Saturday, February 29, 2020

ఓం నమో నారాయణాయ - అష్టాక్షరి

#ఓంనమోనారాయణాయ

⚘అష్టాక్షరి⚘

భక్తి సంప్రదాయంలో- పంచాక్షరి, అష్టాక్షరి మంత్రాలు ఉదాత్తమైనవి.

‘ఓం నమో నారాయణాయ’

అనేది అష్టాక్షరి మంత్రం. నారాయణ స్వరూపాన్ని తనలో ఇముడ్చుకున్న మంత్రం. నారాయణుడు అంటే నీటిలో నివసించేవాడని అర్థం.

ఆయన సర్వవ్యాపి అయిన పరమాత్మ. ‘ఓమ్‌’ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైన బీజాక్షరం. దీన్ని ‘ప్రణవం’గా పిలుస్తారు. నిత్య శుద్ధమైన బీజాక్షరం ఇది.

అకార, ఉకార, మకారాలతో కూడిన ఓంకారం వేదాల్లోనూ వ్యాపించి ఉంది. ఓంకారం సర్వ శుభదాయకమని రుషులు బోధించారు. ఓంకారం సకలార్థ సాధకం. క్షరం కానిది అక్షరం.

‘న’కారం అన్ని ప్రాణాలకూ మూలం శ్రీహరి అని చెబుతుంది. శరీరం ప్రాపంచిక సుఖాలనే కోరుకుంటుందని; మనం చేసే కర్మను బట్టి పుట్టుక, చావు ఉంటాయని పురాణ గాథలు చెబుతాయి.

పరమాత్ముడే అన్నింటికీ మూల కారణమని, ‘న’కారం అంటే నాశనమని వివరిస్తాయి. సజ్జనుల్ని హింసించే రాక్షసులను సంహరించడాన్ని నకారం సూచిస్తుంది.

‘మో’ అంటే మోహన రూపుడు. రుషుల్ని, యోగుల్ని, భక్తుల్ని ఆయన సమ్మోహపరిచేవాడు. మోహాన్ని నాశనం చేసేవాడనీ అర్థం చెప్పవచ్చు.

‘న’ అంటే నారాయణుడు. ఆయనను నరసింహావతారానికి సంకేతంగా పరిగణిస్తారు. నరసింహుడు శత్రు భయంకరుడు.

అనంతర బీజాక్షరం ‘రా’కారం. రమింపజేసేవాడు రామచంద్రుడు. ఆయన తనను సేవించేవారిపై చల్లని వెన్నెల ప్రసరింపజేసేవాడు. రఘుకుల తిలకుడు, రమ్య గుణధాముడు శ్రీరాముడే!

‘య’కారం యజ్ఞానికి సంకేత రూపం. శ్రీహరి యజ్ఞ స్వరూపుడు. ఆ మహావిష్ణువు ధరించిన అనేక అవతారాల్లో ‘యజ్ఞావతారం’ ఒకటి.

‘ణ’ కారాన్ని అనేక అభీష్టాల్ని నెరవేర్చే బీజాక్షరంగా భావిస్తారు.

చివరి అక్షరం ‘య’ కారం. ఇది యజ్ఞ కర్తను, యజ్ఞ భర్తను సూచించేది. యజ్ఞ కర్త లోకహితాన్ని కోరి యజ్ఞం చేస్తే, ఆ యజ్ఞ ఫల స్వీకర్త మహావిష్ణువే!

భక్తులపై విష్ణుదేవుడి కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరించాలంటే, అష్టాక్షరి మంత్రంతో స్తుతించాలని పురాణగాథలు చెబుతాయి.

ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి సులభ మార్గంలో రూపొందించిన జప విధానం ఇది. ఆపదల్లో ఉన్నవారికి, అజ్ఞానంలో మునిగినవారికి విష్ణు నామమే దివ్యమైన ఔషధమని, ఆధారమని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.

స్వామికి ప్రీతిపాత్రులు కావడానికి, ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంత జీవనం గడపడానికి అష్టాక్షరి మంత్రాన్ని ఓ సాధనంగా పరిగణిస్తారు!
#ఓంనమోనారాయణాయ

చిన్న సందేశాత్మక కధ.

చిన్న సందేశాత్మక కధ.
🌹🌹🌹🌹🌹🌹🌹

ఇది ఒక మధ్య తరగతి కుటుంబములో జరిగిన కథ.

🍁ఒక కొడుకుకి తన ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. అతని తండ్రి ఆతనిని ఎప్పుడు నువ్వు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి వేళ్ళు , T .V .స్విచ్ ఆఫ్ చేసి వేళ్ళు, టేబుల్,ఇల్లు శుభ్రంగా ఉంచుకో అని పదే పదే చెప్తు ఉండేవాడు .ఆ మాటలు ఆ కొడుకుకి నచ్చేవి కావు.ఇంట్లో ఉండటానికి ఇష్టం ఉండేది కాదు.

🍁 నిన్నటి వరకు ఆ తండ్రి మాటలు ఇష్టం లేక పోయిన వినేవాడు కానీ ఈ రోజు అతనికి ఒక ఉద్యోగానికి పిలుపు వచ్చింది . ఉద్యోగం రాగానే వేరే చోటుకి వెళ్లిపోవాలి అని మనసులో అనుకున్నాడు.

🍁ఇంటర్వ్యూకి బయలుదేరాడు తండ్రి ఇంటర్వ్యూకి వెళ్తున్న కొడుకుకి వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికి దైర్యంగా సమాధానం చెప్పు ఒక వేళ నీకు తెలియకపోతే ఆ ప్రశ్నలని కూడా నువ్వు ధైర్యంగా ఎదురుకో అని చెప్పి ఖర్చులకు కొంచం ఎక్కువగానే డబ్బులు ఇచ్చి పంపాడు.

🍁ఆ కొడుకు ఇంటర్వ్యూ జరుగుతున్న అడ్రస్ కు వెళ్ళాడు. అంత పెద్ద బిల్డింగ్ కి సెక్యూరిటీ లేదు.గేట్ యొక్క గడి కొంచం వెళ్తున్న వాళ్ళ చేతికి తగిలేటట్లు ఉంది దానిని సరిచేసి లోపలికి వెళ్ళాడు .లోపల గేట్ కి రెండు పక్కల చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి .ఆ మొక్కలకు నీళ్లు పట్టి టూబ్ ని నడిచే దోవలో పడేసి ఆ తోట వాడు మోటార్ ఆఫ్ చేయటానికి వెళిపోయాడు .ఆ టూబ్ ని చేతిలోకి తీసుకోని ఒక మొక్క యొక్క మొదళ్ళ మీద నీరు పడేటట్లు పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు.

🍁రిసెప్షన్ లో ఎవ్వరు లేరు. ఇంటర్వ్యూ కి 1 ST ఫ్లోర్ అని బోర్డు రాసి పెట్టి ఉంది .మెల్లగా మెట్లు ఎక్కాడు దారిలో నిన్న రాత్రి వేసిన లైట్లు వెలుగుతూనే ఉన్నాయి ఎవ్వరు ఆఫ్ చేయకుండా ఉన్నాయి .లైట్స్ ఆఫ్ చేయకుండా వెళ్తున్నావు అని తండ్రి చెప్పిన మాటలు వినపడుతున్నట్లుగా సడన్ గా అనిపించి వెంటనే మెట్ల వద్దకు వెళ్లి లైట్స్ స్విచ్లను ఆఫ్ చేసి పైకి వెళిపోయాడు.

🍁1ST ఫ్లోర్ లో ఒక పెద్ద హాలు లో చాలా మంది కూర్చొని ఉన్నారు. అంత మందిని చూసి నాకు ఇక్కడ ఉద్యోగం దొరుకుతుందా అని మనసులో అనుకుంటూ ముందుకు అడుగు వేసాడు, అక్కడ ఫ్లోరుపై ఉన్న MAT పై WELCOME తల క్రిందులుగా ఉంది దానిని కాలితో సరిచేసి లోపలికి వెళ్ళిపోయాడు.ఆ హాల్ లో ముందు వరుసలో చాలా మంది కూర్చొని ఉన్నారు ,వెనుక వరుస కాళిగా ఉంది కానీ ఫ్యాన్ తిరుగుతూ ఉంది . గది లో ఎవ్వరు లేనప్పుడు ఫ్యాన్ ఎందుకు అని వాళ్ళ అమ్మ అన్నట్లు మాటలు వినపడ్డాయి వెంటనే ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటర్వ్యూ కి వచ్చిన వారితో కలిసి కూర్చున్నాడు.
🍁ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని ఒక దారిలో నుంచి లోపలికి పంపి వేరే దారిలోనుండి బయటకి పంపిస్తున్నారు ,దానివల్ల లోపల ఎటువంటి ప్రెశ్నలు అడుగుతున్నారో అనే విషయం తెలుసుకోలేక పోయాడు.లోపల ఏమి ప్రశ్నలు అడుగుతారో అనే భయంతోనే లోపలికి వెళ్లి నిలబడ్డాడు.అతని సర్టిఫికెట్స్ తీసుకున్న అధికారి తెరచి చూడకుండానే మీరు ఉద్యోగంలో ఎప్పుడు చేరతారు అని ఆ అధికారి అతన్ని అడిగాడు .ఇది కూడా ఒక ప్రశ్న లేక ఉద్యోగం లో చేరతారా అని అడిగారో అర్ధం కాకుండా ఆలోచిస్తూ నిలబడాడ్డు .
🍁అధికారి ఏంటి ఆలోచిస్తున్నావు ఇక్కడ మేము ఎవ్వరిని ఎలాంటి ప్రశ్నలు అడగలేదు వచ్చే ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారో , ఎలా ప్రవర్తిస్తున్నారో చూడటానికి అక్కడక్కడా కెమెరాలు పెట్టాము .ఇక్కడికి వచ్చిన అందరూ వేస్ట్ అవుతున్న వాటర్ ని కానీ, టూబ్ లైట్స్ ని కానీ, ఫ్యాన్ ని కానీ ఆఫ్ చేయలేదు కానీ మీరు ఒకరే అనింటిని సరిచేస్తూ లోపలికి వచ్చారు.మేము మిమల్ని ఉద్యోగం లోకి తీసుకుంటున్నాము అని ఆ అధికారి చెప్పాడు.
🍁నాన్న చెప్పే మాటలు అన్ని నాకు విసుకు తెప్పించేవి,కానీ ఆ మాటలే ఇప్పుడు నాకు ఉద్యోగం ఇప్పించాయి అని సంతోష పడ్డాడు. తండ్రి మీద ఉన్న కోపం మొత్తం పోయింది . ఉద్యోగం లో చేరేటప్పుడు నాన్న ని కూడా ఇక్కడికి తీసుకురావాలి అని మనస్సులో అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు
🍁తండ్రి మన కోసం ఎం చెప్పినా ,ఎం చేసినా మన భవిష్యత్తు కి మంచి జరగాలనే చేస్తాడు.
🍁ఉలి దెబ్బలకి శిల బాధపడుతుంది అనుకుంటే రాయి శిల్పం కాదు . ఆ బాధని తట్టుకున్నపుడే ఆ రాయి శిల్పంగా మారుతుంది .
🍁తండ్రి మనలో ఉన్న చెడుని ఉలి పెట్టి కొట్టినట్లు పోగొడతాడు.తల్లి బిడ్డని పాలిచ్చి,లాలించి,కథ చెప్పి పడుకోపెట్టి పెంచుతుంది ,కానీ తండ్రి అలా కాదు తాను చూడని లోకాన్నితన కొడుకు చూడాలి అని తన భుజంపై కూర్చోపెట్టి లోకాన్నిచూపిస్తాడు.
🍁తల్లి ఒక కవిత అయితే తండ్రి ఒక చరిత్ర!
🍁తల్లి కష్టపడేదాన్నికనిపెట్టచ్చు కానీ తండ్రి కష్టాన్ని పక్కవారు చెప్తే కానీ కనిపెట్టలేరు.
🍁మనకి తండ్రి 5 సంIIల వరకు గురువు లాగా 25 సంIIలకు శత్రువు లాగా కనిపించే తండ్రి గురించి ఆయన చనిపోయిన తర్వాత ఆయన గొప్పతనం తెలుస్తుంది .
🍁తల్లి వృధాప్యంలో కొడుకు లేదా కూతురు ఇంట్లోనో ఉండి తన జీవితాన్ని గడుపుతుంది . 🍁తండ్రి అలా ఉండలేడు చివరి వరకు ఒంటరిగానే ఉండిపోతాడు .
🍁 అందువల్ల తల్లితండ్రుల్ని ప్రాణాలతో ఉన్నప్పుడే ప్రేమగా చూసుకోకుండా ప్రాణంతో లేనప్పుడు బాధపడి ప్రయోజనం లేదు....

గమనిక:- చనిపోయినతరువాత గొప్పలు చూపించుకోవటానికి పంచభక్ష్యాలతో వేలమందికి ఆర్భాటంగా భోజనాలుపెట్టే సంతానం ఆలోచించండి. బ్రతికుండగా తల్లితండ్రులకు కడుపునిండా ప్రేమగా నాలుగు ముద్దలు పెట్టండి సంతోషంగా మరికొంతకాలం జీవించే అవకాశం కల్పించండి 🙏

ధ్యానములొ కూర్చోవటం అంటే ఎందుకు చాలా మంది ఇబ్బంది పడతారు అంటే

ధ్యానములొ కూర్చోవటం అంటే ఎందుకు చాలా మంది ఇబ్బంది పడతారు అంటే, “ధ్యానము లొ ఏదో అద్భుతం జరిగింది, లేక జరుగు తుంది” అని కొంత మంది చెబుతుంటారు. అది విని చాలా మంది ఏదో జరగాలన్న కోరికలతో ధ్యానానికి కూర్చుంటారు.
ఏమి జరగక పోతే నాకు ధ్యానం కుదరటం లేదు అని వదిలేస్తారు. ఇలా ఏదో జరుగుతుందన్న expectation తో చేసే ధ్యానం వల్ల ఏమీ జరగదు. వారి దృష్టి అంతా ఎదురు చూపుతో జరుగుతుంది.
ధ్యానం అంటే మనసు ఆత్మలో అణగారటం! మనసు ఉనికిని కోల్పోవటం!
ధ్యానం అంటే సమాధి స్థితి!
సమాధి స్థితి అంటే బుద్ధి సమస్థితి లోకి వెళ్ళడం. అంటే మనసు ఆలోచనలు, కోరికలు, ఏమీ లేకుండా నిర్వికారంగా వుండి పోవటం.
అప్పుడు ఏమి జరుగు తుంది?
ఉద్వేగాలు ఉండవు. దానితో
శ్వాస (నెమ్మదించి )
తగ్గుతుంది. తద్వారా సకల
నాడీ వ్యవస్థ నెమ్మదిస్తుంది.
గుండె కొట్టుకునే వేగం కూడా తగ్గుతుంది.
క్రమేపీ త్రికోశాలూ విశ్రాంత స్థితిలోకి వెళ్లి పోతాయి.
చక్రాలన్ని శుద్ధి అవుతాయి.
తద్వారా మూలాధార చక్రం ఎక్కువ ఆక్టివేట్ అవుతుంది. క్రమేపీ అద్భుతాలు జరుగుతాయి.

ఆత్మ స్వరూపదర్శనం కలుగుతుంది!
అంటే ఆత్మ తత్వం బోధ పడుతుంది. మనస్తత్వం లో మార్పులు జరుగుతాయి తద్వారా శరీర తత్వం కూడా మారు తుంది.
ఇవన్నీ జరగాలంటే, ముందు మనసు నిర్వికార స్థితిలో ఉండగలగాలి. అంటే ఏదో జరుగుతుంది, జరగాలి అన్న ఆశ, ఎదురు చూపుతో కూడిన ధ్యానం చెయ్యకూడదు.
ధ్యానం చెయ్యాలి. అంతే! నీ సమయం కొంత త్యాగం చెయ్యాలి.. అంతర్ముఖం అవ్వాలి.

Empty Mind – Open Mind

Empty Mind – Open Mind

” ఆధ్యాత్మిక శాస్త్రం మనకు మౌలికంగా రెండు విషయాలను గురించి తెలియజేస్తుంది. అవి .. ఒకటి ‘శ్రుతి’, రెండు ‘స్మృతి’.
” ‘శృతి’ అంటే తెలియని విషయాలను గురించి శ్రద్ధగా విని తెలుసుకోవటం. ‘స్మృతి’ అంటే మనకు తెలిసిన విషయాలను గురించి కూలంకషంగా ఆకళింపు చేసుకోవడం. వీటినే ఆంగ్లంలో “Empty Mind – Open Mind”
అంటాం.

“శూన్యపు మనస్సు .. Empty Mind .. గా వుంటే మనం ఏదైనా విషయాన్ని వినడానికీ మరి ఏదైనా ఒక అనుభవాన్ని పొందడానికీ సిద్ధంగా ఉంటాం. అలాగే Open Mind గా వుంటే అలా పొందిన అనుభవాన్ని చక్కగా ఆకళింపు చేసుకోగలుగుతాం.

అప్పుడే మనకు ప్రక్కవాళ్ళు అర్థం అవుతారు మరి సమస్త సృష్టి అంతా కూడా అవగాహనకు వస్తుంది. ఇదంతా కూడా ధ్యానం చేస్తేనే మనకు సాధ్యం అవుతుంది. ఎంత బాగా ధ్యానం చేస్తే అంత బాగా Empty Mind విస్తృతం చెందుతుంది. మరి ఎంత బాగా ధ్యానం చేస్తే అంత బాగా Open Mind అభివృద్ధి చెందుతుంది. అప్పుడే మనలో అత్యంత శక్తివంతమైన ‘సహజ అవబోధ’ అంటే ‘ Intution’అన్న ఆత్మశక్తి మేల్కొంటుంది.

“ఇందుకుగానూ మనం అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలను చదవాలి, సకల చరాచర సృష్టిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. మరణానికి ముందు మరి మరణం తరువాత ఉండే జీవితాన్ని గురించి తెలియజేసే సరస్వతీ విజ్ఞానాన్ని ఔపోసన పట్టాలి. ఒక ఆధ్యాత్మిక శాస్త్రజ్జుడిలా ఆయా సూక్ష్మ శరీర అనుభవాలను ప్రత్యక్షంగా పొందాలి. ఆయా రంగాలలో విశేషంగా కృషి చేసిన యోగుల జీవిత చరిత్రలను శ్రద్ధగా అధ్యయనం చెయ్యాలి.

“అలా చేసి .. ‘చూసేదీ- చూడబడేదీ ఒక్కటే అన్న ప్రత్యక్ష అనుభవాన్ని పొందాలి. అదే ‘నిర్వాణం’ అంటే! బుద్ధుడు చేసిందీ అదే, వేదవ్యాసుడు చేసిందీ అదే .. రాముడూ, కృష్ణుడూ, శిరిడీసాయిబాబా, ఏసుక్రీస్తు, రమణమహర్షి, అవతార్ మెహర్ బాబా, మేడమ్ బ్లావెట్‌స్కీ చేసిందీ అదే ! మరి మనం కూడా వాళ్ళ కోవలోకే చెందితే ఎంత బాగుంటుంది!

“తమోగుణిగా ఉంటూ ‘నా కెందుకులే’ అనుకుంటే లాభంలేదు. రజోగుణిగా ఉంటూ ‘అన్నీ నాకు తెలుసులే’ అనుకుంటే కూడా లాభం లేదు. శుద్ధ సాత్వికులుగా ఉంటూ, ‘అన్నీ తెలుసుకోవాలి’ అన్న స్ఫూర్తితో సంసారంలో ఉంటూనే ధ్యానసాధన, స్వాధ్యాయం మరి సజ్జన సాంగత్యం ఒక్కొక్కటిగా చెయ్యాలి. అప్పుడే అన్నీ అర్థం అవుతూ ఉంటాయి.

అందుకు గాను మనకు హిమాలయాల అంత వినయం ఉండాలి. మేరు పర్వతం అంత సహనం వుండాలి. మరి చెప్పనలవి కానంతగా నియమనిష్టలు ఉండాలి. లేకపోతే ‘చూసేది వేరే .. చూడబడేది వేరే’ అన్న గందరగోళంతో జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటూ ‘సంసారం’ లో మునిగిపోతాం!

“ఒకానొక నాణేనికి బొమ్మా, బొరుసూ ఉంటేనే విలువ ఉన్నట్లు Empty Mind మరి Open Mind రెండూ ఉంటేనే మన జీవితం కూడా సార్థకం అవుతుంది. కనుక సమయాన్ని వృధా చేసుకోకుండా కళ్ళురెండూ మూసుకుని ధ్యానంలో కూర్చుని వినియోగకరమైన మరి ఉభయకుశలోపరి అయిన ఆలోచనలతో మన గురించి మనం వెతుక్కోవాలి.

“అసలు కళ్ళు మూసుకోవడమే చేతకాకపోతే .. ఒక చోట కూర్చోవడమే చేతకాకపోతే .. మన గురించి మనం తెలుసుకునేదెప్పుడు? మన చుట్టూ ఉన్న వాళ్ళను అర్థం చేసుకునేదెప్పుడు? మరి ఈ సకల సృష్టిని అవగాహన చేసుకునేదెప్పుడు? మన జీవితకాలం సద్వినియోగం అయ్యేదెప్పుడు?

“కనుక విశేషంగా ధ్యానసాధన చెయ్యాలి; విశేషంగా స్వాధ్యాయం చెయ్యాలి .. మరి విశేషంగా సజ్జన సాంగత్యం చెయ్యాలి. కళ్ళు రెండూ మూసుకుని కూర్చునీ, కూర్చునీ ఒకానొక సిద్ధార్థుడు బుద్ధుడు అయినట్లు మనం అందరం కూడా బుద్ధుళ్ళం కావాలి!

ప్రతిదీ కారణ - కార్యమే

ప్రతిదీ కారణ - కార్యమే:-

➡ కారణం లేకుండా ఏ కార్యమూ జరుగదు.
➡ ప్రతి కార్యం వెనుక ఏదో కారణం ఉండే తీరుతుంది.
➡ ఒక్కోసారి కారణం కార్యరూపము ధరించదు.
➡ కారణానికి మటుకు 'కారణం' ఉండదు.
➡ కారణం ఎప్పుడూ స్వయంసిద్ధం.
కారణ - కార్య సంబంధం గురించి తెలుసుకోవడమే 'కర్మ సిద్ధాంతం' గురించి తెలుసుకోవడం అంటే.

అదృష్టం, దురదృష్టం అన్నవి కారణ - కార్య సంబంధాలే. కారణం కనబడితే దృష్టం అని, కారణం అగోచరమయితే అదృష్టం అని పిలుస్తారు.

కారణం గత జన్మలోనూ, కార్యం ఈ జన్మలో ఉన్నప్పుడు అది సామాన్యులకు కనబడదు. అందువల్ల కారణం శుభప్రదంగా ఉన్నప్పుడు 'అదృష్టం' అనీ, అది అశుభప్రదంగా ఉన్నప్పుడు 'దురదృష్టం' అనీ అంటాం. అందువలన, కారణం లేకుండా ఏ కార్యమూ ఎప్పుడూ ఉండదు.

తాపత్రయం

తాపత్రయం:-

తాపం అంటే దుఃఖం, త్రయం అంటే మూడు. త్రి విధ దుఃఖాలే తాపత్రయం, తాపాలు మూడు రకాలు.

1) ఆధ్యాత్మిక తాపం:
మనలోని కామ, క్రోధ, లోభ, మద, మోహ,మాత్సర్యాలనే అరిషడ్వర్గాల వలన కలిగే బాధలనే 'ఆధ్యాత్మిక' తాపాలంటాం.
ప్రతి మనిషికి ఉండే బాధల మొత్తంలో 90% ఈ విధంగా ఎవరికి వారు కల్పించుకుంటున్న బాధలే.

2) ఆది భౌతిక తాపం:
ఇతర ప్రాణికోటి వలన కలిగే తాపాలని 'ఆది భౌతిక తాపా'లంటారు. ఇతరుల అజ్ఞాన, అక్రమ చర్యల వలన మనకు కలిగే బాధలు అన్నమాట.
ప్రతి మనిషికి 9% బాధలు మాత్రమే ఈ కోవకు చెందినవి.

3) ఆది దైవిక తాపం:
ప్రకృతి సహజమైన మార్పుల వలన కలిగే తాపాలని 'ఆది దైవిక తాపాలు' అంటాం.
ఉదాహరణకు : అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు మొదలైనవి. 1% బాధలు మాత్రమే ఈ కోవకు చెందినవి.


తాపత్రయాలు లేని స్థితే ముక్త స్థితి.
ఆత్మ జ్ఞానం వల్లనే ముక్తి సంప్రాప్తిస్తుంది.

విశ్వంలో ఉన్న కోటానుకోట్ల ఆత్మలన్నీ ఈ ఏడు ఆత్మ స్థాయిలలో ఏదో ఒక దానికి చెంది ఉంటాయి.

విశ్వంలో ఉన్న కోటానుకోట్ల ఆత్మలన్నీ ఈ ఏడు ఆత్మ స్థాయిలలో ఏదో ఒక దానికి చెంది ఉంటాయి.

1. శైశవ ఆత్మ (అజ్ఞాని):-
దేవుడు ఉన్నాడా? ఉంటే చూపించు? 'ఆధారాన్ని' చూపించు అనేవాడు.

2. బాల ఆత్మ (విపరీత జ్ఞాని):-
మేము చెప్పేదే కరెక్ట్.,
అని వితండవాదం చేసేవారు.

3. యువ ఆత్మ (ప్రాపంచిక జ్ఞాని):-
పైకి అన్నీ చెప్తాడు. కానీ ఆచరించడు.

4. ప్రౌఢ ఆత్మ (వేదాంతి):-
'అంతా దైవమే, అంతా మాయే, మనం నిమిత్తమాత్రులం' అనేవాడు.

5. వృద్ధ ఆత్మ (యోగి):-
ధ్యానం చేస్తూ, దివ్య దృష్టిని ఉత్తేజింప చేసుకున్నవాడు. కానీ దివ్య దృష్టి మాత్రం 'మనసు చేసే ట్రిక్స్' అని అనుకునేవాడు.

6. విముక్త ఆత్మ (ఋషి/రాజర్షి):-
ఎంత మాత్రం మాట్లాడకూడదు, సాధన చేయాలి అనే వాడు.
సాధన చేస్తూ దగ్గర వచ్చే వాళ్లకు ధ్యానం చేయండి అని చెప్తాడు.

7. పరిపూర్ణ ఆత్మ (బ్రహ్మర్షి):-
అన్ని చోట్లకు తిరుగుతూ, ప్రతిఫలాపేక్ష లేకుండా ఆత్మజ్ఞానాన్ని అందించేవారు.

ఎవరైతే బ్రహ్మర్షి స్థితిలో ఉంటారో-- వారు జనన మరణ చక్రమును దాటుతారు. వారికి మరల జన్మ తీసుకునే అవసరం ఉండదు.

ఆత్మహత్య నుంచి ఆత్మ విశ్వాసం వరకు

ఆత్మహత్య నుంచి ఆత్మ విశ్వాసం వరకు
--------------------------------------------------
రచన :- గురుమంచి రాజేంద్రశర్మ గారు...

ఒక స్త్రీ కొండపైనుంచి లోయలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని చాల ఎత్తయిన కొండ పైకి ఎక్కింది.మరో పది అడుగులు వేస్తే దూకుతుందనగా కాలికి ఏదో తగిలింది.క్రిందికి చూస్తే ఏదో మెరుస్తూ కనిపించింది. ఆమె ఒక కొయ్య సహాయంతో ఆ మెరిసే వస్తువును భూమిలోంచి బయటకు తీసింది.

అది ఒక దీపం. దానికి అంటుకున్న దుమ్ము దులుపుతున్నపుడు ఒక చిన్న మెరుపు వచ్చి అందులోంచి ఒక భూతం బయటకు వచ్చింది.

ఆమె ఆ భూతాన్ని చూసి మొదట భయపడింది. కానీ,ఆ భూతం కొంచెం మనిషిలాగే ఉండడం అదీగాక చావాలని నిర్ణయించుకున్న తర్వాత ఈ దయ్యాలకూ,భూతలకూ భయపడడమేమిటని ధైర్యంగా ఆ భూతాన్ని " ఎవరు నువ్వు ? " అని అడిగింది.

"నేనొక భూతాన్ని ! బహుశా నీకు కాబోయే స్నేహితురాలిని కూడా కావచ్చు ! నా వివరాలు తర్వాత చెబుతాను.ముందు నీ విషయం చెప్పు!
నువ్వు ఎందుకు చావాలని నిర్ణయించుకున్నావు? నీ సమస్య ఏమిటో చెబితే నాకు వీలైతే పరిష్కారం చెబుతాను." అన్నదా భూతం.

" చెబితే నష్టమేమిటి? దొరికితే పరిష్కారం దొరుకుతుంది. లేకపోతే 'చావు' పరిష్కారం ఉండనే ఉంది." అని ఆలోచించి తన కష్టాలు చెప్పసాగింది.

" నా మనస్సు కు సుఖమనేదే లేదు.
నా తల్లిదండ్రులు నన్నర్థం చేసుకోలేదు. ఇష్టం లేనివాడికిచ్చి పెళ్లి చేశారు. సరే పోనీలే ! అని అడ్జెస్ట్ అయ్యాను.కానీ, చేసుకున్న మొగుడు కూడా నన్నర్థం చేసుకోవట్లేదు. నా మాట లెక్క చేయడు.నేను కన్న పిల్లలు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు.నాకు విలువ ఇవ్వడం లేదు. ఆఫీస్ లో నేనెంత కష్టపడి పనిచేసినా మా బాస్ నన్ను గుర్తించట్లేదు.చివరకు పొరుగింటివారు, కొలీగ్స్ ఎవరి వద్ద నాకు విలువ లేదు. దీంతో నా మనస్సులో భరించలేని ఒంటరితనం ఏర్పడి విలువ లేని ఈ బ్రతుకు వద్దనుకుని చచ్చి పోవాలని నిర్ణయించుకున్నాను.నిజానికి ఇది ఆవేశంతోనో- దుఃఖంతోనో తీసుకున్న నిర్ణయం కాదు. నిరాశా - నిర్లిప్తితతో తీసుకున్న నిర్ణయం .

ఆమె మాటలు విన్న భూతం ఇలా అంది.

" నిజమే! మీరంతా సామాజిక జీవులు. మీరు ఏం చెయ్యాలన్నా చుట్టూ ఉన్న వారి ప్రమేయం ఉండాలి. ఆమోదం ఉండాలి. సహకారం ఉండాలి. ఎంత ధీమాగా ఒంటరి పయనానికి తెగించినా కొన్ని అడుగుల తర్వాత మరి కొన్ని అడుగులు జత కలవాల్సిందే. అందుకే ఇతరులు అర్థం చేసుకోవాలని కోరుకోవడం చాలా సహజం.

మరి అలా జరగనప్పుడు ఏం చెయ్యాలి?

ముందు ఒక ప్రశ్న వేసుకుందాం.

అసలు నిన్ను అర్థం చేసుకోవలసిన అవసరం అవతలి వాళ్ళకేముంది?

నిజమే! నువ్వు నీ వైపు నుండి ఆలోచిస్తున్నప్పుడు, వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుండి ఆలోచించడం సహజం కదా! నిన్ను అర్థం చేసుకునే ప్రయత్నం ఎవరైనా చేయాలంటే, నీ అవసరం వాళ్లకు ఉందా ? అని ఆలోచించూ! వాళ్లకు కావలసిన అర్హతలు నీ దగ్గర ఏమున్నాయో చెక్ చేసుకో!

ఎందుకంటే అవసరం లేనిదే ఎవరూ ఏ పనీ చేయరు! ఎంత సొంత వారైనా నిన్ను అర్థం చేసుకోవాలనే నిబంధన ఏదీ లేదు.

సరే! వాళ్ళకు నీ అవసరం లేదని తేలిపోయింది.

మరిప్పుడు ఎలా? నీ కర్మ ఇంతే అనుకుందామా? కానేకాదు. ఇప్పుడిలా ప్రశ్నించుకో!

నీకు వాళ్ళ అవసరం నిజంగా ఉందా?

ఇది కూడా నిజమే!

ఒక్కోసారి మనం అనవసరమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. 'అవతలి వారికి వారి అర్హతలకు మించిన స్థానాన్ని ఇచ్చి బాధపడిపోతుంటాం'.

ఉదాహరణకు ఒక సంస్థలో నీకు గుర్తింపు లేకపోతే మరో సంస్థను వెదుక్కోవచ్చు. ఒకరు నిన్ను తిరస్కరిస్తే మరొకరు నిన్ను ఆదరించవచ్చు. అయితే అన్ని సందర్భాలలోనూ అందరినీ ఒదులుకోలేము కదా! కూతురినో, భర్తనో అలా వదిలేసుకుంటామా? ఒక్కోసారి ప్రేమించిన వాళ్ళను కూడా ఒదులుకోలేకపోవచ్చు! అప్పుడేం చేద్దాం ?

ఇంకేం చేస్తాం ? మన ఫిర్యాదును వెనక్కి తీసుకుందాం! వెనక్కి అంటే వ్యాకరణం మార్చి చదువుదాము.

" నన్ను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు "

దీన్నే మరోలా చదువుదాం

" నేను ఎవరికీ అర్థం కావట్లేదు "

ఎలా ఉంది? రెండింటి లో తేడా ఉంది కదా!
మొదటి దాంట్లో నిన్ను అర్థం చేసుకోలేక పోవడం ఎదుటివారి తప్పు అన్నట్టుగా ఉంది. రెండో దాంట్లో తప్పు నీలోనే ఉంది.
అవును! మనకు సంబంధించిన ప్రతి సమస్యకూ చాలావరకు మన దగ్గరే పరిష్కారాలు ఉంటాయి. ఇదీ అంతే !

నిన్నెవరూ అర్థం చేసుకోవట్లేదు అంటే దానర్థం నువ్వు ఎవరికీ అర్థం కానట్టు ప్రవర్తిస్తున్నావని.

ఇప్పుడు రెండే దారులు.

ఒకటి నువ్వు మారాలి. అంటే ... నీ వైపు నుంచి కాకుండా అవతలి వైపు నుంచి ఆలోచించాలి. నీలో లోపాలున్నాయి అనిపిస్తే సరిదిద్దుకోవాలి.

ఇక రెండోది.

నిన్ను నువ్వు సరిగా చూపించుకోవాలి. నువ్వేంటన్నది కొత్తగా నిరూపించుకోవాలి. నీ అభిప్రాయాన్ని సరిగా కమ్యూనికేట్ చేయాలి. సరిగా అంటే ఎలా అనేది సందర్భాన్ని బట్టి నువ్వే ఆలోచించుకోవాలి. వీటినే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. ఈ నైపుణ్యాలు ఉంటేనే లోకానికి కనబడతావు. సమాజం నిన్ను గుర్తిస్తుంది.

నీ ఆత్మహత్య నిర్ణయాన్ని ఒక ఆరు నెలలు వాయిదా వేసుకో!
ఇన్ని రోజులు అనుభవించిన కష్టాలను మరో ఆరు నెలలు అనుభవించడానికి సిద్ధపడు.అంతేకాదు వీలైతే మరింత ఎక్కువగా అనుభవించు !
నేను చెప్పిన విషయాలను ఈ ఆరు నెలలు సాధన చెయ్యి! తర్వాత వచ్చి నీ అనుభవాలు చెప్పు!
ఫలితమేమీ లేకుంటే చచ్చి పోయే నిర్ణయం నీ చేతిలోనే ఉంది.

చివరగా మరొక్క మాట!

ఇతరుల విలువనూ,గౌరవాన్ని కోరుతున్న నువ్వు ' స్వయంగా నీకు నువ్వు ఇచ్చుకునే విలువా, గౌరవం ఎంతో ఒక పెన్ను పేపర్ పెట్టుకుని విశ్లేషించుకో! "

అంటూ సుదీర్ఘమైన పరిష్కారాన్ని సూచించింది ఆ భూతం.

భూతమిచ్చిన ఈ సుదీర్ఘమైన ఉపన్యాసాన్ని విన్న ఆ స్త్రీ " ఇదేదో చచ్చేవరకు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు ఇచ్చిన భూతములాగుంది.
అయినా మనుషుల కన్న ఈ భూతమే నయం. నా గోడు విని పరిష్కారాన్ని సూచించిన మనిషి ఒక్కడూ లేడు. ఒకసారి దీని మాట కూడా విని చూద్దాం !అనుకుని, "సరే! ఆరు నెలల తర్వాత వచ్చి కలుస్తాను." అంటూ ఆ దీపాన్ని యథా స్థానం లో వుంచి వెళ్ళిపోయింది ఆ స్త్రీ.

ఆరు నెలలు గడిచిపోయాయి.

ఆ స్త్రీ వచ్చింది. భూమి లోంచి ఆ దీపాన్ని తవ్వి తీసి రాచింది. అందులోంచి భూతం బయటకు వచ్చి ఆనందం తో వెలిగిపోతున్న ఆ స్త్రీ ముఖం చూసి, " ఏం జరిగింది? " అని అడిగింది.

" ఏం చెప్పాలి? ఒకటా ? రెండా? అన్నీ మార్పులే! " అంది నవ్వుతూ..

ఆత్మవిశ్వాసం తో కూడిన స్వచ్ఛమైన ఆమె నవ్వును భూతం విస్మయంగా చూస్తూవుంటే ఆ స్త్రీ చెప్పసాగింది.

ఇన్నిరోజులు నా అశాంతినీ, ఒంటరితనాన్నీ మరిచిపోవడానికి 'టీ.వి' కి బాగా అలవాటు పడ్డాను. ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత నన్ను ఆలోచించకుండా చేస్తూ, నా సమయాన్నంతా తినేస్తున్న టీ.వీ అలవాటు ను అరగంట కు కుదించాను.
అంతకు ముందు టి.వి చూస్తూ, పాటలు వింటూ, ముచ్చట్లు పెడుతూ, మధ్యమధ్య ఫేస్బుక్ - వాట్సప్ లు చెక్ చేస్తూ నేను చేసే ఏకాగ్రత లేని పనుల వల్ల రోజంతా బిజీగా ఉన్నాగానీ నా పనులు తెమిలేవి కావు.
ఇప్పుడు చేసే పనిలో లీనమై ఏకాగ్రతగా చేయడం వల్ల పనులు తొందరగా పూర్తి కావడమే కాకుండా చాలా సమయం మిగులుతుంది కూడా !.

డైరీ రాయడం ప్రారంభించాను.నా బలాలూ, బలహీనతలు అర్థమవ్వసాగాయి.

మనస్సులో అశాంతిగా ఉండడం వల్ల రాత్రిల్లు అనవసర కాలక్షేపం చేస్తూ ఆలస్యంగా పడుకుని ఉదయం ఆలస్యంగా నిద్ర లేచే దానిని.

ఆలస్యంగా నిద్ర లేచిన నేను పిల్లలకు స్కూల్‌ బస్ వచ్చే టైం అవుతుందని నేను టెన్సన్ పడుతూ పిల్లలను కూడా టెన్సన్ పెడుతూ గట్టిగా అరుస్తూ నిద్ర లేపే దానిని. అలాగే అరుస్తూనే వాళ్లను రడీ చేయించేదాన్నీ.

నాకు తెలియకుండానే పిల్లలకు కూడా "టెన్సన్ పడడాన్నీ, అసంపూర్తిగా పనులు చేసే విధానాన్నీ అభ్యాసం చేయిస్తున్నాను. " అన్న విషయాన్ని గమనించలేకపోయాను.

" నీకు తెలుసా! గతంలో నీ దగ్గరకు వచ్చే వరకూ నా పిల్లల నుదిటిపై ముద్దు పెట్టుకుని ప్రేమగా పిలుస్తూ నిద్రలేపి కావలించుకున్న సందర్భం ఒక్కటీ లేదు."

ఇప్పుడు నన్ను నేను పూర్తిగా మార్చుకున్నాను.

ఆహారపు అలవాట్లు మార్చుకున్నాను.
రాత్రి తొందరగా పడుకొని తెల్లవారుజామునే నిద్ర లేస్తున్నాను.
వెంటనే స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి ఒక పదినిమిషాలు హృదయ పూర్వకంగా నా ఆత్మస్వరూపంగా ఉన్న భగవంతుని ప్రార్థించి నా భర్తాపిల్లలను నిద్ర లేపుతున్నాను.

నాలో ఆత్మ విశ్వాసమూ, జ్ఞానం పెరుగుతున్నా కొద్ది అనవసర అనుమానాలూ, మూఢ నమ్మకాలు తొలగిపోసాగాయి.

అంతకుముందు స్నానం తర్వాత ప్రక్క బట్టలు ముట్టుకోకూడదని దూరంగా ఉండి అరుస్తూ నిద్ర లేపే దాన్ని.

రాతి విగ్రహంలోనే దేవున్ని దర్శించే నేను,నా భర్తాపిల్లలలో దర్శించలేనా?

కృష్ణ జయంతి రోజు కృష్ణవిగ్రహాన్ని పడుకోబెట్టి ఊపే ఉయ్యాల ఎంత పవిత్రమైనదో నా భర్తాపిల్లలు పడుకునే మంచం - బట్టలు అంత పవిత్రమైనవి కావా ?

అందుకే నా పిల్లలకు "యశోద"నయ్యాను.

నా భర్త కు "రాధ"నయ్యాను.

అలా ప్రేమగా నా భర్తాపిల్లలను నిద్ర లేపి వాకింగ్ తీసుకెళ్ళడం ప్రారంభించాను.అంతకుముందు ప్రతిదానికి ఎదురు చెప్పే నా భర్తాపిల్లలు మారు మాట్లాడకుండా నాతో ఉత్సాహంగా వాకింగ్ కు రాసాగారు.

ఆ ప్రభాతసమయంలో చల్లని పిల్లగాలులు వీస్తూ ఉండగా నా కుటుంబంతో కలిసి నేను ఆత్మ విశ్వాసంతో అడుగులు వేస్తూ నడుస్తూవున్నప్పుడు భరించలేని నా ఒంటరితనమంతా ఒక్క క్షణంలో ఎగిరిపోయింది.

నాకు ఇంగ్లీషు లో బాగా మాట్లాడాలని కోరిక.కానీ, చాలా భయపడేదాన్ని.ఒక రెండు నెలలు తీవ్రంగా శ్రమించి, ఇంగ్లీషు లో అనర్గళంగా మాట్లాడడాన్ని అభ్యాసం చేశాను.మా ఆఫీసుమీటింగ్ లో నేను ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టి చూసి తర్వాత చప్పట్లతో నన్ను అభినందించారు.

నా భర్తాపిల్లలను కారులో కూర్చోబెట్టుకుని నేను డ్రైవ్ చేస్తూ కారులో ప్రయాణించాలని కోరికగా ఉండేది. కారు డ్రైవింగ్ నేర్చుకుని ఆ కోరికా తీర్చుకున్నాను.

చెబితే నమ్మవు కానీ, ఈ వయస్సులో స్విమ్మింగ్ నేర్చుకుని నా భర్తతో కలిసి స్విమ్మింగ్ చెయ్యాలనే కోరిక తీర్చుకున్నాను.ఈ సెలవులలో నా పిల్లలకూ స్విమ్మింగ్ నేర్పించి నా కుటుంబంతో కలిసి స్విమ్మింగ్ చెయ్యాలనే కోరికను కూడా తీర్చుకుంటాను.ఇది విని ఒక చిన్న పిల్లలాగా మాట్లాడుతున్నాని అనిపించవచ్చు ! కానీ, ఒక స్త్రీకి తన కుటుంబం తో కలిసి ఇలాంటి చిన్న చిన్న ఆనందాల వల్ల పొందే తృప్తి వెలకట్టలేనిది.

నాలో ప్రశాంతత పెరిగిన కొద్దీ నా భర్త కూడా నాకు అర్థమవ్వసాగాడు. అతనొక జర్నలిస్టు. తన వృత్తిని బాగా ప్రేమిస్తాడతడు. ఒక విషయాన్ని చూసి అందులోని మంచి - చెడులను విశ్లేషించే తత్వం అతని నుండి వేరు చేయలేంతగా అతనిలో జీర్ణమైపోయింది.
అతనిలో అభ్యాసమైన ఈ గుణం వల్ల గతంలో నాలోని మంచి - చెడులను కూడా విశ్లేషించేవాడు. నాలోని పొరపాట్లు గూర్చి ఆతను చెబుతున్నపుడు నేను అవేశం తో రగిలిపోయేదాన్ని.

గతంలో " నేను తలదువ్వుకుని చాలా సార్లు దువ్వెనకు అలాగే వెంట్రుకలుంచే విషయం గోడవగా మారి ఒక పదిరోజులు మాట్లాడుకోని సంగతి " గుర్తుకువస్తుంది.

ఇంత చిన్నవిషయం గూర్చి ఇతనికెందుకు పట్టుదల ? అని ఆలోచించేదాన్ని.
కానీ అది చిన్న విషయం కాదనీ, నాలో పేరుకుపోయిన నిర్లక్ష్యానికీ - నిర్లిప్తితకు గుర్తని ఇప్పుడు నకర్థమౌతుంది.
ఇలా అతన్ని వృత్తితో సహా అర్థం చేసుకున్న తర్వాత అతను నాకు అర్థమవ్వసాగాడు. క్రమంగా అతడు అర్థమౌతున్నాకొద్ది అతని అద్భుతమైన వ్యక్తిత్వం చూసి ఆశ్చర్యపోయాను.

అతను నాపట్ల ఆసక్తి చూపాలంటే ,అతనికిష్టమైన విషయాల్లో నేనూ ఆసక్తి చూపాలన్న ప్రాథమిక సూత్రాన్ని నేను గ్రహించాను.పేపర్ లో వచ్చిన అతడు రాసిన వార్తలనూ, వ్యాసాలనూ శ్రద్ధగా చదివి విశ్లేషించి అతన్ని ప్రోత్సాహించడం ప్రారంభించాను.

నాలో అకస్మాత్తుగా వచ్చిన ఈ మార్పును చూసి నా భర్త మొదట్లో నా మీద విపరీతమైన గౌరవంతో కొన్ని రోజులు దగ్గరకు రావడానికే ధైర్యం చాలక తటపటాయించాడు. నేనూ కొన్ని రోజులు బింకాన్ని నటించి ,అతని ఇబ్బందిని చూసి ఫక్కున నవ్వేసి వెళ్లి కావలించుకున్నాను.

ఇప్పుడు నాకు కుటుంబసభ్యులతో పట్టుదలలు లేవు. అన్నీ పట్టు విడుపులే !

నీకో విషయం చెప్పనా ? మా వివాహమైన ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు నా భర్తను నిజంగా ప్రేమించడం మొదలు పెట్టాను.

ఇక చుట్టుప్రక్కల జరిగే చెత్త విషయాలన్నీ తీసుకుని ఉసుపోని కబుర్లకోసం మా ఇంటికి కొంతమంది వచ్చేవారు. మొహమాటంతో నా పని మానుకుని ముచ్చట్లు పెట్టేదాన్ని. వాళ్ళవల్ల నా సమయమూ,మనస్సూ రెండూ చెడిపోయేవి.
అలా వచ్చేవారికి " కొంచం కూరగాయాలు తరిగి పెట్టవా ? బోళ్ళు కడగడంలో హెల్ప్ చెయ్యవా? " అంటూ పనులు చెప్పడం మొదలు పెట్టాను. చాలామంది రావడం మానుకున్నారు. నా స్నేహాన్ని నిజంగా కోరుకునే స్నేహితులు మాత్రం వస్తూనే ఉన్నారు.

ఇప్పుడు నన్నెవరూ అర్థం చేసుకోవలసిన అవసరం లేదనిపిస్తుంది. నేనే అందరిని అర్థం చేసుకోగలను.

మరో ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా?

ప్రధానమంత్రి స్త్రీ సమస్యలపై మాట్లాడడానికి దేశం లోని కొంత మంది మహిళలతో ఒకమీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆ మీటింగ్ కు నేనూ ఎంపికయ్యాను. ఆ రోజు నేను మాట్లాడిన విషయాలను మీడియా హైలెట్ చేసింది. ప్రధానమంత్రిగారు నన్ను ప్రత్యేకంగా అభినందించారు.
ఇప్పుడు నేను చాలా మందికి తెలుసు.
నన్ను చూసి మా బాస్ నిలుచుండి విష్ చేయడం మొదలు పెట్టాడు.

ఇప్పుడు నేను వృథాగా సమయాన్నీ , డబ్బునూ, ఆహారాన్నీ , మాటలనూ, కన్నీళ్ళనూ, భావావేశాలనూ ఖర్చు చేయడాన్ని మానుకున్నాను.నాకు తెలియకుండానే నా ముఖం పై చిరునవ్వు కదలాడుతుంది.

" ఉద్ధరేదాత్మనాత్మానం " అని గీతా, ఉపనిషత్తులు చెప్పిన మాటలు మరచి ....ఎవరో టీ.వి లో 'గురువారం మఱ్ఱిచెట్టు కు పాలుపోయ్యు !' అంటే వెళ్లి పోశాను. ' శుక్రవారం రాగిచెట్టు క్రింది మట్టిని బొట్టు పెట్టుకో! " అంటే వెళ్లి పెట్టుకున్నాను.
నా భర్తాపిల్లలూ, పరిస్థితులు మారుతాయని ఆశపడ్డాను.మార్పు బయటనుంచి వస్తుందని ఎదిరిచూశాను.
మార్పు లోపలినుంచే వస్తుందని ..మారాల్సింది నేనేనని నాకిప్పుడర్థమైంది.

ఇదంతా నీవల్లే!

నా ఆత్మహత్య ను తప్పించావు.
నాకో కొత్తజీవితాన్ని ప్రసాదించావు.
నన్నో వ్యక్తిగా నిలబెట్టి విలువా,గౌరవం రావడానికి కారణమయ్యావు.
ముఖ్యంగా "నేనంటే నాకు బాగా ఇష్టం కలిగేటట్లు చేశావు."
ఏం చేసినా నీ రుణం తీర్చుకోలేనిది.

నిజంగా నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కృతజ్ఞతతో కూడా కళ్ల వెంబడి నీళ్లొస్తాయన్న సంగతి నాకు మొదటిసారిగా తెలుస్తుంది.

సరే! నా సంగతి అలా ఉండనీ! నీ వివరాలు చెప్పు " అన్నదా స్త్రీ కృతజ్ఞతాభాష్పాలను తుడుచుకుంటూ..

ఆ స్త్రీ మాటలు విన్న భూతం ఆనందంతో ఇలా చెప్పసాగింది.

" నేను గతంలో నువ్వు ఉన్న స్థితిలోనే ఉండి , ఇదే కొండ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుని ఇలా భూతన్నయ్యాను. చచ్చి భూతాన్ని అయ్యాక నేను చేసిన తప్పు తెలిసొచ్చి జ్ఞానం వచ్చింది.

నేనున్న స్థితి ఎలాంటిదంటే..

ఆకలౌతుంది కానీ, తినలేను.
నిద్రొస్తుంది కానీ, విశ్రాంతి తీసుకోలేను.
అన్ని రకాల కోరికలు కలుగుతాయి కానీ, తీర్చుకోలేను.
దుర్భరంగా , పరమ యాతనగా ఉంటుంది.

ఈ ప్రేతశరీరంలో వుండడం ఇష్టం లేక ఈ కొండకు వచ్చిన ఒక నిజమైన మహాత్ముని కాళ్లావేెళ్ళా పడి విముక్తి కలిగించుమని పార్థించాను.

నా ప్రార్థన విన్న అతడు ...

" ఆత్మహత్య మహా పాపం."

నీ జీవితాన్నీ - ఆయుష్షును వ్యర్థం చేశావు.
నీ పాపం తొలిగిపోవాలంటే నీవల్ల మూడు విషయాలు జరగాలి.

1. ఒకరిని ఆత్మహత్య చేసుకోకుండా కాపాడాలి.( ప్రాణదానం )

2. నీ మాటలు ఒక వ్యక్తి క్రొత్త జీవితం పొందడానికి కారణం కావాలి.
( జ్ఞానదానం )

3. ఆ వ్యక్తి నీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాలి. ( పై రెండింటి దాన సిద్ధి )

అంత వరకు ప్రేతయాతనలు పొందకుండా ఈ దీపం లో ఉంచుతాను అంటూ దీపంలో ఉంచి ఇక్కడ పాతిపెట్టాడు.

ఎవరైనా నీతులు చెప్పగలరు.కానీ ఆచరించడం లోనే ఉంది గొప్పంతా!
నీ శక్తిసామార్థ్యాలవల్లనే ఇదంతా నువ్వు సాధించావు.నేను చేసిందేమీ లేదు.
నీ వల్ల నా మూడు విషయాలు ఒకేసారి నెరవేరి నాకు ప్రేతరూపం నుండి విముక్తి లభించింది.నీకే నా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ఆ భూతం " సూర్య నటించిన రాక్షసుడు సినిమాలోని ఆత్మలా " బంగారు రేణువులుగా విడిపోతూ శూన్యంలో కలిసి పోయింది.

" ఒకరికి సహాయం చేయడం లోనే మన మేలు కూడా ఉందన్న " క్రొత్త సత్యాన్ని తెలుసుకున్న ఆ స్త్రీ కొంగ్రొత్త ఉత్సాహంతో తెలుసుకున్న ఆ సత్యాన్ని ఆచరణ లో పెట్టడానికి బయలుదేరింది.
స్వస్తి
(ఓపికగా చదివిన వారికి )
ధన్యవాదములతో
యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా | నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమ: ||

ధర్మ మహిమ ! (చక్వవేణ మహారాజు కధ )

ధర్మ మహిమ !
➖➖➖✍
(చక్వవేణ మహారాజు కధ )

“ధనం పెరిగిన కొద్దీ దానం పెరగాలి! విలాసాలు,డాబు పెంచుకున్నారంటే,
ఏ నాటికైనా పతనం తప్పదు!”

వరిపంటకు నీరు లేకపోతే ఎండిపోతుంది, సమంగా ఉంటే బంగారంలా పండుతుంది. అధికమైతే, ఆ నీటనే మునిగి, కుళ్ళి, నశిస్తుంది.

ఇక్కడ నీటినే ధనం అనుకుంటే...తగినంత లేకుంటే కరువు, సరిపడా ఉంటే సమృద్ధి, ఎక్కువైతే... తనను తానే నశింపచేసుకునే రాచమార్గం !

అదే అధికంగా ఉన్న ధనాన్ని(నీటిని తీసివేస్తే) దానం చేస్తే తిరిగి దైవానుగ్రహమనే దివ్య ఫలాన్ని పొందవచ్చు.

ఇప్పుడు లోకం తీరు మారింది. ఉన్నది తినేకంటే, తింటూ ఎదుటివాడికి చూపి, గొప్పలు కొట్టుకునే పధ్ధతి పెరిగింది.

తమకున్న డబ్బు, కార్లు, బంగళాలు, విలాస వస్తువులు, తిరిగిన ప్రాంతాలు అన్నీ వెంటనే ఇతరులకు సోషల్ మీడియా ద్వారా చూపాలి.

చీరలు, నగలు ధరించి, షోకేసుల్లో బొమ్మల్లా, ఇతరులకు ప్రదర్శించాలి. నిజానికి ఇటువంటి వారి చూపు, నవ్వు, ప్రదర్శన అంతా పటాటోపమే, వీరికి అంతర్గత శాంతి ఉండదు. వీరిని చూసి, ఇతరులు అనుకరించరాదు. మరి అంతర్గత శాంతి, ధర్మచక్రం యొక్క బలం ఎలా ఉంటుంది, అని అడిగేవారు, చక్వవేణ మహారాజు కధను, తప్పక చదివి తెలుసుకోవాలి !!

పూర్వం చక్వవేణుడు అనే ధర్మాత్ముడు, సదాచారపరాయణుడు, సత్యవాది, దయామయుడు, మహాజ్ఞాని, అయిన మహారాజు ఉండేవాడు. అతను రాజద్రవ్యాన్ని తనకోసం వాడుకోవడం దోషంగా భావించి, భార్యతో తన పొలంలో వ్యవసాయం చేసుకునేవాడు. రాణి నాగలి లాగితే, రాజు విత్తనాలు చల్లేవాడు. తమ పొలంలో పండిన ప్రత్తితో బట్టలు చేసుకు ధరించేవాడు. తమ పొలంలో పండిన ఆహారమే తినేవారు.
రాణికి ఖరీదైన ఆభరణాలు ఉండేవి కావు, వారి కష్టార్జితం వారి జీవనానికే సరిపోయేది.

ఒకనాడు ఆ రాజ్యంలో జరిగిన తీర్ధానికి వచ్చిన ధనికులైన వ్యాపారుల భార్యలు, ఆడంబరంగా రాణిని దర్శించి, ఆమె కూడా మహారాజును అడిగి, అటువంటివి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

వారి మాటలు విన్న రాణి, చక్వవేణుడిని, తనకూ విలువైన వస్త్రాభరణాలు కావాలని కోరింది.
రాజు బాగా ఆలోచించాడు- తాను రాజద్రవ్యాన్ని ముట్టడు, కాని తను
సామ్రాట్టు కనుక, దుష్టులు, బలవంతులు, అత్యాచారులు అయిన రాజుల నుంచి పన్నును వసూలు చెయ్యవచ్చు, అనుకున్నాడు.

తన మంత్రిని రప్పించి, “రాక్షస రాజైన రావణుడి వద్దకు వెళ్లి, నేను 1.25 మణుగుల బరువైన బంగారాన్ని పన్నుగా చెల్లించమని, ఆజ్ఞాపించాను అని చెప్పి, తీసుకురమ్మని “ అనుజ్ఞ ఇచ్చాడు.

మంత్రి తెచ్చిన వార్తను విన్న రావణుడు అతన్ని పరిహాసం చేసి, పంపాడు. ఇదే విషయాన్ని మండోదరికి చెప్పగా, ఆమె ‘స్వామీ ! పొరపాటు చేసారు. వారడిగిన బంగారం ఇవ్వాల్సింది. చక్వవేణుడి మహిమను రేపు ఉదయం మీకు చూపుతాను, ‘ అంది.

ఉదయం ఆమె పావురాలకు గింజలు వేసి, అవి తింటూ ఉండగా, ‘రావణుడి మీద ఆన, గింజలు ముట్టకండి, ‘ అంది, అవి లెక్కచెయ్యక, తినసాగాయి.

