Thursday, April 7, 2022

మనసు మాటల ముత్యాలు

🌹మనసు మాటల ముత్యాలు🌹

🌹 దూరంగా ఉన్నంత మాత్రాన బంధాలు తెగిపోవు.
దగ్గరగా ఉంటే బంధాలు పెరిగిపోవు.
ఎదుటివారి మనసులో మనం ఉన్నపుడు
దూరం,దగ్గర అనేవి సమస్య కావు.

🌹
బలం అనేది శారీరక పటుత్వం నుండి వచ్చేది కాదు.
అది అజేయమైన దృఢసంకల్పం నుండి ఉద్భవిస్తుంది.

🌹
ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది.
ఎక్కడ కష్టాలు ఉంటాయో అక్కడ సుఖాలు ఉంటాయి.

🌹
ఎంతమంది ముఖాలలో నిజమైన చిరునవ్వులు కనిపిస్తాయో
అదే నిజమైన గొప్పదనం
మనిషిలా అందరు బతుకుతారు గాని
మంచిమనిషిగా కొందరే బతుకుతారు..

🌹
వివేకులు తమ కాలాన్ని విజ్ఞాన సముపార్జనకు వినియోగిస్తారు.
అవివేకులు చెడు అలవాట్లకు, నిద్రపోవడానికి తమ కాలాన్ని వినియోగిస్తారు.

🌹
రెండు చెవులు ఒకే శబ్దాన్ని వింటాయి. రెండు కళ్ళు ఒకే దృశ్యాన్ని చూస్తాయి. రెండు నాసికలు ఒకే వాసన పీలుస్తాయి. కానీ, తస్సాచెక్క! అదేమి మాయరోగమో...
ఉండే ఒక్క నాలిక మాత్రము రెండు రకాలుగా మాట్లాడుతుంది.*

సేకరణ

No comments:

Post a Comment