Monday, July 1, 2024

****సంతోషం.................అంటే.........

 *సంతోషం.................అంటే.........*
🌹🌼🎋🍁☘🌸🌿🌻
*ఒక అందమైన ,ధనవంతురాలైన మహిళ చాలా ఖరీదైన దుస్తులు ధరించింది.*
*తనకు కావలసినవన్నీ కొనుక్కోగల స్తోమత ఉంది.* *ఎన్ని ఉన్నా కానీ*
*ఆమె సంతోషంగా* *తృప్తిగా లేదు.* *ఎందుకు అని ఎంత ఆలోచించినా అర్థం కాలేదామెకు.* *కౌన్సిలింగ్ తీసుకుందామని వెళ్ళింది. అక్కడికి వెళ్ళి*
*నేను ఎందుకు సంతోషంగా లేనో........తృప్తికరమైన జీవితం తనకు ఎందుకు*
*లేదో అందుకు ఏమి చేయాలో చెప్పండని ఒక సభ్యుడిని కోరింది.*
🌹🌼🎋🍁☘🌸🌿🌻
ఆ సభ్యుడు ఆ మహిళను వారి కార్యాలయంలో గదులను శుభ్రం చేసే ఒక
మహిళదగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఈమెకు సంతోషం అంటే ఏంటో మీరు
చెప్పండి మీకంటే ఖచ్చితంగా ఆమెకు నేను కూడా చెప్పలేను అని చెప్పి
ఆ మహిళను అక్కడ వదిలివెళ్ళిపోయాడు ఆ సభ్యుడు.
🌹🌼🎋🍁☘🌸🌿🌻
ఆ గదులు శుభ్రం చేసే మహిళ నాకేం చెపుతుంది.అని అనుకుంటూ ఉండగానే
ఆ పనిచేస్తున్న మహిళ నవ్వుకుంటూ వచ్చి ఇలా చెప్పసాగింది.
🌹🌼🎋🍁☘🌸🌿🌻
' మీకు సంతోషం అంటే... తృప్తి అంటే చెపుతాను. కాస్త జాగ్రత్తగా వినండి .
నేను సాధారణ మహిళను. ఈ కార్యాలయంలో 10 సంవత్సరాలుగా
పనిచేస్తున్నాను. నాలుగు సంవత్సరాల క్రితం నా భర్త అనారోగ్యంతో
మరణించాడు. ఆ దెబ్బనుండి కోలుకోకముందే ఒక నెల తిరగకుండానే
నా కొడుకు ఆక్సిడెంట్ లో మరణించాడు.వారు తప్ప నాకు మరో దిక్కు
లేరు. వారు దూరమైన నాకు బ్రతుకు మీద విరక్తి కలిగి చనిపోవాలని
నిర్ణయించుకున్నాను. ఆరోజు నా పనిని ముగించుకుని ఇంటికి
బయలుదేరాను.బాగా వర్షం పడుతోంది. ఆ సమయంలో ఒక పిల్లి నా వెనుకనే 
వానలో తడుస్తూ వస్తోంది. అది మా ఇంటివరకు వచ్చింది. పాపం పిల్లి
వానకు తడిచి వణుకుతోంది. దాన్ని ఇంట్లోకి తీసుకుని వచ్చాను. కాసిన్ని
పాలు పోశాను. పాలు త్రాగిన పిల్లి నామీద తన విశ్వాసాన్ని చూపిస్తూ
నా కాళ్ళకు చుట్టుకుంటూ ఆడుకుంటూ ఉండిపోయింది. సంతోషం
అంటే ఏంటో మరచిపోయిన నాకు ఆ పిల్లి నా కాళ్ళచుట్టు తిరుగుతూ
ఉండటం చూసి నా మొహంలో చిరునవ్వుతో కూడిన ఆనందం వచ్చింది.
🌹🌼🎋🍁☘🌸🌿🌻
అప్పుడు అనిపించింది నాకు. సంతోషం,ఆనందం అన్నవి మనము
ఇతరులకు సహాయపడితే వారి మొహంలో కనిపించే అద్భుతమైన
చర్య అని .. మన తోటి మనుషులకు మనం మనకు చేతనైన సహాయం
చేస్తే వారి మొహంలోని సంతోషమే మనకు తృప్తిని ఇస్తుందని తెలుసుకున్నాను.
ఆ రోజునుండి రోజులో ఎవరికో ఒకరికి నా చేతనైన సహాయం చేస్తూ
ఆనందంగా తృప్తిగా జీవిస్తున్నాను. మీరు కౌన్సిలింగ్ కు వచ్చారు. 
నేను మీకు చెప్పేంత గొప్పదాని కాదు. కానీ ఆ ఆఫీసరు నేను సంతోషంగా
ఎలా ఉండగలుగుతున్నానో ప్రత్యక్షంగా చూసినవారు. అందుకే మిమ్మల్ని
నా దగ్గరకు తీసుకొచ్చారు. మరోలా అనుకోకండి.""
🌹🌼🎋🍁☘🌸🌿🌻
మనం ఇతరులకు ఇవ్వడమే నిజమైన సంతోషం. అది ఏదైనా కావచ్చు.
ఆఖరుకు మీ చిరునవ్వైనా కావచ్చు.మన దగ్గర ఎంత డబ్బైనా ఉండవచ్చు.
కానీ ఆ కాగితాలతో కొన్ని సంతోషాలను ఆనందాన్ని కొనలేము.
🌹🌼🎋🍁☘🌸🌿🌻
ఇలా  ప్రతిరోజూ తనకు తోచిన సహయాన్ని తన తోటి మనుషులకు అందిస్తూ
అందులోనే ఆనందాన్ని వెతుకుని తన జీవితాన్ని సంతోషమయం చేసుకున్న
ప్రతి ఒక్కరూ అభినందనీయులే కదా!

సంతోషం అంటే నీవు నవ్వుతూ ఉండటం కాదు.
నీవల్ల మరొకరి మొహంలో ఆనందం కనపడటమే
🌹🌼🎋🍁☘🌸🌿🌻
*సంతోషం అన్నది ఒక పయనం.మీరు* *సంతోషంగా ఉంటూ ఇతరులనూ*
*సంతోషపరచాలి* *అంటే ఏదో ఒక చిన్న సహాయం.* *అవసరమైన వారికి*
*మీ చిన్నసాయం*
*.....సర్వేజనా సుఖీనోభవంతు.*        
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment