Wednesday, June 10, 2020

దేశభక్తి ప్రతీ ఒక్కరి నుండి మొదలు కావాలి ...!!

జహంగీ ర్ అనే చక్రవర్తితో "మీతో మేము ట్రేడ్ చేస్తాము" అని ఒప్పందం చేసుకుని ఒక్క కంపనీ ఆ రోజు మన దేశం లోకి వచ్చింది
.
.
ఈ రోజు మాతో మీరు ట్రేడ్ చెయ్యండి అంటూ ఎంతో మంది జహంగీరులు ( ప్రదానులూ , ముఖ్య మంత్రులూ వాళ్ళ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతున్నారు ) .
.

.
ట్రేడ్ అంటే మోసం అనే అర్ధం ఉందని జహంగీరుకు తెలియక ఓకే అన్నాడు
.

ట్రేడ్ అంటే మోసం అని తెలిసి మన జీవితాలతో ట్రేడ్ చేస్తున్నారు మన నాయకులు .
.

.
ఆనాడు స్వదేశీ ఉద్యమం అంటే చిన్న పిల్లలు కూడా
తమ ఆట బొమ్మలను మంటల్లో వేశారు
.

ఈ నాడు స్వదేశీ ఉద్యమం వాట్సాప్ + పేస్ బుక్ లో పోస్ట్ మాత్రమే !
.
.

.
ఆచరణలో ఎవరూ చెయ్యరు... కంటి అద్దం నుండి కాలి బూటు వరకూ విదేశీ అయితే మనము ఉపయోగిస్తాము .
.

.
ఆనాడు విదేశీ వస్త్రం కట్టుకున్నవాడిని హేయంగా చూసేవారు
.

.

ఈనాడు ఖాదీ బట్టలు కడితే హేయంగా చూస్తున్నారు
.
.

.
ఆనాడు గాంధీ ,
సత్యాగ్రహీ ,
నెహ్రూ, భరత్ , భగత్ , ఝాన్సీ పేర్లు పెట్టుకోవడం ఆనందం
.

ఈనాడు కిట్టీ , పప్పీ , చెంచా, డూ డ్ , సిస్సీ , ఏమిటేమిటో పేర్లు పెట్టుకోవడం ఆనందం
.

.
ఆనాడు అమ్మా, నాన్నా , పిన్నీ బాబాయ్ , పెద్దమ్మా , పెద్దనాన్నా అని పిలుచుకోవడం ఆప్యాయతలు పంచుకోవడం , ఎవరి ఇంట్లో పెళ్లి , పేరంటం అయినా అందరూ కలిసి పాల్గోవడం ఆచారం
.
.
.

ఈ రోజు అన్నిటికీ ఈవెంట్ మేనేజర్లు వచ్చి చేసేస్తే మనం కూడా ఆ టైం వరకూ మేకప్ వేసుకుని చిరునవ్వులు నటిస్తూ సేల్ఫీ లు తీసుకుని కార్యక్రమం అయ్యాక బిల్లు తలచుకుని భోరు మనడం ఆనందం.
.

.

.
లార్డ్ మెకాలే ఒక్కడి ఆలోచన మన దేశాల నాయకులు అందరూ అమలు పరచి మన దేశ సంస్కృతిని నాశనం చేస్తూ ఉంటె నెహ్రూ మొదలు వచ్చిన అందరు అదే కొనసాగిస్తూ వచ్చారు .
.
.

.
.
చదువు విషయం లో నలందా , తక్షశిల , ప్రతీ ఊరిలో గురుకులం దశ నుండి నేడు మనం ప్రతీ ఊరిలో కార్పోరేట్ స్కూల్స్ స్థాయికి వచ్చాము .
.
.

.
దేశ భక్తి అనే ఒక్క పదం తప్ప అన్నీ వచ్చు మన విద్యార్ధులకు ఇపుడు .
.

మాతృ భక్తి మమ్మీ స్థాయికి చేరింది
.

.

పితృభక్తి డాడ్డీ ఐ లవ్ యు కి చేరింది
.

సోదర ప్రేమ అనేది మృగ్యం అయ్యింది
.

ఇపుడు ప్రేమకు కొలబద్ద డబ్బు
.

ఇపుడు ప్రేమకు కొలబద్ద అధికారం
.

ఇపుడు ప్రేమకు కొలబద్ద అవినీతి
.

ఇపుడు ప్రేమకు కొలబద్ద లంచగొండితనం
.

ఈ లక్షణాలు ఉన్నవారినే మనం ప్రేమిస్తాము .
.
ఈ లక్షణాలు ఉన్న వారితోనే పరిచయాలు పెంచుకుంటాం
.

ఈ లక్షణాలు ఉన్నవారినే మనం అందలాలు ఎక్కిస్తాం .
.

ఈ లక్షణాలు ఉన్న వారినే మనతో కలుపుకుంటాం
ఒకే జాతి పక్షులుగా మనం ఉంటాం .
.
.
మార్పు కావాలా ?
మార్పు రావాలా ?
.

.
.
రావాలి అంటే ఈ వ్యవస్థ ఇంకా కుళ్ళి పోవాలి .
.
.
.
ఇపుడు ఎదుటి వాడికి జరిగిన అన్యాయం చూసి నాకేమీ కాలేదు కదా అనే ఆలోచనలో మనం ఉన్నాము
.

మనం మన కోసం జీవిస్తున్నాము
.
.
మనం మనకోసం కాకుండా ఇతరులకోసం జీవించే రోజు వస్తే అప్పుడు బాగుపడుతుంది .
.
భగత సింగ్ , రాజ గురు , సుఖదేవ్ , నేతాజీ , ఝాన్సీ , అల్లూరి , ఇలా ఏడు లక్షల మంది మన దేశానికి స్వాత్రంత్రమ్ కోసం బలిదానాలు చేశారు .
.

.

.
మన రక్షణ కోసం మనం సైనికులను పెట్టుకుని వారి బలిదానాలను కూడా మన అధికారం కోసం వాడుకుంటున్న దశకు చేరుకున్నాం .
.
.

.

మనలో ఈ మార్పులు వచ్చిన నాడు మీరు కోరుకున్న దేశం తయారు అవుతుంది
.

.

.
మనం ఒక్క దేశం
మనం ఒక్క జాతి
మన అందరి మతమూ మానవత
మన అందరి కులమూ భారత కులము
.
.

.

అది సాధ్యం అవ్వాలి అంటే ఎందఱో బలి కావాలి . అదే జరుగుతోంది ఇప్పుడు .
.

.
కులం పేర. మతం పేర. వివక్షతల పేర ...... ఇలాంటి బలిదానాల నుండి ఒక శాంతి యుత యుద్ధం జరగాలి .
.
.
.
.
.
. అది నా నుండి ,
మీ నుండి ,
మన నుండి ,
ప్రతీ ఒక్కరి నుండి మొదలు కావాలి ...!!🙏🏻🙏🏻

No comments:

Post a Comment