Wednesday, July 3, 2024

 గుడ్ మార్నింగ్ 🌹కదిలే మనసుతో, భావాలతో, ఆలోచనలతో జీవిత అవసరాలకు ఎవరైనా కదిలి తీరవలసినదే. కానీ అవసరంలేని, అనవసరపు వ్యతిరేక, పనికిరాని అన్ని భావాలకు, ఆలోచనలకు కదలటము సరి కాదు. దీని వలన చెడును మన జీవితములోనికి తెచ్చుకుంటాము. ఇటువంటి పనికిరాని కొన్ని భావాలు, ఆలోచనలు - వత్తిడిగా, భయాలుగా, బాధలుగా, అనుమానలుగా, అదుర్ధాగా - ఇలా అనేక వ్యతిరేక ఆలోచనలుగా మనను ఇబ్బంది పెడుతూ - మానసిక, శారీరక సమస్యలుగా మారతాయి.

ఇక్కడే మనము తెలుసుకోవలసినది వున్నది.ప్రపంచములో అన్నీ మన ఇష్ట ప్రకారం ఎంపిక చేసుకొని అనుభవిస్తాము. అలాగే ఆలోచనలు, భావాలు కూడా అన్నీ మనవే అనుకొని స్వీకరించి ఆ భావాలకు ఆలోచనలకు గురి కాకుండా - వాటిలో మంచివి, అవసరమైనవి ఎంపిక చేసుకొని, అనవసరాలు, వ్యతిరేకాలు, చెడులు వదలి వేయటం అలవాటు చేసుకోవాలి. దీనికి పెద్ద, భయంకరమైన, కఠిన సాధనలు ఏమి అక్కర్లేదు - జస్ట్ ఈ ఆలోచనలు, భావాలు నావి కాదు, నాకు అక్కర్లేదు అని మనకు మనమే చెప్పుకొని - మనలోని చెత్తను వదలి వేస్తూ - మనసును శుభ్ర పరుచుకుంటూ ఉండాలి. మనలో అన్నీ మనవి కావు - మల,మూత్రములు విసర్జిస్తూ రోజు శరీరాన్ని అన్నివిధములుగా శుభ్రపరచుకుంటూ ఉంటామో - మలినాలు వదలి వేస్తూ ఉంటామో, అలాగే మనను మనం గమనించుకుంటూ - పనికిరాని చెత్త ఆలోచనలు వదలటం అలవాటు చేసుకుంటే చాలు.........ఇది చాలా తేలిక. 

ఇదే ఆధ్యాత్మిక సాధన.


Source link - http://youtube.com/post/UgkxkwcEn2Z6fmCcWK92bG58k1CleM0Yl9gI?si=YNu-uS-G7_0pb_oO

No comments:

Post a Comment