వెంటనే ఆమె, ‘చక్వవేణుడిపై ఆన, ఇక గింజలు ముట్టకండి,’ అంది, వెంటనే పావురాలు అన్నీ ఎగిరిపోయాయి. ఒక చెవిటి పావురం వినబడక, గింజ తినగానే, తల తెగి, క్రింద పడింది. తర్వాత రాణి, ‘చక్వవేణ మహారాజుపై ఆనను ఉపసంహరిస్తున్నాను, గింజలు తినండి,’ అనగానే, పక్షులు మళ్ళీ గింజలు తినసాగాయి.
‘చూసారా స్వామి ! ఇదీ చక్వవేణుడి ధర్మ చక్ర మహిమ,’ అంది, మండోదరి. ‘పిచ్చి పక్షులకు ఏమి తెలుస్తుంది ?’ అంటూ కొట్టి పారేసాడు రావణుడు.

చక్వవేణుడి మంత్రి సముద్ర తీరానికి చేరి, ఇసుక, మట్టితో లంకా నగర నమూనాను సరిగ్గా అలాగే చేసి, ‘ఒక వినోదం చూపుతాను,’ అంటూ, రావణుడిని పిలుచుకువచ్చాడు. ‘చక్వవేణ మహారాజుపై ఆన’, అంటూ నమూనాలో తూర్పువైపు
ఉన్న బురుజులు, ప్రాకారాలను పడగొట్టగానే, లంకలో నిజంగా అమరిఉన్న నిజమైన తూర్పు వైపు బురుజు, ప్రాకారం కూలిపోయాయి.
హతాశుడయ్యాడు రావణుడు. అలాగే మంత్రి, నమూనాలో ఉన్న తూర్పువైపు స్థూపాలు, ‘చక్వవేణ మహారాజుపై ఆన’ అంటూ, పడగొట్టగానే నిజ లంకాపుర స్థూపాలు కూలిపోయాయి. ఇది చూసి, బెదిరిన రావణుడు, మంత్రి కోరిన బంగారాన్ని అతడికి ఇచ్చి, పంపేశాడు.
మంత్రి చక్వవేణుడికి బంగారం ఇవ్వగా, అతడు అది ఎలా తెచ్చావో చెప్పమని, మంత్రిని అడిగాడు. మంత్రి చెప్పింది విన్న రాణి ఆశ్చర్యచకితురాలు అయ్యింది. ఆమె పవిత్రవర్తనం యొక్క మహిమ తెలుసుకుని, బంగారం వద్దంది. ఆ బంగారం తిరిగి, రావణుడికి పంపివెయ్యబడింది. అన్ని లోకాలను ప్రభావితం చెయ్యగల చక్వవేణుడి త్యాగబుద్ధిని తెలుసుకుని, రావణుడి హృదయం కూడా పరివర్తన చెంది,
మంత్రిని ఆదరించి, పంపివేసాడు.

నీతి : క్షణకాల దుస్సంగాత్యం కూడా అనర్ధాన్ని కలిగిస్తుంది. అందుకే దురభ్యాసాలు, మత్తుపదార్దాలు, క్రీడావినోదాలు, ఖరీదైన ఆడంబరాలతో గడిపేవారి సాంగత్యం వదలాలి.
మోసంతో ఆర్జించిన మృష్టాన్నం కూడా విషతుల్యమే అవుతుంది. పవిత్ర ద్రవ్యం
వల్ల ప్రాప్తించిన పిడికెడు అన్నమైనా అమృతతుల్యం అవుతుంది.
దానం, దయ, ప్రేమతో, అన్ని ప్రాణుల పట్ల సమభావంతో ప్రవర్తిస్తే, ప్రపంచమే

పాదాక్రాంతం అవుతుంది !
ఇది సత్యం ....!✍
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

Put AC at 26+ degrees and put the Fan on.

Put AC at 26+ degrees and put the Fan on.
📣📣📣📣📣📣📣📣
Very useful information sent by an executive engineer from EB:
Correct use of AC:
As hot summer has started and we use Air conditioners regularly, let us follow the correct method.

Most people have a habit of running their ACs at 20-22 degrees and when they feel cold, they cover their bodies with blankets. This leads to double loss. HOW ???

Do you know that the temperature of our body is 35 degrees Celsius? The body can tolerate temperature ranging from 23 degrees to 39 degrees easily. It is called human body temperature tolerance.

When the Room temperature is lower or higher, the body reacts, by sneezing, shivering, etc.

When you run the AC at 19-20-21 degrees, room temperature is much lower than the normal body temperature and it starts the process called hypothermia in the body which affects blood circulation, whereby, blood supply in some parts of the body is not adequate. There are many disadvantages in long term such as arthritis etc.

Most of the time there is no sweating when AC is ON, so the toxins of the body can not come out and in the long term, cause risk of many more diseases, such as skin allergy or itching, high blood pressure etc.

When you run AC at such low temperatures, it's compressor continuously works on full energy, even if it is 5 stars, excessive power is consumed & it blows money from your pocket.

What is the best way to run AC ?? Set up Temperatures for 26 Degrees or more.
You don't get any benefit by first setting Temperature of AC to 20 - 21 and then wrap the sheet/ thin Quilt around you.
It is always better to run AC at 26+ degrees and put the fan on at slow speed. 28 plus degrees is better.

This will cost less electricity and your body temperature will also be in the range and there will be no ill effect on your health.

Another advantage of this is that the AC will consume less electricity, the blood pressure on the brain will also decrease and Saving will ultimately help reduce the effects of global warming. How ??

Suppose you save about 5 units per AC per night by running AC on 26+ Degree and other 10 lakh houses also do like you then we save 5 million units of electricity per day.

At the regional level this savings can be crores of units per day.

Please consider the above and do not run your AC at all below 26 degrees. Keep your body and environment healthy.

Forwarded in Public Interest
Ministry for Power
and Energy. GOI.
👏👏👏👏👏👏👏👏
Forward share.
👍👍👍👍👍👍👍👍

శుక్రవారం విడిచిన దుస్తుల్నే ధరిస్తే..? బియ్యం కొలిచే పాత్రను బోర్లిస్తే?

శుక్రవారం విడిచిన దుస్తుల్నే ధరిస్తే..?
బియ్యం కొలిచే పాత్రను బోర్లిస్తే?

శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మీదేవిని ఉపాసన చేస్తే ధన సమృద్ధి కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి. సంపదలతో తులతూగాలి అనుకునే వారు శుక్రవారం పూట అష్టైశ్వర్యాలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం చేయాలి. ఇంకా ఇంట పసుపు, ఉప్పు అయిపోయాయనే మాట వినబడ కూడదు. పసుపును కొనాలి. లేదా ఉప్పును తేవాలి అని చెప్పడం చేయొచ్చు.

ఉప్పు, పసుపు అయిపోయేంతవరకు ఉపయోగించకూడదు. అవి అయిపోయే లోపు ఇంట తెచ్చుపెట్టుకోవడం చేయాలి. అలాగే ఇంట్లో అన్నం వండేందుకు ముందు బియ్యాన్ని కొలుస్తాం. ఆ కొలిచే పాత్రను ఎప్పటికీ బోర్లించకూడదు.

ఇంట సుఖసంతోషాలు, సిరిసంపదలు పొందాలంటే.. విడిచిన బట్టలను తలుపుకు వేలాడదీయకూడదు. విడిచిన బట్టలను రెండో రోజు, మూడో రోజు ధరించకూడదు. ప్రత్యేకించి శుక్రవారం నాడు విడిచిన దుస్తులు ధరిస్తే దరిద్ర్యం చుట్టుకుంటుందని ఆధ్యాత్మిక పండితులు హెచ్చరిస్తున్నారు.

శుక్రవారం నాడు సాత్త్విక ఆహారాన్ని తీసుకోవాలి. పాలను వినియోగించాలి.

శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి, రంగ వల్లికలతో అలంకరించి.. దీపారాధన చేయాలి.

రోజూ లేదా శుక్రవారం రాత్రిపూట కొద్దిపాటి అన్నాన్ని శేషంగా ఓ చిన్నపాటి గిన్నెలో వుంచి వంటింట్లో వుంచడం సంప్రదాయం. ఇలా చేస్తే పితరులు, దేవతలు ఆ ఇంట అన్నం ఎల్లప్పుడూ వుండుగాక అంటూ దీవిస్తారని ప్రతీతి.

శుక్రవారం నుదుట బొట్టు ధరించే వారికి కలకాలం సౌభాగ్యం నిలిచివుంటుంది. ఇంకా స్టిక్కర్లను నుదుటన ధరించకుండా తెల్ల వక్కలతో తయారైన కుంకుమను శుక్రవారం ధరిస్తే మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శుక్రుని అనుగ్రహం కూడా లభిస్తుంది.

తెల్ల వక్కలను, నేతిలో వేయించి చూర్ణం చేసి ఆ మిశ్రమానికి కస్తూరి పొడి, కుంకుమ పువ్వు పొడిని కలిపి చూర్ణం చేసుకుంటే కుంకుమ సిద్ధమవుతుంది. ఈ కుంకుమను నుదుటన ధరించడం ద్వారా సుగంధ భరితమైన సువాసనతో పాటు శుక్రుని అనుగ్రహం కూడా లభిస్తుంది. ధనవృద్ధి వుంటుంది.

శుక్రవారం పూట తెల్లని వస్త్రాలను ధరించడం ఓ నియమం. తెల్లని వస్త్రాలంటే శుక్రునికి, మహాలక్ష్మీకి ప్రీతికరం. తెల్లని దుస్తులను శుక్రవారం ధరిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

* అలాగే శుక్రవారం పూట కమలములతో, కలువలతో లక్ష్మీదేవికి అర్చన చేసినట్లైతే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇంకా పుష్పాలను దానం చేసినా, అన్నదానం చేసినా, వస్త్ర దానం చేసినా శుభఫలితాలుంటాయి. కస్తూరిని మిత్రత్వం కోరి స్నేహితులకు అందించినా, శుక్రవారం వర్జ్యం వున్న సమయంలో మౌనవ్రతం పాటించినా ఆ ఇంట తప్పకుండా ధన సమృద్ధి కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

నాగసాధువుల గురించి కొన్ని విషయాలు


ఒక వ్యక్తి #నాగసాధువు గా మారడానికి ముందుగా తాను తనకు సంబంధించిన అన్ని భవబంధనాలను వదులుకోవలసివస్తుంది.
అందుకే కుంభమేళా జరిగే సమయంలో అక్కడి వారికి తొలి ప్రాధాన్యం ఇస్తుంటారు. వీరు ధరించే విభూది నామాలు మరియు రుద్రాక్షల ద్వారా ఏ ఆగడాకు చెందిన వారో తెలియచేయబడుతుంది. ఒక వ్యక్తి నాగ సాధువుగా మారాలంటే ముందుగా ఆగడా పెద్దలను కలసి వారి వివరాలు తెలియచెయ్యాలి.
వీరు చెప్పిన సమాచారం నచ్చితే వారిని స్వీకరిస్తారు లేదా అక్కడే రాంరాం చెప్పేస్తారు. ఒక సారి వద్దు అనుకుంటే మళ్ళీ జీవితంలో వారిని స్వీకరించరు. వీరికి అక్కడ 6 నెలలు నుండి 12 సంవత్సరాలు వరకు శిక్షణ ఉంటుంది. ఆ సమయం లో వారికి ఎంతో కఠినమైన శిక్షణ ఇవ్వబడుతుంది. ఇంకా యోగా మరియు ధ్యానం లాంటి వాటిలో శిక్షణ ఇస్తారు.

మన మహా ఋషులు తపస్సు అనే పేరుతో విటీతోనే ఎన్నో అద్భుతమైన ఫలితాలు పొందేవారు. కొందరికి తెలియని విషయము ఏమిటంటే అఘోరాలు వేరు నాగ సాధువులు వేరు
నాగ సాధువులు శాకాహారులు వీరు నేల పైనే నిద్రించాలి,
రోజులో ఒక సారి మాత్రమే భుజించాలి, వీరు భిక్షాటన ద్వారా తమ అహరాన్నివారే సంపాదించుకోవాలి అది కూడా వారు రోజుకు 7 ఇళ్ల ముందు మాత్రమే భిక్ష అడగాలి ఆ ఇంటి వారు ఏది ఇచ్చిన మహా ప్రసాదంగా స్వీకరించాలి వారు ఏమీ ఎవ్వనిచో శివాజ్ఞ అని ఉపవాసం ఉండాల్సిదే, వీరు దిగంబరంగ జీవించాల్సి ఉంటుంది. శిక్షణ తొలి రోజులలో ఒక కాషాయ అంగ వస్త్రం మాత్రమే ధరిస్తారు శిక్షణ కాలం పెరిగేకొద్దీ విభూదిని మరియు రుద్రాక్షలు మాత్రమే దరిస్తారు.

వీరు ప్రధానంగా ఐదుగురు దేవతలను మాత్రమే పూజించాలి
మొదటిగా శివుని , శక్తిని వినాయకుని , విష్ణువును మరియు సూర్యుని మాత్రమే పూజిస్తుంటారు. ఆగడాలకు వచ్చిన వారికి అంచె అంచెలుగా శిక్షణ ఇవ్వబడుతుంది. ముందుగా వీరు అవధూతగా మారాలి గుండు చేయించుకొని వారి కర్మ కాండలను వారే నిర్వహించుకోవాలి పిండ ప్రదానం చేసుకున్న తరువాతనే వీరికి ఆఫీషియల్ నాగ సాధువులుగా గుర్తింపు లభిస్తుంది
ఇక్కడ శిక్షణ కాలంతో పాటు వారి హోదా పెరుగుతువస్తుంది.

మొదటగా
1. నాగ సాధువుగా
2. మహంతగా
3. శ్రీ మహంతగా
4. జమతియా మహంతగా
5. పీఠ మహంతిగా
6. దిగంబర శ్రీ గా
7. మహా మండలేశ్వరుడిగా
చివరిగా
8. ఆచార్య మండలేశ్వరుడిగా పదవులను అలంకరించును.

చివరి వరకు వెళ్లలేని వారు వారి వారి స్థాయిలలో స్థిరపడి పోతుంటారు. వీరు హిందు పరిరక్షణ కొరకు ప్రాణాలను ఇవ్వటానికి అయినా తీయటనికైనా సిద్ధంగా ఉంటారు.

ఈక్కడ మరో విషయం ఏమిటంటే ఆచార్య మండలేశ్వరుడిగా మారీనా వారికి చావు పుట్టుకలను శాసించే శక్తి ఉంటుంది.
వీరు ఏంత కాలమైన నిద్ర మరియు ఆహారాలను లేకుండా జీవించగలరు. వీరు మనుష్యలకు కనిపించేందుకు ఇష్టపడరు.
హిమాలయాల నడుమ కొండ గుహలలో నివాసాలు ఏర్పాటు చేసుకొని నివశిస్తుంటారు.

కొన్ని కొన్ని సందర్భాలలో మాత్రమే సూక్ష్మ రూపులుగా దేశం నలుమూలల సంచరిస్తుంటారు ధర్మ పరిరక్షణ గాడి పడిన రోజున కాల రుద్రులుగా మారుతుంటారు. శిక్షణ లో ఉన్న నాగ సాధువులను మనం కాశీ, హరిద్వార్ లాంటి ప్రదేశాలలో ఉన్న ఆగడాలలో కొన్ని అనుమతులు ద్వారా దర్శించవచ్చును. అక్కడ మహిళలకు ప్రవేశం నిషిద్ధం.

"ఇకపోతే నాగసాధువులు లక్షల్లో కుంభ మేళానికి వస్తారు వీరు వచ్చేసమయాలో ట్రాఫిక్ ఉన్న జాడలు ఉండవు, ఎక్కడ హోటల్ లో ఆహారం తీసుకున్న దాఖలు ఉండవు, వీరు కేవలం సూక్ష్మ రూపం లో ఆహారాన్ని నింపుకుంటారు. ఒక్కసారిగా లక్షలో వచ్చి కొద్దీ దూరం వెళ్ళాక ఎవరికి కనిపించరు...

🙏 ఓం నమః శివాయ హర హర మహాదేవ్ 🙏



ఫిబ్రవరి 28, "జాతీయ సైన్స్ దినోత్సవం" సందర్భంగా కొన్ని విషయాలు

꧁🌱💐HAPPY NATIONAL SCIENCE DAY TO ALL💐🌱꧂

🔭🔬🧪ఫిబ్రవరి 28, "జాతీయ సైన్స్ దినోత్సవం" సందర్భంగా కొన్ని విషయాలు🧪🔬🔭



సముద్రం నీలిరంగులో ఎందుకుంటుంది..?ఆకాశం నీలి రంగులోనే ఎందుకుంటుంది. పగలు నక్షత్రాలు ఎందుకు కనపడవు.? అసలు రామన్ ఎఫెక్ట్ అంటే ఏమిటి..? ఎన్నో ప్రశ్నలు,మరెన్నో ఆసక్తికర అంశాలు..వీటన్నింటికీ సమాధానం సివి రామన్ కనుగొన్న సూత్రాలే ప్రామాణికం. సైన్సు రంగంలో ఎవరూ చేయలేని సాహసాలను అత్యంత సునాయాసంగా చేధించి ప్రపంచ వినువీధిలో మన దేశ పతాకాన్ని రెపరెపలాడించారు. వైజ్ఞానిక రంగంలో ప్రపంచ దేశాలను తలదన్నేలా భారత్ ను శక్తివంతగా చూపించారు. ఆప్పట్లోనే అబ్బురపరిచే ప్రయోగాలకు నిలువెత్తు వేదికలా నిలిచారు సర్ సివి రామన్. ఆయన రామ‌న్ ఎఫెక్ట్ క‌నిపెట్టిన రోజునే దేశంలో జాతీయ సైన్స్ దినోత్స‌వం(నేష‌న‌ల్ సైన్స్ డే)గా జ‌రుపుకుంటున్నారు.

వైజ్ఞానిక రంగంలో తొలి నొబెల్ బహుమతి పొందిన కాంతి పుంజం. దేశంలో రెండవ నోబెల్ పొందిన మహనీయుడు, అంతేకాదు ప్రతిష్టాత్మక భారతరత్న అందుకున్న తొలి విజ్ఞాన కెరటం. ఒక్క మాటలో చెప్పాలంటే వైజ్ఞానిక శాస్త్రానికే వైద్యుడిలా మారాడు ఈ విజ్ఞాన యోధుడు. ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో వెల్లడించిన వ్యక్తిల్లో సర్ సీవి రామన్ మొదటి వ్యక్తి. నోబెల్ బహుమతి అందుకున్న మొట్టమొదటి భారతీయ శాస్త్రవేత్త సీవీ రామన్. నవంబర్ 7, 1888 తమిళనాడులోని తిరుచురాపల్లిలో చంద్రశేఖర్ వెంకట రామన్ జన్మించారు. తండ్రి చంద్రశేఖర్ అయ్యర్, తల్లి పార్వతి అమ్మాళ్. వారిది మధ్యతరగతి కుటుంబం. తండ్రి విశాఖపట్నంలోని ఏవీఎన్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేయడం వల్ల రామన్ బాల్యం, విద్యాభ్యాసం విశాఖలోనే జరిగింది.

