Saturday, July 13, 2024

 ప్రస్తుత కాలంలో పారిశుద్ధ్య నిర్వహణ అతిపెద్ద సమస్యగా ఎందుకు మారిపోయింది !?

జనాభా పెరుగుదల అనేది పైకి కనిపిసున్న అంశం !
కానీ...
పైకి కనపడని అంశం ప్లాస్టిక్ వినియోగం !!

నానాటికీ పెరిగిపోతున్న జనాభా కి కావలసిన నిత్యావసర వస్తువుల నుండి పెళ్లిళ్లు, ఫంక్షన్ల వరకూ ప్రతీదీ ప్లాస్టిక్ తో ముడిపడిపోయింది !!

కూరగాయలు అమ్మేచోట  ప్లాసిక్ కవర్స్, కర్రీ పాయింట్ దగ్గర ప్లాస్టిక్ కవర్స్, కిరాణా కొట్టు లో ప్లాస్టిక్ కవర్స్, షాపింగ్ మాల్స్ లో ప్లాస్టిక్ కవర్స్, లిక్కర్ షాప్స్ దగ్గర ప్లాస్టిక్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్స్ !!

బర్త్డే ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు, దినకార్యాలకు అన్నింటికీ  ప్లాస్టిక్ గ్లాసులు, రోల్స్ !!

పుడితే ఫ్లెక్సీ, పెళ్లికి ఫ్లెక్సి, దినానికి ఫ్లెక్సీ, రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు, ప్రభుత్వ కార్యక్రమాలకు ఫ్లెక్సీలు, ప్రతి పనికీ ఫ్లెక్సీలు !!

ఇలా రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ పెనుభూతంలా కమ్మేసింది !!

ఈ ప్లాస్టిక్ వస్తువులు విచ్చలవిడిగా వాడేసి... వాటిని రోడ్లపై,  డ్రైన్లలో, కాలువల్లో ఎక్కడపడితే అక్కడ పారేస్తున్నారు ప్రజలు !!

వీటి కారణంగా కేవలం వీటి కారణంగానే డ్రైన్లు పూడుకుపోతున్నాయి !
ఏ గ్రామంలో/ పట్టణంలో చూసినా చెత్త కుప్పలు కుప్పలుగా పేరుకుపోతోంది !
డంపింగ్ యార్డులకు స్థలాలు లేక కాలువలు, చెరువుల పక్కన పారబోస్తున్న పరిస్థితులు అందరూ చూస్తున్నాం !!

ఒక్క వారం రోజులు శుభ్రం చెయ్యకపోతే మురుగునీరు నిలువ ఉండిపోయి.. దుర్గంధం వ్యాపించడంతో పాటు దోమలకు అవాసాలుగా మారిపోతున్నాయి !!

గ్రామాలు, పట్టణాలలో ఉన్న సాలిడ్ వేస్ట్ మ్యానేజ్మెంట్ షెడ్లు (చెత్త నుండి సంపద కేంద్రాలు) ఉన్నా కానీ... 10 శాతం కంటే ఎక్కువ వ్యర్ధాల నుండి సంపద సృష్టించడం కష్టతరం అవుతోంది !!

ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే... 
అవినీతి నిర్మూలన, పేదరిక నిర్మూలన లాంటి వాటి కంటే ముందు.. ప్రభుత్వం ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది !!

ప్లాస్టిక్ వాడేవారి నుంచి జరిమానా వసూలు చేయడం కాకుండా.. ప్లాస్టిక్ తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం !!

కేవలం బయో డీగ్రేడబుల్ ప్లాస్టిక్, పేపర్, క్లాత్ లతో తయారుచేసే కవర్స్, రోల్స్, ప్లేట్స్ మాత్రమే తయారుచేసేలా & దుకాణదారులు అమ్మేలా కఠినమైన చర్యలు తీసుకోవలసిందిగా కోరుతున్నాం !!

అవసరాల నుంచి ఆవిష్కరణలు పుడతాయి. క్లాత్ (గుడ్డ) సంచులు, పేపర్ కవర్స్, గ్లాసులు, రోల్స్, విస్తరాకులు లాంటివి ప్రోత్సహించడం  ద్వారా... చేతివృత్తులు, డ్వాక్రా మహిళల  ఉపాధి అవకాశాలను కూడా ఎంతో మెరుగుపరిచినట్లు అవుతుంది !!
ఫ్లెక్సీల స్థానంలో.. పూర్వం వాడిన క్లాత్  బ్యానర్లను ప్రోత్సహించడం ద్వారా.. పెయింటర్లు, నేతపని వారు ఉపాధి పొందుతారు !!

ఇలాంటి చర్యలు యుద్ధప్రాతిపదికన  చేపట్టడం ద్వారా... పారిశుద్ధ్యం మెరుగుపడడంతో పాటు కార్మికులకు కూడా పనిభారం తగ్గడం, వారిని వేరే నిర్వహణా పనులకు వినియోగించుకునే వెసులుబాటు కలుగుతుంది ప్రభుత్వానికి !!

పారిశుద్ధ్య కార్మికులు ఎంత కష్టపడినా... ఈ ప్లాస్టిక్ వినియోగం కారణంగా చెత్త పేరుకుపోతోంది ! 
పర్యావరణాన్ని మనం కాపాడడం ద్వారా పర్యావరణం మనల్ని కాపాడుతుంది.. తద్వారా పంచభూతాలు కూడా మనకు సహకరిస్తాయి !!
 
స్వచ్ఛఆంధ్రా సంకల్పానికి కంటితుడుపు చర్యలు కాకుండా.. చిత్తశుద్ధితో కూడిన మొదటి అడుగులు ప్రభుత్వం నుండి మొదలవ్వాలని కోరుకుంటూ 🙏🙏🙏 ధన్యవాదాలు🙏🙏🙏

✍️✍️✍️✍️✍️✍️

No comments:

Post a Comment