శ్రీ గురుభ్యోనమః 20-07-24
భగవాన్ శ్రీ రమణ మహర్షి పలికిన సద్గురు సందేశంలో "ఉన్నది నలుబది" చాలా విశిష్టమైనది. సర్వ వేదాంత సార సంగ్రహమంతా ఈ నలుబది పద్యములలో ఇమిడి ఉన్నది. ఈ నలుబది పద్యములను శ్రీ రమణులు వారి మాతృభాష తమిళంలో ముందుగా రచన గావించారు. సద్గురు భక్తులు శ్రీ మురుగనార్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా భగవాన్ శ్రీ రమణుల నోటి వెంట వెలువడిన సందేశమే ఉన్నది నలుబది. తమిళంలో ఇది "ఉళ్లదు నార్పత్తు"గా ప్రసిద్ధి. శ్రీ కావ్యకంఠ గణపతి మునీంద్రులతో కలిసి వీటిని ఒక క్రమ పద్ధతిలో అమర్చారు. తరువాత యోగి రామయ్య గారి ప్రార్థనపై వీటిని భగవాన్ శ్రీ రమణులే స్వయంగా తెలుగు వచనంగా అనువదించారు. ఇప్పుడు వీటిని మరింత సరళమైన మాత్రాఛందస్సులో గేయరచనలో చూద్దామా!
అంటే భాషలకు అందని భావము , మాటలలో చెప్పలేని పరమ పవిత్రమైన నిత్య సత్య శాశ్వతము సరియైన ఆసక్తి కలిగిన సచ్ఛిష్యులు తారసపడినప్పుడు సమాజంలోని జనుల కొరకు ప్రాంతీయ భాషలలో ప్రకటించబడుతుంటాయి.
సదా సద్గురు సేవలో...
సహజాచల రాజయోగి
Archive book link - https://archive.org/details/in.ernet.dli.2015.387470/mode/2up
No comments:
Post a Comment