Thursday, October 2, 2025

 [10/2, 09:10] +91 98852 16452: 🌸🍀🌸🍀🌸🍀🌸🍀🌸

*నేడు  (02-10-2025)* 
*ఇంద్రకీలాద్రిపై విజయదశమి,* 
*సకల లోకాలకు ఆరాధ్య దేవత* 
*"రాజరాజేశ్వరి" గా* 
*దుర్గమ్మ అలంకరణ*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

నవరాత్రి ఉత్సవాలలో అలంకారాలలో చివరి రూపం శ్రీ రాజరాజేశ్వరీ దేవి.
సమస్త విశ్వానికీ ఆమె మహారాజ్ఞి. 

లోకపాలకులైన అష్ట దిక్పాలకులను పాలించేవారు *త్రిమూర్తులు.* 
ఆ త్రిమూర్తులను పాలించే దేవతను *రాజరాజేశ్వరి* గా పిలుస్తారు.
 
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున ఇంద్ర కీలాద్రిపై కనకదుర్గమ్మ రాజ రాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. 

తొమ్మిది రోజుల పాటు అమ్మవారు రోజుకో అవతారంలో రాక్షసులను సంహరించి లోకానికి శాంతి సౌభాగ్యాలు ప్రసాదించినందుకు గుర్తుగా విజయదశమిని జరుపుకుంటాం. 

రాజరాజేశ్వరీదేవి భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. 
*‘అపరాజితాదేవి’* గా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా.. ఇచ్ఛా , జ్ఞాన , క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుందీ తల్లి. యోగమూర్తిగా.. మాయా మోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. 

అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత.
పొదుపు చెయ్యడం నేటితరం ఆలోచన ఈ అవతారంలో అమ్మ ఒక చేతిలో చెరకుగడ , ఇంకో చేతిలో అభయముద్రతో భక్తులను అనుగ్రహిస్తూ దర్శనం ఇస్తుంది. చెరకురసం అత్మ జ్ఞానాన్ని సూచిస్తుంది. దుష్టులను,దురహంకారులను , శిక్షించుటకు అంకుశం, పాశం ధరించి ఉంటుంది. ఆమె ప్రశాంతమైన చిరునవ్వు , చల్లని చూపు భక్తులను అనుగ్రహిస్తాయి.

సమున్నతమైన దైవికశక్తికి ఈమె ప్రతీక. చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని సాధించే నేర్పు కలిగిఉండటం, ఉన్నతమైన భావనల్ని వ్యాప్తి చేయడం రాజరాజేశ్వరి అవతారం నుంచి అందుకోవాల్సిన స్ఫూర్తి. 
లలితా సహస్రనామ పారాయణం చేసి అమ్మవారికి కుంకుమార్చన చేయాలి. 

*అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవీ , బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురసుతా దేదీప్య మానోజ్జ్వలా, చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ*

 శ్లోకం పఠించాలి... 

నైవేద్యంగా... 
*సేమ్యా పాయసం, కొబ్బరి పాయసం, కొబ్బరన్నం , పరమాన్నం* 
సమర్పిస్తారు.

🌸🍀🌸🍀🌸🍀🌸🍀🌸
[10/2, 09:10] +91 98852 16452: 🍀🌻🍀🌻🍀🌻🍀🌻🍀

🙏 *శ్రీ రాజరాజేశ్వరీ* 
*అష్టోత్తరశతనామావళిః*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻

ఓం భువనేశ్వర్యై నమః |
ఓం రాజేశ్వర్యై నమః |
ఓం రాజరాజేశ్వర్యై నమః |
ఓం కామేశ్వర్యై నమః |
ఓం బాలాత్రిపురసుందర్యై నమః |
ఓం సర్వేశ్వర్యై నమః |
ఓం కళ్యాణ్యై నమః |
ఓం సర్వసంక్షోభిణ్యై నమః |
ఓం సర్వలోకశరీరిణ్యై నమః |
ఓం సౌగంధికపరిమళాయై నమః | ౧౦
ఓం మంత్రిణే నమః |
ఓం మంత్రరూపిణ్యై నమః |
ఓం ప్రాకృత్యై నమః |
ఓం వికృత్యై నమః |
ఓం ఆదిత్యై నమః |
ఓం సౌభాగ్యవత్యై నమః |
ఓం పద్మావత్యై నమః |
ఓం భగవత్యై నమః |
ఓం శ్రీమత్యై నమః |
ఓం సత్యవత్యై నమః | ౨౦
ఓం ప్రియకృత్యై నమః |
ఓం మాయాయై నమః |
ఓం సర్వమంగళాయై నమః |
ఓం సర్వలోకమోహాధీశాన్యై నమః |
ఓం కింకరీభూతగీర్వాణ్యై నమః 
ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః

