"బాలత్రిపురసుందరి అమ్మవారి గాజులు"
శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి
ఇంట్లోని ఆడవారు ఒకసారి గాజులు కొంటున్నారు. గాజులు అమ్మే అతను అందరికీ గాజులు వేసాడు. అతను వేసిన గాజులకు ఎంతయ్యింది అని శాస్త్రి గారు అడిగితే, 6 మందికి 6 డజన్లు వేసాను. కనుక డజనుకు 12 రూపాయలు చొప్పున 72 రూపాయలు ఇమ్మనాదు గాజులు అమ్మే అతను.
మా ఇంట్లో ఉన్నది 5 మంది ఆడవారే కదా! అన్నారు శాస్త్రి. ఇంట్లోని వారు కాదు ఇందాక ఒక చిన్న పిల్ల కూడా గాజులు వేసుకుని లోపలికి వెళ్ళింది కదా అన్నాడతను. అప్పుడు శాస్త్రిగారు పూజ గదికి వెళ్లి చూడగా అక్కడ చిన్న పిల్లలకు సరిపోయే 12 గాజులు ఉన్నాయి. శాస్త్రి గారికి అర్థం అయ్యింది. 6 డజన్లకు డబ్బులు ఇచ్చారు ఇంకొక విషయం తెలుసా అక్కడ ఆ చిత్రంలో కనిపిస్తున్న పసిపాప ఎవరో కాదు సాక్షాత్తుగా ఆ "బాలా" అమ్మవారే .
శాస్త్రి గారి ఇంటిని ఫోటో తీస్తుంటే గుమ్మం దగ్గర ఎవరూ లేరు,ఫోటో కడిగి చూస్తే ఈ పాప అందులో కనిపించింది.
శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితంలో జరిగిన ఓ అద్భుత సంఘటన.
వారు పూజ చేసేటప్పుడు ఆవాహయామి అనగానే ఆ దేవత వచ్చి ఎదురుగా బుద్ధిగా కూర్చునేదిట. అది వారి అనుభవం.
సేకరణ
No comments:
Post a Comment