Friday, October 24, 2025

 🙏🕉️ హరిఃఓం 🕉️🙏

  పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(254వ రోజు):--
        స్వామీజీ సన్యాసియైనా, వస్తు సంపదలనూ జీవనసౌఖ్యాలనూ ఆశించకుండా యాదృశ్చికంగా లభించినవాటినే స్వీకరిస్తానని ప్రతిజ్ఞచేసినా, వాటితో ఆనందించే శక్తిమాత్రం ఆయనకు చాలానే ఉంది భవిష్యత్తుగురించి చింతలేకపోవటం  చేత, జీవితపు ప్రతిక్షణాన్నీ ఆనందం గా అనుభవించే స్వేచ్ఛ ఉందాయన కు. వేదాలు జీవనపు నిరంతర పరి పూర్ణతను శ్లాఘించాయి. యజుర్వే దంలో ఈ ప్రార్థన ఉంది :
    "శృణుయామ శరదః శతం, ప్రబ్ర వామ శరదః శతం, అదీనః స్యామ శరదః శతం .. (యజుర్వేదం36/24)
      మేము చక్కగా వినాలి, చక్కగా భాషించాలి, గౌరవంగా బ్రతకాలి నూరు శరదృతువులకు పైగా. 
        ఏ కార్యరంగంలోనైనాసరే చురు కుగా పాల్గొనేవారిని స్వామీజీ మెచ్చు కొనేవారు. మనుషులు పనిచేయ డానికి కదిలేలా చేయటమే దేశంలో అన్నిటికంటే పెద్దసమస్య అని ఆయన తరుచూ వాపోయేవారు. కదలిక మొదలైతేనే వారికి సరైన దారి చూపించటం సాధ్యమౌతుంది. 
         చిన్మయమిషన్ అధ్యక్షుడైన రామ్ బాత్రా ముంబైకి పాలనాధి కారిగా ఎన్నికైనపుడు మిషన్ సభ్యు లు ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసిన విందులో ఆ సందర్భానికి తగి నట్లు కొన్ని మాటలు చెప్పమని ఒత్తిడిచేస్తే స్వామీజీనుంచి వెలువడి న ఈ మాటలు తన దేశీయుల వైఖరి గురించి ఆయనకున్న అభిప్రా యాన్ని వ్యక్తంచేశాయి: "ఎవరైనా తన దేశానికి తన కర్తవ్యాన్ని నిర్వ ర్తించినపుడు, నిజానికి అందులో పొగడాల్సినదేమీలేదు. అది చాలా అరుదైన విషయం కాబట్టి, ఈ దేశం లో దానికి ఇంతవిలువ లభిస్తోంది." మరొకసారి, హైదరాబాదులో జరిగి న ఒక సత్సంగంలో సభ్యులను, నవ్వుతూనే, ఇలా మందలించారు : "మన భారతీయులకు ఆఖరుకు మోసం చేయటమైనా సరిగా చేత కాదు. ఒకటో రెండో రూకలు అవినీతి కరంగా ఆర్జించటమెలానాఅనే ఆలో చన తోనే ఎప్పుడూ సతమతమౌ తుంటారు. పశ్చిమదేశాల్లోవారికి, అదెలా చేయటమో బాగాతెలుసు. ఓ లక్ష డాలర్లు అపహరిస్తే, ఓపనై పోయినట్లే. ఇక నేరాల గురించి ఆలోచించటం మాని జీవితాన్ని కొన సాగిస్తారు. మీ మనసులు మాత్రం ఎప్పుడూ చిన్నచిన్న మోసాలవైపే మొగ్గుతుంటాయి, చిన్న..చిన్న.. . మనం ఏం చెయ్యాలనుకున్నా పెద్ద పథకాలే వెయ్యాలి."
       🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
              🌺 సరళ  🌺

No comments:

Post a Comment