Sunday, February 23, 2020

మహాశివరాత్రి పర్వదినం కటిక ఉపవాసం ,జాగారం చేసి శివుణ్ణి తలిస్తే పాపాలు పటా పంచలు అవ్వుతాయా?

మహాశివరాత్రి పర్వదినం కటిక ఉపవాసం ,జాగారం చేసి శివుణ్ణి తలిస్తే పాపాలు పటా పంచలు అవ్వుతాయా?భక్తి పరాయణులు , నాస్తికహేతువాదులు వాదనలలో దేవుడు లేడు- ఉన్నాడు ఏది నిజం? చూద్దామా..
✍హర హర అంటే బోలా శంకరుడు కోటి పాపాలు చేసినా పటాపంచలు చేస్తాడు శివరాత్రి చేసి జాగారం , కటిక ఉపవాసం చేస్తే శివ సాన్నిహిత్యం పొందుతాము అని భక్తి పరుల ప్రగాఢ విశ్వాసం, హేతువాదులు ఇదంతా మూఢ నమ్మకం అలాంటివి లేవు అంటారు ఈ వాదోపవాదాలు వలన కొందరు మధ్యస్థ వాదులు జాగారం కటిక ఉపవాసం చేయాలా చేయకూడదా అనే సందేహంతో ఉంటున్నారు. ఇలాంటి వాటికి సరిఅయ్యిన సమాధానం మీ కోటిపల్లి కాలం
✍అసలు శివరాత్రి ఎన్నో రాత్రులు ఉంటే సంవత్సరం లో ఒక్కరోజునే శివ రాత్రి ఎందుకు అంటే పురాణాలు ప్రకారం శివుడు లింగకారం లో వెలసిన రోజు పురాణాలు ఎన్ని ఉన్నా లింగం అంటే 84 లక్షల జీవరాసుల్లో జీవుడు ఉద్భవించిన మొదటి క్రమం లింగా కారం ఆ తరువాత కాలక్రమేణా రూపాంతరంలో మిగిలిన భాగాలు ఏర్పడ్డాయి అంటే జీవి పరిణామ క్రమంలో సృష్టిలయ కారుని రూపం ఉంది అందుకే శివుడు సృష్టి లయ కారుడు అంటారు.ఇది ఇతిహసం అంటే వాతావరణం లో ఉండే యాంత్రిక శక్తి ,పరారుణ శక్తి, కాస్మిక్ శక్తి విశ్వం అంతా వ్యాపించి ఉంది ఆ శక్తి వలనే జీవుడు పరిణామ క్రమం జరుగుతుంది ఇది సైన్స్ .
✍శివుడు లింగాలు అన్ని ఎన్నో మహిమలు కలవి కొన్ని ఎత్తు పెరిగేవి అయ్యితే మరికొన్ని నీటిని త్రాగేవి,మధ్యప్రదేశ్ లో రంగులు మార్చేది,కాశీ శివ లింగం మహిమ అని,తంజావూరు శివ గోపురం నీడ ఏ దిక్కున పడదు,మంచుతో శివ లింగం ఏర్పడడం సముద్రం మధ్యలో వెలుసిన శివుడు దేవాలయ జెండా తుఫానులు సునామిలు వచ్చినా నేల కోరగక పోవడం ,మనిషి ఉచ్వాస నిచ్వాసాలు 2600 గుండె చప్పుడు 72 నిమిషానికి 72 బంగారు మేకులు ఇలా మనిషి నవరంద్రాలు9, గుడికి 9 ద్వారాలు ఇలా తమిళ శివాలయ కట్టడాలలో కనిపిస్తాయి పోనీ ఇవన్నీ ఇప్పుడు నిర్మించినవ అంటే కొన్ని వేల సంవత్సరాలు క్రితంమే మానవ జీవ వ్యవస్థను తలిపించే నిర్మాణము అంటే ఇలాంటి అద్భుతాలు అన్ని శివ మహిమ అంటారు భక్తి పరులు నాస్తికులు శిల్పుల నైపుణ్యం అని క్రాంతి ధర్మాలతో సూర్య కిరణాలు వలన రాతి రాళ్లు సూర్య కిరణాలు వలన రంగులు మార్చుతాయని, ఎత్తు పెరుగుతాయి అని అందుకే శివ పూజ కటిక ఉపవాసం వట్టి మూఢ నమ్మకాలు అంటారు
నాస్తికులు వాదన ఇక్కడే ఉంది అసలు కిటుకు విశ్వంలో జీవి పుట్టుక లింగా కారం కదా అంటే శరీర అంతరం లో లింగం పెరుగుతుంది. బాహ్యంలో ఉన్న లింగం అంటే మనం పూజించే శివ లింగాలు అన్ని రాతి రాళ్లతో నిర్మితమయ్యయి సూర్య క్రాంతి ద్వారా శక్తీ ని సేకరించి పరారుణ కిరణాలు గర్భ గుడి నుంచి గాలి గోపురం కలసాల ద్వారా శక్తిని వేదజల్లుతూ ఉంటాయి అందుకే శివుడు అభిషేక ప్రియుడు అంటారు మనం అభిషేకం వాడే ఆవునెయ్యి ఆవు పాలు రాతి రాళ్లు శక్తిని నిక్షిప్తం చేస్తాయి ఆ శక్తి విశ్వతరాలో ప్రవేశించి 84 లక్షల జీవరాసులు మనుగడకు ఉపయోగ పడతాయి అందుకే గుడి నిర్మాణాలు అన్ని శిల్పుల నైపుణ్యం ఉన్న ఆ భక్తిలో సైన్స్ ఉంది మన పాటించే సంప్రదాయ అంటే ఉపవాసం వలన మనకు ఆరోగ్య మేలు చేస్తుంది.
