మహాభారత కథ ....
*మూడు గుప్పెడు అటుకులు*
➖➖➖✍️
*మానవునికి ఉన్న సుగుణాలలో ఒకటి దానం చేయడం.*
*దానం చేసే వ్యక్తి దానం స్వీకరించే వ్యక్తి దానం స్వీకరించడానికి తగిన పాత్రుడా కాదా అని ఆలోచించి లేదా ఋజువు చేసుకొని అతను దాన స్వీకరణకు అర్హుడు అయినట్లయితే అతనికి దానం ఇవ్వాలి. దానం స్వీకరించే వ్యక్తి దాన స్వీకరణకు తగిన పాత్రుడు కానప్పటికి అతనికి దానం ఇచ్చినట్లయితే అటువంటి దానాన్ని అపాత్రదానం అంటారు.*
*దానం చేయడం వలన దానం పొందిన వ్యక్తితో పాటు దానం చేసిన వ్యక్తి కూడా ఆనందపడాలి.*
*దానం పొందిన వ్యక్తి.... పొందిన దానంతో అభివృద్ధి చెందాలి, సమాజానికి ఉపయోగపడాలి.*
*కొందరు తాము పొందిన దానంతో సోమరులుగా మారి సమాజాభివృద్ధికి ఆటంకమవుతారు, దీనితో పాటు చెడు వ్యసనాలకు బానిసలై మోసపూరిత మాటలతో దాతలను మరింత పీడిస్తారు.*
*శ్రీకృష్ణుడు, కుచేలుడు బాల్యంలో సహ విద్యార్థులు. వీరిద్దరూ పెద్ద వారు అయినాక శ్రీకృష్ణుడు సకల సౌకర్యాలతో తులతూగుతుండగా కుచేలుడు దారిద్ర్యం అనుభవిస్తూ ఉంటాడు.*
*ఒకనాడు కుచేలుడు శ్రీకృష్ణునుని దర్శనానికి వెళ్లి అటుకులను చిన్ననాటి మిత్రుడు శ్రీకృష్ణుడికి ఇవ్వగా మొదటి పిడికిలి అటుకులు తిన్న శ్రీకృష్ణుడు దానంగా కుచేలుని దారిద్ర్యాన్ని పోగొడతాడు.*
*రెండవ పిడికిలి అటుకులు తిన్నప్పుడు కుచేలునికి సకల సౌకర్యాలు కల్పిస్తాడు.*
*మూడవ పిడికిలి అటుకులు తినబోతున్న కృష్ణుడిని రుక్మిణి ఆపుతుంది.... దీనికి కారణం అపాత్రదానం చేయబోతున్నాడని! అంటే అన్ని సౌకర్యాలు ఏర్పడిన కుచేలుడికి దానం అవసరం లేదు! అయినను దానం ఇస్తే దానం ఇచ్చిన వారు పుచ్చుకొన్నవారింటికి పనివారుగా వెళ్లవలసి వస్తుందని.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment