మనము గుర్తించని
గురువులలో కొందరు
అమ్మ :
పసి తనం నుంచీ
మన వ్యక్తిత్వాన్ని
ఉన్నంతంగా మలచాలని
ప్రతీ క్షణం
పరితపిస్తుంది
నాన్న :
తన వ్యక్తిత్వంతో
తన త్యాగంతో
తన మాటలతో
తన చేతలతో
మన వ్యక్తిత్వానికి
మార్గ దర్శకులుగా జీవిస్తారు
కుటుంబ సభ్యులు
స్నేహితులు
సన్నిహితులు :
మనం మంచి పనులు చేస్తే
మెచ్చుకుంటూ
మనం కూడని పనులు చేస్తే
విమర్శిస్తూ
మన జీవన విధానాన్ని
మెరుగు పరుస్తారు
సూర్యుడు :
నియమము తప్పక
క్రమము తప్పక
తన కర్తవ్యాన్ని చేసుకోవాలనే
బోధ చేస్తాడు
చంద్రుడు :
మనము మన ప్రవర్తన
మన సంపర్కము
అందరి మనసులకు
అనందం కలిగించాలని
బోధ చేస్తాడు
పుస్తకాలు :
రక రకాల సంస్కృతులను
విజ్ఞానాన్ని
నాగరికతలను
జీవన విధానాలను
పరిచయం చేస్తూ
మానవ జాతి అభ్యున్నతికి
దోహదం చేస్తాయి
ప్రకృతి :
ఎన్నో నియమాలను తను
పాటిస్తూ
ప్రళయాలను తట్టుకుంటూ
మనకు కావలసిన వనరులు
అందిస్తూ
మానవజాతి మనుగడకు
అండగా నిలుస్తుంది
ఇంకా
ప్రత్యక్షముగా గురువులు
లౌకిక విద్యను బోధించే
అధ్యాపకులు
ఆధ్యాత్మిక విద్యను అందించే
ఋషులు
మునులు
యోగులు
సకల విద్యలు
శాస్త్రాలు అవపోసన పట్టినా
అత్యంత సామాన్యమైన జీవితం
గడిపి
ఎందరికో ఆధ్యాత్మిక విద్యను
బోధించి
ఇప్పటికీ నమ్మిన వారికి
మార్గదర్శనము చేసే
సజీవ సమాధి పొందిన
మంత్రాలయ శ్రీ రాఘవేంద్రుడు
మానవ జాతి మేలుకోరి
జీవన విధానాన్ని
యోగ మార్గాన్ని
సులువుగా
ఆచరణకు యోగ్యముగా
అత్యంత ఉన్నతమైన
జ్ఞానాన్ని ఆచరించి
భగవంతుని గీత ఇది అని
ఆ గీత ఆచరణ ద్వారా
ఎలా మానవుడు
మాధవుడు కాగలడో
తెలిపిన
ఆ పురుషోత్తముడు .
No comments:
Post a Comment