Wednesday, July 3, 2024

******మాయ అంటే ఏమిటి?*

 *అరుణాచల శివ* 🙏

*మాయ అంటే ఏమిటి?* 

రమణ మహర్షిని ఒకతను చాలా రోజులనుంచీ "మాయ అంటే ఏమిటి?" అని అడుగుతూ ఉండేవాడు.

 మహర్షి ఏమీ చెప్పేవారు కాదు. మౌనంగా ఉండేవారు.

 ఇలా ఉండగా ఒకరోజున రాష్ట్రపతిగా ఉన్న బాబూ రాజేంద్రప్రసాద్ మహర్షి దర్శనార్ధమై వచ్చారు.

ఆశ్రమవాసులందరూ హడావుడి చేసారు. 

మహర్షి ముఖంలో మాత్రం ఏ మార్పూ లేదు. ఒక సామాన్యుడు వస్తే ఎలా ఉన్నాడో రాష్ట్రపతి వచ్చినా అలాగే ఉన్నారు.

 రాజేంద్రప్రసాద్ గారు మహర్షి సమక్షంలో మౌనంగా కాసేపు కూర్చున్నారు.

 దర్శనం అయిపోయాక రాష్ట్రపతి వెళ్ళేటప్పుడు అందరూ ఆయనకు సెండాఫ్ ఇవ్వడానికి పోలోమంటూ పరిగెత్తి పోయారు.

 మహర్షి దగ్గర ఎవరూ లేరు. 

ఈ సందేహం అడిగిన వ్యక్తి ఒక్కడే ఉన్నాడు. 

అప్పుడు మహర్షి అతనితో " మాయ అంటే ఇదే " అని ఒక్కమాట మాత్రం చెప్పారు.

 వారు అసలైన గురువులు.


🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

No comments:

Post a Comment