*_కాలం ఏ సన్నివేశాన్ని మర్చిపోదు... కర్మ రూపంలో గుర్తుచేస్తూనే ఉంటుంది..._*
*_కర్మ కాలితే కాలంలో గతించిన మర్మాలే... సాక్షాలై నిలువునా దహించి వేస్తాయి..._*
*_కళ్ళతో చూసిన నిజాలకు... చెవులతో విన్న ప్రశ్నలకు... నోటితో విసిరిన నిందలకు తెర వెనుక నడిచిన భాగోతానికి సంక్షిప్త సమాధానమే 'కర్మ' కాబట్టి కర్మ చాలా శక్తివంతమైనది నువ్వు ఏది చేస్తే అదే నీకు తిరిగి వస్తుంది._*
*_జీవితంలో నువ్వు ఎవ్వరి వల్లనైనా మోసపోయినప్పుడు నీకు ఎవ్వరినీ తిట్టే అధికారం లేదు, ఎందుకంటే నమ్మింది నువ్వు, మోసపోయింది నువ్వు కేవలం అది నీ తప్పే... అయినా మనిషిని నమ్ముతున్నావ్ అంటే అక్కడ నుంచి నీ పతనం మొదలైనట్టే..._*
*_నమ్మకానికి అర్హులు ఎవ్వరు లేరు ఇక్కడ... కేవలం అవసరానికి వాడుకునేవారు మాత్రమే. ప్రతి పరిచయం వెనుకా... ప్రతి అవసరం వెనుకా ఏదో ఒక మోసం ఉంటుంది..._*
*_అలా అని అందరు అలాంటి వాళ్ళే అని నేననను కానీ, కొంత మందికి మాత్రమే ఇది అన్వయిస్తుంది. పరిస్థితి బట్టి అవసరాన్ని బట్టి అది కొంచెం అటు ఇటుగా బయటపడు తుందంతే..._*
*_అప్పుడు అనిపిస్తుంది నీకు అనవసరంగా నమ్మనని... కాబట్టి ఎప్పుడు జాగురతతో ఉండు ఎలాంటివాళ్ళో పసిగట్టి అప్రమత్తంగా ఉండు అప్పుడే ఈ లోకంలో మోసపోకుండా బ్రతకగలవు. నట్టేట ముంచేవాళ్ళు నీ పక్కనే ఉంటారు... జర జాగ్రత్త మిత్రమా...☝️_*
*_-సదా మీ శ్రేయోభిలాషి... 👏_*
🌸🌸🌸🌹🙇♂️🌹🌸🌸🌸
No comments:
Post a Comment