Wednesday, October 22, 2025

 🦚జ్ఞాన ప్రసూనాలు🚩

1) సృష్టిలో ప్రతీది దేనికది సహజంగా, పూర్ణంగా ఉన్నది.

2) అన్నిటికీ అవకాశంగా ఉండే ఆకాశానికి తన రూపమేమో తెలియనట్లు...
రమణుడికి-
తానున్నానని తెలుస్తోందిగాని... తానెవరో తెలియడం లేదు...
అందుకే తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కణ్ణి అడిగాడు-"నేనెవడను?" అని.

3)ఆయనతో తప్ప అందరితో బంధం పెట్టుకుంటాం.
బంధం ఉన్నట్టు అందరితో నటించాలి.
భగవంతునితో జీవించాలి.

4) వేదాంత లక్ష్యం దేవుణ్ణి పొందటం కాదు. మరణ భయం తొలగటం

5) భగవాన్! మా దృష్టికి ఈ ప్రపంచము నానాత్వం (అనేక విధముల) తో నిండియుంది. ఈ నానాత్వం పోయి సర్వార్థములకు ఒకేఒక్క సారాన్ని గ్రహించే మార్గము ఏమి?

మహర్షి :
ఈ నానాత్వమంతా కర్తృభావన ( నేను చేస్తున్నాను ) వలన; వేరు లాగివేస్తే ఫలాలు రాలిపోతాయి. కాబట్టి చేస్తున్నది నేను అనే భావన మానెయ్యి; అప్పుడు నానాత్వం మాయమౌతుంది. సారవంతమైన సత్వం మిగులుతుంది.
కర్తృత్వ ( నేను చేస్తున్నాను ) భావన పోవడానికి, కర్త ఎవరో విచారించవలెను. లోన వెదకితే, కర్తృభావన (అహం భావన) పోతుంది. అందుకు (ఆత్మ)విచారమే మార్గము.

6) నీకు నీవు ఒక బారెడు దూరంలో ఉండడం అలవాటు చేసుకో ఆత్మ, పరమాత్మ అర్ధాలు వాటికవే తెలుస్తాయి.

No comments:

Post a Comment