Tuesday, July 23, 2024

అంతర్యామి 🥀 దేవుడి తోడు!🥀

 అంతర్యామి
🥀 దేవుడి తోడు!🥀
 ✍️ శ్రీ చిమ్మపూడి శ్రీరామమూర్తి
✍️🌹🌹🌹🙏💐🙏🌹🌹🌹✍️ 

✳️ మనిషి జన్మిస్తాడు, పెరుగుతాడు, చనిపోతాడు♪. బతికినంతకాలం అతడికి తోడుండేది ఒక్కడే♪. ఆ ఒక్కడు - భగవంతుడు♪. కష్టాలలోనైనా సుఖాలలోనైనా, పదిమంది మధ్య ఉన్నా, ఒంటరిగా ఉన్నా- మనిషి వెంట నిలిచేది దేవుడే అని పురాణాలు చెబుతున్నాయి♪. మానవుడు మంచి చేస్తున్నా, చెడు చేస్తున్నా, పుణ్యం చేస్తున్నా, పాపం చేస్తున్నా- వాటిని ఎవరు చూసినా చూడకున్నా 'ఆ ఒక్కడు' చూస్తూనే ఉంటాడు♪. 

✳️ భగవానుడు నిర్నిమేషుడు. ఆయన కనురెప్పలు మూతలు పడవు కాబట్టి, ఆయనకు ఎవరైనా భయపడి తీరాల్సిందే అని విజ్ఞులంటారు♪.

✳️ దైవం అంటే, మనిషికి భయంతో పాటు విశ్వాసం ఉండాలి♪. దాని వెంట భక్తి కూడా పెరుగుతుంటే, అతడిలోని మనోవికారాలు మాసిపోతాయి♪. కొంతకాలానికి ఆత్మసమర్పణ భావం ఏర్పడుతుంది♪. ధార్మికత వెల్లివిరిసి, అతడి మనసు ఆధ్యాత్మికంగా ఓ అమృతకలశంలా మారుతుంది♪.

✳️ జీవితమంతా దేవుడు తోడుగా నిలవాలంటే, మనిషి, పలు నియమ-నిబంధనలు పాటించాల్సి ఉంటుంది♪. ఒక మంచిని పొందాలంటే, కొన్ని చెడ్డగుణాల్ని దూరంగా ఉంచాలి♪. దేవుడి వైపు వెళ్లే కొద్దీ, ఏ మనిషైనా అనేక ప్రలోభాలకు దూరమైపోతాడు♪. 

✳️ త్యాగబుద్ధి కలిగి ఉండటం, ఇతరులకు హాని తలపెట్టకపోవడం - మానవ జీవన రథానికి రెండు చక్రాల వంటివి♪. స్వార్థం విడిచిపెట్టడం, సాటివారికి చేతనైనంతగా సహాయపడటం ప్రధానమైన ధర్మసూత్రాలు♪. లేనిపోని కోరికల్ని మనసులోకి రానివ్వకూడదు♪.

✳️ 'నీలో, నాలో, సర్వత్రా ఉన్నది ఆ విష్ణువే! అని గ్రహించకుండా ఉంటే, అదే వినాశనానికి హేతువుగా మారుతుంది. 'నిజం తెలుసుకో, అందరి పట్ల సమబుద్ధితో ప్రవర్తించు' అనేవారు ఆదిశంక రులు♪. తెలుసుకొని వ్యవహరించడమే సత్యం♪. అదే ప్రేమ. పరబ్రహ్మ స్వరూపమూ అదే! 

✳️ చాలా మంది భౌతిక సుఖాల కోసం తపిస్తుంటారు♪. తపిస్తుంటారు. వాటన్నింటికీ మూలమైనది, ధనం♪. దాని కోసమే పరుగులు తీసేవాడు మూర్ఖుడు♪. ప్రలోభం నుంచి బయటపడేవాడు మహాత్ముడు♪. భౌతిక సుఖాలకు, అందుకు కారణమైన ధనాశకు విముఖంగా ఉన్నవాడికి దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు♪. ఉన్నదానితో సంతృప్తి చెందేవాడే నిజమైన ఐశ్వర్యవంతుడు♪. ఈశ్వరుడికి అతడే ఇష్టుడు. ఆ ఈశ్వరుణ్ని చేరుకోవాలంటే, నాలుగు సోపానాల్ని అధిరోహించాలి♪. 

👉 మొదటి మెట్టు, విగ్రహారాధన. 
👉 రెండోది, జపం లేదా స్తోత్రం. 
👉 మూడో సోపానం, మానసిక ఆరాధన. 
👉 నాలుగో మెట్టు, ఆత్మజ్ఞానం. 

✳️ జీవితంలోని ఆ నాలుగు మెట్లూ ఎక్కినకొద్దీ- ఫలితం కనిపిస్తుంటుంది. చివరికి గమ్యం చేరువవుతుంది♪.

✳️ 'ఏ వస్తువైనా అద్దంలో ప్రతిబింబిస్తుంది♪. వస్తువు, ప్రతిబింబం వేరువేరు•. అవి రెండైనా, అక్కడ ఉన్నది ఒక్కటే♪. అలాగే ప్రపంచం పరమాత్మకు ప్రతిబింబం♪. పరమాత్మ లేకపోతే ప్రతిబింబమే లేదు♪. అక్కడ ఉన్నది ఒక్కడే♪. ఆయనే పరమాత్మ' అని సంత్ జ్ఞానేశ్వర్ అనేవారు♪.

✳️ సత్యం గ్రహించని కొన్ని మతవాదాల వల్ల పరస్పర వైషమ్యాలు రేగుతున్నాయి♪. ఇతర మతాలను దూషించడమే వాటి ధ్యేయంగా మారుతోంది♪. ఏ మతమైనా, దేవుడు ఒక్కడే అని చెబుతుంది♪. అందరి గమ్యమూ ఒకటే అంటుంది•. లక్ష్యం లక్ష్యం ఒక్కటే అయినప్పుడు వైషమ్యాలు ఎందుకు? 

✳️ నిజం చెబుతున్నా ఎదుటివాడు నమ్మక పోతే, 'దేవుడి తోడు, నేను చెప్పేది నిజం’ అంటాం. అప్పుడు ఎదుటివాడు నమ్ముతాడు♪. అబద్ధం చెబితే దేవుడు మనకు తోడుండడు అని దాని అర్థం♪. నిజం చెప్పడం అంటే, నిజాయతీగా ఉండటం•. అలాంటివాడికి నిరీశ్వరుడు నిత్యమూ తోడుగా ఉంటాడు♪.

✳️ మనిషికి పరమాత్మ తోడుగానే ఉంటాడు. ఎంతవరకు అంటే- మనిషి ధర్మం తప్పనంత వరకు, సత్యం తప్పనంత వరకు, దారి తప్ప నంత వరకు!

Courtesy: ఈనాడు
        ❀┉┅━❀🕉️❀┉┅━❀
🙏 లోకాస్సమస్తా సుఖినోభవంతు
🙏 సర్వే జనాః సుఖినోభవంతు
🚩 హిందువునని గర్వించు
🚩 హిందువుగా జీవించు

సేకరణ:
✍️🌹🌹🌹🙏💐🙏🌹🌹🌹✍️

No comments:

Post a Comment