253 వ భాగం
🕉️ అష్టావక్ర గీత 🕉️
అధ్యాయము 18
శ్లోకము 41
క్వ నిరోధో విమూఢస్య యో నిర్బంధం కరోతివై|
స్వారామస్త్యైవ ధీరస్య
సర్వదా $సావ కృతిమః||
మనసును నిరోధించాలని ప్రయత్నించే మూఢుడుకి అది ఎలా సాధ్యమవుతుంది? ఆత్మనుభవములో ఆనందంగా ఉండే జ్ఞానికి మనసు ఎక్కడ? నిరోధించవలసిన ఆవశ్యకత ఎక్కడ?
మనసును నియమించే ప్రయత్నాలను ఎందుకు హేళన చేయవలసి వచ్చిందో ఇంకా మహర్షి వివరిస్తూనే ఉన్నారు. మనసును మనసుతో నిరోధించ బూనడము నిష్ఫలం, కుక్కతోక వంకరను తీయటానికి ప్రయత్నించటం వంటిదే అది కాగలదు .మనసు స్వభావమే విషయాలను ఆశ్రయించి ఉండటం విషయాలు లేనప్పుడు మనసుకు ఉండదు.
మూడులు మాత్రమే మనసును నిరోధించాలని ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం ఉన్నంత సేపు మనసు ఉండనే ఉంటుంది. అందుకే అట్టి ప్రయత్నం చేసే వారిని మూడులు అంటున్నారు. మూడుడైన సాధకునికి జ్ఞానికి గల తేడాను ఇక్కడ చూపిస్తున్నారు.
అనేక భావోద్వేగాలతో అశాంతిమయంగా ఉన్న మనసును సాధన ద్వారా ఏ కోన్ ముఖం చేసి తాత్కాలిక శాంతిని సాధించి అట్టి మనసుతో శాస్త్ర హృదయాన్ని అర్థం చేసుకుంటూ ధ్యానించాలి. ధ్యానము మనసును శాంత పరుస్తుంది. అట్టి శాంత సౌమ్య మనసును సాధించి చివరగా దానిని కూడా విస్మరించాలి. అప్పుడే ఆత్మానుభవం సిద్ధంగా ఉంటుంది."స్వారామస్త్యైవ ధీరస్య".... ఆ విధముగా ఆత్మగా ఆనందంగా ఉంటే ధీరులు అట్టి జ్ఞానుల మనసు..... సర్వదా సావకృతిమహాః.... సర్వదా సహజంగా శాంతంగా ఉంటుంది. ఆత్మానుభవములో మనసు అధిగమించినట్టి జ్ఞానికి మనసే ఒక మహా భ్రమ అని స్పష్టముగా తెలుస్తుంది.
మనసుని నిరోధించడానికి సాధకుడు చేసే ప్రయత్నాలన్నీ అతని మనో తాదాత్మ్యంతో మరింతగా బంధిస్తాయి. ప్రయత్నంతో మనసు బలపడుతూ తన భ్రమా లోకములో ఇలా జీవిస్తూనే ఉంటుంది. ఆత్మానుభవం సిద్ధించడంతో మనసును నిరోధించవలసిన అవసరం తీరిపోతుంది .అసలు మనసే భ్రమ అని స్పష్టంగా తెలుస్తుంది .భ్రమను భ్రమతో నిరోధించ బూనడము బ్రమను పెంచడమే అవుతుంది.
ప్రాథమిక దశలో ఉన్న సాధకులు మనసును తప్పకుండా నియమించవలసిందే. ఈ గీత అంతటా ఈ విషయము స్పష్టం చేయబడుతూనే ఉంది. సాధనా బలంతో మనసును స్వాధీనం చేసుకుని సత్యాసత్యాలను విమర్శించి తెలుసుకోగలిగిన బుద్ధితో ఆత్మానుభవానికి అతి సమీపంలో ఉన్న అర్హులైన సాధకులకే ఈ గీత ఉపదేశింపబడింది. అసత్యాన్ని విమర్శించి తెలుసుకోగలిగిన బుద్ధితో ఆత్మానుభవానికి అతి సమీపంలో ఉన్న అర్హులైన సాధకులకే ఈ గీత ఉపదేశింపబడింది .అసత్యాన్ని విస్మరించి సత్యాన్ని సమీపించి ఆఖరు అడుగు వెయ్యటానికి సందేహించే వారికి ఈ సూచన అమూల్యమైన బహుమానంగా మహర్షిచే అందించబడింది.🙏🙏🙏
No comments:
Post a Comment