Sunday, April 26, 2020

అక్షర సత్యాలు

🧘‍♀ అక్షర సత్యాలు 🧘‍♂

🍂🍃🍂🍃🍂🍃🍂🍃

🥀 మనస్సు అయస్కాంతం లాంటిది.. మంచిని తలిస్తే మంచినీ, చెడును తలిస్తే చెడును అది ఆకర్షిస్తుంది..!!

🥀 చర్య విత్తనమైతే, సంకల్పం ఎరువు ప్రతిరోజు నీళ్లు పోయడం 'అలవాటు' మొలక పెద్దదైతే ఆ చెట్టే "క్యారెక్టర్"
అది గెలుపు అనే ఫలాన్ని, సంతృప్తి అనే ఫలితాన్ని ఇస్తుంది..!!

🥀 నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్య పడే కళ్ళుంటాయి..
ఎత్తి చూపే వేళ్లుంటాయి.. వ్యంగంగా మాట్లాడే నోళ్ళుంటాయి..

🥀 బెదిరావో నీ గమ్యం చేరలేవు..
సాగిపో నిరంతరంగా.. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు..

🥀 ఓ దేవుడా నాకు కోపం వచ్చినపుడు నాకళ్లనుండి కన్నీరు రానివ్వు ,కానీ నా నోటి నుండి మాట రానియ్యద్దు..

🥀 కన్నీటితో నాకోపం వెళ్ళిపోతుంది. కానీ మాట జారితే ఎదుటివారికి బాధను
కలిగించిన వారం అవుతాం..!!

🥀 నేను దేవుడి కోసం చాలానే వెతికా! దేవుడు ఎక్కడా కనిపించలేదు. కానీ దైవత్వం ఉన్నవాళ్లు ఎందరో నాకళ్లముందే కనిపించారు....

🍂🍃🍂🍃🍂🍃🍂🍃

No comments:

Post a Comment