జులై 20 అలెగ్జాండర్. జయంతి.
" క్రీస్తు పూర్వం 340 వ సంవత్సరం..16 యేళ్ళ అబ్బాయి తన గురువుకు ఎదురుగా నిలబడివున్నాడు..గురువు అనుమతి ఇస్తే ఏదో అడగాలనిపిస్తుంది అతని వాలకం చూస్తే...కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తున్న గురువు తన ఎదురుగా శిష్యుడుండటం చూసి ఏమిటో అడగమన్నట్లు కళ్ళు తో సైగచేసారు.చిన్నగా గొంత సవరించుకుంటూ" గురువర్యా..ఈ ప్రపంచన్నంతా ఒకే రాజ్యంగా మార్చేస్తే ఎలా వుంటుంది??? సరిహద్దులు లేని సామ్రాజ్యాన్ని పరిపాలించాలనివుంది" అని అన్నాడు.ఆ ప్రశ్నవిని గురువు అదిరిపోయాడు. ఆలోచనతో అతని భృంగిటముడత పడింది, ఆ గురువు మామూలు గురువుకాదు..గురువులకే గురువు. తత్వంలోనూ, మనోవిజ్ఞానశాస్త్రంలో,చరిత్ర,పరిపాలన, బౌతిక, వైద్య,వృక్ష,జంతుశాస్త్రాలలో అపారమైన మేధావి... ఆరిస్టాటిల్ ...ఆ శిష్యుడు అలెగ్జాండర్ .
తన శిష్యుడు అడిగిన ప్రశ్నకు అనుగుణంగా అతనిని సన్నిద్ధంచేయాలనుకున్నాడు. ఆరోజు నుంచి ఆ అబ్బాయిని విశ్వవిజేతను చేసేందుకు తగిన విధంగా మానసికంగా!శారీరకంగాధృఢచిత్తుడనుచేసే ప్రసంగాలు,కథలు,శిక్షణలు మొదలుపెట్టాడాగురువు.
అలెగ్జాండర్ కి ఆ ఆలోచన రావడానికి కారణంవుంది.అప్పుడు గ్రీకుదేశంలోని రాజ్యాలు అంతర్గతకుమ్ములాటలతో సతమతమవుతున్నాయి.. అందులో తన తండ్రికూడా నిరంతరయుద్ధాలలో మునిగిపోయివున్నాడు.
అలెగ్జాండర్ తండ్రి అయిన మాసిడోనియా రాజు ఫిలిప్ అంతర్గతయుద్ధాలపోరాటంలో మరణించాడు.. దాంతో 20 యేండ్లకే అలెగ్జాండర్ రాజ్యపీఠం అలంకరించాడు. ముందు తన చుట్టుప్రక్కల రాజ్యాలను జయించాలని గురువు దగ్గర అనుమతి కోరాడు. గ్రీకురాజ్యాలతోపాటు పర్షియా,భరతఖండాన్ని జయించినట్లైతే నువ్వు విశ్వవిజేతవు కాగలవు అంటూ దీవించాడు అరిస్టాటిల్ ..
దృఢచిత్తుడై దాదాపు లక్షమంది కాల్భలంతో జైత్రయాత్రకు బయలుదేరిన అలెగ్జాండర్ నాలుగుసంవత్సరాలలోనే గ్రీసుదేశంలో రాజ్యాలన్నింటినీ వశపరుచుకున్నాడు.
తర్వాత అతిపెద్ద సామ్రాజ్యమైన పర్షియాపై దండియాత్ర చేసాడు,, పర్షియా చక్రవర్తి డైరయిస్_3 అలెగ్జాండర్ ను ధైర్యంగా ఎదురుకున్నప్పటికీ క్రీ.పూ..334 లో మొదటి అంబేలా యుద్ధంలో అలెగ్జాండరే విజేత అయినాడు. అలెగ్జాండర్ పర్షియా రాజధానిని తగలబెట్టించినాడు..
తర్వాత అతని చూపు సింధూదేశంపై పడ్డది..అతనికి తక్షశిలరాజు స్నేహహస్తం లభించినది..పర్షియానుండి 4 సంవత్సరాలు ప్రయాణంచేసి భారతసరిహద్దులకు చేరాడు. సింధూనదిని దాటేందుకు చాలా తంటాలు పడ్డారు అలెగ్జాండర్ ..సింధూనదీపరివాహకఅడువులలో వుండే ఆదివాసీలు అడుగడుగునా అలెగ్జాండర్ ను ఎదురుకొన్నారు.చాలామంది ఆదివాసీలను నిర్థాక్షణ్యంగా ఊచకోతకోసాడతడు.
చివరికి చీనాబ్ ,సట్లజ్ మధ్య ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఆటవికరాజైన పురుషోత్తముడితో సంధికి ప్రయత్నించగా అందుకు అంగీకరించని పురుషోత్తముడు అలెగ్జాండర్ తో యుద్దానికే మొగ్గుతాడు,. వీళ్ళద్దరి మధ్య 327-26 మధ్య భీకరయుద్ధం జరగగా అలెగ్జాండరే విజేత అవుతాడు.
60 సంవత్సరాల పురుషోత్తముడు తనకున్న కొద్దిపాటి సైన్యంతోనే తన సైన్యానికి అపారనష్టం కలగజేయటం చూసి ఆశ్చర్యపోతాడు అలెగ్జాండర్ ..అతనిని ధైర్యసాహసాలకు మెచ్చి పురుషోత్తముని రాజ్యాన్ని ఇచ్చివేయడమే కాకుండా తను జయించిన మరికొన్ని భూభాగాలను కూడా కానుకగా ఇస్తాడు.
అక్కడ నుండి పాటలీపుత్ర వైపు కదలాలని వ్యూహం రచించగా అతని సైనికులు నిరాసక్తిని కనబరుస్తారు. అందులోనూ మహాపద్మనందుని పరాక్రమంతో ఏర్పడిన సువిశాల భూభాగం,అపారమైన సైనికసంపద గల నందరాజ్యాన్ని జయించడం సాధ్యంకాదని వేగులు సహితం అలెగ్జాండర్ కు చెబుతారు.
విధిలేని పరిస్థితులలో అలెగ్జాండర్ భారత్ సరిహద్దుల నుండి వెనుదిరుగుతాడు.. అయితే తిరుగుపయనంలోనే "ఆదివాసీలతో పోరాడక తప్పలేదతనికి..
తను ప్రాణప్రధకంగా చూసుకొనే గుర్రం చనిపోవడం చాలా బాధిస్తుంది.. మాళవికులు అనే ఆదివాసీలతో పోరాడే సమయంలో ఒక మాళవికయువకుని ఈటె దెబ్బకు బాగా గాయపడుతాడు.. దానితో విషజ్వరము సోకి క్రీ.పూ 323లో ఇరాక్ లోని బాబిలోనియా ప్రాంతంలో తన 32 వ యేట కనుమూస్తాడు అలెగ్జాండర్ !!
అప్పట్లో గ్రీకులకు తెలిసిన చాలా భూభాగాన్ని జయించాడు అలెగ్జాండర్ ..జయించిన సువిశాల భూభాగాన్ని కొన్ని సంవత్సరాలు కూడా పరిపాలించలేకపోయాడాయన. అతని మరణంతో అతని సామ్రాజ్యమంతా అల్లకల్లోలంగా మారి చిన్న,చిన్న రాజ్యాలుగా ముక్కలైపోయింది!!!
No comments:
Post a Comment