రామన్ తన 13 వ ఏట ప్రెసిడెన్సీ కాలేజీలో 1902 లో ప్రవేశించి, 1904 లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై బంగారు పతకం పొందాడు. 1907 లో అదే కాలేజీ నుండి యం.ఏ. డిగ్రీని ఫిజిక్స్ లో డిస్టింక్షన్లో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తర్వాత తల్లిదండ్రుల కోరిక మేరకు ఐసిఎస్ పాసై కలకత్తా ప్రభుత్వ ఆర్థికశాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్గా చేరారు. ఉద్యోగంలో చేరే ముందు లోకసుందరి అమ్మాళ్తో పెళ్ళయింది. ఒకసారి కలకత్తాలో ప్రయాణం చేస్తున్నప్పుడు బౌబజారు స్ట్రీట్ దగ్గర ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే బోర్డు చూసి పరుగు పరుగున అక్కడికి వెళ్ళాడు. ఆ సంస్థ కార్యదర్శి డాక్టర్ అమృతలాల్ సర్కార్ ను కలిసి పరిశోధన చేయడానికి అనుమతిని పొందారు. అలా అనుమతి పొందిన తరువాత పరిశోధనలపై ఉన్న ఆసక్తి వలన తెల్లవారుజామున ఐదున్నరకే ఐసిఎస్ కు రామణ్ వెళ్ళేవారు. వారాంతారాలు, సెలవులు ఇలా ఎలాంటి వెసులుబాటు దొరికినా ఎక్కువగా పరిశోధనలతోనే గడిపాడు. తన జీవిత కాలంలో సగభాగం పరిశోధనలకే కేటాయించాడంటే ఆయనకు పరిశోధనలపై ఎంత ప్రేమ దాగి ఉందో అర్థం చేసుకోచ్చు అతని తల్లి పార్వతి అమ్మాళ్కు సంగీతంలో మంచి అభిరుచి ఉండేది. ఆమె వీణను అద్భుతంగా వాయించేది. అందుకే రామన్ తొలి పరిశోధనలు వయోలిన్, వీణ, మృదంగం వంటి సంగీతవాయిద్యాల గురించి సాగాయి. విజ్ఞాన పరిశోధన తృష్ణ వలన తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసరుగా చేరారు. 1921 లో లండన్లో తను అధ్యయనం చేసిన సంగీత పరికరాల శబ్ద రహస్యంపై ఉపన్యాసాలు ఇచ్చారు. అప్పుడు శ్రోతల్లోని ఒకరు ఇలాంటి అంశాలతో రాయల్ సొసైటీ సభ్యుడు కావాలనుకుంటున్నావా ఏంటి అని వెటకారంగా అన్నప్పుడు ఆయనలో పరిశోధనలపై మరింత ఆసక్తి పెరిగింది.

సముద్రంలో నీరు నీలి రంగులో ఎందుకుందంటూ సీ. వి. రామన్ చేసిన ప్రయోగం ఓ సంచలనం. అనేక అద్భుతాలకు వేదికగా నిలిచిన ప్రయోగం. ఈ విషయంపై ఎన్నో పరిశోధనలు ఆయన చేశారు. ఈ ప్రయోగాల ఆధారంగానే ఆయనకు నొబెల్ బహుమతి వరించింది. అంతే కాదు భారతరత్న అవార్డు కూడా ఆయన ఖాతాలో చేరింది. శబ్దశాస్త్రం నుంచి తన పరిశోధనలను కాంతి శాస్త్రం వైపు మార్చాడు. తన తిరుగు ప్రయాణంలో ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రం నీరు రెండింటికి నీలిరంగు ఉండటం ఆయనను ఆలోచింపచేసింది. అప్పటిదాకా అనుకుంటున్నట్లు సముద్రపు నీలి రంగుకు కారణం ఆకాశపు నీలిరంగు సముద్రం మీద ప్రతిఫలించడం కాదు. సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడమే కారణం అని ఊహించారు. కలకత్తా చేరగానే తన ఊహను నిరూపించడానికి ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘనపదార్థాలు కాంతి పరిక్షేపణం గురించి పరిశోధనలు చేశారు. అందుకు యువశాస్త్రవేత్తలైన కె.ఆర్.రామనాధన్, కె.యస్.కృష్ణన్ ఆయనకు అండగా నిలిచారు. ప్రకృతిని అమితంగా ప్రేమించే రామన్, అందులోని శబ్దాలు, రంగులు, విలువైన రాళ్లు, వజ్రాలు మొదలైన వాటి మీద పరిశోధన చేశారు.

ఆకాశం నీలి రంగులో ఉంటుంది కాబట్టి సముద్రం నీలిరంగులో ఎందుకు ఉంటుందని తన పరిశోధనల ద్వారా రుజువు చేశారు. సముద్ర జలంలోని అణువులు సూర్యకాంతిని వివిధ వర్ణాలుగా విడదీసి వెదజల్లుతాయి. వివిధ వర్ణాలు వివిధ దశలలో వెల్లివిరుస్తాయి. నీలిరంగు కిరణాలు మాత్రం ఎక్కువ లోతుకు చొచ్చుకుపోయి ప్రతిఫలిస్తాయి. అందువల్ల సముద్రం నీలి రంగులో ఉంటుందని రామన్ వివరించారు. వీటిలో ఒక పరిశోధనా ఫలితానికే 1930 లో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. రామన్ ను భారత ప్రభుత్వం ప్రథమ జాతీయ ఆచార్యునిగా నియమించింది. 1954 లో 'భార తరత్న' బిరుదు ఇచ్చింది. 1957 లో సోవియట్ యూనియన్ 'లెనిన్ బహుమతి'తో సత్కరించింది. విదేశాలలో ఎన్నో అవకాశాలున్నా కాదని, మన దేశంలోనే అరకొర సదుపాయాలతోనే పరిశోధనలు చేసి సివిరామన్ ఎన్నో విజయాలు సాధించారు.

భారతరత్న అందుకున్న సమయంలో రామన్ ఇచ్చిన సందేశాత్మక ఉపన్యాసం నేటీకీ ఎంతోమందిని అలోచనలో పడేస్తోంది. విజ్ఞాన శాస్త్ర సారాంశం, ప్రయోగశాలల పరికరాలతో వికసించదు. నిరంతర పరిశోధన, స్వంతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మధించి వేస్తాయి 'అంటూ ఆయన చేసిన ప్రసంగం నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. ఉదయాకాశంలోని వెలుగుల్లో చెట్లు ఎంత అందంగా కనబడతాయో మీరు ఎప్పుడైనా గమనించారా? నాకు వీటిని చూస్తూ ఉంటే స్పటిక నిర్మాణం గురించిన ఆలోచనలు వస్తుంటాయి. అందుకే "విజ్ఞానం అత్యుత్తమైన సృజనాత్మక కళారూపం అని రామన్ ఎప్పుడూ చెబుతుండే వారు.

రామన్ జీవితంలో మరో మైలురాయి రామన్ ఎపెక్ట్ సిద్దాంతం. వస్తువు మీద కాంతి కిరణం పడితే అది పరివర్తనం చెందుతుందని.. దానివల్లనే అది తన గమనాన్ని మార్చుకుంటుందని తన సిద్దాంతాల ద్వారా రుజువు చేశారు రామన్. అప్పటికున్న అరకొర సదుపాయాలతోనే మన దేశ విజ్ఞాన కిరణాలను నలుదిశలా ప్రసరింపజేశారు.

1927 సంవత్సరం భౌతిక శాస్త్రంలో కాంప్టన్ నొబెల్ బహుమతి పొందినప్పుడు రామన్ లో సరికొత్త ఆశలను రేకెత్తించాయి. కాంప్టన్ ఫలితం ఎక్సరేయిస్ విషయంలో నిజమైనపుడు, కాంతి విషయాలలో నిజం కావాలి కదా అనే ఆలోచనలో పడ్డారు. ఆ ఆలోచనే రామన్ ఎఫెక్టుకు దారితీసింది. తగినంత అధునాతనమైన పరికరాల్లేకపోయినా, రామన్ తన ఆలోచనకు ప్రయోగ రూపంలో జవాబు లభిస్తుందని నమ్మకంతోనే విజయం వైపు అడుగులు వేశారు. సూర్యుని నుంచి వెలువడే తెలుపు వర్ణపు కాంతి వాయువులోని అణువులపై పడి, వాటి ప్రయాణ దిశను మార్చుకుంటాయని తన పరిశోధనల ద్వారా తెలుసుకున్న సి.వి. రామన్ ఓ సిద్ధాంతాన్ని సూత్రీకరించాడు. వస్తువు మీద కాంతి కిరణం పడితే అది పరివర్తనం చెందుతుందని 1928 సంవత్సరం, ఫిబ్రవరి 28న రామన్ మొట్టమొదటిసారి ప్రకటించారు.

పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింపచేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది. ఈ విషయాన్ని 1928 మార్చి 16 న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞుల సదస్సులో చూపించాడు. అతను అనుకున్నట్లే 1928 ఫిబ్రవరి 28 న రామన్ ఎఫెక్టు ఆవిష్కరించడం జరిగింది. ఈ పరిశోధనను అభినందిస్తూ బ్రిటీష్ ప్రభుత్వం 1929 లో నైట్ హుడ్ బిరుదుతో సత్కరించింది. ఈ రామన్ ఎఫెక్టు అసామాన్యమైనదని, అందులో 200 రూపాయలు కూడా ధర చేయని పరికరాలతో ఆ విషయ నిరూపణ జరగడం అద్భుతమైనదని ప్రపంచ శాస్త్రజ్ఞులంతా రామన్ ను అభినందించారు.

అఖండ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన రామన్ కు ఎన్నో గౌరవ డాక్టరేట్లు లభించాయి. 1924 లో ఇంగ్లండ్ రాయల్ సొసైటీ సభ్యుడయ్యాడు. 1928 లో రామన్ కు సర్ బిరుదు దక్కింది. 1947 లో ప్రతిష్ఠాత్మకమైన ఫ్రాంక్లిన్ మెడల్ లభించింది. సి.వి. రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొని ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచాడు. తన అనన్య సామాన్య పరిశోధనా సామర్ధ్యంతో ఫిజిక్స్ రంగంలో రామన్ ఎఫెక్ట్ కనుగొని చరిత్ర సృష్టించిన ఫిబ్రవరి 28 నే జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకొంటున్నాం. 1987 ఫిబ్రవరి నుండి ప్రతీ సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవంగా భారత ప్రభుత్వం అధికారకంగా జరుపుతోంది.

విజ్ఞాన ఆవిష్కరణల్లో భారతీయులకు నోబుల్ రావడం గగనం. అలాంటిది సర్ సీవి రామన్ అ ఘనత సాధించిపెట్టారు. అదీ ఆసియా ఖండం చరిత్రలోనే విజ్ఞాన శాస్త్రంలో ఆఘనత దక్కించుకున్న ఏకైక వ్యక్తి రామన్. పరిశోధనల కోసం భారతీయులు విదేశాలు వెళ్ళడమేంటీ.. విదేశీయులే.. పరిశోధనల కోసం ఇక్కడకు రావాలని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి రామన్ రామన్ ముందువరకూ సైన్సులో నోబెల్ బహుమతులు అన్నీ తెల్ల జాతీయులైన పాశ్చాత్యులకే దక్కేవి. కాని, రామన్ నూటికి నూరుపాళ్ళూ భారతీయునిగా ఈ గడ్డపైనే చదువుకొని, తలమానికమైన పరిశోధన జరిపి సైన్సులో భారతీయుల శక్తిసామర్ధ్యా లను ప్రపంచానికి చాటి చెప్పి భారత్ కు నోబుల్ సాధించిపెట్టారాయన.

1913 లో సాహిత్యంలో మనదేశం నుండి నోబెల్ బహుమతి పొందిన విశ్వకవి రవీంద్రనాధ్ ఠాగూర్ అనంతరం సైన్సు రంగంలో విజయఢంకా మ్రోగించిన అఖండ ప్రజ్ఞాశాలి రామన్ ఒక్కరే కావడం అందరికీ గర్వకారణం. రామన్ పరిశోధనలు సైన్సులో, పారిశ్రామిక రంగంలోనూ క్రొత్తపుంతలు త్రొక్కడానికి దారితీసింది. శాస్త్రరంగంలో రామన్ స్పెక్టో స్కోపీ ఆవిర్భావానికి భారతరత్న, 1957 లో లెనిన్ శాంతి బహుమతి లభించాయి. కాంతి ప్రసరణపై జరిపిన పరిశోధనలకు నోబెల్ బహుమతి లభించింది. మనకి స్వాతంత్య్రం రాగానే రామన్ కు మొట్టమొదటి నేషనల్ ప్రొఫెసర్ గా ప్రభుత్వం నియమించి గౌరవించింది. 1948 లో బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ గా రిటైరయ్యారు. దృష్టి, కాంతి, ధ్వని, వర్ణాలు, ద్రవాల తలతన్యత, ఖనిజాలు, డైమండ్, క్రిస్టల్ తదితర అంశాలపై పరిశోధనలు జరిపిన సి.వి. రామన్ సుమారు 465 పరిశోధన పత్రాలను వెలువరించాడు. వాటిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగుళూరు వారు సేకరించి భద్రపరిచారు.

1949 లో బెంగుళూరులో రామన్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ స్థాపించి, 1970 నవంబరు 27 న ఆయన మరణించే వరకూ, ఆ సంస్థలో పరిశోధనలు జరిపి, మన దేశంలో సైన్సు అభివృద్ధికి మార్గదర్శకు లయ్యారు. 1971 నవంబర్ 21 న సి.వి. రామన్ పోస్టేజి స్టాంపును భారత ప్రభుత్వం వెలువరించి ఆ మహా శాస్త్రజ్ఞుడిని గౌరవించింది. 1933 లో బెంగళూరులో టాటా ఇన్స్టిట్యూట్ డైరెక్టరుగా వున్నప్పుడు జర్మనీ నుండి హిట్లర్ ఎంతోమంది సైన్సు నిష్ణాతులను తరిమివేసేవాడు. జాత్యహంకారంతో హిట్లర్ బాధల గాధలకు గురిచేస్తున్న నిష్ణాతులైన యూదు సైంటిస్టులను, ఇతర సైంటిస్టులను మనదేశానికి ఆహ్వానిస్తే, మనదేశం సైన్సు రంగంలో అగ్రగామి కాగలదని రామన్ ఆకాంక్షించాడు. మనదేశస్తులు విదేశాలు వెళ్ళి చదువుకొనే బదులు విదేశస్తులనే మనదేశం ఆహ్వానించాలని రామన్ అభిమతం.

రామన్ ఆశించినంతగా విజ్ఞానరంగంలో మనదేశం దూసుకుపోతుందా అంటే.. అంతగా లేదనే చెప్పాలి. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ వైపల్యమేనని చెప్పాలి. పాలకులు ప్రయోగాల కోసం విధిలించే అరకొర నిధులు కారణంగా ఈ ప్రయోగాల మీద శాస్త్రవేత్త ఆసక్తి సన్నగిల్లుతోంది. ప్రపంచదేశాలతో పోలిస్తే భారత్ శాస్త్ర సాంకేతిక రంగ స్థానం ప్రస్తుతం 8వ స్థానంలో ఉంది. సైంటిస్టులకు దేశాల సరిహద్దులు వుండవు. సైన్స్ విశ్వజనీనం. ఇది నమ్మిన రామన్ రామన్ హిట్లర్ వల్ల హింసకు గురియైన, అవమానపడ్డ కొందరు నోబెల్ బహుమతి పొందిన శాస్త్రజ్ఞులను వచ్చి మనదేశంలో స్థిరపడమని, యిక్కడ పరిశోధన కొనసాగించమని ఆహ్వానించాడు. దానితో బ్రిటీషు ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని హర్షించకపోగా, సి.వి. రామన్ ను టాటా ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ పదవి నుండి తొలగించింది.

ఆ సంఘటన రామన్ లో పట్టుదల, దీక్షను మరింత పెంచింది. సైన్స్ రంగంలో మనదేశం స్వయం సంపూర్ణం కావాలని వివిధ రంగాలలో తన కృషిని కొనసాగించారు. తన తలపాగాను తియ్యలేదు. విదేశస్తుల ముందు తలవంచలేదు. సైన్సు పరిశోధనల ద్వారానే మనదేశం ప్రపంచ దేశాలలో అగ్రగామి కాగలదని రామన్ స్పష్టంగా గుర్తించారు. ఆ దిశగానే అడుగుల వేసి మన దేశాన్ని ప్రపంచపటంలో నిలిపారు. భౌతిక శాస్త్రంలో భారత కీర్తి కిరీటిగా సి.వి రామన్ నిలిచాడు. రామన్ తరువాత ఏ భారతీయునికి లేదా ఏ ఆసియా వాసికి భౌతిక లేదా విజ్ఞాన శాస్త్రంలో నోబెల్ బహుమతి రాలేదు. భారత్లో శాస్త్ర పరిశోధనను పెంపొందించడం కోసం 1934 లో రామన్ భారత అకాడమీ ఆఫ్ సైన్స్ ను ప్రారంభించారు. మన పూర్వీకుల విజ్ఞానానికి ధీటుగా సైన్స్ ను భవిష్యత్తు తరాలకు అందించాలని అలాంటి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నదే ఆయన సంకల్పం. ఆ కేంద్రంలో మన మేధావులు విశ్వ రహస్యాలను ఛేదించాలన్నది ఆయన ఆకాంక్ష. రామన్ ఎఫెక్ట్ ఆసరా చేసుకుని అనేక దేశాల్లో శాస్త్రవేత్తలు ప్రయోగాలు, పరిశోధనలు చేశారు. దాదాపు 1800 పరిశోధన పత్రాలు ప్రచురించబడ్డాయి. 2500 రసాయనిక సమ్మేళనాలపై అధ్యయనం జరిగింది.

మనదేశంలో విజ్ఞాన శాస్త్ర అభివద్ధి ఎలా ఉందో చూస్తే చాలా విచారంగా ఉంటుంది. ఈ విషయం మనకే కాదు మన పాలకులు కూడా ఆంగీకరిస్తారు. బడ్జెట్లో శాస్త్ర, సాంకేతిక రంగాలకు నిధులు అంతంత మాత్రంగానే కేటాయిస్తుండటంతో శాస్త్రవేత్తలు ప్రయోగాలు వైపు అంతగా ఆసక్తి చూపడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. 133 కోట్ల జనాభా ఉండి స్వాతంత్య్ర భారత చరిత్రలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇప్పటిదాకా నోబెల్ బహుమతి పొందగలిగింది ఒక్కరే అంటే భారత్ ప్రపంచ దేశాలతో ఎంత వెనుకబడి ఉందో అర్థం చేసుకోవచ్చు. శాస్త్ర పరిశోధన పత్రాల ప్రచురణ విషయంలో భారతదేశం ప్రపంచ దేశాలతో పోలిస్తే ఎనిమిదో స్థానంలో ఉంది. భారత దేశంలో సంవత్సరానికి 1,54,827 పరిశోధనా పత్రాలను ప్రచురిస్తుండగా ఆమెరికాలో 14,25,550 పత్రాలను ప్రచురిస్తున్నారు.

🌴🦢🦢🦢🦢🦢🦢🦢🌴

Friday, February 28, 2020

ఎందుకు లేదా నాకే ఎందుకు లేదా నేనేం తప్పు చేశాను? అన్న దానికి బదులుగా

ఊహించని దుఃఖం మన దారిలో కలిగినప్పుడు లేదా ప్రాణాంతక సందర్భాలు వచ్చినప్పుడు మనం 'ఎందుకు?' అని ప్రశ్నిస్తాము.

ఏదైనా కష్టమైనవి జరిగినప్పుడు, చాలా మంది తమని తాము 'నేనేం తప్పు చేశాను?' అని ప్రశ్నించుకుంటారు?

దానికి బదులుగా 'ఈ దుఃఖం నన్ను ఎక్కడికి తీసుకువెళుతోంది? దేని నుండి దూరంగా తీసుకెళుతోంది? ఇప్పుడు నాకోసం ఏమి ఎదురుచూస్తోంది?' అని ప్రశ్నించుకోండి.

