Sunday, June 7, 2020

అసలు దేశభక్తి అంటే ఏమిటి? రాజకీయం అంటే ఏమిటి? అని తెలుసు కోవాలనుకొంటే మనం ఒక మహా మనీషి గురించి తెలుసుకోవాలి. ఆయనే..

✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️

🤔ప్రస్తుతం రాజకీయాలను చూస్తుంటే వెగటు పుట్టిస్తు, పరమ వికారంగా ఉన్నాయి. అసలు దేశభక్తి అంటే ఏమిటి? రాజకీయం అంటే ఏమిటి? అని తెలుసు కోవాలనుకొంటే మనం ఒక మహా మనీషి గురించి తెలుసుకోవాలి. ఆయనే..🤔

అది ఒక గ్రామంలోని వీధిబడి, ఆ బడిలో మాష్టారు తెలుగుపాఠం చెబుతున్నారు! ఇంతలో ఒక పిల్లాడు లేచి సార్ ఈడికి నిన్న మీరిచ్చిన పుస్తకం వేరే వాల్లకు అమ్మేశాడు సార్ అని పక్క అబ్బాయిని చూపుతూ చెప్పేడు. దానికి మాష్టర్ ఏమిరా వెధవా వాడు చెబుతున్నది నిజమేనా అని అడిగితే, అవును అది నిజమే అని ధైర్యంగా చెప్పేడు ఆ ఆకుర్రాడు సారుతో. ఏందుకురా అలా చేశావు వెధవా ! ఆ పుస్తకం లేకపోతే పాఠాలు నీకెలా గుర్తుకు వస్తాయి, అని గద్దించగా, అందుకు ఆ అబ్బాయి నేను మొత్తం పుస్తకాన్ని చదివేసి అవపోసన పట్టానండీ అన్నాడు ఆ పిల్లాడు.

దానికి కోపంతో మాష్టర్ ఓరి బడుద్దాయ్ నాకే అబద్దం చెబుతావా అయితే ఇది చెప్పు ఆ పుస్తకంలో 8 వ పేజీలో ఏముంది చెప్పుచూద్దా అనగా, ఆ పేజీలోని మొత్తం పాఠాన్ని గడగడా చెప్పేశాడు ఆ అబ్బాయి. ఆశ్చర్యపోయిన మాష్టర్ వివిధ పేజీలలో ఏముందో అడిగేడు. అన్నింటిని గడగడా చెప్పేశాడు ఆ కుర్రాడు. చివరకి 48 వ పేజీలో ఏముందో చెప్పమనగా, అసలు ఆ పుస్తకంలో 48 వ పేజీ లేనేలేదు కదా సార్ అన్నాడు. దానితో మాష్టర్ అచ్చరువొంది, ఆనందభాష్ఫాలు రాలుస్తుా, నాయనా నువ్వు సామాన్యుడవుకావు చాలా గొప్పవాడివి అవుతావురా అని దగ్గరకు తీసుకొని దీవించాడు.

ఆ దీవెనలు ఊరకే పోలేదు. ఆ అబ్బాయే భావి జీవితంలో గొప్ప బారిష్టర్ అయినాడు. అలాగే రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి కూడా అయినాడు. అతను ఎవరోకాదు, అతని పేరే మన తెలుగువారు గర్వంగా ఆంధ్రకేసరి అని పిలుచుకొనే టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఒక సారి ఆయన గొప్పతనం గురించి గుర్తుచేసుకొందాం. 1872 ఆగష్టు 23 న ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు పంతులుగారు.

ఆయన తల్లిగారు పూటకూళ్ళు పెట్టేవారు. ఆరోజులలో అలా పెట్టేవారిని చిన్నతనంగా చూసేవారు. పంతులు గారు కూడా ధనవంతుల ఇళ్ళలో వారాలబ్బాయిగా వుండి చదువుకొనేవారు. అయితే ఆయనకు నాటకాల పిచ్చెక్కువ. మెట్రిక్ తప్పాడు. అయితే హనుమంతురావ్ నాయుడు అనే మాష్టర్ సహాయంతో మద్రాస్ లో FC పాసై' లా ' చదివి లాయర్ గా ప్రాక్టీస్ చేసేవారు. మంచి తెలివి గల వారైనందున వాగ్ధాటి పటిమ కలవాడైనందున అనతికాలంలో గొప్పలాయర్ అయినాడు.అయినా బారిష్టర్ లేనందున ద్వితీయ శ్రేణి లాయర్ గానే వుండవలసివచ్చింది.

అందుకు 1904 లో ఇంగ్లండ్ వెళ్ళి బారిష్టర్ చదివేడు. అప్పుడే అక్కడ దాదాభాయ్ నౌరోజీతో ఆయనకు పరిచయం అయింది. బారిష్టర్ అయిన తరువాత మద్రాస్ హైకోర్ట్ లో ప్రాక్టీస్ మొదలు పెట్టేరు. అప్పటి వరకు ఆంగ్లేయులు, తమిళులు మాత్రమే హైకోర్టులో లాయర్స్ గా పేరు పొందేరు. తెలుగు వాడిగా మొదటిసారి హైకోర్టు లాయర్ అవటంతో చాలా కేసులోచ్చాయి. తన వాగ్ధాటితో అనతికాలంలోనే గొప్ప బారిష్టర్ గా పేరు సంపాదించాడు. దాంతో ఆరోజుల్లోనో లక్షలకు లక్షలు సంపాదించాడు. ఒకరోజు వాళ్ళావిడ డబ్బులు దాచడానికి ఖాళీ ఎక్కడా లేదండీ అని అన్నదంటే పరిస్థితి అర్థం చేసుకోండి. అప్పట్లోనే అంత డబ్బు సంపాదించాడు.

