Saturday, July 13, 2024

రామాయణము మనకి హితవు పలుకుతు ఆయా సమయాలలో ధైర్యముగ యుండాలని ఉద్భొదిస్తున్నది.

 శ్రీమద్రామాయణము. 

(226-వ ఎపిసోడ్),,

"" ఇహ సంపాతివా  సీతా రావణస్య నివేశనే,
ఆఖ్యాతా  గృథరాజేన  న చ పశ్యామి తామహమ్||,,

"" నిర్భయుడు యశస్వియైన హనుమ సీతామాత జాడ లంకలో ఎంతవెతకినా తెలియకపొవటముతో చింతిస్తు,"""సీతాదేవిని లంకలో తాను చూస్తున్నాను చూసాను అని తన దృష్టిశక్తితో స్వయముగ చూసి  నుడివియున్నాడు.కానీ మాత జాడ ఏమాత్రము తెలుసుకొనలేకపోతున్నాని చింతిస్తాడు.

"" సీతామాతను  గురించి పరి పరి విధముల ఆలోచన చేస్తు మొదటిసారిగా మాతను గూర్చి తప్పుగ భావిస్తాడు.

"" కిం ను సీతా~థ వైదేహీ మైథిలీ జనకాత్మజా,
ఉపతిష్టేత వివశా రావణం దుష్టచారిణమ్||(13-06) సుం.కాం.

విదేహరాజైన జనకునిసుత మైథిలి యైన సీతామాత ఇక తనకు మరోమార్గము లేదని తలచి దుష్టప్రవృత్తి గల ఆ రావణాసురునకు వశమైయుండునా యని దుష్టాలోచన చేసి అది అసంభవమని అనుకుంటు

"" ఉపర్యుపరి వా నూనం సాగరం క్రమతస్తదా,
విచేష్టమానా పతితా సముద్రే జనకాత్మజా!"""(13-10),,

సీతామాత ను ఆ రావణాసురుడు ఆకాశ మార్గాన తీసుకొని వెళ్లునప్పుడు  ఆదురాత్మునితో పెనుగులాడుచు సముద్రగర్భములో పడిపోయి ఉండవచ్చని తలపోసి వగస్తు,

"" యది  సీతామదృష్ట్వా~హం వానరేంద్రపురీమతః,
గమిష్యామి తతః కో మే పరుషార్థో భవిష్యతి||,(13-20),

సీతామాత జాడ తెలుసుకొనక నేను అంగదాదులతో  కిష్కిందకు వెళ్లినచో  నేను  ఏ పురుషార్థము సాధించినట్లని విచారిస్తాడు.

"" పరుషం దారుణం క్రూరం తీక్ష్ణమింద్రియతాపనమ్,
భృశానురక్తో మేధావీ న భవిష్యతి లక్ష్మణః""(13-24),,

సీతామాతని వెతికి కనిపెట్టలేకపోయాననే కఠినాతికఠినమైన ,దారుణమైన, అతిక్రూరమైన,మిక్కిలితీవ్రమైనట్టి, రాముని ఇంద్రియములు దహించివేయునట్టి పదజాలము""న దృష్ట్వా మయా సీతా"" అను దుర్వార్త విన్నచో ఆ రఘురాముడు జీవించి యుండునాయనుకుంటు రాముడు లేక లక్ష్మణుడు మిగలడు,తదుపరి  భరతశత్రుఘ్నులు బ్రతకరు,పుత్రుల మరణవార్త విన్నచో మువ్వురు తల్లుల అసువులు వీడును.వీరందరు మరణించినచో నా ప్రభువు సుగ్రీవుడు జీవితమును చాలించునని విచారణ చేస్తు,

"" యావత్ సీతాం హి పశ్యామి రామపత్నీం యశస్వినీమ్,
తావదేతాం పురీం లంకాం విచినోమి పునః పునః||,(13-52),

ఇన్ని విపరీతములు జరుగకుండగ రామపత్నియు,లోకవిఖ్యాతయైన ఆ సీతాదేవి ని దర్శించువరకు ఈ లంకాపురిని మరీ మరీ గాలించెదనని హనుమ నిశ్చయించు కున్నవాడయ్యెను. 

ఆ విధముగ నిశ్చయించుకున్న ఆంజనేయస్వామివారు రామునకు,సీతామాతకు,లక్ష్మణునకు,రుద్రునకు,ఇంద్రాది దేవతలకు,తండ్రియైన వాయుదేవునకు సూర్యచంద్రాదులకు నమస్కరించి సీతామాత ను వెతుకుటకు అశోకవనమునకు బయలదేరెను.

కష్టసమయములలో ఎంతటివారికైనను దురాలోచన లతోను ,భయముతో కూడిన ఆలోచనలతో మనసు భయ కంపితమవుతుందని రామాయణము మనకి హితవు పలుకుతు ఆయా సమయాలలో ధైర్యముగ యుండాలని ఉద్భొదిస్తున్నది.
జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.

No comments:

Post a Comment