Tuesday, June 2, 2020

ధ్యానం అంటే ఏమిటి... ఇది.. ఒక చిన్న పిల్లవాడిని వెంటాడే ప్రశ్న. అయితే..

🍃☘️🍃☘️🍃☘️🍃☘️🍃☘️🍃

ధ్యానం.....

ధ్యానం అంటే ఏమిటి... ఇది.. ఒక చిన్న పిల్లవాడిని వెంటాడే ప్రశ్న. అయితే.. బాలుడు అర్థం చేసుకోగలిగే సరళమైన భాషలో వివరించలేనందున అతని తల్లిదండ్రులు విచారణలో పడ్డారు.

ఒకసారి ఆ కుటుంబం శ్రీ రమణ మహర్షి దర్శనం కోసం వెళ్లారు. అప్పుడు ఆ బాలుడు తన ప్రశ్నను రమణ మహర్షిని అడిగాడు.

శ్రీ రమణ మహర్షి తనలో తాను నవ్వుకున్నారు. అప్పుడు నవ్వుతున్న ముఖంతో, ఆయన భక్తుడుకి వంటగది నుండి అబ్బాయికి దోస తెచ్చి పెట్టమన్నారు.

ఒక ఆకు మీద దోస వడ్డించారు. శ్రీ రమణ మహర్షి బాలుడ వైపు చూస్తూ.. ఇప్పుడు నేను "హ్మ్ " అని చెప్తాను అప్పుడు నువ్వు దోస తినడం ప్రారంభించాలి. అప్పుడు మళ్ళీ నేను "హ్మ్" అని చెప్తాను, ఆ తరువాత దోస ముక్కను నీ ఆకు మీద ఉంచకూడదు." అని అనగా..

బాలుడు అంగీకరించాడు. అతను చాలా ఉత్సాహంగా ఉన్నాడు. మరికొందరు కుతూహలముతో చూస్తున్నారు. ఇప్పుడు బాలుడు శ్రీ రమణ మహర్షి ముఖాన్ని చూసి ఆయన ఆజ్ఞ కొరకు ఆత్రంగా ఎదురు చూశాడు. ఆయన "హ్మ్" అని ఆజ్ఞాపించగానే బాలుడు తినడం ప్రారంభించాడు.

ఇప్పుడు ఆ పిల్లవాడి దృష్టి శ్రీ రమణులపై ఉంది. అతను మరల ఆజ్ఞ రాకముందే దోస పూర్తి చేయాలనుకున్నాడు. బాలుడు ఆ తురుతలో దోస తినడం, దోస పెద్ద ముక్కలుగా చేసి తినడం చేస్తున్నాడు, కానీ, అన్ని సమయాలలో శ్రీ రమణులపై మాత్రమే దృష్టి ఉంది. దోస క్రమంగా తగ్గుతోంది. ఇక ఒక చిన్న ముక్క మిగిలి ఉంది. బాలుడు రెండవ ఆజ్ఞ కోసం శ్రీ రమణుల వైపు ఆత్రుతగా చూస్తున్నాడు. ఆయన ఆజ్ఞాపించిన క్షణం, బాలుడు వెంటనే దోసను నోటిలో పెట్టాడు.

ఇప్పుడు శ్రీ రమణులు ఆ బాలుడిని అడిగారు "ఇప్పటి వరకు నీ దృష్టి ఎక్కడ ఉంది..? నా మీద లేదా దోస మీద..?"... బాలుడు "రెండింటి మీద " అని బదులిచ్చాడు

శ్రీ రమణుల "అవును. నీవు దృష్టిని నా మీద ఉంచుతూ దోస పూర్తి చేయడంలో నిమగ్నం ఆయి ఉన్నావు.." నీవు అస్సలు పరధ్యానం చెందలేదు.

ఇలాగ మీరు మీ రోజువారీ కార్యకలాపాలను చేస్తూ మీ దృష్టి మరియు ఆలోచనలు యల్లవేేలలా ఆ ఈశ్వరుడు పైన ఉంచాలి... దీనినే ధ్యానం అంటారు...

🙏|| ఓం శాంతి ||🙏

No comments:

Post a Comment