ఓం పురాణాగమరూపిణ్యై నమః 
ఓం పంచప్రణవరూపిణ్యై నమః 
ఓం సర్వగ్రహరూపిణ్యై నమః |
ఓం రక్తగంధకస్తురీవిలేప్యై నమః | ౩౦
ఓం నాయికాయై నమః | (నానాయై నమః)
ఓం శరణ్యాయై నమః |
ఓం నిఖిలవిద్యేశ్వర్యై నమః |
ఓం జనేశ్వర్యై నమః |
ఓం భూతేశ్వర్యై నమః |
ఓం సర్వసాక్షిణ్యై నమః |
ఓం క్షేమకారిణ్యై నమః |
ఓం పుణ్యాయై నమః |
ఓం సర్వరక్షణ్యై నమః |
ఓం సకలధర్మిణ్యై నమః | ౪౦
ఓం విశ్వకర్మిణే నమః |
ఓం సురమునిదేవనుతాయై నమః |
ఓం సర్వలోకారాధ్యాయై నమః 
ఓం పద్మాసనాసీనాయై నమః |
ఓం యోగీశ్వరమనోధ్యేయాయై నమః |
ఓం చతుర్భుజాయై నమః |
ఓం సర్వార్థసాధనాధీశాయై నమః |
ఓం పూర్వాయై నమః |
ఓం నిత్యాయై నమః |
ఓం పరమానందాయై నమః| ౫౦
ఓం కళాయై నమః |
ఓం అనంగాయై నమః |
ఓం వసుంధరాయై నమః |
ఓం శుభదాయై నమః |
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః |
ఓం పీతాంబరధరాయై నమః |
ఓం అనంతాయై నమః |
ఓం భక్తవత్సలాయై నమః |
ఓం పాదపద్మాయై నమః |
ఓం జగత్కారిణై నమః | ౬౦
ఓం అవ్యయాయై నమః |
ఓం లీలామానుషవిగ్రహాయై నమః |
ఓం సర్వమాయాయై నమః |
ఓం మృత్యుంజయాయై నమః |
ఓం కోటిసూర్యసమప్రభాయై నమః |
ఓం పవిత్రాయై నమః |
ఓం ప్రాణదాయై నమః |
ఓం విమలాయై నమః |
ఓం మహాభూషాయై నమః |
ఓం సర్వభూతహితప్రదాయై నమః | ౭౦
ఓం పద్మాలయాయై నమః |
ఓం సుధాయై నమః |
ఓం స్వాంగాయై నమః |
ఓం పద్మరాగకిరీటినే నమః |
ఓం సర్వపాపవినాశిన్యై నమః |
ఓం సకలసంపత్ప్రదాయిన్యై నమః |
ఓం పద్మగంధిన్యై నమః |
ఓం సర్వవిఘ్నకేశధ్వంసిన్యై నమః |
ఓం హేమమాలిన్యై నమః |
ఓం విశ్వమూర్త్యై నమః | ౮౦
ఓం అగ్నికల్పాయై నమః |
ఓం పుండరీకాక్షిణ్యై నమః |
ఓం మహాశక్త్యై నమః |
ఓం బుద్ధ్యై నమః |
ఓం భూతేశ్వర్యై నమః |
ఓం అదృశ్యాయై నమః |
ఓం శుభేక్షణాయై నమః |
ఓం సర్వధర్మిణ్యై నమః |
ఓం ప్రాణాయై నమః |
ఓం శ్రేష్ఠాయై నమః | ౯౦
ఓం శాంతాయై నమః |
ఓం తత్త్వాయై నమః |
ఓం సర్వజనన్యై నమః |
ఓం సర్వలోకవాసిన్యై నమః |
ఓం కైవల్యరేఖిన్యై నమః |
ఓం భక్తపోషణవినోదిన్యై నమః 
ఓం దారిద్ర్యనాశిన్యై నమః |
ఓం సర్వోపద్రవనివారిణ్యై నమః |
ఓం సంహృదానందలహర్యై నమః |
ఓం చతుర్దశాంతకోణస్థాయై నమః | ౧౦౦
ఓం సర్వాత్మాయై నమః |
ఓం సత్యవక్త్రే నమః |
ఓం న్యాయాయై నమః |
ఓం ధనధాన్యనిధ్యై నమః |
ఓం కాయకృత్యై నమః |
ఓం అనంతజిత్యై నమః |
ఓం అనంతగుణరూపే నమః |
ఓం స్థిరేరాజేశ్వర్యై నమః | 108

