు ఏం అరిచినా తిట్టినా అవమానించినా మీరు రెస్పాండ్ అవ్వరు. ఎందుకంటే అది వాళ్ళ వ్యక్తిగత విషయం మనం కరెక్ట్ గా ఉన్నామా లేదా అనేది మనకి ఇంపార్టెంట్.
(08:23) సో ఈ వీడియో నచ్చినట్లయతే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద కింద కచ్చితంగా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఓకే సీ యు బాయ్ బాయ్ టేక్ కేర్

No comments:

Post a Comment