అలా క్రమంగా స్వాతంత్రోద్యమం వైపు ఆకర్షితులై హోంరూల్ లో ఉద్యమంలో చేరాడు. 'స్వరాజ్య' అనే పత్రికను తెలుగు, తమిళ భాషలలో నడిపేరు.1921 సహాయ నిరాకరణోద్యమ సందర్భంగా తన యావదాస్థితిని ప్రజలకు అంకితం చేసి, బారిష్టర్ గా రాజీనామా చేసి భారతీయ కాంగ్రీస్ లో సభ్యునిగా చేరినారు. 1929 లో సైమన్ కమీషన్ రాక సందర్భంగా మద్రాస్ లో నిరసనలు తెలుపుతున్న ప్రజలపై ఆంగ్లేయులు కాల్పులు జరపగా పార్థసారథి అనే యువకుడు మరణించాడు. అతనిని చూడకుండా నిషేదాజ్ఞలు విధించగా ప్రకాశంగారు ధైర్యంగా ముందుకు వెళ్ళారు. కాలుస్తామని తుపాకులు ఎక్కుపెట్టగా కాల్చండిరా అంటూ గుండెలు చూపారు. అతని ధైర్యానికి మెచ్చిన ప్రజలు ఆయనకు ఆంధ్రకేసరి అని బిరుదిచ్చారు.

1937 లో కాంగ్రేస్ పార్టీ మద్రాస్ రాష్ట్రంలో ఎక్కువ సీట్లు గెలుచుకొనింది. అందరూ ప్రకాశం గారే ముఖ్యమంత్రి అవుతారని అనుకొంటుండగా గాంధీ, నెహ్రూల ప్రీతిపాత్రుడైన రాజాజీని ముఖ్యమంత్రిని చేశారు. ప్రకాశం గారికి రెవెన్యూ మంత్రి అయినారు. అయితే రెండో ప్రపంచయుద్ధంలో భారత్ పాల్గొనడానికి నిరసనగా ఆ పదవికి రాజనామా చేశారు.

తరువాత క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని మూడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. 1946 లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినారు. కాని రాజాజీ, కామరాజ్ లాంటి నాయకుల కుయుక్తులను భరించలేక 11 నెలల తరువాత పదవికి రాజీనామా చేశారు. ప్రజా పార్టీ ని పెట్టేరు. ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి ముఖ్యమంత్రి అయినారు. కాని కమ్యూనిష్టులు మద్ధతు ఉపసంహరించు కోవడంతో 1954 నవంబర్ 24 న రాజనామా చేసి రాజకీయాల నుండి తప్పుకొన్నాడు. ప్రకాశంగారు చాలా ధైర్యస్తుడు. ముక్కుసూటి మనిషి. ఎవ్వరినీ లెక్కచేసేవాడు కాదు. అందులో కొన్ని.

1. ఒక ఉద్యమాన్ని నడిపించడానికి ప్రజల నుండి విరాళాలు సేకరించారు. కాని ప్రకాశం పంతులంటే పడనివారు గాంధీకి మాయమాటలు చెప్పి లెక్కలడగ మన్నారు. గాంధీ లెక్కల అడగగా మహాత్మా నా జీవితంలో లక్షలు సంపాదించాను లక్షలు దానం చేశాను, అలాంటిది ఒక్క వేయి రూపాయలు నాకు ఒక లెక్కా?? అయినా ప్రతి పైసాకు నా దగ్గర లెక్కుంది, నేను చూపుతా!! కానీ మీరు మేకపాలు తాగేందుకు టాటా వారు పెడుతున్న ఖర్చెంతో చెబుతారా అని ఘాటుగా బదులిచ్చారు.

2.1952 లో ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఉద్యమ కాలంలో నెహ్రూ మీద రూపాయి నోటు విసిరేస్తూ దానిలో తెలుగులో రూపాయి అని వుంది కదా. మరి మాకు ప్రత్యేక రాష్ట్రం ఎందుకివ్వకూడదో చెప్పమన్నాడు.

3.1948 లో నెహ్రూ హెచ్చిరికలు బేఖాతర్ చేస్తూ హైదరాబాద్ నిజాం దగ్గరకెళ్ళి రజాకార్ల ఉద్యమ నాయకుడైన ఖాజింరజ్వీని ఉద్దేశించి నువ్వు నీ అదృష్టాన్ని దూరం చెసుకొంటున్నావ్ అని హెచ్చరించారు. అతని దైర్యానికి అబ్బుర పడిన రజాకార్ల సైన్యం అసంకల్పితంగా అతనికి సల్యూట్ చేశారట. వారి సల్యూట్ అందుకొన్న తెలుగువాడు అతనొక్కడే. పేదరికం అనుభవిస్తూ పెరిగాడు, లక్షలు సంపాదించాడు చివరికి పేదరికంలోనే చనిపోయిన మహామనిషి మన ఆంధ్రకేసరి.

ఆ మహాను భావుడికి ఆశ్రువులు నిండిన కళ్ళతో నివాళులు అర్పిస్తూ... జోహార్ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారికి జోహార్లు సమర్పిస్తూ..

🤘సర్వే జనా సుఖినోభవంతు🤘

👌ధర్మో రక్షతి రక్షతః 👌

For Every Action Equal &
Opposite Reaction

-రామభక్త గురూజీ ప్రొద్దుటూరు.
సెల్-8328170075.*

No comments:

Post a Comment