🍀🌻🍀🌻🍀🌻🍀🌻🍀
[10/2, 09:10] +91 98852 16452: 🌷🌻🌷🌻🌷🌻🌷🌻🌷

🙏 *రాజరాజేశ్వర్యష్టకం*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻

అంబా శాంభవి చంద్రమౌళిరబలాఽపర్ణా ఉమా పార్వతీ
కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ
సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ  ౧ 
అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనందసందాయినీ
వాణీ పల్లవపాణి వేణుమురళీగానప్రియా లోలినీ
కళ్యాణీ ఉడురాజబింబవదనా ధూమ్రాక్షసంహారిణీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ  ౨ 
అంబా నూపురరత్నకంకణధరీ కేయూరహారావళీ
జాతీచంపకవైజయంతిలహరీ గ్రైవేయకైరాజితా
వీణావేణువినోదమండితకరా వీరాసనేసంస్థితా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ  ౩ 
అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవీ
బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్జ్వలా
చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ  ౪ 
అంబా శూల ధనుః కుశాంకుశధరీ అర్ధేందుబింబాధరీ
వారాహీ మధుకైటభప్రశమనీ వాణీరమాసేవితా
మల్లద్యాసురమూకదైత్యమథనీ మాహేశ్వరీ అంబికా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ  ౫ 
అంబా సృష్టవినాశపాలనకరీ ఆర్యా విసంశోభితా
గాయత్రీ ప్రణవాక్షరామృతరసః పూర్ణానుసంధీకృతా
ఓంకారీ వినుతాసుతార్చితపదా ఉద్దండదైత్యాపహా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ  ౬ 
అంబా శాశ్వత ఆగమాదివినుతా ఆర్యా మహాదేవతా
యా బ్రహ్మాదిపిపీలికాంతజననీ యా వై జగన్మోహినీ
యా పంచప్రణవాదిరేఫజననీ యా చిత్కళామాలినీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ  ౭ 
అంబాపాలిత భక్తరాజదనిశం అంబాష్టకం యః పఠేత్
అంబాలోకకటాక్షవీక్ష లలితం చైశ్వర్యమవ్యాహతమ్
అంబా పావనమంత్రరాజపఠనాదంతే చ మోక్షప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ  ౮

🌷🌻🌷🌻🌷🌻🌷🌻🌷
[10/2, 09:10] +91 98852 16452: 🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳

*ఈరోజు (02-10-2025)*
*శమీవృక్ష దర్శనం, విశేషం*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻

*శ్లో|| శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |*
*అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ ||*

దేవదానవులు పాల సముద్రమును మధించి నప్పుడు అమృతం జనించిన శుభ ముహూర్త దినం ఈ విజయ దశమి రోజే అని తెలియచేయబడింది. 'శ్రవణా' నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి "విజయ" అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయ దశమి' అను పేరు వచ్చినది. ఏ పనైనా తిధి , వారము తారా బలము , గ్రహాబలము ముహూర్తము మున్నగునవి విచారించ కుండా , విజయదశమి నాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము. 'చతుర్వర్గ చింతామణి' అనే ఉద్గ్రందము ఆశ్వయుజ శుక్లదశమి నాటినక్షత్రోదయ వేళనే 'విజయం ' అని తెలిపి యున్నది. ఈ పవిత్ర సమయము సకలవాంచితార్ద సాధకమైనదని గురు వాక్యము.

