Monday, July 15, 2024

 *DO-NOT HATE ANYONE | Excerpts from Divine Discourse | ది. 03-09-1988 |*
 
 *భగవాన్ ఉవాచ!!!* 

 *ఉపనిషత్తులు కూడను "అధ్వేష్టా సర్వభూతానాం".. ఎవ్వరినీ ద్వేషించకూడదు.  ఎవ్వరిని విరోధం చేసినప్పటికిని, భగవంతుణ్ణి విరోధించినటువంటివాడవుతాడు.  "నిర్ద్వేషో సర్వభూతేషు" ఎవ్వరిని ద్వేషించినా కూడను భగవంతుణ్ణి ద్వేషించినట్లవుతుంది.*  

*"సర్వ జీవ నమస్కారం కేశవం ప్రతి గచ్ఛతి"  అని అనింది.  ఎవ్వరికి నమస్కారం చేసినప్పటికిని, వారి యందున్నటువంటి యొక్క అంతరాత్మ స్వరూపుడైన పరమాత్మునికే నమస్కారం అందుతుంది.*    

*ఇట్టి పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని గుర్తించుకోలేనటువంటి మూఢులు, దీనిని అవిశ్వాసంగానూ, ఒక మూర్ఖత్వంగానూ భావిస్తూ వస్తున్నారు.   భారతీయుల యొక్క పవిత్రము, నిస్వార్ధము, నిరంతరము అయినటువంటి యొక్క దివ్య తత్వమును ఇతరులు ఎవ్వరు కూడను గ్రహించుకోలేరు.*  

*ఇంత పవిత్రమైనటువంటి, పవిత్రమైన భారతీయ సంస్కృతిని, భారతీయులే గ్రహించుకోలేకపోతున్నారు.  నామ రూపములు వేరుగా ఉండినప్పటికిని, అందున్నటువంటి యొక్క ఆత్మ తత్వము ఏకత్వమనేటువంటి యొక్క సత్యాన్ని కూడను ప్రచారము చేస్తూ వచ్చింది భారత దేశము.*

No comments:

Post a Comment