Saturday, July 13, 2024

****"హనుమాన్ చాలీసా ప్రాముఖ్యత"*

 హరిఓం   ,                           -                                         -                  *"హనుమాన్ చాలీసా ప్రాముఖ్యత"*

ప్రారంభ శ్లోకం "జయ హనుమాన జ్ఞాన గుణసాగర" వల్లె వేయటం వలన జీవితంలో స్వాభావిక దివ్యజ్ఞానాన్ని పొందుతారు. ఈ జ్ఞాన సహాయంతో, జీవితంలో ప్రతిష్టంభించిన అనేక సవాళ్లు, దాదాపు అసాధ్యం అనుకున్నవాటిని సాధించగలుగుతారు. 

"మహావీర విక్రమ బజరంగి" శ్లోకం ప్రజలలో బలాన్ని నింపుతుంది. అవాంఛనీయమైన స్నేహప్రభావాల నుండి బయట పడటానికి సహాయపడుతుంది. 

చాలీసాలోని ఏడవ, ఎనిమిదవ శ్లోకాలు, శ్రీరాముడి ఆత్మతత్వాన్ని తెలియ చేస్తాయి. దేవుని దివ్యసన్నిధికి చేరుస్తాయి. 

14, 15వ శ్లోకాలు కీర్తి ప్రతిష్టలు పొందటానికి సహాయం చేస్తాయి. పనులు నిర్వహించడానికి కావలసిన సామర్థ్యం, అందరి ప్రశంసలు అందుకుంటారు. 

11వ శ్లోకం చదవటం వలన పాములు, విష జంతు వుల భయం తొలగించడానికి సహాయం లభిస్తుంది. 

16, 17 శ్లోకాలు చదవటం వలన జీవితంలో కోరుకున్న స్థానానికి ఎదగటానికి సహాయ పడుతుంది. 

20వ శ్లోకం చదవటం వలన జీవితంలో అనేక సవాళ్లను అధిగమించవచ్చు, అనేక అడ్డంకులు తొలగిపోయి లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. 

24వ శ్లోకం, ఢాకిణి పిశాచాలు, భూతాలు, చేతబడి ప్రభావాలకి లోనుకాకుండా ఉండటానికి సహాయపడుతుంది. చాలీసాలోని ప్రతి శ్లోకంతో జీవులకు అనేక లాభాలు ముడి పడి ఉన్నాయి. అందువలన హనుమాన్ చాలీసాకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. 

ప్రతినిత్యమూ హనుమాన్ చాలీసా మొత్తం ఐదు సార్లు పఠించిన వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి ఉంటుంది................
                                                             -          🙏🙏 ......                                           -        వలిశెట్టి లక్ష్మీశేఖర్...                                -         98660 35557 .....                                      -          09.08.2024 ......

No comments:

Post a Comment