👍🏻మానవ దేహం, జీవితం ఎంతో శక్తివంతమైనవి... ఒక వ్యక్తి తన శరీరాన్ని సవ్యంగా వినియోగించుకున్నప్పుడు, అతను అద్భుతమైన జీవితాన్నే పొందుతాడు..దివ్యమానవుడుగా విరాజిల్లుతాడు..అయితే ఇంత శక్తివంతమైన దేహాన్ని వినియోగించుకునే జ్ఞానం అతనిలో లేకపోతె అదే దేహాన్ని మరొకరు వినియోగించుకొనే వీలు కూడా ఉంటుంది..ఉదాహరణకి కంప్యూటర్ తీసుకోండి మీరు దాన్ని పూర్తి జ్ఞానంతో వినియోగిస్తే అది మీకోసం పనిచేస్తుంది..కానీ దానిని సరిగా వాడక పొతే, వైరస్ వచ్చి హాక్ చేయబడుతుంది..అప్పుడు హాక్ చేసిన వ్యకి ఎలా కావాలంటే ఆలా ఆ కంప్యూటర్ పని చేస్తుంది.... ఈ విషయాన్ని మనుషులు అందరూ అర్థం చేసుకోవాలి..కంప్యూటర్ కంటే శక్తివంతమైనది ఈ దేహం..ఈ దేహాన్ని నడిపిస్తున్నది మైండ్.. " మైండ్ పవర్" గురించి ఎన్నో పుస్తకాలు కూడా రాయబడ్డాయి. ...ఇది కూడా కంప్యూటరులాగే హాక్ చేయబడగలదు..అలా జరిగితే ఇతరుల అభిప్రాయాలకు అనుగుణంగా మీరు జీవించటం ప్రారంభిస్తారు...ట్రెండ్స్ ని బాగా ఫాలో అవుతారు ..మీ మైండ్ ని హాక్ చేసే పరికరాలను స్వయంగా మీరే ఇంట్లో పెట్టుకుంటారు..ఇలాంటి జీవితాన్ని మార్చుకోవటానికి ఏకైక మార్గం ధ్యానం..ధ్యానం ద్వారా మనస్సు శూన్యమై మీరు రీబూట్ చేయబడతారు మీరు కోల్పోయిన మీ సహజత్వం మీకు తిరిగి ప్రాప్తిస్తుంది.....
🌿👏🏻🌿👏🏻🌿👏🏻🌿
మీ...పి.సారిక
No comments:
Post a Comment