మీకోసం మరొక గొప్ప ప్రేమ ఎదురుచూస్తోంది.

ఈ ప్రేమ ద్వారా మనం అపరాధ భావం మరియు ప్రాయశ్చితం వదిలేస్తాము. మనం సంకుచితం గా ఉండటానికి బదులుగా వ్యాకోచించి ఉండగలుగుతాము. ఎందుకు వేరే విధంగా ఉన్నాము అని ఆశ్చర్యపోతాము. కారణం కోసం గతాన్ని చూడకుండా, భవిష్యత్తు మనకోసం ఇచ్చే అవసరాన్ని మనం ప్రశ్నించవచ్చు. 'ఇది ఎక్కడ నుండి వచ్చింది?', 'ఇది నన్ను ఎక్కడికి తీసుకువెళ్లాలని అనుకుంటోంది?' ఇదంత వెంటనే బయటపడదు. మనం వేరొక మార్గంలో ఉన్నాం. అదే ప్రేమ మార్గం.

మనం ఎక్కడికి తీసుకువెళ్లబెడుతున్నాం అన్నది మనకు ఖచ్చితంగా తెలియకపోవచ్చు.

ఎందుకు లేదా నాకే ఎందుకు అన్న దానికి బదులుగా 'మన లక్ష్యం ఏమిటి?' అన్న దాన్ని తెలుసుకోండి. వెనువెంటనే అపరాధ భావం మరియు ప్రాయశ్చిత్తం నుండి ప్రేమ వైపుకు మారిపోతాము. ఎవరిని అయితే మన జీవితం నుండి పక్కన పెట్టేసామో, వారి పట్ల కూడా ఇప్పుడు ప్రేమ కలుగుతుంది.

ఎస్ పత్రి

Reference:

🌎 బ్రహ్మర్షి పితామహ పత్రీజీ 27-2-2020 వ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన english మెసేజ్ కి తెలుగు అనువాదం🌎

🌷 "పాండిచ్చేరి"🌷
🌹 "27-2-2020"🌹

బెర్ట్ హెల్లింగర్ రచించిన “TOGETHER IN THE SHADOW OF GOD” అనే పుస్తకం నుండి కొన్ని రచనలు

మనకు ఉన్నదంట్లో చిన్న సాయం అయినా చాలు.- ఒక చిన్న కథ

🌹ఒక చిన్న కథ🌹

ఒక చిన్న హోటల్ చేతిలో గిన్నె పట్టుకుని ఒక పదేళ్ళ బాబు " అన్న అమ్మ పది ఇడ్లిలు తీసుకురమ్మన్నారు డబ్బులు రేపు ఇస్తాను అన్నారు అని చెప్పాడు "

ఆ హోటల్ యజమాని ఇప్పటికే చాలా బాకీ ఉన్నదీ
అమ్మతో చెప్పు
ఇప్పటికి తీసుకువెళ్ళు గిన్నె ఇలా ఇవ్వు బాబు సాంబార్ పోసిస్తాను అని చెప్పాడు

ఇడ్లి పొట్లం కట్టి గిన్నెలో సాంబార్ పోసి బిడ్డ చేతిలో పెట్టాడు .
సరే అన్న వెళ్ళొస్తాను అమ్మకు చెప్తాను అని చెప్పి బయల్దేరాడు

అదే హోటల్ లో అన్ని గమనిస్తున్న వ్యక్తి యజమాని దగ్గరకు వెళ్లి అడిగాడు
ఇప్పటికే చాల బాకీ పడ్డారు అంటున్నారు మళ్ళీ ఎందుకండీ ఇచ్చి పంపారు అని

ఆ యజమాని ఆహారమే కదండీ నేను ఇస్తున్నది .
పెట్టుబడి వేసే నేను నడుపుతున్నది కానీ ఇటువంటి చిన్న పిల్లలు వచ్చి అడిగినప్పుడు లేదని చెప్పడానికి మనసు రావట్లేదు .
ఈరోజు కాకపోయినా రేపైనా నా డబ్బులు నాకు ఇచ్చేస్తారండి
కాస్త లేటుగా ఇస్తారు అంతే
అందరికి డబ్బులు అంత సులభంగా దొరకదు.
బిడ్డ ఆకలితో అడిగుంటుంది అందుకే పంపారేమో .
నేను ఇస్తాను అనే నమ్మకంతో పంపారు ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేను .
నేను కష్టపడి సంపాదిస్తున్న డబ్బు అండి ఎలాగైనా నాకు వస్తుందండి మోసం చేయరు .కానీ ఇప్పటికి వారి ఆకలి తీరుతుంది కదండీ అది ముఖ్యం

నేను ఇప్పుడు ఇవ్వను అంటే ఆ బిడ్డ ఆ తల్లికోసం దొంగతనం చేయొచ్చు లేదా
ఆ తల్లి ఆ బిడ్డను బిక్షమెత్తడానికి పంపవచ్చు లేదా ఆ తల్లి బిడ్డ ఆకలి తీర్చడానికి తప్పుడు మార్గం ఎంచుకోవచ్చు
ఇప్పటికి నేను నష్టపోవచ్చు కానీ
సమాజంలో జరిగే మూడు తప్పుడు ప్రయత్నాలను నేను ఆపగలిగాను అంతే అన్నాడు .
ఇంత ఆలోచించిన ఆ మహనీయుడికి మనసులోనే దణ్ణం పెట్టుకున్నాడు ఆ వ్యక్తి .

దేవుడు లేడని ఎవరండీ చెప్పేది .
ఇలాంటి వారి మనస్సులో ఉన్నాడండి
వాళ్ళు ఇచ్చేస్తారన్న నమ్మకంలో ఉన్నాడండి

ఒక మనిషి మనల్ని వెతుకుంటూ వచ్చారంటే మనం కచ్చితంగా ఇస్తాము అనే నమ్మకంతోటె వస్తారు.

మనకు మించిన సహాయం చేయమని చెప్పడంలేదు.
మనకు ఉన్నదంట్లో చిన్న సాయం అయినా చాలు.🍁

Thursday, February 27, 2020

FIVE FINGER CONCEPT (ఐదు వేళ్ళు) ENGLISH & TELUGU

FIVE FINGER CONCEPT

LITTLE FINGER - FOOD
RING FINGER - THOUGHTS
MIDDLE FINGER - INFORMATION
FORE FINGER - WORDS
THUMB - VIEW OF LIFE

Positive Food : Taking vegetarian food.
Negative Food: Non-veg Food

Eat fresh and hot food, and only veg food. Eat only when you are hungry, not when you have a desire.
Eating more than we want and food stored in refrigerator is a negative food.
Don't force feed children and guests.

2types of thoughts
Positive thoughts and negative thoughts.

I should gain others should lose is a negative thoughts
I should win. Others should win, is a positive thought.
Think good about everybody. Right thoughts. Sarve Jana sukino bavanthu.
India good and even Pakistan good.
Remove negative thoughts.

Positive information and negative information.

Books have more information. Which book to read. Bagwatgita positive information. There are Positive books and negative books
Right information is got by reading right books.
Authentic information
Source is correct then the information is correct.
Take correct information. It should have an impact on us, on thinking and future life.
Source of information is to be analysed, so that we can follow the right path.
POSITIVE WORDS AND NEGATIVE WORDS
When we Open our mouth positive speech and negative speech comes.
Encouraging others in the right path are positive words.
Don't underestimate your word power. Always use positive words. Don't use negative words. We should speak like Ramana Maharishi, Buddha etc

VIEWS OF LIFE
A person will ask Narada Maharishi, when am I going to get mukthi. After sitting in meditation, Narada replies after four incarnations. The person says, oh! No. This is negative view of life. Narada meets another person who was dancing, and even he asks Narada the same question. Narada replies after 14incarnations. He replies, wow! So nice. I am happy. This is positive view of life. A yogi has no complaints. If you are a God you will have right view of life.

If you are a pyramid master, then you will have right food, right thoughts, right information, right words, and right view of life. Be perfect in all the five departments. Then you will be a PANCHAKALYANI HORSE. Teach all your friends, neighbours, relatives, thus five finger concept.
POSITIVITY WILL LEAD YOU TO HEAVEN AND NEGATIVITY WILL LEAD YOU TO HELL

FOOD. - PHYSICAL BODY
THOUGHTS. - MIND
INFORMATION - INTELLECT
WORDS. - SOUL
LIFE. - GOD

When you take right food, you get right thoughts. when you get right thoughts, you get right information. When you get right information, you get right words. When you get right words, you have a happy life.


Source:Our Guruji BRAHMARSHI PITAMAHA PATRIJI speech at Kanchipuram




🟤 బ్రహ్మర్షి పితామహా పత్రీజీ కాంచీపురంలో ఇచ్చిన సందేశం🟤

ఐదు వేళ్ళు

▪చిటికెన వేలు- ఆహారం
▪ఉంగరం వేలు- ఆలోచనలు
▪ మధ్య వేలు- సమాచారం
▪చూపుడువేలు- మాటలు
▪బొటనవేలు- జీవితాన్ని చూసే విధానం.

🔹 సానుకూల ఆహారం(పాజిటివ్ ఫుడ్): శాకాహారాన్ని తీసుకోవడం

🔹 ప్రతికూల ఆహారం(నెగిటివ్ ఫుడ్): మాంసాహారం.

తాజాగా, వేడిగా ఉన్న శాఖాహార భోజనం మాత్రమే తీసుకోవాలి. కేవలం ఆకలి ఉన్నప్పుడే తినాలి కానీ, కోరిక కలిగినప్పుడు కాదు. అవసరాన్ని మించి తినడం లేదా ఫ్రిజ్లో ఉంచిన ఆహారాన్ని తీసుకోవడం అనేది ప్రతికూల ఆహారం. ఇంటికి వచ్చిన అతిథులకు లేదా పిల్లలకు బలవంతంగా ఆహారాన్ని ఇవ్వవద్దు.

రెండు రకాల ఆలోచనలు

సానుకూల ఆలోచనలు
ప్రతికూల ఆలోచనలు

నేను లాభం పొందాలి, ఇతరులు నష్ట పోవాలి అన్నది ప్రతికూల ఆలోచన. నేను గెలవాలి, ఇతరులు కూడా గెలవాలి అన్నది సానుకూల ఆలోచన. ప్రతి ఒక్కరు గురించి మంచిగా ఆలోచించండి. సరైన ఆలోచనలు. సర్వేజనా సుఖినోభవంతు.

ఇండియా మంచిదే, పాకిస్తాన్ కూడా మంచిదే. ప్రతికూల ఆలోచనలను నిర్మూలించండి.

సానుకూల సమాచారం మరియు ప్రతికూల సమాచారం

పుస్తకాలలో చాలా సమాచారం ఉంటుంది. ఎటువంటి పుస్తకాన్ని చదవాలి. భగవద్గీతలో చాలా సమాచారం ఉంది. మంచి పుస్తకాలు ఉన్నాయి మరియు చెడు పుస్తకాలు ఉన్నాయి. సరైన సమాచారం సరైన పుస్తకాలు చదివినప్పుడు లభిస్తుంది. సరైన సమాచారం యొక్క మూలం సరైనప్పుడు, అందులో ఉన్న సమాచారం కూడా సరైనది అవుతుంది. అది మన ఆలోచనల పైన మరియు భవిష్యత్తు పైన ప్రభావం చూపించాలి. సమాచారం యొక్క మూలాన్ని విశ్లేషించడం వల్ల, సరైన మార్గాన్ని అనుసరించగలుగుతాము.

సానుకూల మాటలు మరియు ప్రతికూల మాటలు

మన నోరు తెరచి నప్పుడు సానుకూల మాటలు మరియు ప్రతికూల మాటలు కూడా వస్తాయి. ఇతరులను సరైన మార్గానికి ప్రోత్సహించడం అనేది సరైన మాటలు. మీ వాక్ శక్తిని తక్కువ అంచనా వేయొద్దు. ఎల్లప్పుడూ సానుకూల మాటల్ని ఉపయోగించండి. పూల మాటలను ఉపయోగించవద్దు. రమణ మహర్షి బుద్ధుడు వంటి వారిలా మాట్లాడాలి.

జీవితాన్ని చూసే విధానం

ఒక వ్యక్తి నారదమహర్షిని "నాకు ఎప్పుడూ ముక్తి లభిస్తుంది?" అని ప్రశ్నించాడు. ధ్యానంలో కూర్చున్నాక నారదుడు, "నాలుగు జన్మల తర్వాత" అని సమాధానమిచ్చాడు. ఆ వ్యక్తి "ఓహ్" అన్నాడు. ఇది జీవితాన్ని ప్రతికూలంగా చూడటం. నారదుడు నృత్యం చేస్తున్న వేరే వ్యక్తిని కలిసినపుడు, ఆ వ్యక్తి కూడా ఇదే ప్రశ్నను అడిగాడు. నారదుడు అతనికి "14 జన్మల తరువాత" అని సమాధానమిచ్చాడు. అతను "వావ్! చాలా బావుంది. నేను చాలా ఆనందంగా ఉన్నాను"అని సమాధానమిచ్చాడు. ఇది జీవితాన్ని సానుకూలంగా చూడటం. ఒక యోగి ఎటువంటి ఫిర్యాదులు లేవు. మీరే కనుక ఒక భగవంతుడైతే మీకు జీవితాన్ని సరైన విధంగా చూడటం తెలుస్తుంది.

మీరు ఒక పిరమిడ్ మాస్టర్ అయినట్లయితే, అప్పుడు మీకు సరైన ఆహారం, సరైన ఆలోచనలు, సరైన సమాచారం, సరైన మాటలు మరియు జీవితాన్ని సరైన విధంగా చూడటం తెలుస్తుంది. ఈ ఐదు విషయాల్లో సంపూర్ణంగా ఉండండి. అప్పుడు మీరు పంచకల్యాణి గుర్రం లా మారుతారు. ఈ ఐదు వేల సందేశాన్ని మీ ఇరుగుపొరుగు వారికి, స్నేహితులకు, బంధువులకు, అందరికీ తెలియజేయండి.

సానుకూలత మిమ్మల్ని స్వర్గానికి తీసుకు వెళ్తే, ప్రతికూలత మిమ్మల్ని నరకానికి తీసుకువెళుతుంది.

అందుకనే ఏమో స్త్రీని పుడమి తల్లి తో పోల్చారు..

యావత్తు సృష్టిని.. ఒక్క గంటలో తయారు చేయగల్గిన దేవుడు.. స్త్రీ మూర్తిని తయారు చేయడానికి మాత్రం వారం రోజులు కష్ట పడ్డడంట. ఎందుకో తెలుసుకోవాలంటే.. మనసు పెట్టి చదవాలలి 👇

మగాడితో సహా సర్వ జీవులను పుట్టించేసిన దేవుడు చివరగా ఒక స్త్రీని సృష్టించడం మొదలుపెట్టాడు.

ఒక రోజూ రెండు రోజులూ కాదు.
ఏకంగా వారంరోజులు తీసుకున్నాడు..స్త్రీ సృష్టికోసం.
మిగిలిన పనులన్నీ మానుకుని..తన నాథుడు స్త్రీ సృష్టికోసం ఇంతగా తలమునకలైపోవడం చూసిన దేవత అడిగింది...
"స్త్రీని సృష్టించడానికి ఎందుకింత సమయం తీసుకున్నారని?".

ఆప్పుడు దేవుడు.. "ఏం చెయ్యను మరి...
ఈ స్త్రీ హృదయంలో ఎన్ని విషయాలు పొదగాల్సి వచ్చిందో తెలుసా...
ఇష్టాయీష్టాలకతీతంగా ఉండాలీ..
సృష్టి. వివక్ష తగదు.
మొండికేసే పిల్లాడిని క్షణాల్లో దారికి తెచ్చుకోవాలి.

చిన్న చిన్న గాయాలు మొదలుకుని ముక్కలయ్యే మనసులవరకూ ఎన్నెన్ని సంఘటనలను ఈ జీవి ఎదుర్కోవాలో తెలుసా...
ఆమె ఎంతమందికి ఓ ఔషధంగా పని చేయాలో తెలుసా...
ఆమెకు ఆరోగ్యం బాగులేకున్నా సరే తనకు తానే సర్దుకుపోవాలి.
అడిగేవారు ఉండరూ ఉండకపోవచ్చు...
రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయాలి.
ఇన్ని రకాల పనులు చెయ్యాల్సి వచ్చినా ఆమెకు ఉన్నవి రెండు చేతులే...." అన్నాడు.

"ఏంటీ? ఇన్ని పనులు చేయడానికి ఆమెకు రెండు చేతులేనా?" అని ఆశ్చర్యపోతూ దేవత ఆమెను మెల్లగా తాకింది.
"ఇదేంటీ ఇంత మృదువుగా ఉందే ఈమె దేహం" అని ప్రశ్నించింది.

ఆప్పుడు దేవుడు.."ఆమె శారీరకంగా మృదువుగా మెత్తగా నాజూకుగా ఉండొచ్చు.
కానీ మానసికంగా ఆమె ఎంతో బలవంతురాలు.
అందుకే ఆమె ఎన్నో సమస్యలను ఎదుర్కోగలదు. అంతేకాదు,
ఆమె అన్ని భారాలనూ తట్టుకోగలదు.

ఇష్టం, కష్టం, ప్రేమ, కోపం, తాపం, అంటూ అన్ని భావోద్వేగాలనూ ఆమె చవిచూడాలి.
అవసరమైతే దిగమింగాలి.
కోపమొస్తే నవ్వుతూ వెల్లడించే శక్తి ఆమెకుండాలి.
తనకు న్యాయం అనిపించినప్పుడు అందుకోసం పట్టుపట్టడమూ తెలుసు.
ఇతరుల దగ్గర ఆశించేది ప్రేమానురాగాలను...." అన్నాడు.

"ఓహో. ఈమె ఆలోచించగలదా" అని దేవత అడిగింది.

అప్పుడు దేవుడు.. "ఎందుకాలోచించదు?
అన్ని విషయాలూ ఆలోచించడమే కాకుండా సమస్యలు ఎదురైతే పరిష్కారాలు చెప్పగలదు..." అన్నాడు.

దేవత ఆమె చెక్కిళ్ళను తాకి "ఈ చెక్కిళ్ళు తడిగా ఉన్నాయేంటీ? కన్నీరు కారుస్తోందిగా....ఏంటిది? " అని అడిగింది.

అప్పుడు దేవుడు.. "అదా...కన్నీరది.
ఆ కన్నీటిలో ఆనందమూ ఆవేదనా దుఃఖమూ దిగులూ ఆశ్చర్యమూ భయమూ అంటూ అన్ని రకాల ఉద్వేగానుభూతులూ ఉంటాయి.

ఆ కన్నీటికున్న శక్తి అనంతం....
పైగా మరో జీవీకి ప్రాణంపోసి పది నెలలూ పొట్టలో మోసే నేర్పు ఆమెకు ఉంది" చెప్పాడు.

దేవత ఆశ్చర్యపోతూ "మీ సృష్టిలో విశిష్టమైనది ఇదే. .." అని చెప్పింది.

అయితే దేవుడు.. "అంతా బాగానే ఉన్నా ఆమెకు తన విలువా శక్తీ తెలిసినా..వాటిని అవసరమైతే తప్ప ప్రయోగించదు.
అప్పటివరకూ తెలియనట్టే ఉంటుంది..."
అవసరమైనప్పుడు..ఆ శక్తి ముందూ.. ఎవరూ నిలబడలేరు..
అని చెప్పి భూమ్మీదకు పంపాడు స్త్రీని...!!👌

ఇదంతా చదువుతుంటే.. మన జీవితంలో జరిగిన ఎన్నో ఘటనలు జ్ఞప్తికి వస్తున్నాయి కదా..
అందుకనే ఏమో స్త్రీని పుడమి తల్లి తో పోల్చారు.. 🙏👏👏👏 💐💐💐

శ్రీహరి సేవకు యోగ్యమైన పూజా పుష్పాలు ?

శ్లో:- అహింసా ప్రథమం పుష్పం, పుష్ప మింద్రియ నిగ్రహః
      సర్వ భూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః
      శాంతి:పుష్పం, తపః పుష్పం, ధ్యానం పుష్పం తధైవచ
      సత్యమష్ట విధం పుష్పం విష్ణో:ప్రీతికరం భవేత్ .

భావము:-
అహింస
ఇంద్రియ నిగ్రహము
సర్వ భూత దయ
ఓర్పు
శాంతి
పరమాత్మకై తపించుట
పరమాత్మ ధ్యానము
సత్యనిరతి

అనే ఎనిమిది విధాలైన పుష్పాలతో శ్రీహరిని ఆరాధిస్తే అనుగ్రహిస్తాడట.

మాతృమూర్తి ఋణం

మాతృమూర్తి ఋణం

ఆదిశంకరాచార్యుల వారు
సన్యాసాశ్రమం స్వీకరించి
తన ఆప్తులందరినీ త్యజించి వెళ్ళే ముందు తల్లి ఆర్యాంబ
చాలా బాధ పడింది.

"శంకరా,
నువ్వు నాకు
ఏకైక పుత్రుడువి కదా!

నన్ను వదలి వెళ్ళి పోతున్నావు,

ఆఖరి క్షణాల్లో నాకని ఎవరున్నారు?

నాకు దిక్కెవరు "
అని దీనంగా ప్రశ్నించింది.

" అమ్మా!

ఏ సమయమైనా సరే,

నీవు తల్చుకుంటే చాలు నీ ముందు వుంటాను."
అన్నాడు శంకరుడు.

భగవత్పాదులు శంకరాచార్యులవారి తల్లికి మరణకాలం సమీపించింది. మూసిన కళ్ళు తెరవ లేదు.

"నేను తలచిన వెంటనే వస్తానన్నాడే శంకరుడు"
అని మనసులోనే తలుచు కుంటూ వున్నది ఆర్యాంబ.
తల్లి తలచు కుంటున్నదన్న విషయం
ఆదిశంకరులు గ్రహించారు.

వెంటనే శ్రీకృష్ణుని ధ్యానించారు.

శ్రీకృష్ణుడు ఏం కావాలని అడిగాడు.

కురుపితామహుడు భీష్మాచార్యునికి మోక్షమిచ్చినట్లుగా
నా మాతృమూర్తికి
మోక్షం ప్రసాదించమని వేడుకున్నారు శంకరాచార్యులవారు.

అర్యాంబ , తలుచుకుంటే శంకరుడు వస్తానన్నాడే అని తపిస్తున్నప్పుడు అక్కడికి ఎవరో వస్తున్న అలికిడయింది.
కళ్ళు కూడా తెరవలేని స్థితిలో వున్న ఆర్యాంబ చటుక్కున లేచి
శంకరా!
అంటూ ,
అక్కడికి వచ్చిన
ఒక పసిబాలుని,
గట్టిగా హృదయానికి
హత్తుకుంది.

బాలుని ఒంటి నిండా ఆభరణాలను గమనించిన ఆర్యాంబ‌,

శంకరుడు సన్యాసి కదా !

యీ ఆభరణాలు ఎలావచ్చాయని అనుకున్నది.

బరువెక్కిన కనురెప్పలను మెల్లిగా తెరచి చూసింది ఆర్యాంబ.

అక్కడ తను అను నిత్యం పూజించే గురు వాయూరు శ్రీకృష్ణుడు సాక్షాత్కరించి నిలచివుండడం
గమనించింది.

గురువాయూరప్పని చూసిన ఆర్యాంబ మహదానందంతో
"అప్పా!
నోరు తెరిచి,
నీ నామజపం చేసే
శక్తి కూడా లేని యీ దీనురాలి ఆఖరిక్షణాలలో నను చూసేందుకు వచ్చావా?
కృష్ణా " అని
మెల్లిగా గధ్గద కంఠంతో పలికింది.

శ్రీకృష్ణుడు వెంటనే
" నీ పుత్రుని ఆదేశం.

రాకుండా వుండగలనా ?

అమ్మను చూడకుండా
వుండగలనా " అని
చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు.

అదే సమయానికి శంకరాచార్యులవారు కూడా అక్కడికి వచ్చారు.

ఉప్పొంగిన ఆనందంతో
ఆ మాతృమూర్తి శంకరునితో
" నాయనా !

నా భాగ్యమేమని చెప్పను ?

నిన్ను పుత్రుని గా పొంది నేను తరించాను.

సాక్షాత్తు
శ్రీకృష్ణ భగవానుడినే
నా ముందు నిల బెట్టావు కదా,
శంకరా!" అని
కన్నీళ్ళు కార్చింది .

గోపాలుని నేను నిలబెట్టడ మేమిటి?

నేను జన్మించినది మొదలు
నీవు నా కోసం
పడ్డ శ్రమకు ,
కష్టాలకు బదులుగా
నేనేమీ చేయలేక పోయాను.

సాక్షాత్తు భగవంతుడే మానవ రూపంలో పుట్టినా
మాతృ ప్రేమకు సాటిగా ,
ఎంతటి సేవ చేసినా కన్నతల్లి ఋణం అణు వంతైనా తీరదు.

నే నైనా అంతే.

నేను చేయగలిగిన దంతా
నీ దివ్య చరణాలకు హృదయ పూర్వకమైన
"సాష్టాంగ ప్రమాణం ఒక్కటే"
అని మాతృదేవత పాదాల ముందు మోక రిల్లారు ఆదిశంకరాచార్యులవారు.

మన తల్లి తండ్రుల కు
మనం చేసే సేవల వల్లనే
వారి మనసు సంతృప్తి చెంది
వారి దివ్యాశీస్సులు
సదా తమ బిడ్డలకు ప్రసాదిస్తారని
జగద్గురు
ఆదిశంకరాచార్యుల వారు
ఈ లోకానికి సందేశ మిచ్చారు.

సర్వేజనా స్సుఖినోభవంత్

మన జాతికి కావాల్సింది...మార్కులు కాదు...మంచి పౌరులు.

25 సంవత్సరాలకు ముందు గోవా దగ్గర ఒక పల్లెటూరు ఉండేది.ఆ వూరు అతిపెద్ద పుచ్చకాయలను పండించడంలో చాలా ప్రసిద్ధి పొందింది.ఆ ఊరిలో రైతులు పంట కోసే సమయంలో పిల్లలకు ఒక పోటీ పెట్టేవారు.పిల్లలు ఎవరికి ఎన్ని పూచ్చకాయలు కావాలంటే అన్ని తినవచ్చు.ఎవరు ఎక్కువ కాయలు తింటే వారికి గొప్ప బహుమతి ఉండేది.పిల్లలంతా ఆనందంగా ఆ పోటీలో పాల్గొనేవారు.ఆ పిల్లలలో ఒక్కడికి IIT లో సీటు వచ్చి పక్క రాష్ట్రానికి చదువుకు వెళ్ళిపోయాడు.ఆ అబ్బాయి 6 సంవత్సరాలు తర్వాత తన సొంత ఊరికి వెళ్ళాడు.ఆ అబ్బాయికి చిన్ననాటి పుచ్చకాయలు తినే పోటీ గుర్తొచ్చి ఊరి బయటే ఉన్న కూరగాయల మార్కెట్టుకెళ్లి....మొట్ట మొదట పెద్ద పుచ్చకాయను తృప్తిగా తినేసి వెళ్లాలని అనుకున్నాడు.

మార్కెట్లోకి వెళ్ళగానే ఒక చోట ఒక యువ రైతు పుచ్చకాయల పోటీ జరుపుతుండటం చూసి ఆనందంగా అక్కడికి వెళ్ళాడు.
కానీ ...ఆ పోటీలో అన్నీ చిన్న చిన్న కాయలే ఉన్నాయి....ఎక్కడ వేదికినా పెద్ద సైజు కాయలే కనబడలేదు.
ఆ అబ్బాయికి చాలా నిరాశ కల్గింది.దేశంలోనే పెద్ద పుచ్చకాయలు పండించే ఊరిలో .....చివరికి పెద్ద కాయలే పండ లేదు.

దీనికి కారణం ఏమై ఉంటుంది? అని ఆ అబ్బాయి ఆలోచించాడు.
చివరికి దానికి కారణం కనుక్కొన్నాడు.
తాను చిన్నగా ఉన్నప్పుడు...రైతులు కాయలపోటీల్లో...పెద్ద పెద్ద కాయలను ఇచ్చి వాటి గింజల్ని మాత్రం ఒక గిన్నెలోకి ఉంచమని... పిల్లల్ని కోరేవారు.తర్వాతా ఆ గింజల్ని సేకరించి మళ్ళీ నాటుకొని పెద్ద పెద్ద కాయలని పండించేవారు.
కానీ తర్వాత ....ఆ రైతుల కొడుకులు ....వారసత్వం తీసుకొని
ఈ పోటీలు నిర్వహించసాగారు. వారు ....పుచ్చకాయల పోటీల్లో పెద్ద కాయలకు బదులు ....చిన్న చిన్న నాసి రకం కాయల్ని ఇచ్చి పోటీలు జరిపారు. ఆ చిన్న కాయల గింజల్ని సేకరించారు.
పెద్ద కాయలను మాత్రం లాభాలకు అమ్మేవారు.
అలా ప్రతి సంవత్సరం చేశారు.సరిగ్గా...4 సం. ల కే పెద్ద కాయలు కాయడమే నశించిపోయింది.

మనం కూడా ....మంచిని మన పిల్లలకు ఇవ్వడంలో చాలా ఘోరంగా విఫలం అవుతున్నాము. మన భారతీయ సంస్కృతిలో మహిమాన్విత గాధలైన రామాయణ, భగ్వద్గీతలను,మన సంస్కృతీ లోని మంచిని మన పిల్లలకు ఇవ్వడంలో మనం గత 25 సంవత్సరాలుగా విఫలమై...వారికి పనికిమాలిన పుచ్చు గింజల్లాంటి పద్దతులను నేర్పించి......మార్కులు వస్తే చాలు....ఇక మనుషులు ఏమైపోయినా ఫర్వాలేదు....పెద్ద ఉద్యోగం వస్తే చాలు...తల్లి దండ్రులను తన్ని తరిమేసినా ఫర్లేదు......
ఆడపిల్లలను ....ఆకలిగా చూసినా ఫర్లేదు....బాగా డబ్బు సంపాదిస్తే చాలు......పేదవాడికి కాస్త సాయం చేయక పోయినా ఫర్లేదు......ఆస్తులు కూడబెడితే చాలు.....అన్న చందంలో.... పెద్దలు జీవించడం వలనే...... ఈ నాడు ఇంట్లోని ఆడబిడ్డను బయటికి పంపాలంటే ....భయపడే దౌర్భాగ్యం దాపురించింది.

పెద్దలారా.....మేలుకోండి
పిల్లలకు ...మంచిని నేర్పండి,సంస్కారాన్ని ఇవ్వండి
రాముడి గురించి చెప్పండి......వచ్చే కాలమంతా బాగుంటుంది.
లేకపోతే...ఇలాగేIIT ఫౌండేషన్ లు, ఒలంపియడ్ లు అంటూ పిల్లలను నాశనం చేసి... పనికిమాలిన దద్దమ్మల్లా తీర్చి దిద్దకండి.

మన జాతికి కావాల్సింది...మార్కులు కాదు...మంచి పౌరులు.
భారత్ మాతాకి జై!వందేమాతరం !
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🙏🙏

నేడు(27 feb) స్వతంత్ర పోరాట యోధుడు చంద్రశేఖర్ సీతారాం తివారి (ఆజాద్) గారి వ వర్ధంతి .

నేడు స్వతంత్ర పోరాట యోధుడు చంద్రశేఖర్ సీతారాం తివారి (ఆజాద్) గారి వ వర్ధంతి .

భారత స్వాతంత్ర్యోద్యమంలో దేశమాత విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి అమరుడైన వీరుడు చంద్రశేఖర్ ఆజాద్. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా మరియు అష్ఫాకుల్లా ఖాన్‌ల సహచరుడిగా బ్రిటీషువారి గుండెల్లో రైల్లు పరిగెత్తించిన ఈయన మనదేశం గర్వించదగ్గ అసమాన వీరుడు.
భగత్ సింగ్ మార్గ నిర్దేశకుడిగా పేరుగాంచిన ఆజాద్ పూర్తిపేరు చంద్రశేఖర సీతారామ్ తివారి. ఈయన పండిత్‌జీగా కూడా పిలువబడ్డారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఝాబువా జిల్లా, బావ్రా (భాబ్ గా) గ్రామంలో పండిట్ సీతారామ్ తివారి, జగరానీ దేవీలకు 1906 జూలై 23వ తేదీన చంద్రశేఖర్ ఆజాద్ జన్మించారు. ప్రాథమిక విద్యను సొంత గ్రామంలోనే పూర్తి చేసిన ఈయన వారణాసిలో సంస్కృత పాఠశాలలో హయ్యర్ సెకండరీ విద్యను అభ్యసించారు.
1919లో అమృత్‌సర్‌లో జరిగిన జలియన్ వాలాబాగ్ దుర్ఘటనతో తీవ్రంగా కలతచెందిన ఆజాద్.. ఆ తరువాత 1921లో మహాత్మాగాంధీ నడిపిన సహాయ నిరాకరణోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న నేరానికిగానూ ఈయన తన పదిహేనేళ్ల ప్రాయంలోనే అరెస్టయ్యారు.
విచారణ సందర్భంగా కోర్టులో "నీ పేరేంటి?" అని మెజిస్ట్రేట్ అడిగిన ప్రశ్నకు ఆయన పెద్ద శబ్దంతో "ఆజాద్" అని అరచి చెప్పారు. దాంతో ఆయనకు మెజిస్ట్రేట్ 15 కొరడా దెబ్బలు శిక్షగా విధించాడు. అయితే ప్రతి కొరడా దెబ్బకు ఆయన భారత్ మాతాకీ జై (వందేమాతరం) అంటూ గొంతెత్తి నినదించారు. ఇక అప్పటినుంచి చంద్రశేఖర్ ఆజాద్‌గా ఆయన పేరు స్థిరపడిపోయింది.
సహాయ నిరాకరణోద్యమం ఆజాద్‌లో దాగి ఉన్న విప్లవవాదిని మేల్కొలిపింది. ఎలాగైనా సరే భారతదేశాన్ని బ్రిటీష్‌వారి కబంధ హస్తాల నుంచి విడిపించాల్సిందేనని ఆయన బలంగా నిశ్చయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆయన హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌ను స్థాపించారు. భగత్ సింగ్, సుఖదేవ్, తదితరులకు మార్గనిర్దేశకుడిగా మారారు.
1928వ సంవత్సరంలో పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడి కన్నుమూసిన 'పంజాబ్ కేసరీ లాలాలజపతిరాయ్ మృతికి ప్రతికారంగా రాజ్ గురు, భగత్ సింగ్, బ్రిటీష్ పోలీస్ అధికారి సాండర్స్ ను కాల్చి చంపగా, సాండర్స్ వెంట వచ్చిన హెడ్ కానిస్టబులు రాండ్ ను అజాద్ కాల్చి చంపాడు. ఉత్తర ప్రదేశ్, పంజాబ్ ప్రభుత్వాలు ఆజాద్ ను సజీవంగా పట్టుకునే ప్రయత్నం చేశాయి. అతనిని ప్రాణాలతో తీసుకువచ్చినా లేక చంపి తెచ్చినా 30 వేల రూపాయలు బహుమతిగా ప్రకటించారు. అ రోజు 1931, ఫిబ్రవరి 27, శుక్రవారం అలహాబాదులోని ఆల్ఫ్రెడ్ పార్క్‌కు చేరుకోగా, ఇన్ఫార్మర్లు ఇచ్చిన సమాచారం మేరకు బ్రిటీష్ పోలీసులు చుట్టుముట్టారు. ఆజాద్‌ను లొంగిపోవాలంటూ హెచ్చరికలు చేశారు. అయినా కూడా మొక్కవోని ధైర్యంతో పోలీసులకు లొంగకుండా, ఒక్కడే పోరాడుతూ ముగ్గురు పోలీసులను హతమార్చారు. అలసిపోయేదాకా పోరాడిన ఆయన చివరి క్షణంలో తన వద్ద మిగిలిన ఒకే ఒక్క బుల్లెట్‌తో తనను తానే కాల్చుకుని అశువులు బాసారు.

లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ ఎలా వాహనమయ్యింది?

🕉🙏🏻🚩లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ ఎలా వాహనమయ్యింది?🕉🙏🏻🚩

ఒకప్పుడు కౌశికుడు అనే ఒక గొప్ప విష్ణుభక్తుడు ఉండేవాడు. అతడు గొప్ప సంగీత విద్వాంసుడు. సుమధురమైన తన గానమాధుర్యంతో మహావిష్ణువుని ప్రసన్నం చేసుకున్నాడు. స్థూలశరీరాన్ని విడిన తరువాత విష్ణులోకాన్ని చేరుకున్నాడు. శ్రీహరి తన ప్రియభక్తుని స్వాగతించి అతని గౌరవార్థం ఆంతరంగిక సంగీతసభ ఒకటి ఏర్పాటుచేసాడు. ఆ సభలో దేవర్షి నారదునికి ప్రవేశం లభించలేదు. తుంబరునికి సకల మర్యాదలతో స్వాగతం చెప్పారు. తనకు ప్రవేశం లేకపోవడం అటుంచి తన ప్రత్యర్థి అయిన తుంబరునకు స్వాగత సత్కారాలు లభించడం చూచిన నారదుడు మండిపడ్డాడు. అయినా, తమాయించుకుని లక్ష్మీదేవి మందిరంలో నుంచి లోనికి పోవడానికి ప్రయత్నించాడు. అక్కడ కూడా ఆ దేవి చెలికత్తెలు అడ్డుపెట్టారు. దానితో నారదుడు ఆ మహాలక్ష్మిని శపించాడు. అదితెలిసిన వెంటనే లక్ష్మీనారాయణులు నారదుని ముందు ప్రత్యక్షమైయ్యారు. తమను మన్నించమని వేడుకున్నారు. అప్పటికి నారదుని కోపం శాంతించింది. తన తొందరపాటుకు పశ్చాత్తాపం మొదలైంది. శరీరమంతా చెమటలు పట్టాయి.

కీలెరిగి వాత పెట్టడం బాగా తెలిసిన నారాయణుడు చేసిన దానికి సిగ్గు పడుతున్న నారదుని చూచి అన్నాడు - 'నారదా! నీ కోపకారణం నాకు తెలియును. నిజానికి భక్తి జ్ఞానములందు, శీల వర్తనములందు తుంబరుడు నీకన్న కపటి కాడు, గర్విష్టి కాడు. కపట భక్తిని ప్రదర్శించు వారెన్ని తీర్థాలు సేవించినప్పటికి వ్యర్థం. భక్తిశ్రద్ధలతో నన్నుకొలుచువారలకు అవశ్యం వశ్యుడనే. సంగీతం చేత ననుజేరవచ్చునని చాటి చెప్పుటకే కౌశిక తుంబరులను నేను సత్కరించాను. నీ శాపానికేమీ బాధ పడటం లేదు. లోకహితమే జరుగుతుంది. చింతించ వద్దు.'

నారదునికి అప్పటికి జ్ఞానోదయమైంది. "ఓ దేవదేవా! నా తప్పులను క్షమించుము. అవివేకివలె ప్రవర్తించాను. నన్ను కాపాడుము. తుంబర కౌశికులవలె సంగీతంలో మేటినైతే ఇంతటి విపరీతం జరిగి ఉండేది కాదు కదా!' అంటూ కట్టెలు తెంచుకుని ప్రవహిస్తున్న కన్నీటి వరద మధ్య నారదుడు నారాయణుని పాదాలమీద పడ్డాడు.

భక్తుని పశ్చాత్తాపం భగవంతుని హృదయాన్ని కరిగించింది. తన దివ్యహస్తాలతో నారదుని పైకి లేపాడు. ధైర్యం చెప్పాడు. సంగీతం నేర్చుకోవాలన్న కుతూహలం నిజంగా ఉంటే తాను చెప్పినట్లు చేయమన్నాడు. ఉత్తరాన మానససరోవరానికి అవతల ఒక పర్వత శిఖరం ఉంది. దాని మీద ఒక దివాంధం ఉంది. ఆ ఉలూకపతికి శుశ్రూష చేసి సంగీతంలో మేటివి కమ్మని దీవించాడు.

శ్రీమన్నారాయణునికి కృతజ్ఞతలు ప్రకటిస్తూ చెతులు జోడించిన నారదుడు సెలవుపుచ్చుకున్నాడు. వెంటనే మనోవేగంతో మానససరోవరం చేరుకున్నాడు. కమ్మని సంగీతం అస్పష్టంగా వినిపిస్తోంది. తెరలు తెరలుగా వస్తున్న ఆ గానమాధుర్యాన్ని పట్టుకుని ఆవలిగిరి శిఖరం చేరాడు. గంధర్వ, కిన్నెర, కింపురుష, అప్సరాసాదులెందరో అక్కడ సంగీతాభ్యాసం చేస్తున్నారు. వారి మధ్య గురుపీఠం మీద దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న 'గానబంధు' నారదుని చూడగానే వినయంతో ఆశనం దిగి ఎదురేగాడు. ఆనందంగా ఆసనం చూపి కుశలప్రశ్నలు వేసాడు. ఏతెంచిన కారణం చెప్పమని ప్రార్థించాడు.

నారదుడు గానబంధు వినయానికి, సంగీత పాటవానికి ఆశ్చర్యపోయాడు. తనకు తెలియని ఈ సంగీత వేత్త ఎవరని ఆలోచనలో పడ్డాడు. అతడెవరైతేనేం! తనకు కావలసింది సంగీతవిద్య. ఉలూకపతికి నమస్కరించి జపతపాదులకు సాధ్యంకాని శ్రీహరిని తుంబుర కౌశికులు గానమాధుర్యంతో వశం చేసికొన్నారని, తనకూ అలాంటీ దివ్యగాన విద్యను ప్రసాదించమని వేడుకున్నాడు. గానబంధు, నారదుని ఆంతర్యం గ్రహించి ముందు తానెవరో వివరింప సాగాడు -

పూర్వం భువనేశుడనే రాజు ఉండేవాడు. అతడు చాలా జాలి గుండెగలవాడు. ధర్మవర్తనుడు. సంప్రదాయానుసారం ధర్మకార్యాలన్నీ క్రమం తప్పకుండా నిర్వహించాడు. అటువంటి ఉత్తమ పాలకుడు సంగీతాన్ని మాత్రం నిషేధించాడు. ఎవరైనా గానాలాపన చేస్తే మరణశిక్ష విధించమని మంత్రులకు చెప్పాడు. భగవంతుని కూడా భక్తిగీతాలతో స్తుతించకూడదని చాటించాడు. ఒకరోజు హరిమిత్రుడు అనే భక్తుడు రాజాజ్ఞను మరచిపోయి భగవంతుని కీర్తిస్తూ గానం చేసాడు. ఆ గానమాధుర్యంలో మునిగిపోయిన ప్రజలు కూడా పాడకూడదన్న విషయాన్ని మరచిపోయారు. వెంటనే రాజబటులు వచ్చారు. హరిమిత్రుని రాజు ముందు నిలబెట్టారు. రాజు ఆలోచించాడు. పాడినవాడు బ్రాహ్మణుడు. బ్రహ్మహత్య మహాపాపం. మరణశిక్షతో సమానమైనది రాజ్యబషిష్కరణ. ఇలా ఆలోచించి హరిమిత్రుని సంపదనంతా స్వాధీనం చేసికొని రాజ్యం నుండి వెళ్లగొట్టాడు. కాలచక్రం తిరగడం మానదుకదా! కొంతకాలానికి రాజు మరణించాడు. పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు. అలాగే గిట్టినప్రాణి కూడ పుట్టక తప్పదు. నరుడుగా మరణించిన రాజు గుడ్లగూబగా జన్మించాడు. దివాంధజన్మ కాబట్టి రాత్రులందే ఆహారం సంపాదించుకోవాలి. తిండి ఒక సమస్యగా తయారయింది. పురాకృత దోషఫలితం కాబోలు; ఒకసారి నాలుగు రోజులైనా ఆహారం దొరగలేదు. ఆకలి దుర్లభమైపోయింది. చివరికి మరణాన్ని ఆహ్వానించాడు. అతడు పూర్వజన్మలో చేసికొన్న సుకృతం వల్ల మరణ దేవత యమధర్మరాజు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. ప్రాణం తీయకుండా ఎదురుగా నిలబడ్డ యముని చూచి 'ధర్మరాజా! ఎందుకు ఈవిధంగా నన్ను బాధ పెడుతున్నావు? నేను గతజన్మలో రాజుగా ప్రజలపై ఎంతవరకు దయాదక్షిణ్యాలు చూపించాలో అంతవరకు చూపించాను. నీవెందుకు నాపై దయ చూపవు?' అన్నాడు భువనేశుడు.

దివాంధ స్థితికి యమధర్మరాజు జాలి పడ్డాడు. తాను చేసిన తప్పేమిటో తెలియకుండా ఎవరైనా శిక్ష అనుభవించడం ధర్మం కాదు కదా! తెలిసినప్పుడే కదా పశ్చాత్తాపం కలిగేది! అలా ఆలోచించి అసలు విషయం చెప్పాడు.

"దివాంధమా! నీవు రాజుగా ఉన్నప్పుడు అనేక సత్కార్యాలు చేసినమాట నిజమే. కాని పరమాత్ముని వేద మంత్రాలతో మాత్రమే స్తుతించాలని శాసించడం నీ మూర్ఖత్వం. పరమపావనమైన సంగీతంతో హరికీర్తన చేసిన హరిమిత్రుని శిక్షించిన పాపం తక్కువైనదియా! ఆ పాప ఫలితం కొండంతయై నీకు లభించిన పుణ్యఫలానికి మించిపోయింది. అదే నేడు నిన్ను పట్టిపీడిస్తోంది. విష్ణుభక్తులకు చేసిన కీడు నీకీ అవస్థ తెచ్చిపెట్టింది. దీనినుండి బయట పడటం ఎవరికీ సాధ్యం కాదు". సమవర్తి చెప్పింది విన్నాక గాని, దివాంధానికి తాను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. ఏ మార్గంలోనైనా భగవంతుని స్తుతించ వచ్చన్న జ్ఞానం కలిగింది. చేసిన తప్పుకు క్షమించి ఎలాగైనా బయటపడే మార్గం చూపించమని ధర్మదేవత పాదాలమీద పడ్డాడు.

యముని హృదయం కూడా ద్రవించింది. "ఉలూకరాజా! చేసిన తప్పుకు శిక్ష అనుభవింపక తప్పదు. దీనికి మించిన శిక్ష అనుభవించినచో శిక్షాకాలం తగ్గుతుంది. అంగీకరిస్తే ఆ గుహలోని కేగుము. అందులో నీ గత జన్మ దేహముంది. అందుండి రోజుకు కొంత మాంసాన్ని చీల్చుకుని భక్షించు. అది పూర్తి అయిన తదనంతరం నీకు శుభం కలుగుతుంది" అని దీవించి వెళ్ళాడు.

"ఓ మహర్షీ! ఆ దురదృష్టవంతుడను నేనే! ఆ తరువాత నేనొక రోజున నా శవం వద్ద కూర్చొని ఉండగా, దివ్య తేజస్వియైన ఒక బ్రాహ్మణుడు రథంలో పోతూ నా ముందున్న శవమును చూచి రథాన్ని నిలిపాడు. దగ్గరకొచ్చి చూసి, 'ఇది భువనేశుని కాయము వలెనున్నది. ఇందేల పడియున్నది? దీనిని యీ పక్షి భక్షించుటేమి?" అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. అప్పటికి నేను ఆ విప్రుని గుర్తించాను. అతడు నా చేత బహిష్కరింపబడిన హరిమిత్రుడు. వెంటనే అతని పాదములపైబడి ప్రార్థించాను. తప్పుకు క్షమించమని అడిగాను. దుఃఖాశ్రువులు నేల రాలుతుండగా యమధర్మరాజు తెలియజెప్పిన విషయమంతా వివరించాను. హరిమిత్రుడది విని చలించిపోయాడు. తన అంతరంగ భావమునకనుగుణంగా ఇలా పలికాడు. 'నీ బాధలు చూస్తుంటే నాకెంతో విచారం కలిగింది. నీవు నాయెడల చూపిన కాఠిన్యం నేను ఆరోజునే మరచాను. నీవనుభవించిన బాధలిక చాలు. ఈ క్షణం నుండి నీకు బాధ అన్నది లేకుండునుగాక! గొప్ప సంగీత విద్వాంసుడవై లోకంలో ఉత్తమ సంగీత విద్యను బోధింతువు గాక!' అంటూ అతడు నా కృతజ్ఞతను స్వీకరించి వైకుంఠానికేగాడు. వాని దీవనలు ఫలించి నేనిట్లున్నాను" అంటూ గానబంధు తన కథనంతా వివరించాడు.

ఆ తరువాత నారదుడు గానబంధు విద్వాంసుని శిష్యుడయ్యాడు. తొలిరోజునే సంగీతం ఎలా నేర్చుకోవాలో అనే విషయం మీద పాఠం చెప్పాడు. సంగీతం ఒక దివ్యకళ అన్నాడు. తపంతో గాని, తామసంతో కాని అది పట్టుబడదన్నాడు. కళ కోసం జీవితాన్ని అర్పించాలి అన్నాడు. కష్టపడి నిరంతరం సాధనచేస్తే ఎవరైనా అపురూపమయిన ఈ కళలో ఆధిక్యం సాధించవచ్చన్నాడు. గౌరవ భావం మొహంలో ఉట్టిపడుతుండగా వినయంగా తలవంచుకొని ఆలకించాడు నారదుడు. ఆ సాధన అలా వేయేళ్లు గడిచాయి. కఠోరమైనదీక్షతో నారదుడు 3,60.006 రాగాలలో మంచి ప్రావీణ్యం గడించాడు. సహపాఠులంతా పొగిడేస్తుంటే సంగీతంలో ఇక తనకు తిరుగులేదనే గర్వంతో ఉబ్బిపోయాడు. అమితానందంతో గురువును జేరి కృతజ్ఞతలు చెల్లించాడు. గురుదక్షిణ చెల్లిస్తాను. ఏమికావాలో సెలవిమ్మన్నాడు. ఎంతటి కోరికైనా సంశయింప వద్దన్నాడు.

శిష్యుని పలుకులు విన్న ఆ గురువు ఎంతగానో సంతోషించాడు. 'ఓ మహర్షీ! దేవర్షులైన మిమ్ము నేనేమి కోరగలను! దివాంధమునకు వలసిన అవసరములేమి ఉంటాయి? శిష్యుడవైనందున ఏదో ఒకటి కోరుకొనక తప్పదు. ఈ ధరాతలం నిలిచి ఉండునంత వరకు సంగీతకళతోపాటు నేను సహితం లోకంలో గుర్తుండేలా వరము ప్రసాదింపుము' అని మనసులోని మాట బయట పెట్టాడు.

నారదుడు విశాలంగా నవ్వాడు. 'గురువర్యా! ఇది మరీ చిన్న కోరిక. ఈ చిరుకోరిక మీకున్న సంగీత పాండిత్యం తీర్చగలదు. శిష్య ప్రశిష్య కోటి వలన భూతలమున సంగీతకళ నిలిచియున్నంత వరకు మీ కీర్తికి చ్యుతి లేదు. మీరు చేసిన ఈ మహోపకారమునకు గురుదక్షిణగా లక్ష్మీనారాయణుల కటాక్షము, వారి సేవాభాగ్యమును, శాశ్వత సన్నిధానమును ప్రసాధిస్తున్నాను. ప్రళయం సంభవించినవేళ శ్రీ మహావిష్ణువునకు గరుత్మంతునివలె శ్రీమహాలక్ష్మికి నీవు వాహనమై తరియింతువు గాక!' అంటూ శిష్యునిగా కానుకను, దేవర్షిగా వరమును సమర్పించి సెలవు తీసుకొన్నాడు. ఆ విధంగా గానబంధు అనే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనమైంది.🕉🙏🏻🚩

గురుపరంపరను 1823 కన్నా ముందు ఉన్నవారిని వరుస క్రమంగా కంచి మఠం ప్రకటించడం జరిగినది.

గురుపరంపరను 1823 కన్నా ముందు ఉన్నవారిని వరుస క్రమంగా కంచి మఠం ప్రకటించడం జరిగినది.
ఈ మఠం గురుపరంపర ఈ క్రింది విధంగా ఉన్నది.

1. శంకర భగవత్పాద
(#ఆదిశంకరాచార్య)
(482 BC-477 BC)

2. సురేశ్వరాచార్య
(477 BC-407 BC)
3. సర్వజ్ఞాత్మనేంద్ర సరస్వతి
(407 BC-367 BC)
4. సత్య బోధేంద్ర సరస్వతి
(367 BC-268 BC)
5. జ్ఞానానందేంద్ర సరస్వతి
(268 BC-205 BC)
6. శుద్ధానందేంద్ర సరస్వతి
(205 BC-124 BC)
7. ఆనంద జ్ఞానేంద్ర సరస్వతి
(124 BC-55 BC)
8. కైవల్యానంద యోగేంద్ర సరస్వతి
(55 BC-28 AD)
9. కృపా శంకరేంద్ర సరస్వతి
(28 AD-69 AD)
10. సురేశ్వరేంద్ర సరస్వతి
(69 AD-127 AD)
11. శివానంద చిద్ఘనేంద్ర సరస్వతి
(127 AD-172 AD)
12. చంద్రశేఖరేంద్ర సరస్వతి
(172–235)
13. సచ్చిదానందేంద్ర సరస్వతి
(235–272)
14. విద్యాఘనేంద్ర సరస్వతి
(272–317)
15. గంగాధరేంద్ర సరస్వతి
(317–329)
16. ఉజ్జ్వల శంకరేంద్ర సరస్వతి
(329–367)
17. సదాశివేంద్ర సరస్వతి
(367–375)
18. యోగతిలక సురేంద్ర సరస్వతి
(375–385)
19. మార్తాండ విద్యాఘనేంద్ర సరస్వతి
(385–398)
20. మూక శంకరేంద్ర సరస్వతి
(398–437)
21. చంద్రశేఖరేంద్ర సరస్వతి-II
(437–447)
22. బోధేంద్ర సరస్వతి
(447–481)
23. సచ్చిత్సుఖేంద్ర సరస్వతి
(481–512)
24. చిత్సుఖేంద్ర సరస్వతి
(512–527)
25. సచ్చిదానంద ఘనేంద్ర సరస్వతి
(527–548)
26. ప్రజ్ఞా ఘనేంద్ర సరస్వతి
(548–565)
27. చిద్విలాసేంద్ర సరస్వతి
(565–577)
28. మహాదేవేంద్ర సరస్వతి-I
(577–601)
29. పూర్ణబోధేంద్ర సరస్వతి
(601–618)
30. బోధేంద్ర సరస్వతి-II
(618–655)
31. బ్రహ్మానంద ఘనేంద్ర సరస్వతి
(655–668)
32. చిదానంద ఘనేంద్ర సరస్వతి
(668–672)
33. సచ్చిదానంద సరస్వతి
(672–692)
34. చంద్రశేఖరేంద్ర సరస్వతి-III
(692–710)
35. చిత్సుఖేంద్ర సరస్వతి-II
(710–737)
36. చిత్సుఖానందేంద్ర సరస్వతి
(737–758)
37. విద్యా ఘనేంద్ర సరస్వతి-II
(758–788)
38. అభినవ శంకరేంద్ర సరస్వతి
(788–840)
39. సచ్చిద్విలాసేంద్ర సరస్వతి
(840–873)
40. మహాదేవేంద్ర సరస్వతి-II
(873–915)
41. గంగాధరేంద్ర సరస్వతి-II
(915–950)
42. బ్రహ్మానంద ఘనేంద్ర సరస్వతి-II
(950–978)
43. ఆనంద ఘనేంద్ర సరస్వతి
(978–1014)
44. పూర్ణ బోధేంద్ర సరస్వతి-II
(1014–1040)
45. పరమశివేంద్ర సరస్వతి-I
(1040–1061)
46. సంద్రానంద బోధేంద్ర సరస్వతి
(1061–1098)
47. చంద్రశేఖరేంద్ర సరస్వతి-IV
(1098–1166)
48. అద్వైతానంద బోధేంద్ర సరస్వతి
(1166–1200)
49. మహాదేవేంద్ర సరస్వతి-III
(1200–1247)
50. చంద్రచూడేంద్ర సరస్వతి-I
(1247–1297)
51. విద్యా తీర్థేంద్ర సరస్వతి
(1297–1385)
52. శంకరానందేంద్ర సరస్వతి
(1385–1417)
53. పూర్ణానంద సదాశివేంద్ర సరస్వతి
(1417–1498)
54. వ్యాసాచల మహాదేవేంద్ర సరస్వతి
(1498–1507)
55. చంద్రచూడేంద్ర సరస్వతి-II
(1507–1524)
56. సర్వజ్ఞ సదాశివ బోధేంద్ర సరస్వతి
(1524–1539)
57. పరమశివేంద్ర సరస్వతి-II
(1539–1586)
58. ఆత్మబోధేంద్ర సరస్వతి
(1586–1638)
59. భగవన్నామ బోధేంద్ర సరస్వతి
(1638–1692)
60. అద్వైతాత్మ ప్రకాశేంద్ర సరస్వతి
(1692–1704)
61. మహాదేవేంద్ర సరస్వతి-IV
(1704–1746)
62. చంద్రశేఖరేంద్ర సరస్వతి-V
(1746–1783)
63. మహాదేవేంద్ర సరస్వతి-V
(1783–1813)
64. చంద్రశేఖరేంద్ర సరస్వతి-VI
(1813–1851)
65. సుదర్శన మహాదేవేంద్ర సరస్వతి
(1851–1891)
66. చంద్రశేఖరేంద్ర సరస్వతి-VII
(1891 – 7 ఫిబ్రవరి 1907)
67. మహాదేవేంద్ర సరస్వతి-V
(7 ఫిబ్రవరి 1907 – 13 ఫిబ్రవరి 1907)
68. చంద్రశేఖరేంద్ర సరస్వతి-VIII
(13 ఫిబ్రవరి 1907 – 3 జనవరి 1994)
69. జయేంద్ర సరస్వతి
(3 జనవరి 1994 – 28 ఫిబ్రవరి 2018)
70. శంకర విజయేంద్ర సరస్వతి
(28 ఫిబ్రవరి 2018 –ప్రస్తుతం)