✍సంక్రాంతి అంటే మహా సంక్రాంతి అంటారు అంటే సంక్రమణం అంటే మార్పు అని మనకు నవంబర్ డిసెంబర్ లో మంచు ద్వారా వచ్చే వ్యాధులు అన్ని పొగట్ట డానికి గుడిలో కార్తీక దీపం పెట్టిస్తారు త్వద్వారా గాలిలో ఉండే తేమ పలచబడి వాతావరణం వైరస్ ల ఆవాసం గా ఉండకుండా జరుగుతుంది అప్పుడు మనకి శీతాకాలంలో N1H1,N2H5...వైరస్ ల ద్వారా వచ్చే డెంగు,స్వైన్ ఫ్లూ,బర్డ్ ఫ్లూ,టైఫాయిడ్.. ఇలాంటి విష జ్వరాలు రాకుండా ఉంటాయి మొదలు సంక్రాంతి వరకూ ఇంటికి ముగ్గు వేయడం భోగి పీడకల ఆవుపేడతో గొబ్బెమ్మ పెట్టడం ద్వారా వైరస్ నిర్ములన జరుగుతుంది.
✍ఇలా నాగు పాము పుట్టలో మొదలయ్యిన చలి శివ రాత్రి రోజు శివ శివ అంటూ పోతుంది అంటారు అందుకే శివరాత్రి అంటే కోటి దీప కాంతి ,దీపోస్తవం ఈ కోటి కాంతుల్లో వైరస్ లు మటు మాయం అయ్యి మంచి రోజులు వస్తాయి
✍అందుకే వైరస్ లను పారద్రోలే రోజు కాబట్టి లివర్ ఫంక్షన్ బాగుండాలి కనుక మితమైన అల్పాహారం తీసుకుని శివసాన్నిహిత్యం అంటే గుడి దగ్గర కోలాటం,బుర్ర కధ,యక్ష గానం లాంటి కనువిందు చేసే మనసుకి ఆహ్లాదం కలిగే లా చేస్తూ గుడి చుట్టూ దీపాలు ఆరకుండా చేసి పకృతిని కాపాడాలి అని శివరాత్రి పెట్టారు.
✍ శివరాత్రి రోజు మనం కటిక ఉపవాసం చేసి కాటికి వెళ్లమని ఏ శాస్త్రం చెప్పలేదు కొంత మంది అతి జాడ్య వాదులు ఒక మెట్టు ఎక్కి లేని శాస్త్రాలు సృష్టిస్తూ ఇలా హేతువాదులు వాదనలు కు బలం చూపిస్తున్నారు.
✍జాగారం అంటే ఇంట్లో ఉండి టీ లు త్రాగుతూ సినిమాలు చూస్తూ సెల్ గేమ్స్ ఆడుతూ జాగారం చేయటం కాదు శక్తీ బాండగారం అయ్యినా గుడికి వెళ్లి దీపాలు వెలిగిస్తూ మనిషి హార్మోన్స్ ని ఉత్పత్తికి మూలం అయ్యినా సంగీత ధ్వనులు డమరుకం శబ్దాలు జయ జయ ద్వానాలు చేస్తే పకృతి ధర్మం పాటించ బడుతుంది త్వద్వారా సమస్త జీవకోటి కి మనుగడ సాధ్యం అవ్వుతుంది.
✍అందుకే మన బారతీయులు చేసే ప్రతి పండుగలో ఒక సైన్స్ ఉంది ఎంతో గొప్ప మేధస్సుతో మనకు మన భవిషత్తు తరాలకు అందించిన అపురూప కానుకలు ఆరోగ్యం సైన్స్ ఉంది అసలు విషయం చెప్పకుండా తెలిసి తెలియకుండా మిడి మిడి జ్ఞానం తో లేనివి సృష్టిస్తూ కటిక ఉపవాసం అని పెట్టి మనిషి ప్రాణాలు పోయేలా చేస్తుంటే హేతువాదులకు బలమైన వాదన వస్తుంది.
✍శివరాత్రి అంటే మితమైన ఆహారం తీసుకుంటు దీపం వెలిగిస్తూ చేస్తే ఆరోగ్యం సమస్యలు ఉండవు అదే శివ మహత్యం ....
*✍హేతువాదులు సైన్స్ అన్నా భక్తి పరులు భక్తి అన్నా భారతీయులు జరుపుకునే ప్రతి పండుగ ఒక సైన్స్ ఉంది ఆ సైన్స్ ను భక్తి రూపంలో ఉంది ఆరోగ్యం ఉంది ఇదే మన సనాతన గొప్పతనం..
-సేకరణ

No comments:

Post a Comment