*'శమీ పూజ'* చేసుకునే ఈ రోజు మరింత ముఖ్యమైనది. 
*శమీ వృక్షమంటే 'జమ్మి చెట్టు'.* అజ్ఞాతవాసమందున్న పాండవులు వారి వారి ఆయుధములను , వస్త్రములను శమీవృక్షముపై దాచి ఉంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆవృక్ష రూపమును పూజించి ప్రార్ధించి, తిరిగి ఆయుధములను , వస్త్రములను పొంది, శమీవృక్ష రూపమున ఉన్న *'అపరాజిత'* దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాదించారు.

*"శ్రీ రాముడు"* ఈ విజయదశమి రోజున ఈ *'అపరాజితా'* దేవిని పూజించి రావణుని సంహరించి, విజయము పొందినాడు. 
అదేంటంటే , శ్రీరాముడు రావణాసురుని పది తలలనూ చూసి భీతిల్లి , నిద్రించిన శక్తిని (దేవిని) పూజించగా , ఆమె మేల్కొని శ్రీరాముని పూజలందుకొని , శ్రీరామునికి విజయాన్ని కలుగజేసింది. శ్రీరాముడు శక్తిని మేల్కొల్పిన సమయము ఆశ్వయుజ శుక్ల పాడ్యమి. 
నాటి నుంచి పదో రోజు శ్రీరాముడు సంపూర్ణ విజయాన్ని పొంది పుష్పకమెక్కి అయోధ్యకు బయలుదేరాడు. అలా బయల్దేరేముందు శమీ వృక్షాన్ని పూజించాడు. అందువల్లనే నవరాత్రి ఉత్సవాలను జరిపి , విజయదశమినాడు అందరూ శమీపూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది.

విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన *శమీవృక్షం (జమ్మి చెట్టు)* వద్ద గల అపరాజితా దేవిని పూజించి , పై శ్లోకం పఠిస్తూచెట్టుకు ప్రదక్షణలు చేయాలి.  పై శ్లోకము వ్రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలించాలి. ఇలా చేయుట వల్ల అమ్మవారి కృపతోపాటు , శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.

*‘‘శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ , అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదినీ. శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా , ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ. కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా , తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజితే.''*

పైన చెప్పిన మంత్రార్థం ఏమిటో చూద్దాం.

శమీ వృక్షము అనేది పాపాన్ని శమింపచేసేది. శత్రువులను నాశనం చేస్తుంది. ఇది నాడు అర్జునుని ధనస్సును కల్గి ఉండింది. శ్రీరాముడికి ప్రియాన్ని కల్గించింది. యాత్రార్థులకు సౌఖ్యాన్నిస్తుంది. పనులన్నిటినీ నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తుంది.

తెలంగాణాలో ఈ పూజ అనంతంరం పాలపిట్ట దర్శనం కోసం వేచివుంటారు. దానిని చూసిన తరువాతే ఇండ్లకు తిరిగి వస్తారు. వచ్చేటప్పుడు తమ వెంట జమ్మి ఆకును తెస్తారు. చిన్న వాళ్లు పెద్దల చేతులలో జమ్మి ఆకును *‘బంగారం'* అని చెప్పి పెట్టి , వారి దీవెనలందుకోవడం ఆచారంగా పాటిస్తారు. బంగారం లక్ష్మిదేవికి ప్రతీక.

హైదరాబాద్ నగరంలో జమ్మికొమ్మ , ఆరె కొమ్మలకు ఉన్న ఆకులను బంగారు , వెండిగా పంచుతూ , శుభాకాంక్షలను తెలుపు కుంటారు. 
దీనినే *‘సోనా దేనా'* 
కార్యక్షికమంగా పిలుస్తారు. ప్రధానంగా జమ్మి , ఆరె ఆకులను పరస్పరం పంచుకొని , కౌగిలించుకోవడం ఒక ఆత్మీయ స్పర్షగా ఈ పండగ సందర్భంగా కొనసాగుతున్న ఆచారం. దీనిని జాతి , కుల , మత , లింగ వివక్షలకు అతీతంగా మనసుల్ని , హృదయాల్ని కలిపే సామాజిక ఐక్య తారాగానికి ప్రతీకగా భావిస్తారు.

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳

No comments:

Post a Comment