ఆత్మ స్వరూపులారా ! హృదయ దీపాల్ని వెలిగించుకోవాల్సిన సమయం నేటి దీపావళి.
అంతరంగాల్లోని అసుర చీకట్లను వదిలించుకోవాల్సిన సందర్భం. చుట్టూ ఉన్న జీవితాలకు ప్రేమ కాంతిని పంచాల్సిన సుదినం. చీకటి నుంచి వెలుతురు వైపుగా మనం ప్రారంభించే ప్రయాణంలో ఓ మార్గ చూచి నేటి దీపావళి
బయటి చీకటిని తొలగించుకోడానికైనా, లోపలి చీకటిని వదిలించుకోడానికైనా, లక్ష్య సాధనలో అవరోధాల చీకటిని అధిగమించడానికైనా ధ్యాన జ్ఞాన మార్గం ఒక్కటే. మనిషికి వెలుగునిచ్చేది?’‘సూర్యుడు’
‘సూర్యుడు లేనప్పుడు?’చంద్రుడు’
‘చంద్రుడు లేనప్పుడు?’దీపం’
‘దీపం కూడా లేనప్పుడు?’ఆత్మదీపం’.
కాలం గడిచేకొద్దీ దీపంలోని వత్తి కాలిపోయినట్టు, మనిషిలోని ‘నేను’ అనే భ్రమ బూడిదైపోవాలి. క్రమంగా తరిగిపోయే చమురులా ‘నాదీ’ అనే స్వార్థం అడుగంటాలి. ఒక్కసారి ఆత్మదీపాన్ని వెలిగించుకుంటే... నిత్య కాంతులు ప్రసరిస్తూనే ఉంటాయి. ఇదే నిజమైన దీపావళికి అర్థం పరమార్థం.
No comments:
Post a Comment