Sunday, November 1, 2026

 🦚జ్ఞానప్రసూనాలు🚩

1) భౌతికంగా ప్రయాణం చేస్తేనే గమ్యం.ఆధ్యాత్మికంగా ప్రయాణం ఆపితేనే గమ్యం.

2) గిరి గీసి కేంద్రంలో బాణం వేసేవాడు సాధకుడు. బాణం వేసి దాని చుట్టూ గిరి గీసేవాడు సిద్ధుడు.

3) ఏ గ్రహానికెళ్లినా మనస్సు నీతోనే కదా ఉండేది!మనసు గుట్టు తెలుసుకో విశ్వం గుట్టు తెలుస్తుంది.

4) ఎవరి పని వారు చేసుకుంటూ తమ కుటుంబానికి ఏలోటూ రాకుండా చూసుకుంటే చాలు. వారు సదా గురుసన్నిధిలో ఉన్నట్లే

5) భగవంతుడిచ్చిన తెలివితోనే భగవంతుణ్ణి పట్టేసుకోవాలని ప్రయత్నిస్తున్నాం.తెలివితో భగవంతుడు దొరకడు.తెలివికి వెలుగునిస్తూ తెలివికి లోపల వెలుగుతుంటాడు భగవంతుడు.

No comments:

Post a Comment