Saturday, July 20, 2024

*****మనశ్శాంతికి మార్గం

 *🕉️🙏మనశ్శాంతికి మార్గం🕉️🙏*

*🕉️🙏మారుతున్న కాలంతోపాటు మనిషి జీవన విధానంలోనూ అనేక మార్పులు వచ్చాయి. ఆహారం, ఆహార్యం, నిద్రించే సమయం, శారీరక శ్రమలలో వినూత్నమైన మార్పులేర్పడుతున్నాయి. కాలంతో పోటీ పడుతూ, ఉరుకులు పరుగుల జీవితాన్ని గడుపుతున్నాం. ఇప్పుడు మానసిక ఒత్తిడి లేని మనిషంటూ లేదంటున్నారు మనోతత్త్వనిపుణులు. ధనం కంటే విలువైనది మనశ్శాంతి. ఎందుకంటే దాన్ని ఎవరూ అమ్మలేరు. ఎవరూ కొనలేరు.*🕉️🙏

*🕉️🙏మనిషి మానసిక జీవనానికి అత్యంత ప్రధానమైనది మనశ్శాంతి. అది మనస్సాక్షికి దిక్సూచి వంటిది. విజయానికి ఇంధనం వంటిది. నమ్మిన విలువలకు కట్టుబడి వున్నప్పుడు, జీవితం సమతుల్యతతో సాగినప్పుడు, నిజమైన మనశ్శాంతికి నిర్వచనం అవగతమవుతుంది.*
*మనశ్శాంతి మనిషికున్న సహజ లక్షణం. అది అదృష్టం వల్ల వచ్చేది కాదు. దురదృష్టం వల్ల కోల్పోయేది కాదు. అది మానసిక ప్రశాంతతకు మూలకేంద్రం. దాన్ని కాపాడుకోవడం తెలిస్తే అడ్డుపడే క్లేశాలు వాటంతటవే తొలగిపోతాయి. వాటి స్థానంలో స్థితప్రజ్ఞ చిగురులేస్తుంది. "పాపకృత్యాలు చేయకుండా సత్కార్యాలు చేయడం వల్ల మనసు ఎప్పటికప్పుడు ప్రక్షాళనమవుతుంది. మనశ్శాంతికి దగ్గర చేస్తుంది" 🕉️🙏*

*🕉️🙏మనిషి అరిషడ్వర్గాలకు దూరంగా వున్నప్పుడే ప్రశాంతతకు దగ్గరగా ఉండగలడు. ప్రతికూల భావాలు వున్నప్పుడు సహజంగానే మనశ్శాంతి మన వద్ద ఉండదు. వీటికి సాధ్యమైనంతవరకు దూరంగా వుండటం, వుంచటం మనశ్శాంతి కోసం చేసే సాధనలో కీలకమైన ప్రక్రియ. ముందుగా మనలో అశాంతికి కారణమేమిటో తెలుసుకోవాలి.*🕉️🙏

*🕉️🙏మనిషి తనకు తానే మానసిక ఒత్తిడికి కారణమవుతున్నానని తెలుసుకోవాలి. నేడు మనశ్శాంతి లేదంటూ ఎంతో మంది యువత దారి తప్పుతున్నారు. దాన్ని వెతుక్కుంటూ, వేటి వేటి వెనకో పరుగులు తీస్తూ, వున్న ప్రశాంతతను కోల్పోతున్నారు.* *శరీరానికి మరణం ఒక్కసారే వస్తుంది. కాని మనశ్శాంతిని* *కోల్పోయిన వారికి అది*
*అనుక్షణం వెన్నంటే ఉంటుంది. "మనిషి ఎప్పుడూ వర్తమానంలో నిలబడే గతాన్ని, భవిష్యత్తును సందర్శిస్తూ వర్తమానాన్ని కోల్పోతుంటాడు.🕉️🙏*

*🕉️🙏వాస్తవానికి మనిషి ఉండేది ఎల్లప్పుడూ వర్తమానంలోనే" అన్నారు రమణ మహర్షి.*🕉️🙏

*🕉️🙏కాబట్టి గతం గురించి చింత, భవిష్యత్తు గురించి బెంగ - వదిలేసి అనుక్షణం వర్తమానంలో జీవించాలి. గడచిన క్షణం మృతసమానం. రానున్న క్షణం కళ్ళు తెరవని పసికందు.*🕉️🙏

*🕉️🙏రెండూ నీవి కావు.*🕉️🙏

*🕉️🙏ఈ క్షణం మాత్రమే నీది. వర్తమానంలో జీవించే వ్యక్తి అరిషడ్వర్గాలకు అతీతంగా మనశ్శాంతితో అలౌకిక ఆనందంలో జీవిస్తాడు.*🕉️🙏

No comments:

Post a Comment