Saturday, July 13, 2024

ఆత్మజ్ఞానం కావాలంటే త్యాగం అవసరము

 ఆత్మజ్ఞానం కావాలంటే త్యాగం అవసరము
                   ➖➖➖
`
మానవుడు బాహ్య విషయాలపై కోరికలను త్యజించనంత వరకు భగవంతుడుదక్కడు.

ఆత్మజ్ఞానం కావలెనంటే త్యాగం చాలా అవసరము.త్యాగమంటే ఇల్లు,వాకిలి, భార్యాబిడ్డలను వదిలేయడం కాదు! ప్రపంచపు విషయాల పట్ల ఆకర్షణ వదిలేయాలి. మనసులో కోరికలను అదుపులో ఉంచుకోవాలి. ఇహలోక బంధాల పట్ల వ్యామోహం, మమతానురాగాలు క్రమక్రమంగా వదులుకోవాలి.

భగవంతుడు ఒక్కడే నిత్యుడు అన్న సత్యాన్ని గుర్తించి, ఆయనను పొందడానికి సాధన చేస్తుండాలి.

కానీ నేడు మానవుని పరిస్థితి ఎలా ఉందంటే, 'ఆత్మజ్ఞానం కావాలంటే ప్రతీరోజూ పలానా మంత్రం జపించు, దానితో పాటు రెండు అరటిపండ్లు తిను!' అని చెపితే 'ఏ మంత్రం జపించాలి?' అని అడగడం మానేసి 'ఏ రకమైన అరటిపండు తినాలి?' అని అడిగే మేధావులుండే కాలం  మనది.

మనిషి ఇలా ఉంటుంటే  ఇంకా అత్మజ్ఞానం ఎలా కలుగుతుంది! కోరికలను త్యాగం చేయకుండా ఏ సాధన చేసినా ఈ జన్మకే కాదు వేయి జన్మలెత్తినా భగవంతుని తెలుసుకోలేం! ఆత్మజ్ఞానం కలుగనే కలుగదు!
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

No comments:

Post a Comment