నువ్వు హిందువుగా ఉన్నంత సేపే...నీ ఐడెంటిటీ మిగిలి ఉంటుంది...
నువ్వు హిందువు కాదు అని భావించిన వెంటనే..నీ వ్యక్తి స్వేచ్చ...అభిరుచి...కుటుంబ ఆచారం... సమూహ సాంప్రదాయం...నీ మతం కోల్పోతావు...
హిందూ అన్న పదం నీ మతాచారాలకు సంపూర్ణ రక్షణ...
నీ వైవిధ్య ప్రకటనకు...నీ విరోధ భావనకు అధికారం ఇవ్వబడుతుంది...
నువ్వు విష్ణువును..రాముడ్ని నమ్ముతూ కూడా నువ్వు నీ చెట్టును పూజించగలవు...
నువ్వు శివుడ్ని ఆరాధిస్తూ కూడా నీ గిరిజన దైవాన్ని ప్రేమించగలవు...
నువ్వు హిందువు అనుకున్నంత వరకూ ఏ వనవాసీ... ఏ గిరివాసీ... ఏ దళిత సోదరుడు తన అస్థిత్వ వ్యక్తీకరణకు ఎలాంటి ఆటంకం ఉండదు సరికదా...మరింత వెన్ను దన్నులు లభిస్తాయి...
ఏ గ్రామ దేవతనూ ఉపేక్షించదు హిందుత్వం... ఏ కుల దైవాన్ని విస్మరించదు...
ఎవర్ని అర్చించినా ఆ పరమేశ్వరుడికే చెందుతుందన్న మౌలిక భావన హిందుత్వానిది...
కాబట్టి ఏదైనా కొన్నిచోట్ల కొందరు నాయకులో... వ్యక్తులో అలా వద్దు..ఇలా వద్దు...వైదిక పూజలే సరైనవి అని వాదిస్తూ ఉండవచ్చు...
కానీ...అవైదికం అన్నది పాశ్చాత్య ...ఎడారి మతాలకు మాత్రమే ఉద్దేశించినది...
మన పూజా విధానాల్లో అవైదికం అన్నది లేనేలేదు..
ప్రతి ఒక్క పద్ధతీ దానికున్న అర్హత దానికి ఉంటుంది...
దానికున్న సాధికారత దానికి ఉంటుంది...
అయితే విదేశీ ఎడారి మతాలనుంచి డబ్బులు తిన్న కొందరు... దేశద్రోహ బుద్ధితో...హిందుత్వం వాటిని మింగేస్తుంది అన్న దుష్ప్రచారం చేసారు...
అది ఒట్టి దుష్ప్రచారం మాత్రమే అన్నది ఒక కుంభ మేళా కు వచ్చే వివిధ మత సమూహాలను చూస్తే అర్థం అవుతుంది ..
ఒక సమ్మక్క సారక్క జాతరకు...ఒక నాగోబా జాతరకు వచ్చే ప్రజలను చూస్తే అర్థం అవుతుంది...
ఇవి వేల వందల సంవత్సరాలుగా హిందూ భావన కారణం గానే ఎగ్జిస్ట్ అవుతున్నాయని తెలుస్తుంది...
పొరబాటున ఎడారి గుడారానికి వెళ్ళారా...ఖేల్ ఖతం.. దూకాన్ బంద్...
ఒకడే దేముడు..ఒకటే బుక్కు... వాళ్ల మధ్యయుగాల్లో చెప్పుకున్న సుత్తే...ఇప్పుడూ పాటించాలి...
ఆ మతాలు ఉన్న దేశాల్లో ప్రాంతాల్లో ఇంక ఏమి మిగిలి ఉన్నాయో చూసి వస్తే తెలుస్తుంది...
ఇప్పుడేం చెయ్యాలి..
వాళ్ళూ హిందువులు ఎట్లయితరో.. ఏ గొర్రెల గుంపుకు షెఫర్డో...ఏ గుడికి దేవరాజో... ఏ రాజ్యానికి మహారాజో అడిగి రావాలి...
దాంతో బాటు...ఇప్పుడు సాంఘిక మాధ్యమాల్లో హిందుత్వానికి వ్యతిరేకంగా ..నేను హిందువుని ఎట్లయితా...బుద్ధుడు ముందు తరువాతే హిందూ అనే సొల్లు చెబుతున్న వాళ్ళని పట్టుకుని...గుంజిళ్ళు తీయించాలి...
లేకపోతే జ్ఞానం రాదు...
గుంజీలు శాస్త్రీయంగా జ్ఞాన వృద్ధికి పనికి వస్తాయి...
ఏకీభవిస్తారు కదా....!
No comments:
Post a Comment