Wednesday, July 3, 2024

 🌺భక్తి రసామృతము🌺
     హరేకృష్ణ🙏

ముక్తులు ఐదు రకాలు. భగవంతునిలో ఐక్యము కావడము ఒకటి, భగవంతునితో పాటుగా ఆతని లోకములోనే నివసించడము రెండవది, భగవంతునితో సమానమైన రూపలక్షణాలను పొందడము మూడవది, భగవంతునితో సమానమైన ఐశ్వర్యాన్ని అనుభవించగలగడము నాలుగవది, ఇక భగవంతుని సామీప్యములో నివసించడము ఐదవది. విశుద్ధభక్తుడు భౌతికభోగాన్ని త్యజించడము మాట అటుంచి పైన పేర్కొనబడిన ఐదు ముక్తులలో దేనినీ కోరడు. కేవలము భగవత్సేవలోనే అతడు సంతృప్తి చెంది ఉంటాడు. ఇదే విశుద్ధభక్తుని లక్షణము. విశుద్ధభక్తి వలన కలిగే ఆరు ప్రభావాలలో మొదటిది అన్ని రకాల క్లేశాల నుండి విముక్తిని కలిగించడము, రెండవది సర్వమంగళస్థితి ప్రారంభము కావడము, మూడవది దివ్యానందాన్ని కలిగించడము, నాలుగవది ప్రత్యేకమైన వరదానముగా లభించడము, ఐదవది. ముక్తినైనా త్రోసిపుచ్చడము, ఆరవది శ్రీకృష్ణుని ఆకర్షించడము. హరేకృష్ణ!                       (భగవద్దర్శన్ మాస పత్రిక నుండి సేకరణ.)

No comments:

Post a Comment