Saturday, July 20, 2024

 *కోరికలపై నియంత్రణ అవసరము*
                 
*మనలోని బలహీనతను, భయాన్ని దూరం చేసుకోలేకపోతే బతుకు దుర్భరంగా మారుతుంది. భయం భయంగా జీవించడం కన్నా పెద్ద కష్టం ఉండదు. ఏ పరిస్థితిలోనైనా మనిషి తనను తాను నిందించుకోకూడదు. పరనిందే కాదు, స్వీయనిందా ప్రమాదకరమే.*

*జీవిత కాలంలో తప్పులే చేయకుండా బతకడం కష్టం. మనం సామాన్య మానవులం. సదా నిజమే పలకడానికి హరిశ్చంద్రులం కాము. శరీరం నుంచి మాంసాన్ని కోసిచ్చే శిబి చక్రవర్తులం అంతకంటే కాదు. కానీ ఆనందకరమైన నిర్భయమైన జీవితం కోసం తపించే అత్యంత సాధారణ మనుషులం.*

*మనం మన సాధారణత్వాన్ని అంగీకరించిన క్షణమే మన వ్యక్తిత్వం అసాధారణమవుతుంది. మన అజ్ఞానాన్ని అంగీకరించిన మరుక్షణమే మనలోకి తొలి వెలుగురేఖ ప్రవేశిస్తుంది.*

*మనసులో ఒకటి, బాహ్యంగా మరో భావనతో జీవించడం తగని పని. మనసులో ప్రతి మనిషికీ కొన్ని కోరికలు ఉంటాయి. అవి మంచి కోరికలా, చెడు కోరికలా అనేది విశ్లేషించుకోవాలి.*

*ఎదుటివాడి జేబులోని డబ్బు అయాచితంగా మనకు చేరాలని ఆశించడం చెడు కోరిక. ఏదైనా మంచిపని చేసి డబ్బు సంపాదించాలనుకోవడం మంచి కోరిక.*

*ఏదైనా... కోరికలపై నియంత్రణ ఉంటేనే జీవితం ఆనందంవైపు పయనించే అవకాశం ఉంటుంది.*
       
     *⚜️||ఓం నమశివాయః||⚜️*
                   🌷🙏🌷
☘️🍃☘️ 🍃☘️🍃 ☘️🍃☘️

No comments:

Post a Comment