సృష్టిలో లేనిది ఏది.. మనిషిలోనూ రాదు
--------------------------- -------------------------
ధ్యానులు శ్వాసమీద ధ్యాస...అంటారు.
తాత్వికులు ఎరుకలో వుండండి చాలు అంటారు
చివరికి ఇదెలా అర్ధమయ్యిందంటే..
ధ్యాసంటే "ఏదొక దానిమీద కొంత సమయం పాటు వుండే ఓ మానసిక స్థితి" అనుకుంటున్నాం.
కానీ అలా కానేకాదు. నిజానికి మనమంతా
నిద్రలో తప్ప ఎప్పుడూ ఏదొక ధ్యాసలోనే వుంటాము. కాకుంటే తెలిసీ ధ్యాస పెట్టటం
లేదా తెలీకుండానే మన ధ్యాసలో మనం
వుండటం. మొత్తానికి వుండేది ధ్యాసలోనే.
ఇంతకీ ద్యాసంటే ఏమిటీ..!?
మనసు పెట్టటం; దృష్టి పెట్టటం; ధ్యాస పెట్టటం;
ఎరుకలో వుండటం; జాగృతమై వుండటం..
ఇవన్నీ తెలిసినవే. దాదాపు సమాన అర్ధమున్న
ఈ పదాలు సందర్భాన్ని బట్టి కొద్దిపాటి అర్ధ
భేదంతో వీటిని ఉపయోగిస్తూ వుంటాం.
ఇంక మానవీయ ఉద్వేగాలు ఏమిటీ..?
వివిధ ఉద్వేగాల్లో ధ్యాసెలావుంటుంది..?
కామ క్రోధాలు; మోహ స్వార్ధాలు;
ఈర్ష్యాసూయాలు; ద్వేష ఉక్రోషాలు
లాగే ప్రేమా ఓ ఉద్వేగమేనా?..ఐతే
వాటికి ప్రేమకి ఉన్నతేడా ఏమిటి!? ఎక్కడా!?
ఉద్వేగాలన్నింటిల్లోనూ ధ్యాస పనిచేస్తుంది.
నిజమే! ప్రేమలోనూ ద్వేషంలోనూ వున్నది
ఒకే ధ్యాసే! కానీ ఒకలాంటి ధ్యాస కాదు.
వజ్రంలోనూ బొగ్గులోనూ వున్నది
ఒకే కర్బనం.కానీ ఒకలాంటి కర్బనం కాదు.
సాధువు& సామాన్యుడిలోనూ వున్నది
ఒకే మనసు. కానీ ఒకలాంటి మనసు కాదు.
ఇక్కడవున్న తేడా ఒక్కటే.. క్వాలిటీ !
ఇంతకీ ఎలా వచ్చి చేరిందీ క్వాలిటీ..?
ఓ ధ్యాస ప్రశాంతమైతే ప్రేమ
ఓ ధ్యాస సంకుచితమైతే ఉద్వేగం
ప్రశాంతత అంటే సడలింపు(వ్యాకోచం)
నిజానికీ తత్వం మనకి సృష్టినుండి సంక్రమించిందే!
సృష్టినుండి ఉత్పన్నమైన మనిషితత్వమూ
సృష్టితత్వాన్ని పోలే కదా వుంటుంది..!?
ఓ జామచెట్టుకి కాసేది జామ కాయలే
మామిడిచెట్టుకి కాసేది మామిడి కాయలే
యావత్ విశ్వానికి ఓ లక్షణం ఉంది
మనకి తెలిసిందే..సంకోచ వ్యాకోచాలు.
సంకోచించి నపుడు చీకటి బిలాలు
వ్యాకోచించి నపుడు కాంతులీనే తారలు
చిత్రంగా ధ్యాసలోనూ అదే లక్షణం.
పదార్ధం అత్యంత దగ్గరై కిక్కిరిసి వుండగా
(బ్లాక్ హోల్)..అది దేనిని తననుండి బయటికి
రానివ్వదు.. (Possessiveness) చివరికి
కాంతితో సహా..అన్నీ తనలోకి లాగేస్తుంది.
ఉద్వేగపూరిత మైన మనసుకి వుండే ధ్యాస
కూడా అంతే. స్వార్ధం లోభం... వంటివాటిలో
ధ్యాస సంకుచితమై వుంటుంది. కోపం ద్వేషం
వంటివాటిలో ధ్యాస ఘర్షణతో వుంటుంది.
మోహం కామం వంటివాటిలో ధ్యాస తాత్కాలిక ఆనందంతో వుంటుంది.
చివరగా ప్రేమలో ధ్యాస వుండేది ఉభయచరంలా. ఇక్కడ ధ్యాస సంకుచితమైతే..ఆ ప్రేమ అంతా
(Possessiveness) నేను నాది అనే భావనతో
ముడిపడి వుంటుంది. పసివాడు అమ్మ తనదే
అనుకుంటాడు. పెద్దయ్యాక ప్రేయసి నాదే అను కుంటాడు. తనకి దక్కనిదాన్ని నాశనం చేసే తత్వం కూడా చూడొచ్చు. డబ్బు పదవి కీర్తి...అన్నీ నాకొసం
నేను ప్రేమించుకుంటూ చేసేవన్నీ.. సంకుచితమైన
ధ్యాసతో కలిగే తత్వాలు. లక్షలాది జనులు ఇక్కడ
ఇక్కడే వుంటాం. కానీ ధ్యాస విశాలత్వం ఐతే..
అప్పుడు కలిగే ప్రేమలోంచి ఓ బుద్దుడు వస్తాడు.
మనిషికి మనసునిచ్చిన సృష్టే.. దానికి
ఉద్వేగాలనిస్తోంది. వాటిని పరిణమింప
చేస్తోంది. "ధ్యాస వివిధ ఉద్వేగాలుగా
మారుతూ ఉన్నతస్థాయి ఉద్వేగంగా
పరిణమించమే ప్రేమంటే"...ఇదే
బొగ్గు వజ్రంగా మారటమంటే!!👏

No comments:
Post a Comment