Monday, July 22, 2024

షిరిడీ సాయి బాబా మహత్యం సినిమాలో నువ్వు లేక అనాధలం అనే పాట అప్పటి నుంచే పెద్ద హిట్టు..

 షిరిడీ సాయి బాబా మహత్యం సినిమాలో నువ్వు లేక అనాధలం అనే పాట అప్పటి నుంచే పెద్ద హిట్టు..

ఈ సినిమాలోని అన్ని పాటలు సాయి బాబా భక్తులను పెంచాయి అనడంలో సందేహం లేదు

అయితే ఆ పాటలోని రెండవ చరణం ఇలా ఉంటుంది....

*మా ఏసు నీవేనని మా ప్రభువూ నీవేనని*
*ప్రార్ధనలు చేశామయా నిన్నే...*
*అల్లాగ వచ్చావని చల్లంగ చూస్తావని*
*చేశాము సలాం సలాం నీకే*
*గురునానకైనా ....గురుగోవిందైనా....*
*గురుద్వారమైనా...నీ ద్వారకేననీ*
*నీ భక్తులైనాము సాయి....రావా .. నువ్వు..*
*కృష్ణసాయి కృష్ణసాయి రామసాయి ( 2 )*
*అల్లాసాయి మౌలాసాయి ( 2 )*
*నానక్ సాయి గోవింద్ సాయి*
*ఏసు సాయి షిర్డి సాయి ఓం... నానక్ ..*
*సాయి సాయి బాబా సాయి.....*

పై పాటలోని ఆధారంగా చర్చికి వెళ్ళే ఏ క్రైస్తవుడయినా *ఏసే-సాయి,సాయినే ఏసు అని సాయి బాబా ఫోటో పెట్టుకుని ప్రార్థనలు చేయడం మీలో ఎవరైనా చూసారా*???

అలాగే మసీదుకి వెళ్ళే ఏ ముస్లిమైనా అల్లానే సాయి-సాయి బాబానే అల్లా అని నమాజు చేయడం మీలో ఎవరైనా చూసారా??

కాని హిందువులు మాత్రం రాముడే సాయి-కృష్ణడే సాయి అని రామ సాయి-కృష్ణ సాయి అని పూజలు చేస్తారు..!
పూజిస్తే పూజించారు కాని మరి వాళ్ళెందుకు పూజించరో అని ఒక్కసారైనా ఆలోచించారా!

అలాగే ఎవడన్న ఏసు సాయి,సాయి మరియా, సాయి పాదం, ఖాన్ సాయి,సాయి రహమాన్ అని పేర్లు పెట్టుకున్నారా?

వేల సంవత్సరాల క్రితం నుండి ఆచారాలు, సాంప్రదాయాలు, జీవన విధానం రూపంలో సనాతన ధర్మం ఆచరించబడుతూ వచ్చింది... మొదటి సారి బౌద్ధ ధర్మాన్ని అనుసరించడం తో ధర్మం స్థానంలో మత భావన ప్రారంభం అయ్యింది.... ఎడారి మతాలు భారత దేశం లో ప్రవేశించడం తో, బలవంతం గానో లేక సమస్త ప్రకృతిని సమభావంతో చూసే సనాతన ధర్మ మౌళిక లక్షణం వల్ల సనాతన వైదిక సమాజం పై ఎడారి మతాల ప్రభావం స్పష్టంగా పెరగసాగింది.... అప్పటి సామాజిక అసమానతలను ఈ ఎడారి మతాలు తమకు అనుకూలంగా మలుచుకుని సమాజంలో ప్రజల మధ్యన మానసిక విభజనను తేగలిగాయి...

ఇతర మతాలకు చెందిన వారిలో సగం మంది వారి మత గ్రంథాలను ఒకసారైనా చదివి ఉంటారు లేదా వారి ఇంట్లో ఉంచుకొని ఉంటారు.... అదే హిందువులలో కనీసం పది శాతం మంది కూడా వారి ధర్మ గ్రంథాలైన రామాయణ, భారత, భగవద్గీత లను కనీసం కంటితో కూడా చూసి ఉండరు.....

*హిందువులలోని ఈ ఉదాసీనత, ఏ మతం గురించి తెలియకుండా అన్ని మతాలు సమానమనుకునే మానసిక దౌర్భాగ్యం వలన క్రమంగా తన అస్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని కోల్పోయి ఇలాంటి కలుపుమొక్కలు పెరగడానికి అవకాశం ఇస్తోంది*

తిరిగి మన పూర్వవైభవం పొందాలంటే మన పిల్లలకు మన ధర్మ గ్రంథాలను, మన ఆచార సాంప్రదాయాలను, మన పురాణ పురుషులు, మన నిజమైన స్వాతంత్ర సమరయోధుల చరిత్రలను చిన్నతనం నుండే పరిచయం చేయడం మన తక్షణ భాధ్యత...

భారతీయులను మానసికంగా ఏకం చేయగల శక్తి ఒక్క రామనామానికే ఉంది....
*రామ నామమే తిరిగి భారతీయ ఆత్మను  ఉద్దీపన చేయగలదు*

గురుపౌర్ణమి రోజున ఎవరిని పూజించాలి.!!

విశ్వకర్మ సమారంభాం విశ్వరూపార్య మధ్యమాం.!
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరామ్.!!

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం.!
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరామ్.!!

సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం.!
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం.!!

ప్రణవార్థ స్వరూపాయ శుద్ధ జ్ఞానైక మూర్తయే.!
నిర్మలాయ ప్రశాంతాయ శ్రీ దక్షిణామూర్తయే నమః.!!

జ్ఞానానంద మయం దేవం నిర్మలం స్ఫటికాకృతిమ్.!
ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మహే.!!

దత్తాత్రేయం మహాత్మానాం వరదం భక్త వత్సలం.!
ప్రపన్నార్తి హరం వందే స్మర్తృగామి సనోవతు.!!

వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే.!
నమో వై బ్రహ్మ నిధయే వాశిష్ఠాయ నమో నమః.!!

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం.!
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరమ్.!!

విరాట్పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం.!
కాలజ్ఞాన ప్రవక్తారం శ్రీ వీరబ్రహ్మ గురుం భజే.!!

మన సనాతన ధర్మంలో చాలా మంది గురువులు
ఉన్నారు.! వీరందరిని పక్కన పెట్టి కేవలం సాయబాబాను పూజించటం ఎంతవరకు సబబు.??

జై శ్రీరామ్... 🙏🙏🙏

మీ హిందూ జన సంఘ్...

No comments:

Post a Comment